Search
  • Follow NativePlanet
Share
» »శ్రీవిల్లిపుత్తూరు - తమిళనాడు ఆలయ పట్టణం !

శ్రీవిల్లిపుత్తూరు - తమిళనాడు ఆలయ పట్టణం !

By Mohammad

తమిళనాడు రాష్ట్రములో విరుధ్ నగర్ జిల్లాలో గల శ్రీవిల్లి పుత్తూరు రాష్ట్రములోనే అత్యంత పవిత్రమైన ఆలయపట్టణం. ఈ ప్రదేశం దాని సొంతమైన వారసత్వాన్ని మరియు పురాతన చరిత్ర కలిగి ఉంది. ఈ పట్టణంలో అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినవి మరియు రాష్ట్ర ప్రజలు చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఇది మధురై కు 74 కిలోమీటర్ల దూరంలో కలదు.

ప్రదేశం యొక్క చరిత్ర

వాస్తవానికి ఈ నగరాన్ని విల్లి పుత్తూరు అని పిలుస్తారు. కానీ శ్రీ ఆండల్ పుట్టిన కారణంగా,ఈ నగరంను శ్రీవిల్లి పుత్తూరు అని పిలుస్తున్నారు. ఈ పట్టణంలో అనేక మతపరమైన తమిళ మూలాలను ప్రస్తావించారు మరియు వారి సాహిత్య రచనల్లో సూచనగా ఈ నగరం యొక్క పేరు ఉపయోగించిన చాలా మంది సాధువులు ఉన్నారు.

ఇది కూడా చదవండి : చెన్నై నుండి మధురై రోడ్డు ప్రయాణం !

పాలకోవా ఈ ప్రదేశంలో తయారు చేయబడుతున్న ఒక సంప్రదాయ తీపి పదార్ధము. ఈ తీపి పదార్దం తయారు చేయటం వల్ల తమిళులకు ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది. పాలు మరియు చక్కెరతో కలిపి తయారుచేసిన ఈ పాలకోవా చాల రుచికరంగా ఉంటుంది.

ఆండాళ్ ఆలయం

ఆండాళ్ ఆలయం

తమిళనాడు రాష్ట్రములోని విరుధ్ నగర్ జిల్లాలో ఉన్న శ్రీవల్లిపుతర్, ఆండాళ్ ఆలయానికి ప్రసిద్ధి చెందిన ఒక పురాతన పట్టణం. ఈ దేవాలయం సుమారు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆలయంలో లార్డ్ పడుకొని ఉన్న భంగిమలో ఉంటారు. ఆలయ ప్రాంగణంలో ఆని ఆళ్వార్ ఉత్సవం మరియు ఎనైకప్పు అనే రెండు ముఖ్యమైన పండుగలను జరుపుతారు.

చిత్ర కృప : g mariappan

కట్టలగర్ కోయిల్

కట్టలగర్ కోయిల్

శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుండి 15 km ల దూరంలో కట్టలయర్ దేవాలయం కలదు. ఈ ప్రదేశం పర్యాటకులకు ఉత్తమమైంది మరియు పూజలు కోసం చాలా శుభప్రదమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటుంది. దేవతను చూడటానికి అడవిలో ఆరు కిలోమీటర్ల దురం నడక సాగించాలి.

చిత్ర కృప : Arul Damodaran

మధవర్ విలగం వైద్య నతార్ ఆలయం

మధవర్ విలగం వైద్య నతార్ ఆలయం

ఆలయంలో 6 అడుగుల పొడవుగల నటరాజ చిత్రం ఉన్నది. ఈ ఆలయం లోపల ప్రదక్షిణ చేయటం దైవిక అనుభూతిని కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అనుసరించాల్సిన నిర్దిష్ట నియమాలు మరియు ఆచారాలు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రసాదంను భక్తులు మరియు పేద ప్రజలకు కూడా ఆలయం అధికారులు అందిస్తున్నారు. ఈ ఆలయం లోకి స్నానం చేయకుండా వెళ్ళకూడదు.

చిత్ర కృప : Sri Ram Prasath

పెన్నింగ్ టన్ పబ్లిక్ లైబ్రరీ

పెన్నింగ్ టన్ పబ్లిక్ లైబ్రరీ

పెన్నింగ్ టన్ పబ్లిక్ లైబ్రరీ శ్రీవిల్లిపుత్తూరు ఆలయ పట్టణంలో ఉంది. ఇది అక్కడి పురాతన లైబ్రెరీ లో ఒకటిగా భావిస్తారు. 1875 లో స్థాపించిన లైబ్రెరీ ప్రజలకు మంచి విషయాలు తెలియపరచటానికి ఒక సహాయకారిగా ఉన్నది.

చిత్ర కృప : Visual Libraries Project

పిలవక్కల్

పిలవక్కల్

పిలవక్కల్ శ్రీవిల్లిపుత్తూరు పట్టణంలో ఉన్న ఒక చిన్న గ్రామము. ఈ గ్రామంలో ఒక ఆనకట్ట ప్రసిద్ధి చెందింది. ఇది మొత్తం జిల్లాలో ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం సందర్శకులను తప్పక ఆకర్షిస్తుంది.

చిత్ర కృప : Sthang

శంకరణ్ కోయిల్

శంకరణ్ కోయిల్

శంకరణ్ కోయిల్, శ్రీవిల్లిపుత్తూరు పట్టణం నుండి 45 km ల దూరంలో ఉంది. శ్రీవిల్లిపుత్తూరు సందర్శించిన తర్వాత భక్తులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు. దీనిని క్రీ. శ. 900 లో ఉకిర పాండ్యన్ నిర్మించేను. చాలా ప్రసిద్ధి చెందిన తాబాసు అనే పండుగ ఆలయం ప్రాంగణంలో జరుగుతుంది.

చిత్ర కృప : Sri Ram Prasath

సతురగిరి కొండలు

సతురగిరి కొండలు

సతురగిరి హిల్స్ , శ్రీవిల్లిపుత్తూరు పట్టణం నుండి పది కిలో మీటర్ల దూరంలో ఉంది. స్థానిక ప్రకారం, నాలుగు వేదాలు కలిసికట్టుగా కొండ ఏర్పడింది అని నమ్ముతారు. అందుకే ఈ కొండకు సతురగిరి హిల్స్ అనే పేరు వచ్చింది. సతురగిరి హిల్స్ విష్ణువు కు నిలయంగా ఉంది.

చిత్ర కృప : Vishnu Menon M

శేన్బగాతోప్పు ఉడుత అభయారణ్యం

శేన్బగాతోప్పు ఉడుత అభయారణ్యం

శేన్బగాతోప్పు అతిపెద్ద ఉడుత అభయారణ్యం నెరసిన వన్నెగల అతిపెద్ద ఉడుతలను రక్షించడానికి స్థాపించబడింది. ఈ ప్రదేశం శ్రీవిల్లిపుత్తూరు ఆలయ పట్టణం సమీపంలో ఉన్న ప్రసిద్ధ పాల్ఘాట్ గ్యాప్ దక్షిణంగా ఉంది. ఈ అభయారణ్యంలో దిగ్గజ ఉడుతలు, ప్రసిద్ధి చెందిన జంతువులు చాలా ఉన్నాయి.

చిత్ర కృప : telugu native planet

వలయపట్టి

వలయపట్టి

శ్రీవిల్లిపుత్తూరు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వలయపట్టి పర్యాటకులకు గొప్ప ఆసక్తిని మరియు ఆకర్షణను కలిగిస్తుంది. ఈ ఊరి విశేషం ఏమిటంటే, ఎవ్వరూ పొగాకు ఉత్పత్తులను అమ్మరు. ఒకవేళ అమ్మితే కఠిన శిక్షలను అమలు చేస్తారట. మొన్నీమధ్య ఆదర్శ గ్రామం గా వలయపతి గ్రామం అవార్ట్ తీసుకుంది.

చిత్ర కృప : Narayanan nana

వటపత్ర సాయి ఆలయం

వటపత్ర సాయి ఆలయం

దేవుడు పెరుమాళ్ తమిళనాడులోని వటపత్రసాయి ఆలయంలో వటపత్రసాయి రూపంలో ఉన్నారు. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయం యొక్క గొప్ప ప్రదేశాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ ఆలయ నిర్మాణం క్రీ. పూ. జరిగిందని భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఆరు ఆరాధనా సేవలు జరుగుతాయి.

చిత్ర కృప : Venugopal Thirunagari

శ్రీవిల్లిపుత్తూరు ఎలా చేరుకోవాలి ?

శ్రీవిల్లిపుత్తూరు ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : మధురై సమీప విమానాశ్రయం. ఇది 74 కిలోమీటర్ల దూరంలో కలదు.

రైలు మార్గం : శ్రీవిల్లిపుత్తూరు లో రైల్వే స్టేషన్ కలదు. రాష్ట్రం నలుమూల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు / బస్సు మార్గం : మధురై, తిరునల్వేలి, విరూద్ నగర్ తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు శ్రీవిల్లిపుత్తూరు కు తిరుగుతుంటాయి.

చిత్ర కృప : KDhandapani

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X