Search
  • Follow NativePlanet
Share
» »రాణి రుద్రమదేవి స్నానం చేసిన ‘శృంగార బావి’ రహస్యాలు మీకు తెలుసా?

రాణి రుద్రమదేవి స్నానం చేసిన ‘శృంగార బావి’ రహస్యాలు మీకు తెలుసా?

వరంగల్ లోని శృంగార బావి కి సంబంధించిన పూర్తి కథనం.

బావుల ప్రాముఖ్యత ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అయితే పురణాల్లోనే కాకుండా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బావులు ఇప్పటికీ మనం అక్కడక్కడ చూడవచ్చు. హిందూ ధర్మం ప్రకారం బావులు కూడా దేవతలు నివశించే ప్రాంతంగా చూస్తారు. ఇక చారిత్రాత్మకంగా చూస్తే ఈ బావుల నిర్మాణంలో కొంతమంది రాజులు, రాణులు వినూత్నంగా ఆలోచించేవారు. అటువంటి కోవకు చెందినదే కాకతీయుల రాజ్యంలోని శృంగార బావి. ఇది ఎక్కడ ఉంది? అందులో ఉన్న రహస్యాలు ఏమిటి తదితర వివరాలన్నీ మీ కోసం....

ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.ఈ క్షేత్రానికి కాకులకు బద్ధవిరోదం. అందువల్లే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శని చూపు పడదు.

ఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉందిఇనుము ఇంతడిని బంగరంగా మార్చే రాయి ఈ కోటలో ఉంది

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఈ సుందరమైన శృంగార బావి ఉంది. దీని నిర్మాతలు కాకతీయ మహారాజులు. కాకతీయులు అన్న తక్షణం మనకు దేవాలయాలు, యుద్ధాలే గుర్తుగువస్తాయి.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

వీరు దేవాలయాలే కాకుండా అనేక రహస్యాలను తమలో దాచుకున్న ఈ శృంగార బావిని కూడా నిర్మించారు. వీరు తమ రాజ్యం మొత్తం 330 బావులను నిర్మించారని చెబుతారు. అందులో ఈ శృంగార బావి విశిష్టమైనది.

కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?కుర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా?

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ఇప్పటికీ ఈ శృంగార బావి గురించి తెలంగాణలోని చాలా మందికి తెలియదు. కాకతీయుల కాలానికి చెందిన ఈ శృంగార బావి తనలో అనేక రహస్యాలను దాచుకొంది. ఈ రహస్యాల ఛేదన కోసం ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ఈ శృంగార బావి మూడు అంతస్తులతో నిర్మితమైనది. ఈ బావి లోపలికి దిగితే టైం మిషన్ లో వెలుతున్నామా? అన్న భావన కలుగుతుంది. అంటే చరిత్ర పుటల్లోకి వెలుతన్న భావన కలుగుతుంది. అనేక చారిత్రాత్మక విషయాలు గుర్తుకు వస్తాయి.

శని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండిశని చూపు పడకూడదంటే ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లండి

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవితో పాటు ఆ వంశానికి చెందిన అనేకమంది ఈ శృంగార బావిలో స్నానం చేశారు. ఆ సమయంలో అనేక సుగంధ ద్రవ్యాలు ఈ నీటిలో కలిపేవారని చెబుతారు.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

అయితే రాణి రుద్రమ్మ ఇక్కడ స్నానం చేయడం వల్ల ఈ శృంగార బావికి చాలా ప్రాచూర్యం కలిగింది. అందువల్లే ఈ బావిని రాణి రుద్రమ్మ శృంగార బావి అని పిలుస్తారు. అనేర రహస్యాలకు నిలయమైన ఈ బావి గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?ఈ ఆశ్రమంలో ఉన్నవారికి చావన్నదేరాదా?

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ఈ శృంగార బావిలో ఒక సొరంగ మార్గం కూడా ఉంది. ఈ సొరంగ మార్గం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వెయ్యి స్తంభాల గుడికి తీసుకువెళుతుంది. ఆ వెయ్యి స్తంభాల గుడిలో మరో బావి కూడా ఉంది. ఈ బావిని పవిత్రమైనదిగా భావిస్తారు.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ఇందులోని నీళ్లను ఈశ్వరుడిని అభిషేకించడానికి వినియోగిస్తారు. ఇక శృంగార బావిలో స్నానం చేసి సొరంగ మార్గం గుండా ఆ వెయ్యి స్తంభాల గుడికి వెళ్లి అక్కడ స్వామివారికి పూజలు చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ఇక ఇక్కడి శృంగార బావి కళా నైపుణ్యానికి నిదర్శనం. ఇక్కటి శిల్పాల నట్యభంగిమలు భారతీయ నాట్య కళా వైభవానికి సజీవ రూపాలు. ఇక యుద్ధ తంత్ర నైపుణ్యానికి కూడా ఈ శృంగార బావి నిర్మాణం ప్రతీక.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

మూడు అంతస్తులతో కూడిన ఈ బావిలో పై అంతస్తులోకి ఎవరైనా అపరిచిత వ్యక్తి వస్తే కింది అంతస్తులో ఉన్నవారికి ఇట్టే తెలిసిపోతుంది. దీంతో వారిని తుద ముట్టించడానికి వీలవుతుందని ఆ విధంగా నిర్మించారు.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ఇక మొదటి అంతస్తులో 9 స్తంభాలు, రెండో అంతస్తులో 4 స్తంభాలు, మూడో అంతస్తులో 2 స్తంభాలతో ఈ బావిని నిర్మించారు. ఈ శృంగార బావిలో అంత:పుర స్త్రీలు స్నానం చేసే సమయంలో నీళ్లు ఎంత అలజడిగా ఉన్నా, ఎవరైనా చూస్తే వారి ప్రతి బింబం నీటిలో కనిపించేలా ఈ బావిని నిర్మించారు.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

దీంతో భౌతిక శాస్త్రానికి కూడా అంతుబట్టని పరిజ్జానాన్ని ఈ బావి నిర్మాణంలో వినియోగించినట్లు చెబుతారు. ఎంత వేసవిలోనైనా ఈ బావిలోని నీరు ఎండిపోదు. కరువు సమయాల్లో కూడా ఈ బావిలోని నీరు చల్లగా ఉండటం కూడా విశేషమే.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల నుంచి వరంగల్ కు నేరుగా రైలు సౌకర్యం ఉంది. వరంల్ తో పాటు చుట్టు పక్కల ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ ఆనాటి కళా వైభవానికి ప్రతీకలు.

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ముఖ్యంగా వరంగల్ కోట ఇది వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో, హనుమ కొండ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, ఉంది. ఇక్కడ ఇప్పుడు కోట అవశేషాలు కనిపిస్తాయి. కోట శిలా తోరణ స్తంభాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో వాడుకలో ఉంది.

ఈ దసరా ఉత్సవాల్లో ఒక్కటైనా మీరు చూశారా?ఈ దసరా ఉత్సవాల్లో ఒక్కటైనా మీరు చూశారా?

శృంగార బావి, వరంగల్

శృంగార బావి, వరంగల్

P.C: You Tube

ఇక ఈ కోటలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామిదేవాలయం కూడా ఉంది. క్రీస్తు శకం 1162లో గణపతి దేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భూ భాగం నుంచి పూష్పాకారం, పై కప్పు నక్షత్రాకారం పోలినట్లు ఉన్న ఈ దేవాయం శిల్ప సంపద ఎంత వర్ణించినా తక్కువే.

ఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయిఇక్కడ హారతి ఇచ్చే సమయంలో విగ్రహం కళ్లు తెరుచుకొంటాయి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X