Search
  • Follow NativePlanet
Share
» »మీలో దెయ్యాన్ని పాలదోలుతారు

మీలో దెయ్యాన్ని పాలదోలుతారు

భారత దేశంలో దయ్యాన్ని లేదా దెయ్యాన్ని పాలదోలే ప్రాంతాలకు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

భయపెట్టే సినిమాలు చూసినప్పుడు మీలో ఎంతమందికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.భయపెట్టే సినిమాలు మామూలుగా విపరీతమైన వుద్రేకాన్ని కలిగిస్తాయి. కాని వాటిని నిజంగా చూసినప్పుడు మీరు ఏం చేయలేరు అనే భావన కలిగించేలా ఒక స్థితికి చేరుస్తాయి.రోమన్, కాథలిక్, మతాధికారులు భూతవైద్యం చేయటంలో విపరీతమైన పేరుగాంచారు అనే సత్యం చాలామందికి తెలుసు.మన భారతదేశంలో ప్రముఖదేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాల్లో భూతవైద్యాన్ని బాహాటంగా నిర్వహిస్తారు. భూతవైద్య పద్ధతికి సంబంధించిన నమ్మకాలు మరియు/లేదా పద్ధతులు దక్షిణ దేశంలోని ప్రాచీన ద్రవిడులలో ప్రముఖంగా ఉండేవి. నాలుగు వేదాలలో, అథర్వ వేదంలో మంత్ర మరియు వైద్యాలకు చెందిన రహస్యాలు ఉన్నాయని చెప్తారు. ఈ గ్రంథంలో దెయ్యాలను మరియు దుష్ట ఆత్మలను తొలగించడానికి అనేక ఆచార కర్మలు వివరించబడ్డాయి. ఈ నమ్మకాలు పశ్చిమ బెంగాల్, ఒడిషా మరియు కేరళ వంటి దక్షిణ రాష్ట్రాలలో బలంగా ఉండి ఆచరించబడుతున్నాయి. అటువంటి ప్రదేశాలగురించి తెలుసుకుందాం.

1. కన్నీళ్లు ఆగవు

1. కన్నీళ్లు ఆగవు

Image source:

చాలా మంది తాము ఎవరూ స్వాధీనంలో వున్నామని భావించి అటువంటివాళ్ళ చెరనుంచి బయటపడటానికి ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళుతూవుంటారు. ఇటువంటి ప్రజలు అనుభవిస్తున్న బాధను గనుక మనం కళ్ళారా చూస్తే కన్నీళ్లు ఆగవు.ఆ చూసినప్పుడు కలిగే భావన మనల్ని విపరీతమైన ఆందోళనకు గురిచేస్తుంది.భారతదేశంలో ఏఏ పుణ్యక్షేత్రాలు భూతవైద్యానికి విపరీతమైన పేరుసంపాదించాయి. అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఆ యొక్క ప్రక్రియగురించి మరింత విపులంగా ఇప్పుడు తెలుసుకుందాం.

2. అసలు భూతవైద్యం అంటే ఏంటి?

2. అసలు భూతవైద్యం అంటే ఏంటి?

Image source:


క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం భూతవైద్యం అంటే వ్యక్తులు, ప్రదేశాలు లేదా వస్తువులు ఇలా వేటిలోనైనా లేదా వేటికైనా దెయ్యం పట్టిందని లేదా చెడ్డశక్తులతో నిండిపోయి వుందని భావిస్తారో లేదా వీరందరూ దుర్భుద్ధికి బాధితులుగా లేదా పరికరాలు మారుతారో అటువంటి విచిత్రపరిస్థితి నుండిబయటపడేస్తూ వాళ్ళలో వున్న దెయ్యాలను, లేదా చెడుశక్తులను,లేదా చెడు ఆత్మలను బయటకుపారద్రోలి పరిపూర్ణ మనిషిని చేయటానికి ఇది ఎంతగానో వుపయోగపడుతుంది.

3. గత జన్మల్లో చేసిన పాపాల నుంచి

3. గత జన్మల్లో చేసిన పాపాల నుంచి

Image source:

బాప్టిస్ మల్ భూతవైద్యం ఈ రకమైన భూతవైద్యంలో గతజన్మలో చేసిన పాపాలనుండి విముక్తిని కలిగించటానికి బాపిటైజింగ్ అనే ప్రక్రియద్వారా ఈ భూతవైద్యం చేస్తారు. సాధారణం భూతవైద్యం ఏదైనా పరిసరాలను లేదా వస్తువులను దెయ్యాలయొక్క ప్రభావంనుండి బయట పడేయటానికి ఈ రకమైన భూతవైద్యాన్ని వుపయోగిస్తారు. పరిసరాలు, ప్రాంతాలను అనుసరించి ఈ భూత వైద్యానికి వాడే వస్తువులు మారిపోతుంటాయి.

4. కొన్ని సమయాల్లో మరణిస్తారు

4. కొన్ని సమయాల్లో మరణిస్తారు

Image source:


నిజమైన భూతవైద్యం అంటే ఏదైనా వ్యక్తి యొక్క శరీరంలో వుండే భూతాన్ని బయటకు పంపించి ఆయా వ్యక్తులని శుద్ధి చేయటానికి వుపయోగిస్తారు.ఎవరైతే ఈ దెయ్యాలబారిన పడి వాటి యొక్క ఆధీనంలో వుంటారో అటువంటివారిపై ఈ భూతవైద్యాన్ని ప్రయోగిస్తారు. ఈ సమయంలో ఆయా వ్యక్తులకు శారీరకహాని కలగొచ్చు.మరియు కొన్ని సందర్భాలలో వారు మరణించే అవకాశం కూడా వుంది.

5. దెయ్యానికి ఆహారంగా మారడం

5. దెయ్యానికి ఆహారంగా మారడం

Image source:

ఎప్పుడైతే దెయ్యం ఒక వ్యక్తిని బాధితుడిగా మార్చి ఆహారం తీసుకోవలని భావిస్తుందో,అటువంటి సందర్భాలలో విభిన్నమైన భూతవైద్యాన్ని చేయవలసివుంటుంది. ఆ సందర్భాలలో పూజారి దెయ్యాలతో నేరుగా మాట్లాడి ఆత్మలనుండి వాటిని పారద్రోలాలని ప్రయత్నిస్తాడు.ఇప్పుడు భారతదేశంలో వుండే కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆచరించే భూతవైద్యం గురించి తెలుసుకుందాం.

6. శ్రీ మెహందిపూర్ బాలాజీ

6. శ్రీ మెహందిపూర్ బాలాజీ

Image source:

శ్రీ మెహందిపూర్ బాలాజీ ఈ పుణ్యక్షేత్రానికి ఒక సారి వెళ్లివచ్చినతరువాత అక్కడి గాయాలతో కూడిన జ్ఞాపకాలు మిమ్మల్ని అలా వెంటాడుతూనే వుంటాయి. ఈ దేవాలయం భూతవైద్య ఆచార్యులకు ఎంతో పేరుగాంచింది మరియు మీరెప్పుడైతే అక్కడికి వెళతారో అక్కడ గోడలకు గొలుసులతో కట్టబడిన వ్యక్తులను చూడవచ్చు. ఇక్కడ గొలుసులతో కట్టబడిన వారు దెయ్యంబారి నుండి తమను తాము కాపాడుకోవాలనే వుద్దేశ్యంతో బాగా మరుగుతున్న వేడినీటిని కూడా వారిపైవారే పోసేసుకుంటారు.

7. హజరత్ సయ్యద్ ఆలీ దర్గా

7. హజరత్ సయ్యద్ ఆలీ దర్గా

Image source:

గుజరాత్ ఈ యొక్క పుణ్యక్షేత్రానికి ఏ కులం వారైనా వెళ్ళవచ్చు. ఆ పుణ్యక్షేత్రం లోపలి ఎప్పుడైతే మీరు అడుగుపెడతారో ఆ సమయంలో దెయ్యం పూనింది అని చెప్పబడే వ్యక్తులయొక్క అరుపులు మరియు ఏడుపులు విపరీతంగా వినబడుతుంటాయి. ఎక్కువ క్రూరంగా వ్యవహరిస్తుంటారో అటువంటివారిని గొలుసులతో కట్టివేస్తుంటారు మరియు దెయ్యాలబారి నుండి బయటపడటానికి చాలామంది స్త్రీ పురుషులు అక్కడ నేలపై దొర్లుతూ కనిపిస్తారు.

8. దేవ్ జీ మహారాజ్ మందిర్

8. దేవ్ జీ మహారాజ్ మందిర్

Image source:


మలజ్ పూర్ భారతదేశంలో భూత్ మేళను ప్రతిసంవత్సరం నిర్వహించే అతి తక్కువదేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ పౌర్ణమి రోజు ఎక్కువ మంది వస్తుంటారు. ఈ క్షేత్రంలో ఎవరైతే చెడ్డశక్తులబారిన పడ్డారో వారు తమ శరీరంనుండి వారిని కాపాడటానికి కర్పూరాన్ని అరచేతిలో పెట్టి వెలిగిస్తారు. మరియు అక్కడున్న వ్యక్తులు పవిత్రచీపుర్లతో వారిని తుడుస్తారు. ఆ సమయంలో వారి అరపులు చుట్టు పక్కల కిలోమీటరు వరకు ప్రతిధ్వనిస్తాయి.

9. దత్తాత్రేయమందిర్

9. దత్తాత్రేయమందిర్

Image source:


గంగాపూర్ ఈ యొక్క ఈ పుణ్యక్షేత్రంలో ఉదయం 11:30గంలకు మహామంగళ హారతి మొదలవుతుంది. ఈ సమయంలో భూతవైద్యం మొదలుపెడుతుంటారు. ఎప్పుడైతే ఇది మొదలవుతుందో ఆ సమయంలో చెడ్డశక్తులు ఆవహించిన వ్యక్తులు బిగ్గరగా అరుస్తూ కేకలు పెడుతూ దేవుడ్ని తిడుతూవుంటారు. చాలా మంది దెయ్యం పట్టిన వ్యక్తులు అక్కడ స్థంభాలను కూడా ఎక్కేస్తుంటారు.ఆ దేవాలయం నుండి తమను పంపించేయాలనే వుద్దేశ్యంతో చాలామంది ఇలాచెస్తుంటారు.

10.నిజాముద్దీన్ దర్గా, ఢిల్లీ

10.నిజాముద్దీన్ దర్గా, ఢిల్లీ

Image source:

దెయ్యం పట్టిన వ్యక్తులను చూడగలను అనే ధైర్యం మీలో విపరీతంగా గనకవుంటే మీరు తప్పకసందర్శించాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి.ఈ దర్గాలో ప్రజలు సూఫీదేవుడిని ప్రార్థనలు చేస్తూవుంటారు. ఎక్కడైతే భూతవైద్యం చేస్తుంటారో అక్కడ అనూహ్యంగా విపరీతమైన ఏడుపులు మరియు అరుపులు వినపడుతూవుంటాయి. దేశ రాజధానిలోనే ఇటువంటి ప్రదేశం ఉండటం ఇక్కడ గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X