Search
  • Follow NativePlanet
Share
» »శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఆ మల్లికార్జునస్వామిని దర్శించుకునే ముందు సాక్షిగణపతిని దర్శించుకోవాలి.ఆ అయ్యవారిని దర్శించుకోవటానికి వెళ్ళేటప్పుడైనా లేక తిరిగివచ్చేటప్పుడైనా సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి.

By Venkatakarunasri

ఆ మల్లికార్జునస్వామిని దర్శించుకునే ముందు సాక్షిగణపతిని దర్శించుకోవాలి.ఆ అయ్యవారిని దర్శించుకోవటానికి వెళ్ళేటప్పుడైనా లేక తిరిగివచ్చేటప్పుడైనా సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనం శ్రీశైలానికి వచ్చి అయ్యవారిని దర్శించుకున్నాం అనటానికి ఈ సాక్షిగణపతే మనకు సాక్ష్యం. దీనికి ఒక పెద్ద పురాణకథకూడా వుంది.అది మనం తరువాత తెలుసుకుందాం.

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో నల్లమల కొండలలో చిన్న పట్టణం శ్రీశైలం హిందువులకు చాలా పవిత్ర మైనది. ఈ పట్టణం కృష్ణ నది ఒడ్డున కలదు. హైదరాబాద్ ఈ పట్టణానికి సుమారు 212 కి. మీ. ల దూరం వుంటుంది. ఎంతో పవిత్ర యాత్రా స్థలంగా భావించే ఈ శ్రీశైలం పట్టణానికి లక్షలాది హిందువులు ప్రతి సంవత్సరం దేశం లోని అన్ని మూలల నుండి వచ్చి దర్శించుకుంటారు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఈ టవున్ లో అనేక దేవాలయాలు, తీర్థాలు కలవు. భక్తులకు, పర్యాటకులకు కావలసిన వివిధ రకాల ఆకర్షణలు ఇక్కడ కలవు. ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడు గా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబ గా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాల లో స్నానాలు ఆచరిస్తారు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఈ నీటి లో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు. శ్రీశైలం కు ఎయిర్ పోర్ట్ లేదా రైలు స్టేషన్ లేనప్పటికీ తేలికగా చేరగల చక్కటి రోడ్ మార్గం కలదు. ఇది ఒక ఉష్ణమండల ప్రదేశం కావున, వేసవులు అధిక ఉష్ణోగ్రతలు కలిగి పర్యాటకులకు అసౌకర్యంగా వుంటుంది. శ్రీశైలం చూడాలంటే శీతాకాలం అనుకూలమైనది.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలం దగ్గర చూడవలసినవి

అక్క మహాదేవి గుహలు నల్లమలై శ్రేణులలోని కొండలపై శ్రీశైలం కు సుమారు 10 కి. మీ. ల దూరం లో కలవు. ఈ గుహలు చరిత్రకు పూర్వం నాటివని తెలియజేసే ఆధారాలు కూడా కలవు. పట్టణ చరిత్రలో ఈ గుహలు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. ఈ గుహలకు 12 వ శతాబ్దపు వేదాంతి మరియు కర్ణాటక గాయని అయిన అక్కమహాదేవి అక్కడ గుహల లోపలి భాగాలలో కల సహజ శివలింగం కు తపము , పూజలు చేయుట వలన ఆమె పేరు పెట్టారు. అక్క మహాదేవి గుహలు సహజంగా ఏర్పడిన గుహలు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

కృష్ణా నది కి ఎగువ భాగంలో కలవు. ప్రధాన గుహకు సహజంగా ఏర్పడిన ఒక అద్భుత ఆర్చ్ వుంటుంది. ఈ ఆర్చ్ కొలతలు సుమారుగా 200 x 16 x 4 గా వుండి ఎట్టి ఆధారం లేక వుంటాయి. పర్యాటకులు గుహలలోని భాగాలకంటే కూడా ఈ ఆర్చ్ సహజ నిర్మాణానికి ఆనందిస్తారు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఈ గుహల లో కల రాళ్ళు ఎపుడో భూమి పుట్టిన నాటివి, పురాతనమైనవి కనుక ఒక మంచి ఆకర్షణగా వుంటాయి. ఈ గుహలకు కృష్ణా నది గుండా వెళ్ళడం ఒక మంచి అనుభవం. సుమారు 150 అడుగుల పొడవు వుండే ఈ గుహల సందర్శన మరింత మంచి అనుభవం గా కూడా వుంటుంది.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలం శాంక్చురి

శ్రీశైలం చుట్టుపక్కల మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ కల సంరక్షిత అడవిని తప్పక చూడాలి. ఇది ఇండియా లోనే అతి పెద్ద టైగర్ రిజర్వు గా పేరొందినది. సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి వుంది. ఏ జంతువు కనబడక పోయినా, ఈ ప్రదేశం లో తిరిగి రావటమే ఒక సాహసంగా భావించాలి. శాంచురి లోపల ఎన్నో రకాల వృక్షాలు, వెదురు మొక్కలు వంటివి చూడవచ్చు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శాంక్చురి లోపల వివిధ రకాల జంతువులను అంటే పులులు, చిరుతలు, హయనాలు, అడవి పిల్లులు, ఎలుగులు, లేళ్ళు , దుప్పులు వంటివి చూడవచ్చు. శ్రీశైలం డాం కు సమీపం లో కల సాన్క్చురి భాగం లో మీరు నీటి మడుగులలో వివిధ రకాల మొసళ్ళ ని కూడా చూడవచ్చు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం ఒక జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కి. మీ. ల దూరం లో కలదు. ఈ నీరు ఎంతో పవిత్రమైనదని భావించటం తో భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తారు. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు. వర్షాకాలం లో మాత్రం రోడ్ సరిగ్గా వుండదు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఈ మల్లెల తీర్థం లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం దొరుకుతుందని భావించటం తో ఈ జలపాతాలు ప్రాముఖ్యతని సంతరించుకొన్నాయి. అయితే, ఈ నీటిలోకి చేరాలంటే సుమారు 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక, చాల జాగ్రత తీసుకోవాలి. జారి పడే అవకాశం వుంటుంది. వేగిర పడకుండా నిదానంగా మెట్లు దిగి వెళ్ళాలి.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాం ని ప్రధాన శ్రీశైలం పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది పై కట్టారు. వ్యూహాత్మకంగా దీనిని నల్లమల కొండలలో ఒక లోతైన మలుపు లో నిర్మించారు. ఈ డాం ఇండియా లో రెండవ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా పేరొందినది. శ్రీశైలం డాం ప్రాజెక్ట్ ని 1960 వ సంవత్సరం లో నిర్మాణం మొదలు పెట్టగా, దానిని పూర్తిచేసేందుకు సుమారు 20 సంవత్సరాలు పట్టింది.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

చివరకు ఇది 770 మెగా వాట్ల విద్యుత్ ఉత్పతి సామర్ధ్యం కలిగి ఒక బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా రూపొందింది. నేడు ఈ డాం సుమారు 2,200 చదరపు కిలోమీటర్ల భూమిని సాగు చేస్తోంది. ఈ రిజర్వాయర్ నీటి నిలువకు విద్యుత్ అవసరం లేనందున అధిక మొత్తాలలో నీటిని ఇక్కడ నిలువ చేస్తారు. వరదలు వచ్చినపుడు, శ్రీశైలం రిజర్వాయర్ చాలా త్వరగా నిండిపోయి మిగిలిన నీరు నాగార్జునసాగర్ డాం లోకి ప్రవహిస్తుంది. వరద నీటిని పవర్ జనరేషన్ కు ఉపయోగించరు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శివాజీ స్ఫూర్తి కేంద్రం

శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం లో ఒక క్రీడల కేంద్రం గా వుంది. ఈ సెంటర్ కు మారాట్టా యోధుడు శివాజీ పేరు పెట్టారు. ఈ సెంటర్ చేరాలంటే, సుమారు 30 మెట్లు ఎక్కవలసి వుంటుంది. సెంటర్ యొక్క భవనం ఆకర్షణీయంగా వుండి దానిలో శివాజీ విగ్రహం ఒక సింహాసనం పై కూర్చుని వుంటుంది. ఈ సెంటర్ చుట్టూ అన్నివైపులా సంరక్షణ చేయబడి అక్కడ నుండి లోయ లోని ప్రకృతి దృశ్యాలు మరియు దూరంగా వుండే శ్రీ శైలం డాం ని చూచి ఆనందించేలా వుంటుంది.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

ఈ క్రీడల కేంద్రాన్ని , రాష్ట్రం లోని క్రీడల లో అన్ని వయసుల పిల్లలు పాల్గొనేందుకు గాను శిక్షణ ఇచ్చేందుకు స్థాపించారు. చాలా మంది తమ పిల్లలని ఈ కేంద్రానికి పంపుతారు. క్రికెట్, ఫుట్ బాల్ , టెన్నిస్ , బాడ్మింటన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రీడలలో ఈ కేంద్రం లో ట్రైనింగ్ పొందిన పిల్లలు చాల మంది పాల్గొన్నారు.

pc:youtube

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

రోడ్డు ప్రయాణం

శ్రీశైలం దేశం లోని ప్రధాన పట్టణాల కు రోడ్ మార్గం లో చక్కగా కలుపబడి వుంది. అనేక ప్రభుత్వ బస్సులు కలవు. అయినప్పటికీ, మీరు బస్సు టికెట్ల ని ముందుగా రిజర్వు చేసుకోవటం సూచించ తగినది.

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

రైలు ప్రయాణం

శ్రీశైలం కు రైలు స్టేషన్ లేదు. సమీప రైలు స్టేషన్ గుంటూరు - హుబ్లి లైన్ పై కల మర్కాపూర్ లో కలదు. శ్రీశైలం కు ఇది సుమారు 85 కి. మీ.ల దూరం లో కలదు. బస్సు లేదా ప్రైవేటు టాక్సీ ల లో శ్రీశైలం చేరవచ్చు. బస్సు ప్రయాణం చవక.

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

శ్రీశైలంలోని అద్భుతాన్ని చూడండి కార్తీక మాసంలో...

విమాన ప్రయాణం

శ్రీశైలం పట్టణానికి ఎయిర్ పోర్ట్ లేదు. సమీప విమానాశ్రయం 201 కి. మీ. ల దూరం లో హైదరాబాద్ లో కలదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ దేశం లోని ఇతర ప్రధాన నగరాలకు, మరియు విదేశాలకు కూడా అనుసంధానించబడి వుంది. విమానాశ్రయం నుండి శ్రీశైలం కు టాక్సీ ల లో చేరవచ్చు.

మీ జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విభిన్నమైన శివలింగాలు !మీ జీవితంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విభిన్నమైన శివలింగాలు !

దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి ఇది ఒక మంచి నిదర్శనం.....

చనిపోయిన వారిని బ్రతికించే పవిత్రమైన స్థలమిది...చనిపోయిన వారిని బ్రతికించే పవిత్రమైన స్థలమిది...

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే మహిమాన్విత సర్ప దేవాలయంసంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే మహిమాన్విత సర్ప దేవాలయం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X