Search
  • Follow NativePlanet
Share
» »ఈ విగ్రహం రహస్యాలన్నీ మీకు తెలుసా?

ఈ విగ్రహం రహస్యాలన్నీ మీకు తెలుసా?

భారత దేశాన్ని అఖండ భారతావనిగా మర్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ ది. భారత దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో దాదాపు 500 పైగా స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. వాటన్నింటినీ ఐక్యం చేయడానికి వల్లభాయ్ పటేల్ ఎంచుకున్న మార్గం ఆయనకు ఉక్కుమనిషిగా పేరు సంపాదించి పెట్టింది. అటు వంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు భారత దేశం సముచిత గౌరవం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఏమిటి ఆ గౌరవం? ఆ పర్యాటక ప్రాంత ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా చేరుకోవాలి తదితర వివరాలన్నీ మీ కోసం...

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని భవిష్యత్ తరాలకు కూడా తెలియజెప్పేలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆయన విగ్రహాన్ని అక్టోబర్ 31న ప్రధాని నరేంద్రమోదీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నిర్మించనున్న ఆ విగ్రహం పలు విశిష్టతలను కలిగి ఉంది. భారత దేశంలో రాజకీయంగా ప్రముఖ రాష్ట్రమైన గుజరాత్ లో 182 నియోజక వర్గాలు ఉన్నాయి.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

ఈ 182 నియోజక వర్గాలకు ప్రతీకగా ఈ విగ్రహం ఎత్తును 182 అడుగులుగా నిర్ణయించారు. ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కలల రూపం ఈ విగ్రహం. ఈ ప్రాజెక్టుకు క్రీస్తుశకం 2013 అక్టోబర్ 31న శంకుస్థాపన చేశారు.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం కావడం ఇక్కడ గమనార్హం. ఈ ప్రాజెక్టువ్యయం రూ.3వేల కోట్లు. స్వాతంత్ర్యం వచ్చాక రాజుల పాలనలో ఉన్న 562 చిన్నా, పెద్ద సంస్థానాలను భారత దేశంలో కలిపిన పటేల్ ను గౌరవిస్తూ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా పేరు పెట్టారు.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో ఈ విగ్రహం రూపు దిద్దుకుంది. సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ సంస్థలు ఈ విగ్రహం నిర్మణంలో ప్రధాన పాత్ర పోషించాయి.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

మొత్తం నాలుగువేల మంది కార్మికులు ఈ విగ్రహ నిర్మాణం కోసం పాటుపడ్డారు. ఇందులో 200 మంది చైనీయులే కావడం గమనార్హం. టీక్యూ ఆర్ట్ ఫౌండ్రీ కంపెనీకి భారీ విగ్రహాల తయారీలో ఎంతో అనుభవం ఉంది.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

దీంతో ఈ సంస్థకు చెందిన 200 మంది కార్మికులను చైనా నుంచి ఇక్కడికి రప్పించింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టుకు వినియోగించిన మొత్తం ఇనుము బరువు ఇరవై ఐదువేల మెట్రిక్ టన్నులు.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

ఇందులో ఐదు వేల మెట్రిక్ టన్నుల ఇనుము రైతులు విరాళాలుగా అందించిందే. పాత వ్యవసాయ పనిముట్ల నుంచి ఈ ఇనుమును సేకరించారు. విగ్రహం తయారీకి 90వేల టన్నుల సీమెంటును వినియోగించారు.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

ఈ విగ్రహం ఏర్పాటుతో ఇప్పటి వరకూ ఈ భూమి పైన ఎత్తైన విగ్రహంగా పేరుగాంచిన చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ బుద్ధుడు రెండో స్థానానికి వెళ్లిపోయాడు. ఈ విగ్రహం ఎత్తు 153 మీటర్లు.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

అటు పై జపాన్ లోని ఉసికుడయబుట్స్ (120 మీటర్లు), స్టాచ్యూ ఆఫ్ లిబల్టీ (93 మీటర్లు) రష్యాలోని ద మదర్ ల్యాండ్ కాల్స్ (85 మీ) తర్వాతి స్థానాల్లో చేరిపోయాయి.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

నిజానికి పటేల్ విగ్రహం మినహా ఇస్తే మిగిలిన విగ్రహాలన్నీ వాటి ఎత్తులు వాటి వేదికలతో కలిసి చెబుతారు. ఆ వేదిక విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే స్టాచ్యూ ఆఫ్ యునిటీ మొత్తం ఎత్తు 240 మీటర్లు.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉన్న వేదికనెక్కితే దగ్గర్లో ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్తో పాటు పచ్చటి కొండలనూ చూడవచ్చు. ఇక్కడ బోటు షికారు కూడా అందుబాటులో ఉంది.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

ఇక్కడ ప్రతి రోజూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలతో కూడిన లేజర్ లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. స్థానిక గిరిజనుల సంస్క`తిని తెలిపే మ్యూజియం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

స్టాచు ఆఫ్ యునిటీ

స్టాచు ఆఫ్ యునిటీ

P.C: You Tube

గుజరాత్ లోని నర్మదాడ్యాంకు దగ్గర్లో సాధు బెట్ అనే నదీ ద్వీపానికి కేవలం 3.2 కిలోమీటర్ల దూరంలోనే ఈ విగ్రహం ఉంది. ఏడాదిలో ఎప్పుడైనా ఇక్కడికి వెళ్లవచ్చు. అయితే జులై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎక్కువ మంది వెలుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X