Search
  • Follow NativePlanet
Share
» »దేవతలందరూ నివశించే ప్రదేశం...అందుకే ఇక్కడ

దేవతలందరూ నివశించే ప్రదేశం...అందుకే ఇక్కడ

By Beldaru Sajjendrakishore

విషపు రాళ్లతో మలచబడిన ప్రపంచంలో ఏకైక విగ్రహం

రాక్షసుడు అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది ప్రజలను హించేవాడు. దేవతల పై దండయాత్రలు చేసేవాడు. ఇలా చాలా రకాల ఆలోచనలు మనస్సులో మెదులుతాయి. అయితే రాక్షసరాజు వేల సంవత్సరాలు విష్ణువు గురించి తపస్సు చేసి ఆయన్ను మెప్పించాడు. అంతే కాకుండా బ్రహ్మ తలపెట్టిన ఓ కార్యానికి ఏకంగా తన తలనే దానంగా ఇచ్చాడు. అతను మోక్షం పొందిన చోటు దేవతలందరూ నివశించేలా విష్ణువు అతనికి వరం ఇచ్చాడు. అందుకే ప్రపంచంలోని చాలా మంది అక్కడకు వచ్చి తమ పెద్దలకు పిండప్రదానం చేసి వారికి మోక్షం లభించాలని ప్రార్థిస్తుంటారు. ఇంతకీ ఆ చోటు ఎక్కడ ఉంది దానికి సంబందించిన కథ మనం ఈ రోజు తెలుసుకుందాం

1.హిందువులతో పాటు బౌద్ధులకు కూడా

1.హిందువులతో పాటు బౌద్ధులకు కూడా

Image source:

గయ హిందువులతో పాటు బౌద్ధులకు కూడా పరమ పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాజధాని పాట్నా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గయ పురణపరంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రాముఖ్యత చెందినది.

2. గయాసురుడనే రాజు

2. గయాసురుడనే రాజు

Image source:

పూర్వం గయాసురుడనే రాక్షసరాజు ఉండేవాడు. అతను విష్ణువు పరమ భక్తుడు. విష్ణువు కోసం వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ మహాదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు. విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత భూ మండలంలోని అన్ని పరమ పవిత్రమైన తీర్థాల కంటే తన శరీరం అతి పవిత్రమైనది కావాలని కోరుకుంటాడు.

3.వరమిస్తాడు

3.వరమిస్తాడు

Image Source:

ఆ రాక్షసరాజు భక్తికి మెచ్చిన విష్ణువు భవిష్యత్తులో రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అతని కోరిక నెరవేరుస్తాడు. దీంతో ఎంత పాపం చేసిన వారైనా రాజు శరీరాన్ని తాకిన వెంటనే పుణ్యాత్ములుగా మారి నేరుగా మోక్షం పొందేవారు.

4.భారీ కాయుడు

4.భారీ కాయుడు

Image Source:

ఇక గయాసురుడు చాలా భారీకాయుడు దాదాపు 576 మైళ్ల పొడవు, 268 మైళ్ల నడుముతో ఉంటాడు. చివరికి పక్షలు, క్రిమి, కీటకాలు కూడా గాలిలో ఎగురుతూ వచ్చి ఆయన శరీరాన్ని తాకిన వెంటనే మోక్షం పొందేవి. ఇలా అందరూ పుణ్యాత్ములుగా మారి పోవడం వల్ల నరకానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతూ వచ్చింది.

5.సష్టి ధర్మంలో తేడా రావడంతో

5.సృష్టి ధర్మంలో తేడా రావడంతో

5.సృష్టి ధర్మంలో తేడా రావడంతో

Image Source:

దీంతో సష్టి ధర్మంలో తేడా రావడంతో దేవతలందరూ భయపడి పోయారు. మరోవైపు గయాసురుడు చేసిన లెక్కలేని యజ్జాల వల్ల స్వర్గాధిపతి ఇంద్రపదవిని పొందుతాడు. దీంతో ఇంద్రుడు పోయిన తన పదవిని పొందడానికి బ్రహ్మగురించి ఘోర తపస్సు చేస్తాడు. బ్రహ్మకూడా స`ష్టి ధర్మం సరిచేయాలని భావించి దేవతలందరితో చర్చించి ఒక ఉపాయం పన్నుతాడు.

6.బ్రహ్మ నేరుగా కోరుతాడు

6.బ్రహ్మ నేరుగా కోరుతాడు

6.బ్రహ్మ నేరుగా కోరుతాడు

Image Source:

దాని ప్రకారం బ్రహ్మ నేరుగా గయాసురుడి దగ్గరకు వెళ్లి తాను ఓ గొప్ప యాగాన్ని చేయాలని దానికి అనువైన ప్రాంతం భూ లోకంలో లేదని చెబుతాడు. అంతే కాకుండా పరమ పవిత్రమైన నీ శరీరం అందుకు అనువైన ప్రదేశమని పొగడ్తలతో ముంచెత్తుతాడు.

7.గయుడు పొంగిపోతాడు

7.గయుడు పొంగిపోతాడు

Image Source:

దీంతో గయాసరుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి కోరడంతో పాటు పొగడ్తల వల్ల కొంచెం గర్వం కూడా పెరుగుతుంది. తన తల పై యక్షం చేసుకోమని చెబుతాడు. ఇక్కడే బ్రహ్మదేవుడు మెలిక పెడుతాడు. ఒక వేళ మధ్యలో యాగం నీవల్ల నిలిచిపోతే నీవు చనిపోతావని హెచ్చరిస్తాడు. అయినా గయాసురుడు యాగం చేసుకోమనే చెబుతాడు.

8.యాగం వేడికి

8.యాగం వేడికి

Image Source:

అయితే బ్రహ్మదేవుడు చేసే యాగం వేడికి గయుడు తట్టుకోలేక పోతాడు. అతని తల కదలడం ప్రారంభమవుతుంది. దీంతో శిరస్సు కదల కుండా ఉండటం కోసం దగ్గర్లోని అనేక పర్వతాలను తెచ్చి ఆ తలకు అటు ఇటు పెట్టుకుంటాడు. అయినా కదలడం నిలవదు.

9.దేవవ్రతను కూడా

9.దేవవ్రతను కూడా

Image Source:

చివరికి బ్రహ్మదేవుడే మరీచి శాపం వల్ల శిలా రూపంలో ఉన్న మహాపతివ్రత దేవవ్రతను తీసుకువచ్చి పెడుతాడు. అయినా కూడా తల కదలడం నిలబడదు. దీంతో తన మరణం ఆసన్నమైనది భావించిన గయాసురుడు తాను ఎంతగానో కొలిచే విష్ణువే తనను సంహరించాలని కోరుకుంటాడు. దీంతో విష్ణువు తన కుడికాలును అతని వక్షస్థలం పై ఉంచి మోక్షం ప్రసాదిస్తాడు.

10.గయుని కోరిక పై

10.గయుని కోరిక పై

Image Source:

ఈ క్రమంలో గయుడు ‘బ్రహ్మదేవుడే నా తల పై యజ్జం చేశాడు. మహాపతివ్రత అయిన దేవవ్రతి నా శిరస్సు పక్కన ఉంది. ఇక మీరే నా శరీరం పై పాదం మోపారు. అందువల్ల నా దేహం నశించే ఈ ప్రాంతం పరమ పవిత్రమైదిగాను ఇక్కడ పిండప్రదానం చేయించుకునేవారు మోక్షం పొందేలా వరం కావాలి.‘ అని కోరుకుంటాడు.

11.అలా దేవతలు అందరూ

11.అలా దేవతలు అందరూ

Image Source:

అంతే కాకుండా తన పేరున ఈ నగరం ప్రసిద్ధి చెందాలని ఇక్కడ ఉన్న పర్వతాల పై ముక్కోటి దేవతలు నివశించాలని కూడా కోరుతాడు. తన భక్తుడి చివరి కోరికలను తీర్చి గయాసురుడికి విష్ణువు ముక్తిని ప్రసాదిస్తాడు.

12.శ్రీరాముడు కూడా

12.శ్రీరాముడు కూడా

Image Source:

అలా గయ పేరున ఈ నగరం వెలిసింది. ఇక్కడ పర్వతాల పై అనేక దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి. మరోవైపు ఈ స్థల పురాణం తెలిసిన చాలా మంది ఇక్కడకు వచ్చే తమ వారికి శ్రద్ధ, కర్మలను నిర్వహిస్తారు. సాక్షాత్తు శ్రీరామ చంద్రుడు ఇక్కడ తన తండ్రి అయిన దశరథుడికి పిండ ప్రదానం చేసినట్లు చెబుతారు.

13.సీతాదేవిని కోరుతాడు

13.సీతాదేవిని కోరుతాడు

13.సీతాదేవిని కోరుతాడు

Image Source:

ఇందుకు సంబంధించి స్థానికులు చెప్పే కథనం ప్రకారం పిండ ప్రదానం చేయడానికి ముందు శ్రీరాముడు స్నానం చేయడానిక స్థానికంగా ఉన్న ఫలగు నదికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో దశరథుడు అక్కడకు వచ్చి తనకు చాలా ఆకలిగా ఉందని పిండం త్వరగా పెట్టమని సీతాదేవిని కోరుతాడు.

14.రావిచెట్టు సాక్షం

14.రావిచెట్టు సాక్షం

Image Source:

దాంతో సీతా దేవి దశరథుడికి పిండం పెండుతుంది. స్నానం ముగించుకొని వచ్చిన తర్వత శ్రీరాముడు పిండ ప్రదానం చేయడానికి వెళితే దశరథుడు దానిని స్వీకరించడు. దీంతో రాముడు మిక్కిలి బాధపడుతాడు. ఆ సమయంలో సీతాదేవి జరిగిన విషయం చెప్పి సాక్షంగా దగ్గరగా ఉన్న రావి చెట్టును చూసిస్తుంది.

15.ఎప్పటికీ ఎండిపోదు

15.ఎప్పటికీ ఎండిపోదు

Image Source:

రావి చెట్టు సీతా దేవి చెప్పినదంతా నిజమని చెబుతుంది. దీంతో సంతోషించిన సీతా దేవి ఈ భూమి ఉన్నంత వరకూ నీవు జీవించే ఉంటావని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోవని వరమిస్తుంది. అందువల్లే ఈ చెట్టు ఆకులు ఎప్పుడు రాలవని రావి చెట్టు ఎప్పుడు ఎండిపోవడం తాము చూడలేదని ఇక్కడి వారు చెబుతుంటారు.

16.సతీదేవి ఛాతి భాగం

16.సతీదేవి ఛాతి భాగం

Image Source:

గయలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా సతీదేవి ఛాతి భాగం ఇక్కడే పడిందని చెబుతారు. అదే మంగళగౌరి దేవాలయంగా పూజలు అందుకుంటోంది. అదే విధంగా ఫలగూ నదీ తీరంలో విష్ణుపత్ ఆలయం ఉంది. ఇక్కడ విష్ణువు పాదముద్రలను మనం చూడవచ్చు.

17.దేవి అహల్యాభాయ్ నిర్మించింది

17.దేవి అహల్యాభాయ్ నిర్మించింది

Image Source:

18వ శతాబ్దంలో దేవి అహల్యాభాయ్ హోల్కర్ ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని నిర్మించింది. విష్ణుపథ్ ఆలయంలోని పాదముద్రలను బౌద్దులు కూడా పూజిస్తారు. విష్ణుమూర్తి దశావతారాల్లో బుద్దుడు కూడా ఒకరని బౌద్దులు విశ్వసిస్తారు. అందువల్లే ఇక్కడ ఉన్న పాదముద్రలకు వారు పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు.

18.బుద్ధగయ

18.బుద్ధగయ

Image Source:

అదే విధంగా ఫలగూ నదీతీరమున స్నాన ఘట్టాలతో పాటు రావి, మర్రిచెట్లకు వేల సంఖ్యలో భక్తులు పూజలు చేయడం మనం చూడవచ్చు. గయ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో బుద్ధగయ ఉంటుంది. గౌతమ బుద్ధుడు జ్జానోదయం పొందిన ప్రాంతం ఇదేనని చెబుతారు. ఇక్కడకు దేవశ విదేశాల నుంచి వేల సంఖ్యలో నిత్యం భక్తులు వస్తుంటారు.

19.బ్రహ్మయోని కొండ కూడా

19.బ్రహ్మయోని కొండ కూడా

Image Source:

ఇక గయలోని బ్రహ్మయోని కొండ కూడా బౌద్దులకు మిక్కిలి పవిత్రమైన స్థలం . ఇక్కడ బుద్దుడు ఆదిత్య పర్యాయ సూత్రాలను బోధించాడని చెబుతారు. ఇక గయాలోని ఉన్న జమ్మా మసీదు బీహారులోనే అతి పెద్ద మసీదు. ముజాఫీరి రాజకుంటుంబం దాదాపు 150 ఏళ్ల క్రితం ఈ మసీదును నిర్మించారు. ఇక్కడ ఒకేసారి వేలాది మంది నమాజ్ చేసే వీలుంది.

20.ఎలా వెళ్లాలి

20.ఎలా వెళ్లాలి

Image Source:

నలంద, వారణాసి, తదితర పట్టణాల నుంచి ఇక్కడకు ప్రతి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. ఇక గయ, బోధ్ గయకు మధ్య అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడ నుంచి ఎక్కువగా శ్రీలంకకు విమానయన సర్వీలసులు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X