Search
  • Follow NativePlanet
Share
» »రాక్షసరాజు చే ప్రతిష్టించిన స్వామి వారి విగ్రహం..దర్శిస్తే వద్దన్నా వివాహం ఆ పై అన్నీ...

రాక్షసరాజు చే ప్రతిష్టించిన స్వామి వారి విగ్రహం..దర్శిస్తే వద్దన్నా వివాహం ఆ పై అన్నీ...

శ్రీరంగం పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం.

By Kishore

భారత దేశంలో పురాణా ప్రాధ్యన్యత ఉన్న పుణ్యక్షేత్రం శ్రీరంగం. ఇక్కడ విష్ణు భగవానుడు శ్రీరంగనాథ స్వామి రూపంలో కొలువై ఉన్నాడు. కావేరీ నదీ తీరంలో ఉన్న మూడు రంగనాథస్వామి దేవాలయాల్లో శ్రీరంగం మూడవది. అందువల్ల ఇక్కడ ఉన్న స్వామివారిని అంత్య రంగడు అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలోని మూలవిరాట్టును రాక్షసరాజు అయిన విభీషనుడు ప్రతిష్టించినట్లు చెబుతారు. దేవాలయంలోని స్వామివారిని దర్శించుకొంటే వివాహ సంబంధ సమస్యలు అన్నీ తొలిగిపోయి వెంటనే వివాహమవుతుందని భక్తులు నమ్మకం. ప్రపంచంలో పూజాధికార్యక్రమాుల నిర్వహించే హిందూ దేవాలయాల్లో శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయం అత్యతం విశాలమైనది. ఈ రంగనాథ స్వామి దేవాలయం మొత్తం 156 ఎకరాలతో 21 గోపురాలతో ఉంటుంది. ఇక్కడ ఏడాదిలో 365 రోజుల పాటూ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.

'వైకుంఠ' దేవాలయం సందర్శిస్తే మన తల రాత తిరిగి మార్చే బ్రహ్మ'వైకుంఠ' దేవాలయం సందర్శిస్తే మన తల రాత తిరిగి మార్చే బ్రహ్మ

1. అత్యంత పురాతన ఆలయం

1. అత్యంత పురాతన ఆలయం

Image Source:

భారత దేశంలోని పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాల్లో శ్రీరంగం కూడా ఒకటి. ఇక్కడ మూల విరాట్టు రాక్షసరాజు అయిన విభీషనుడి ద్వారా ప్రతిష్టించబడిందని పురాణాలు చెబుతాయి. ఆలయం నిర్మించి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుందని చెబుతారు.

2. బ్రహ్మ గురించి తపస్సు

2. బ్రహ్మ గురించి తపస్సు

Image Source:

పూర్వం ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మగురించి కొన్నివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో బ్రహ్మ మెచ్చి వరం కోరుకోమంటాడు. ఇందుకు సంతోషపడిన ఇక్ష్వాకుమహారాజు తన రాజ్యం ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఇందుకు సహకారం అందించాల్సిందిగా కోరిక కోరుతాడు.

3. చిన్న విగ్రహాన్ని

3. చిన్న విగ్రహాన్ని

Image Source:

దీంతో బ్రహ్మ తాను నిత్యం పూజించే శ్రీ రంగనాథుడి చిన్న విగ్రహాన్ని ఆయనకు అందజేస్తాడు. దీనిని ఎవరైతే రోజూ పూజించి ఉత్సవాలు జరుపుతారో వారి కోర్కెలు నెరవేరుతాయని స`ష్టి కార్యానికి అవసరమైన వివాహ బంధం గట్టిగా ఉంటుందని చెబుతాడు.

4. ఇక్ష్వాకుల వంశస్తుల వద్దే

4. ఇక్ష్వాకుల వంశస్తుల వద్దే

Image Source:

అంతే కాకుండా వివాహ పరమైన సమస్యలు ఏవైనా ఉంటే తొలిగిపోతాయని కూడా చెబుతాడు. ఈ నేపథ్యంలో ఆ రంగనాథుడి విగ్రహం తరతరాలుగా ఆ ఇక్ష్వాకు వంశస్తుల వద్దే ఉంటూ వస్తుంది.

5. రావనుడిని సంహరిస్తాడు

5. రావనుడిని సంహరిస్తాడు

Image Source:

శ్రీరాముడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రామ, రావణ యుద్ధంలో రాముడు రాక్షసరాజైన రావణుడిని సంహరిస్తాడు.

6. విభీషనుడు సహాయం చేస్తాడు

6. విభీషనుడు సహాయం చేస్తాడు

Image Source:

ఈ యుద్ధంలో రాముడు గెలవడానికి ప్రధానంగా ఆ రావణుడి తమ్ముడు రాక్షసరాజైన విభీషనుడు సహాయం చేస్తాడు. ఇక యుద్ధం ముగిసిపోయిన తర్వాత రాముడు సీత, లక్ష్మణ సమేతంగా తిరిగి రాజ్యానికి వస్తాడు. అటు పై పట్టాభిషేకం కూడా జరుగుతుంది.

7.విభీషనుడు ఏడుస్తాడు

7.విభీషనుడు ఏడుస్తాడు

Image Source:

ఈ పట్టాభిషేకం వరకూ విభీషనుడు రాముడి వద్దనే ఉంటాడు. ఇక ఆ విభీషనుడు తిరిగి లంకకు బయలు దేరే సమయం ఆసన్నమవుతుంది. దీంతో తాను రాముడిని విడిచి ఉండలేనని, సకల సంపదలతో తులతూగుతున్న రామరాజ్యంలో ఒక సాధారణ మానవుడి వలే గడపడానికి ఇష్టపడుతాను కాని తిరిగి లంకకు వెళ్లలేనని ఏడుస్తూ ఉంటాడు.

8.రాముడు ఊరడిస్తాడు

8.రాముడు ఊరడిస్తాడు

Image Source:

విషయం తెలుసుకున్న రాముడు విభీషనుడిని ఊరడిస్తాడు. తమ రాజ్యం భోగ, భాగ్యాలతో తులతూగుతూ ఉండటానికి కారణం బ్రహ్మ దేవుడు అందజేసిన శ్రీ రంగనాథుడి విగ్రహం, ఆ విగ్రహానికి ప్రతి రోజూ జరిగే పూజలే అని చెబుతాడు.

9.కథ మొత్తం చెబుతాడు

9.కథ మొత్తం చెబుతాడు

Image Source:

అంతే కాకుండా ఆ విగ్రహం తమ వద్దకు రావడం వెనుక ఉన్న కథ మొత్తం చెబుతాడు. తనకు యుద్ధంలో గెలవడానికి సాయం చేసినందుకు ప్రతిఫలంగా అంతటి మహిమాన్వితమైన శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని నీకు ఇస్తానని చెబుతాడు.

10.విగ్రహం అందజేస్తాడు

10.విగ్రహం అందజేస్తాడు

Image Source:

ఈ విగ్రహం ఉన్న చోట నిత్య కళ్యాణం, పచ్చతోరణం వలే ఆ ప్రాంతం మొత్తం కళకళలాడుతూ ఉంటుందని చెబుతాడు. ఈ విగ్రహం నీ చెంత ఉంటే నేను కూడా నీ దగ్గర ఉన్నట్లే అని పలురకాలుగా విభీషనుడిని శ్రీరాముడు ఊరడిస్తాడు.

11.లంకకు సాగనంపుతాడు

11.లంకకు సాగనంపుతాడు

Image Source:

ఒక శుభముహుర్తాన చిన్న పరిమాణంలో ఉన్న శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని స్వయంగా శ్రీరాముడు విభీషనుడికి ఇచ్చి లంకకు సాగనంపుతాడు. ఈ సమయంలో ఒక జాగ్రత్త కూడా శ్రీరాముడు విభీషనుడికి చెబుతాడు.

12.భూమి పై పెట్టకూడదని చెబుతాడు

12.భూమి పై పెట్టకూడదని చెబుతాడు

Image Source:

ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలంక చేరేంత వరకూ శ్రీరంగనాథ విగ్రహాన్ని భూమికి తాకించవద్దని చెబుతారు. ఇందుకు అంగీకరించిన విభీషనుడు శ్రీరాముడిని విడిచి అయోధ్యకు బయలు దేరుతాడు. ఈ క్రమంలో విభీషనుడు కావేరీ నదీ తీర ప్రాంతమైన శ్రీరంగం దగ్గరకు వచ్చేసరి సూర్యస్తమయం అవుతుంది.

13. సంధ్యావందనం

13. సంధ్యావందనం

Image Source:

దీంతో సంధ్యావందనం చేయాలని భావించి భూమి పై ఒక వస్త్రాన్ని ఉంచి దాని పై శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని ఉంచి సంధ్యా వందనం చేయడానికి వెలుతాడు. అయితే తిరిగి వచ్చేసరికి వస్త్రం గాలికి పక్కకు వెళ్లిపోగా విగ్రహం భూమిని తాకి ఉంటుంది.

14. విగ్రహం అంతకంతకూ పెరిగి పోతుంది

14. విగ్రహం అంతకంతకూ పెరిగి పోతుంది

Image Source:

అయినా దానికి చేతులోకి తీసుకోవాలని విభీషనుడు తీవ్ర ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ విగ్రహం అంతకంతకూ పెరిగి పోతుంది. దీంతో విభీషనుడు విచారిస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ రంగనాథుడి రూపంలో విష్ణువు ప్రత్యక్షమయ్యి విచారించవద్దని ప్రతి రోజూ రాత్రి నీ పూజలను స్వీకరిస్తానని చెబుతాడు.

16. ఆ ముడుపు చెల్లిస్తే వెంటనే వివాహం

16. ఆ ముడుపు చెల్లిస్తే వెంటనే వివాహం

Image Source:

కాగా, గతంలో బ్రహ్మదేవుడి చెప్పినట్లు ఈ రంగనాథుడిని దర్శించి మూలవిరాట్టుకు వస్త్రాలను ముడుపుగా చెల్లిస్తే చాలా కాలంగా పెళ్లి కాని వారికి వెంటనే వివాహం అవుతుందని భక్తుల నమ్మకం. ఇక ఈ క్షేత్రంలో ఏడాది పొడగునా ఏవో ఒక ఉత్సవాలు జరుగుతూ ఈ గుడి ప్రాంగణం మొత్తం నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే వాఖ్యలు గుర్తుకు వస్తాయి.

17. మొత్తం మూడు

17. మొత్తం మూడు

Image Source:

కాగా కావేరి తీరంలో మొత్తం మూడు ప్రసిద్ధ రంగనాథ ఆలయాలు ఉన్నాయి. అందులో మొదటిది మైసూరుకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రంగ పట్టణంలో వెలిసిన రంగనాథ స్వామి దేవాలయం. ఇక్కడ వెలిసిన రంగనాథుడిని ఆది రంగడు అని అంటారు.

18. అంత్య రంగడు

18. అంత్య రంగడు

Image Source:

ఈ పుణ్యక్షేత్రానికి దగ్గర్లో శివన సముద్రంలో వెలిసిన రంగనాథుడిని మధ్య రంగడు అని అంటారు. ఇక మూడోది అయిన శ్రీరంగంలో కొలువై ఉన్న రంగనాథ స్వామిని అంత్య రంగడు అని అంటారు.

19 అతి విశాలమైనది

19 అతి విశాలమైనది

Image Source:

ప్రపంచంలో పూజాది కార్యక్రమాలు జరుగుతున్న అతి విశాలమైన హిందూ దేవాలయాల్లో శ్రీరంగంలోని శ్రీరంగనాథ ఆలయం మొదటిదని చెబుతారు. అంకోర్ వాట్ లో ఉన్న దేవాలయంలో పూజాది కార్యక్రమాుల జరగడం లేదు. ప్రస్తుతం అది శిథిలా వస్థలో ఉందన్న విషయం తెలిసిందే.

20. 156 ఎకరాలు, 21 గోపురాలు

20. 156 ఎకరాలు, 21 గోపురాలు

Image Source:

తమిళనాడులోని పురుచినాపల్లి (తిరుచ్చి) కి దగ్గరల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం దేశంలోని 108 దివ్య ఆలయాల్లో ఒకటి. 6,31,00 చదరపు మీటర్ల విస్తీర్ణం (156 ఎకరాలు)లో ఈ దేవాలయం ఉంది. దేవాలయం రాజగోపురం ఎత్తు 72 మీటర్లు (236 అడుగులు). ఆసియాలోనే ఇది అత్యంత ఎతైన రాజగోపురం కలిగిన దేవాలయం. ఈ దేవాలయంలో మొత్తం 7 ప్రాకాలు, రాజగోపురంతో సహా మొత్తం 21 గోపురాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X