Search
  • Follow NativePlanet
Share
» »సగం నలుపు తెలుపు శివ లింగం...దర్శిస్తే భార్యభర్తలు

సగం నలుపు తెలుపు శివ లింగం...దర్శిస్తే భార్యభర్తలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి.

By Beldaru Sajjendrakishore

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశం గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ ... క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామం లేదా దక్షారామం

విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే..విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే..

పురుషాంగ రూపంలో 'లింగ'మయ్యపురుషాంగ రూపంలో 'లింగ'మయ్య

ఇక్కడ చీటీ పడితేనే పెళ్లిఇక్కడ చీటీ పడితేనే పెళ్లి

మిగతా శక్తి పీఠా క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోటా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్టించడం విశేషం. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.

1. స్థలపురాణం

1. స్థలపురాణం

1.స్థల పురాణం

Image Source:

పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించారు.

2. తారకాసురుడితో యుద్ధం

2. తారకాసురుడితో యుద్ధం

2. తారకాసురుడితో యుద్ధం

Image Source:

అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణ చేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగుతుంది. ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడుతుంది.

3. అవే పంచారామ క్షేత్రాలు

3. అవే పంచారామ క్షేత్రాలు

3. అవే పంచారామ క్షేత్రాలు

Image Source:
అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. అవి వరుసగా ద్రాక్షారామంలో, రెండవది అమరారామం [అమరావతి] లో, మూడవది క్షిరారామం [పాలకొల్లు] లో, నాలుగవది సోమారామం [గుణుపూడి, భీమవరం] లో అయిదవది కుమారారామం [సామర్లకోట దగ్గరగల భీమవరం] లో పడ్డయట. ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ఠ చేసి అభిషేకార్చనలు చేసారు. ఆఅ దేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఆయా దేవుని పేరుతో పిలవబడుతోంది.

4. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి

4. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి

4. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి

Image Source:

భీమేశ్వర ఆలయం ద్రాక్షారామం పంచారామాలలో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తి పీఠాల్లొ ఒకటిగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ మూల విరాట్ భేమేశ్వర స్వామి కాగా, అమ్మవారు దాక్షాయిణి. భీమేశ్వర స్వామి స్వయంభు లింగరూపంలో 14 అడుగుల ఎత్తు వుంటారు. లింగం సగభాగం నల్లగా, మిగిలిన సగభాగం తెల్లగా ఉంటుంది. అర్ధనారీశ్వర తనానికి ఇదొక నిదర్శనం. అందువల్ల ఈ ఆలయాన్ని దర్శించిన భార్య భర్తలు మిక్కిలి అనోన్యంగా ఉంటారని చెబుతారు.

5. రెండు అంతస్తుల్లో

5. రెండు అంతస్తుల్లో

5. రెండు అంతస్తుల్లో

Image Source:

ఆలయంలో క్రింద దర్శన అనంతరం పై అంతస్తులో పూజాదికాలతో మళ్లీ దర్శనం చేసుకుంటారు. అంటే రెండు అంతస్తులలో వుంటుంది. ఇక్కడ లక్ష్మి నారాయణుడు క్షేత్రపాలకుడిగా వున్నాడు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై 832 పైగా శాసనాలు ఉన్నాయి. మనకి వీటిలోని వ్రాత అర్ధంకాకపోయినా చారిత్రిక పరిశోధకులకు ఇవి పెన్నిధి వంటివి. ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే మనకు మనదేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది.

6. అందుకే ఆ పేరు

6. అందుకే ఆ పేరు

6. అందుకే ఆ పేరు

Image Source:

పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారన్న కథనం కూడా ఉంది. ఇదే ప్రాంతంలో ఒకనాడు దక్షుడు యజ్ఞం తలపెట్టాడు. ఇందుకు ఆహ్వానం లేకపోయినా దక్ష ప్రజాపతి కుమార్తే దాక్షాయినీ ఆ శివుణ్ని ఒప్పించుకొని పుట్టింటిలో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. పార్వతి దేవిని ఎవరూ కూడా పలకరించలేదు.

7. దక్షయజ్ఞాన్ని ధ్వంసం

7. దక్షయజ్ఞాన్ని ధ్వంసం

7. దక్షయజ్ఞాన్ని ధ్వంసం

Image Source:

ప్రేమాదరాలు చూపించలేదు. పార్వతి దేవికి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. అయ్యో !! నా భర్త మాట వినకుండా వచ్చానని పశ్చాత్తాపపడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేకపోయింది. పాపం. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.

8. అక్కడే స్వయంభువుడిగా

8. అక్కడే స్వయంభువుడిగా

8. అక్కడే స్వయంభువుడిగా

Image Source:

పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మశరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయతాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశశక్తిపీఠాలు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.

9. అందువల్ల మహిమాన్వితమైనది

9. అందువల్ల మహిమాన్వితమైనది

9. అందువల్ల మహిమాన్వితమైనది

Image Source:


ఇక్కడ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లొ ద్వాదశ శక్తి పీఠంగా మాణిక్యాంబ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది. మిగతా శక్తి పీఠా క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరోచోటా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతుంటాయి. ఈ క్షేత్రంలో యంత్రం వేసి అమ్మవారిని ప్రతిష్టించడం విశేషం. సతీదేవి తనువు చాలించిన ప్రదేశంలోనే శక్తిపీఠం ఆవిర్భవించడం వల్ల ఒక మహిమాన్విత ప్రాంతంగా విరా జల్లుతోంది.

10. వేదవ్యాసుడు

10. వేదవ్యాసుడు

10. వేదవ్యాసుడు

Image Source:

పూర్వం వేదవ్యాసుల వారు కాశిలో నివసించేవారు. ఒకసారి కాశీవిశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు.

11. వ్యాసుని విగ్రహం ఇక్కడ

11. వ్యాసుని విగ్రహం ఇక్కడ

11. వ్యాసుని విగ్రహం ఇక్కడ

Image Source:

దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది.

12. జుట్టు ముడి వేసుకున్న స్థితిలో ఆంజనేయ స్వామి

12. జుట్టు ముడి వేసుకున్న స్థితిలో ఆంజనేయ స్వామి

12. జుట్టు ముడి వేసుకున్న స్థితిలో ఆంజనేయ స్వామి

Image Source:

గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.

13. నమూనా దేవాలయం

13. నమూనా దేవాలయం

13. నమూనా దేవాలయం

Image Source:

ఏకశిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట.

14. ఎతైన గోపురాలు

14. ఎతైన గోపురాలు

14. ఎతైన గోపురాలు

Image Source:


నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి, వేప వంటి వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడ లో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు. భక్తులు వీటిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

15. ద్రాక్షారామం ఎలా చేరుకోవాలి ?

15. ద్రాక్షారామం ఎలా చేరుకోవాలి ?

15. ద్రాక్షారామం ఎలా చేరుకోవాలి ?

Image Source:


విమాన మార్గం ద్రాక్షారామం కి 36 కి. మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం. ఈ విమానాశ్రయం దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ వంటి నగరాలకు విమాన సర్వీసులు ఉన్నాయి.

రైలు మార్గం ద్రాక్షారామం కి 30 కి. మీ. దూరంలో ఉన్నది సామర్లకోట రైల్వే జంక్షన్ . ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మొదలగు నగరాలకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం రోడ్డు మార్గం గురించి ఎటువంటి ఢోకా చెదావలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ద్రాక్షారామంకి అన్ని నగరాలనుంచి బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కనుక బస్సు మార్గం శ్రేయస్కరం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X