Search
  • Follow NativePlanet
Share
» »ఆ ‘పులి’ నిర్మించిన నక్షత్రాకార కోట ఎక్కడుందో తెలుసా

ఆ ‘పులి’ నిర్మించిన నక్షత్రాకార కోట ఎక్కడుందో తెలుసా

నక్షత్రాకారంలో ఉన్న మంజరాబాద్ కోటకు సంబంధించిన కథనం.

By Kishore

భారతతీయ చరిత్రలో కోటలది విడదీయని బంధం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో కోటలు మన సొంతం. అదే కోవకు చెందినది మంజరాబాద్ కోట. దేశంలో ఎక్కడా లేనట్లు మంజరాబాద్ కోట నక్షత్రాకారంలో ఉంటుంది. దీనిని మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ నిర్మించాడు. మంజరాబాద్ కోటను చూడటానికి వీకెండ్ లో ఎక్కువ మంది వస్తుంటారు. అనేక యుద్ధాలను చూసిన ఈ కోట పర్యాటక ప్రియులను ఆకర్షిస్తోంది. బెంగళూరు నుంచి మూడు గంటల ప్రయాణంతో మంజరాబాద్ కోటనుచేరుకోవచ్చు. వీకెండ్ లో ఎక్కువగా ట్రెక్కర్స్ ఇక్కడకు వస్తుంటారు. ఈ కోటను ప్రాచర్యంలోకి తీసుకువరావడానికి స్థానిక కర్నాకట ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నూతన ప్రణాళికలు రచిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే ఈ కోట మరింతగా పర్యాటకులను ఆకర్షిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.

భూత, ప్రేత, పిశాచాల బాధల నుంచి విముక్తి ఇక్కడే.. ఆ దేవదేవుడి చమట బిందువులే ఇక్కడభూత, ప్రేత, పిశాచాల బాధల నుంచి విముక్తి ఇక్కడే.. ఆ దేవదేవుడి చమట బిందువులే ఇక్కడ

1. నక్షత్రాకారపు కోట

1. నక్షత్రాకారపు కోట

Image Source:

భారత దేశంలో అనేక కోటలు అనేక రూపాల్లో మనకు కనిపిస్తాయి. అయితే అత్యంత అరుదుగా ఉండే కోటల జాబితాల్లోకి మంజరాబాద్ కోట చేరుతుంది. ఈ కోట నక్షత్రాకారంలో ఉంటుంది. ఇటువంటి విభిన్న కోటను చూడాలంటే కర్ణాటకకు వెళ్లాల్సిందే.

2. 3240 అడుగుల ఎత్తులో

2. 3240 అడుగుల ఎత్తులో

Image Source:

సముద్ర మట్టానికి 3240 అడుగుల ఎత్తులో మంజరాబాద్ కోట నిర్మించారు. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంటుంది. ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించిన ఈ కోట 8 కోనాలను కలిగి ఉంటుంది. ఈ కోటను చేరుకోవాలంటే దాదాపు 250 మెట్లను ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది.

3. ఎక్కడ ఉంది?

3. ఎక్కడ ఉంది?

Image Source:

మంజరాబాద్ కోట బెంగళూరు మంగళూరు హైవే దారిలో వస్తుంది. హాసన జిల్లా సకలేశ్వరపురం నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని దోణిగల్ అనే గ్రామానికి సమీపంలోని ఓ గుట్ట పై ఈ నక్షత్రాకారపు కోట ఉంది. ఈ సుందరమైన కోటను మైసూరు పులిగా పేరుగాంచిన టిప్పు సుల్తాన్ నిర్మించాడు.

4. ఎప్పుడు నిర్మించాడు

4. ఎప్పుడు నిర్మించాడు

Image Source:

మంజరాబాద్ కోటను టిప్పు సుల్తాన్ 1785 1892 మధ్యలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ కోటను ముఖ్యంగా నాల్గవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో వినియోగించాడు. శ్రీరంగ పట్టణం పతనం తర్వాత బ్రిటీష్ వారు ఈ కోటను తమ స్వాధీనం చేసుకొన్నారు. అటు పై కొన్ని ముఖ్యమైన భాగాలన ధ్వసం చేశారు.

5. ఈ కోటలో ఏమిమి చూడవచ్చు

5. ఈ కోటలో ఏమిమి చూడవచ్చు

Image Source:

దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోటలో నీటి నిల్వకు అవసరమైన చిన్న చెరువు ఉంది. యుద్ధ సమయంలో మందుగుండు నిల్వకు అవసరమైన గదులు, వంటగది, స్నానపు గదులు, శౌచాలయాలు ఉన్నాయి. ఈ కోట నుంచి సొరంగం ఉందని చెబుతారు. ఆ సొరంగం ద్వారా వెళితే నేరుగా శ్రీరంగపట్టణానికి చేరుకోవచ్చుననా చెబుతారు. అయితే ప్రస్తుతం ఈ స్వరంగమార్గాన్ని మూసివేశారు.

6. ఇంకా ఏమి చూడవచ్చు.

6. ఇంకా ఏమి చూడవచ్చు.

Image Source:

వీకెండ్ లో మంజరాబాద్ ను ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. ఈ కోటకు సమీపంలోనే సకలేశ్వర్ దేవాలయం ఉంది. ఇది పురాతన దేవాలయం. హోయసల రాజ వంశానికి చెందిన వారు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ శిల్పాలు చూడటానికి చాలా బాగుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X