Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ స్వర్గపు ద్వారాలు తెరుచుకున్నాయి.

ఇక్కడ స్వర్గపు ద్వారాలు తెరుచుకున్నాయి.

ఛార్ ధామ్ యాత్రకు సంబంధించిన కథనం

By Beldaru Sajjendrakishore

హిందూ పురాణాల ప్రాకారం ఇహలోకం వదిలి పరలోకంలో సుఖంగా ఉండాలంలే స్వర్గానికి పోవాలని తలుస్తారు. ఇందుకోసం బతికున్నప్పుడు మంచి పనులు చేయాలని లేదంటే నరకం తప్పదనేది ప్రజలు ఎన్నో ఏళ్లుగా భావిస్తున్నారు. ఒక వేళ తెలిసీ తెలియక ఏవైన తప్పులు చేసి ఉంటే కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే చేసిన పాపాలన్నీ పోయి నేరుగా స్వర్గానికి వెళుతారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అటువంటి పుణ్యక్షేత్రాల పర్యటనలో ముందు వరుసలో ఉండేది ఛార్ ధామ్ యాత్ర. పేరులో ఉన్నట్లే నాలుగు పుణ్యక్షేత్రాల దర్శనాన్నే ఛార్ ధామ్ యాత్ర అంటారు. హిందూ పురాణాల ప్రకారం బదరీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి సందర్శనను ఛార్ ధామ్ యాత్రగా పేర్కొంటారు. ఇందులో బదరీనాథ్ తప్ప మిగిలిన మూడు పుణ్యక్షేత్రాలను మనం ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు.

ఈ ఆలయాన్ని దర్శిస్తేనే కాశి దర్శన ఫలితంఈ ఆలయాన్ని దర్శిస్తేనే కాశి దర్శన ఫలితం

శంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటుశంకరాచార్యులకు అమ్మవారు పరీక్షపెట్టిన చోటు

మహిళ వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటు.మహిళ వక్షస్థలంలో ఈశ్వరుడు వెలిసిన చోటు.

అయతే బదరీనాథ్ మాత్రం ఏడాదిలో సుమారు ఆరునెలల మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బదరీనాథ్, యమునోత్రీ, గంగోత్రి, కేథరీనాథ్ లను కలిపి మినీ ఛార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు. వీటిని సందర్శించుకున్నా చేసిన తప్పులన్నీ పోయి నేరుగా స్వర్గానికి పోతామని చెబుతారు. ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన ఈ యాత్ర సుమారు 12,000 అడుగుల ఎత్తులో ఇరుకైన దారుల వెంట సుమారు 10 రోజుల పాటు సాగుతుంది. ప్రతి ఏటా మే నుంచి దీపావళి మర్నాడు వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. మిగతా ఆరు నెలల కాలం అక్కడంతా మంచుకప్పేసి ఉంటుంది. ఈ ఛార్ ధామ్ యాత్రకు సంబంధించి ఈ ఏడాదికి గాను రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మినీ ఛార్ ధామ్ యాత్ర అనుమతికి అన్ లైన్ రిజిస్ట్రేషన్ ను ఓపెన్ చేశారు. చల్లని పర్యాటక ప్రాంతాలుగా పేరు గాంచిన ఈ క్షేత్రాలను వేసవిలో కూడా ఎక్కువ మంది సందర్శిస్తుంటారు. దీనితో పాటు ఈ పుణ్యక్షేత్రాల వివరాలు మీ కోసం...

1. గంగోత్రి

1. గంగోత్రి

Image Source:

భగీరథుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి గంగను భూమి పైకి దింపిన ప్రదేశాన్నే గంగోత్రి అని అంటారు. ఇక్కడ గంగానదిని భాగీరథి పేరుతో పిలుస్తారు. గంగానదిని భూమి పైకి తీసుకురావడానికి భాగీరథుడు కారణం కావున ఆ పేరు వచ్చింది. హరిద్వార్, రిషికేష్ తోపాటు డెహరడూన్ నుంచి ఒక రోజు ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు.

3. గోముఖ్

3. గోముఖ్

Image Source:

ఇక గంగోత్రికి 40 కిలోమీటర్ల దూరంలో గోముఖ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడే గంగాదేవి జన్మస్థలం అని చెబుతారు. ఇక్కడకు వెళ్లాలంటే భారత రక్షణశాఖ అనుమతి అవసరం. అందువల్ల చాలా మంది గంగోత్రి వద్దకు వెళ్లి అక్కడ నుంచే వెనుతిరుగుతారు.

4. భవిష్య బద్రీ దేవాలయం

4. భవిష్య బద్రీ దేవాలయం

4. భవిష్య బద్రీ దేవాలయం

Image source:

ఇక్కడకు దగ్గర్లో భవిష్య బద్రీ దేవాలయం ఉంది. ఇది జోషి మఠానికి 17 కిలోమీటర్ల దూరంలో తపోవనం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉంటాడు. భవిష్యత్తులో ఛార్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలోనే కొలువవుతాడని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. అందువల్లే ఈ దేవాలయానికి భవిష్య బద్రీ దేవాలయం అనే పేరు వచ్చింది.

5. యమునోత్రీ

5. యమునోత్రీ

Image Source:

యమునా నది జన్మస్థలమే యమునోత్రి. ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. యమునోత్రీ జన్మించిన చోటునే యమునా దేవి ఆలయం ఉంది. ఆలయం చేరుకోవడానికి హనుమాన్ చెట్టి, జానకి చెట్టి వరకూ వ్యానులు వెలుతాయి. అక్కడి నుంచి గుర్రం, డోలీ, బుట్ట, లేదా కలినడకన సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి యమునోత్రీ చేరుకోవచ్చు.

6. 10 అడుగుల వెడల్పు మాత్రమే

6. 10 అడుగుల వెడల్పు మాత్రమే

6. 10 అడుగుల వెడల్పు మాత్రమే

Image Source:

నడక దారిలో ఒక్కోచోటు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఒక వైపు వందల అడుగుల ఎతైన పర్వతప్రాంతాలు, మరో వైపు ఐదారు వందల అడుగుల లోతైన లోయ ప్రాంతాలు ఉంటుంది. ఈ రెండింటి నడుమ ప్రవహించే యమునా నది అందాలను కన్నులతో చూడాల్సిందే తప్పిస్తే వర్ణించడానికి వీలు కాదు.

7. వేడి నీటి గుండాల్లో

7. వేడి నీటి గుండాల్లో

7. వేడి నీటి గుండాల్లో

Image Source:

యమునా దేవి గుడి ముందు ఉన్న వేడి నీటి గుండాల్లో యాత్రికులు స్నానం చేసి యమునా దేవిని దర్శించుకుంటారు. గర్భగుడిలో యమునా, సరస్వతి, గంగా దేవి మూర్తులు ఉంటాయి. దేవతల దర్శనం తర్వాత యాత్రికులు ఆలయం పక్కన ఉన్న చిన్న ఉష్ణ గుండాల్లో చిన్న బియ్యం, ఆలు మూడలను దారానికి కట్టి లోపలికి వదులుతారు.

8. నైవేద్యంగా

8. నైవేద్యంగా

8. నైవేద్యంగా

Image Source:

ఆ వేడికి అవి బాగా ఉడికి పోతాయి. వీటిని దేవతను నైవేద్యంగా పెడుతారు. తర్వాత యాత్రికులు నదీమతల్లికి పూజలు చేసి నదీ జలాన్నే తీర్థంగా తీసుకుంటారు. నదిలో పూలు, దీపం తదితరాలను వదిలి తమ మొక్కును తీర్చుకుంటారు.

9. నర నారాయణ కొండల మధ్య

9. నర నారాయణ కొండల మధ్య

9. నర నారాయణ కొండల మధ్య

Image Source:

బద్రీనాథ్ ఉత్తరాఖండ్ లోనే చమోలి జిల్లాలో ఉంది. నర నారాయణ కొండల వరుసల మధ్య నీలఖంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంది. బద్రీనాథ్ రుషికేష్కు ఉత్తర భాగంలో 301 కిలోమీర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా గౌరీ కుండ్ కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

10. అందుకే ఆ పేరు

10. అందుకే ఆ పేరు

Image Source:

బద్రీ అంటే రేగు పండు నాథ్ అంటే దేవుడు. ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వల్ల ఇక్కడ వెలిసిన దేవుడికి బద్రీనాథుడు అనే పేరు వచ్చినట్లు చెబుతారు. మరో కథనం ప్రకారం కృష్ణావతారానికి ముందు మహావిష్ణువు నారాయణ మునిగాను అర్జునుడు నర ముని గాను ఇక్కడే జన్మించి నట్లు స్థల పురాణం చెబుతుంది. అటు పై వారిరువురూ కృష్ణుడిగానూ అర్జునినిగానూ జన్మించినట్లు తెలుస్తోంది.

11. రెండు రోజుల పాటు ప్రయాణం

11. రెండు రోజుల పాటు ప్రయాణం

Image Source:

కేదరీనాథ్ నుంచి బద్రీనాథ్ కు సుమారు రెండు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడకు సమీపంలో డెహరడూన్ వీమానాశ్రయం ఉంది. అదే విధంగా రైల్వే హరిద్వార్ లో రైల్వేస్టేషన్ కూడా ఉంది. ప్రతి రోజూ ఢిల్లీ, హరిద్వార్, రుషికేష్ ల నుంచి బస్సలు ఇక్కడకు బయలు దేరుతాయి.

12. నేరుగా వెళ్లవచ్చు

12. నేరుగా వెళ్లవచ్చు

12. నేరుగా వెళ్లవచ్చు

Image Source:

బద్రినాథ్ దేవాలయం వరకూ మనం నేరుగా వాహనాల్లో వెళ్లవచ్చు. ఈ దేవాలయానికి ఒక కిలోమీటరు దూరంలో బ్రహ్మకపాలము ఉంది. ఇక్కడకు 8 కిలోమీటర్ల దూరంలో వసుధార ఉంది. ఈ వసుధారలోని నీరు పుణ్యాత్ముల పై మాత్రమే పడుతుందని చెబుతారు.

13. కేదార్ నాథ్ దేవాలయం

13. కేదార్ నాథ్ దేవాలయం

13. కేదార్ నాథ్ దేవాలయం

Image Source:

సాధారణంగా లింగం ఒవెల్ లేదా గుడ్డు ఆకారంలో ఉంటుంది. అయితే కేదారినాథ్ దేవాలయంలో మాత్రం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవుల్లో ఒకరైన భీముడు శివుడిన్ని ఆరాధించే సమయంలో ఈ లింగాన్ని ప్రతిష్టించారని ఒక కథనం.

14. జ్యోతిర్లింగాలు

14. జ్యోతిర్లింగాలు

Image Source:

మరో కథనం ప్రకారం ఆదిశంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా జ్యోతిర్లింగాల స్థాపన జరిపే సమయంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఏది ఏమైనా ప్రపంచంలో త్రిభుజాకారంలో ఉన్న శివలింగం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.

16. కాలి నడకన

16. కాలి నడకన

Image Source:

అక్కడి నుంచి కేదార్ నాథ్ కు బయలు దేరుతారు. సుమారు 14 కిలోమీటర్లు కాలి నడకన లేదా డోలీల్లో గుర్రాల పై వెలుతుంటారు. ఈ మొత్తం నాలుగు క్షేత్రాల దర్శనంతో మినీ ఛార్ ధామ్ యాత్ర పూర్తయినట్లు భక్తులు భావిస్తుంటారు.

17. ముందుగా రిజిస్ట్రేషన్ తప్పని సరి

17. ముందుగా రిజిస్ట్రేషన్ తప్పని సరి

17. ముందుగా రిజిస్ట్రేషన్ తప్పని సరి

Image Source:

హరిద్వార్ లోని రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, గురుద్వారా తదితర ప్రాంతాల్లో ఛార్ ధామ్ యాత్ర కోసం వెళ్లేవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో ఐడెంటిటీ కార్డులు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి. ఇందు కోసం రూ.50 చెల్లించాలి.

18. ఆన్ లైన్ లో కూడా

18. ఆన్ లైన్ లో కూడా

18. ఆన్ లైన్ లో కూడా

Image Source:

అదే విధంగా అన్ లైన్ లో కూడా తమ పేర్లను మనం నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం www.onlinechardhamyatra.com లో సంప్రదించాలి. అదే విధంగా ఛార్ ధామ్ యాత్రకు హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్లవెచ్చు. ఇందు కోసం ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ అధికారిక వెబ్ సైట్ www.uttarakhandtourism.gov.in లో సంప్రదించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X