Search
  • Follow NativePlanet
Share
» » కబాబ్ కోసం ఓ పర్యటన

కబాబ్ కోసం ఓ పర్యటన

ఒక్కొక్క ప్రాంతంలో ఈ కబాబ్ ను ఒక్కో రకంగా వండుతారు. రుచి కూడా వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కబాబ్ కు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

మీలో దెయ్యాన్ని పాలదోలుతారుమీలో దెయ్యాన్ని పాలదోలుతారు

కప్పకు కూడా ఓ గుడికప్పకు కూడా ఓ గుడి

బ్రహ్మకే పోయిన జ్జానం ప్రసాదించిన చోటు సందర్శిస్తే పోగొట్టుకున్న సంపద, జ్జానం...బ్రహ్మకే పోయిన జ్జానం ప్రసాదించిన చోటు సందర్శిస్తే పోగొట్టుకున్న సంపద, జ్జానం...

నాన్ వెజ్ డిష్ లలో కబాబ్ కు ఉన్న స్థానాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదేని పండగ కావచ్చు, లేదా ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో ఏర్పాటు చేసే మెనూలో ఈ కబాబ్ కు ప్రత్యేక స్థానం ఉండాల్సిందే. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఈ కబాబ్ ను ఒక్కో రకంగా వండుతారు. రుచి కూడా వేరుగా ఉంటుంది. అయితే ఏ ఊరిలో ఏ రకమైన కబాబ్ దొరుకుతుందన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. మీ టూర్ సందర్భంగా అక్కడికి వెళ్లినప్పుడు మీరు మాంసం ప్రియులైతే తప్పక ఆ కబాబ్ ను రుచి చూడండి

1. హైదరాబాద్

1. హైదరాబాద్

1. హైదరాబాద్

Image Source:

పర్యాటక రంగంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉంది. అదే విధంగా హైదరాబాద్ ఫుడ్ హబ్. ఇక్కడ దొరికినన్ని ఫుడ్ వెరేటీలు మరెక్కడా దొరకదు. ముఖ్యంగా నాన్ వెజ్ విషయానికి సంబంధించి హైదబాద్ మొదటి వరుసలో ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ బిర్యాని ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది. అదే సమయంలో ఇక్కడ దొరికే శేఖ్ కబాబ్ గురించి కూడా చెప్పుకోవాలి. మిగిలిన కాబాబ్ ల తయ్యారికి తవ్వాను వినియోగిస్తే ఈ కబాబ్ తయ్యారికీ తందూర్ పొయ్యిని వినియోగిస్తారు. ఈ కబాబ్ ప్రతి బైట్ కూడా ఎంతో రుచిగా ఉంటుంది.

2. లక్నో

2. లక్నో

2. లక్నో

Image Source:

లక్నోను నవాబుల సిటీ అని అంటారు. ఇక్కడ ఉన్న వివిధ పర్యకాటక ప్రదేశాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆతిథ్యం రంగం కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా లక్కోకు వచ్చిన వారు బిర్యాని కంటే అక్కడ దొరికే ప్రత్యేకమైన కబాబ్ అంటేనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తుండే కబాబ్ ఇక్కడ చాలా ఫేమస్. మాంసాన్ని తవ్వా పై ప్రత్యేక పద్దతిలో ఎర్రగా కాల్చి పుదీనా చెట్నిలో తింటూ ఉండటం మరిచిపోలేని అనుభూతి.

3. కొలకత్తా

3. కొలకత్తా

3. కొలకత్తా

Image Source:

కొలకత్త చేపల కూరకు చాలా ఫేమస్. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ నగరంలో వివిధ రకాల చేపలు దొరుకుతాయి. దీంతో వాటితో వండే వంటకాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. అందువల్లే కొలకత్తాకు వెళ్లిన వారు చేపల కూరతో భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోరు. ఈ క్రమంలోనే ఫిష్ కబాబ్ చాలా ప్రత్యేకం. ఈ ఫిష్ కబాబ్ స్ట్రీట్ ఫుడ్ నుంచి మొదలుకొని ఫైవ్ స్టార్ హోటల్స్ వరకూ దొరుకుతుంది.

4. ఢిల్లీ

4. ఢిల్లీ

4. ఢిల్లీ

Image Source:


ఢిల్లీ అంత బిజీ నగరం భారత దేశంలో మరేది ఉండదేమో. అదే విధంగా ఢిల్లీ హైదరాబాద్ తర్వాత ఫుడ్ హబ్ గా పేరు గాంచింది. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల వంటకాలు ఎన్నో లభిస్తున్నాయి. ఈ క్రమంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శామి కబాబ్. ఈ కబాబ్ లలో ఒక్క ఎముక కూడా దొరకదు. ఈ కబాబ్ కూడా స్ట్రీట్ ఫుడ్ నుంచి మొదలుకొని ఫైవ్ స్టార్ హోటల్స్ వరకూ దొరుకుతుంది.

5. ముంబై

5. ముంబై

5. ముంబై

Image Source:

ముంబై అంటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం వడా పావ్ మాత్రమే. అయితే ముంబై కూడా నాన్ వెజ్ ప్రియుల కోసం ఎన్నో వెరేటీల ఢిష్ లను రెడీ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పకోవలసింది. కబాబ్. ఇక్కడ దొరికే కబాబ్ దేశంలో మరెక్కడా దొరకదు. అది ముంబై కబాబ్ అనే పేరుతోనే చాలా ఫేమస్. మరెందుకు ఆలస్యం ముంబై వెళ్లినప్పుడు తప్పక ఈ ముంబై కబాబ్ లను తినండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X