Search
  • Follow NativePlanet
Share
» »వేంకటేశ్వరుడి ‘అన్న’ అందుకే తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చాడా?

వేంకటేశ్వరుడి ‘అన్న’ అందుకే తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చాడా?

తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయానికి సంబంధించిన కథనం.

తిరుపతిలోని గోవిందరాజస్వామిని వేంకటేశ్వరుడి అన్నగా చెబుతారు. తిరుపతి వేంకటేశ్వరుడే స్వయంగా తాను తన అన్న గోవిందరాజులు చెప్పినట్టు నడుచుకొంటానని ఒకానొక సందర్భంలో చెప్పాడు. ఇక ఈ గోవిందరాజస్వామి దేవాలయం దగ్గర్లోని కొలను అనేక చారిత్రాత్మక ఉద్యమాలకు పుట్టినిల్లు. వైష్ణవోద్యమానికి రామానుజాచార్యలు ఇక్కడే బీజం వేసినట్లు చెబుతారు. స్వతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక పోరాటాలు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యాయని చెబుతారు. శేషశయన స్థితిలో ఉన్న గోవిందరాజులు తమిళనాడులోని చిదంబరం నుంచి ఇక్కడికి వచ్చాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. ప్రాణ భయంతో అక్కడి పూజారులు స్వామివారిని ఇక్కడకు తీసుకొనిరాగా రామానుజా చార్యలువారికి ఆశ్రయం కల్పించాడని శాసనాలు చెబుతాయి. ఇలాంటి ఆసక్తికరమైన కథనం నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం

వేంకటేశ్వరుడికి అన్నగా

వేంకటేశ్వరుడికి అన్నగా

P.C: You Tube

తిరుపతిలోని గోవిందరాజ స్వామిని కలియుగ దైవం వేంకటేశ్వరుడికి అన్నగా పేర్కొంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు నుంచి అప్పుగా తీసుకొన్న సొమ్మును కొలిచి కొలిచి అలసిపోయిన స్థితిలో పడుకొన్న భంగిమలో గోవిందరాజస్వామి కనిపిస్తాడు.

వినియోగించిన కుంచె కూడా

వినియోగించిన కుంచె కూడా

P.C: You Tube

ఆలయన కాళ్ల వద్ద సొమ్మును కొలవడానికి వినియోగించిన కుంచె కూడా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా చరిత్రను అనుసరించి ఈ విగ్రహం తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చిందని గోవిందరాజ స్వామి దేవాలయంలోని శాసనాల వల్ల తెలుస్తుంది.

 శేషశయనుడైన విష్ణుమూర్తి

శేషశయనుడైన విష్ణుమూర్తి

P.C: You Tube

పూర్వం చిదంబర క్షేత్రంలో శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయం ఉండేది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న క్రిమకంఠుడనే రాజు శివ భక్తుడు. అంతేకాకుండా విష్ణువు అంటే అసహించుకునేవాడు. ఈ క్రమంలోనే చిదంబరంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు.

 ప్రాణభయంతో రాజ్యాన్ని విడిచి

ప్రాణభయంతో రాజ్యాన్ని విడిచి

P.C: You Tube

అంతేకాకుండా ఆలయ పూజారులను తీవ్రంగా హింసించి చంపించడం మొదలు పెట్టాడు. దీంతో వైష్ణవ పూజారులు ప్రాణభయంతో రాజ్యాన్ని విడిచి చెల్లాచెదురుగా పారిపోయారు.

రామానుజాచార్యులను కలిసి

రామానుజాచార్యులను కలిసి

P.C: You Tube

ఇందులో కొంతమంది ఆ విష్ణుమూర్తి ఉత్సవ మూర్తులను తీసుకొని తిరుమల ప్రాంతంలోని రామానుజాచార్యులను కలిసి తమ గోడును తెలియజేశారు.

విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి

విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి

P.C: You Tube

దీంతో రామానుచా చార్యులు చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రస్తుతం గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రతిష్టింపజేసినట్లు తెలుస్తోంది.

యాదవ రాజు ద్వారా

యాదవ రాజు ద్వారా

P.C: You Tube

అదే విధంగా చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహాలకు కూడా ఆరాధనలు, నిత్యపూజలు జరిగేలా కట్టుబాటు చేశారు. అటు పై రామానుజా చార్యులు తన శిష్యుడైన యాదవ రాజు ద్వారా ఆ ఆలయానికి దగ్గర్లో ఒక గ్రామాన్ని నిర్మింపజేసాడు.

వలస వచ్చిన పూజారులు

వలస వచ్చిన పూజారులు

P.C: You Tube

అందులో చిదంబరం నుంచి వలస వచ్చిన పూజారుల కుటుంబాలు ఉండేలా చేశాడు. అయితే మరికొంతమంది గోవిందరాజ స్వామి దేవాలయంలో మొదట పార్థసారధి విగ్రహం పూజలు అందుకొనేదని చెబుతారు.

క్రిమకంఠుడి రాజు ఆగడాలు

క్రిమకంఠుడి రాజు ఆగడాలు

P.C: You Tube

చిదంబరంలోని క్రిమకంఠుడి రాజు ఆగడాలు భరించలేక చిదంబరం లోని శేషశయన స్థితిలోని విగ్రహాన్ని నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి 24.2.1130 లో ఆలయంలో ప్రతిష్టింపజేశారని చెబుతారు. ఈ రెండు విషయాల్లో కొంత బేధం ఉన్నా చిదంబరంలో శేషశయన విష్ణుమూర్తి తిరుపతికి వచ్చి కొలువై ఉన్నట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతోంది.

జయనగర రాజులు

జయనగర రాజులు

P.C: You Tube

అదే విధంగా ఆలయంలోని శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1235లో మూడవ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలించే సమయంలో ఆలయం అభివ`ద్ధికి బాగా పాటుపడ్డాడు. అదేవిధంగా 1506లో విజయనగర రాజులు సాళువ వంశ కాలంలో ఆలయం అబివ`ద్ధికి అనేక భూములను దానంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఉత్తర దిక్కుకు పాదాలు

ఉత్తర దిక్కుకు పాదాలు

P.C: You Tube

ఇక గర్భగుడిలో గోవిందరాస్వామి విగ్రహం శేశాయి ఆదిశేషుని పై పడుకొన్నట్లు ఉంటుంది. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణదిశలో తల పెట్టుకొని, శంఖు, చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభి నుంచి కమలం ఉద్భవించి అందులో బ్రహ్మ ఉంటాడు. అంతేకాకుండా తలకు కిరీటం, దివ్యాభరణాలు కూడా స్వామివారికి ఉంటాయి.

మూలవిరాట్టు గోవిందరాజస్వామితో

మూలవిరాట్టు గోవిందరాజస్వామితో

P.C: You Tube

మూలవిరాట్టు గోవిందరాజస్వామితో పాటు ఆండాళ్ అమ్మవారు, శ్రీక`ష్ణుడు, శ్రీరామనుజ తిరుమంగై ఆళ్వారు, తదితర విగ్రమాలను మనం చూడవచ్చు. ఆలయం దక్షిణ భాగంలో రుక్మిణి, సత్యభామా సహితుడైన పార్థసారధి మందిరం ఉంది. వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

అభిషేకం జరుగదు

అభిషేకం జరుగదు

P.C: You Tube

ఇక్కడి విగ్రహం మట్టితో చేసినందువల్ల అభిషేకం జరుగదు. అయితే తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలాగానే గోవిందరాస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్దతులే పాటిస్తారు. ప్రధాన ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి. వీటి పై రామాయణ, మహాభారత గాధలను అందమైన శిల్పాల రూపంలో చెక్కారు.

 కాశీ రాజు కుటుంబ సమేతంగా

కాశీ రాజు కుటుంబ సమేతంగా

P.C: You Tube

వేంకటేశ్వరుడే ఈ గోవిందరాజ స్వామిని తన అన్నగా పేర్కొన్నాడని పురాణ కథనం. ఇందుకు సంబంధించిన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. దాని ప్రకారం ఒకసారి కాశీ రాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుడిని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చాడు.

స్వామివారు రాణి కలలో

స్వామివారు రాణి కలలో

P.C: You Tube

వారిద్దరికి స్వామివారి దర్శనం బాగానే జరిగింది. ఆరోజురాత్రివారు తిరుమలలోనే నిద్రకు ఉపక్రమించారు. అప్పుడు స్వామివారు రాణి కలలో కనిపించి నీకు నేను సంతానాన్ని అనుగ్రహిస్తాను కాని నీ ముక్కెరలో ఉన్న మణిని ఇవ్వమని అడిగాడు.

స్వామి వారు కూడా

స్వామి వారు కూడా

P.C: You Tube

దీంతో ఆమె తాను భర్త అడుగుజాడల్లో నడుచుకొంటానని అందువల్ల ఆయన చెబితేనే ఇస్తానని శ్రీనివాసుడికి సమాధానం ఇచ్చింది. అందుకు స్వామి వారు కూడా నేను నా అన్న గోవిందరాజుకు ఆధీనుడను. ఆయన చెబితేనే నీకు సంతాన భాగ్యాన్ని కలిగిస్తానని చెప్పి అంతర్థానమయ్యాడు.

దర్శనం చేసుకొని కాని వెనుదిరగరు

దర్శనం చేసుకొని కాని వెనుదిరగరు

P.C: You Tube

అందువల్లే తిరుపతిలోని గోవిందరాజస్వామిని తిరుమల లోని వేంకటేశ్వరుడికి అన్నగా భక్తులు భావిస్తారు. తిరుపతి వేంకటేశ్వరుడి దర్శానానికి వెళ్లిన కొంతమంది భక్తులు తిరుపతి గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని కాని వెనుదిరగరు.

చారిత్రాత్మక ఉద్యమాలకు పుట్టినిల్లు

చారిత్రాత్మక ఉద్యమాలకు పుట్టినిల్లు

P.C: You Tube

ఇక కొండను ఎక్కలేని భక్తులు గోవిందరాజుని దర్శనం చేసుకొని వేంకటేశ్వరుడికి తమ కోర్కెలను చెప్పాల్సిందిగా వేడుకొని వెనుతిరుగుతుంటారు. గోవిందరాజ స్వామి ఆలయంలో ఉన్న కోనేరు అనేక చారిత్రాత్మక ఉద్యమాలకు పుట్టినిల్లు. వైష్ణవోద్యమానికి రామానుజాచార్యలు ఇక్కడే బీజం వేసినట్లు చెబుతారు. స్వతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక పోరాటాలు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యాయని చెబుతారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X