Search
  • Follow NativePlanet
Share
» »అక్కడ లక్షల కోట్ల రుపాల విలువచేసే నిధి...తీసుకురావడానికి వెళితే అంతే

అక్కడ లక్షల కోట్ల రుపాల విలువచేసే నిధి...తీసుకురావడానికి వెళితే అంతే

అతి రహస్యమైన సింగన్పూర్ గుహలకు సంబంధించిన కథనం

By Beldaru Sajjendrakishore

భారత దేశంలో ఎన్నో రహస్య ప్రదేశాలు ఉన్నాయి. వాటి మర్మాన్ని కనుగొనడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే వాటి రహస్యాలను కనుగొనడం అంత సులభమైన విషయం మాత్రం కాదు. ఒక్కొక్కసారి ఈ రహస్యాలను ఛేదించడానికి వ్యక్తి చనిపోవడం కాని అదృశ్యమవడం కాని జరిగిపోతుంది. ఇప్పటికీ కొన్ని పురాణ, ఇతిహాస, చారిత్రాత్మక కట్టడాలు, గుహలు పలు ప్రశ్నలను మన ముందు నిలుపుతున్నాయి.

ఆ వనం రహస్యం ఏమిటీఆ వనం రహస్యం ఏమిటీ

సాంకేతిక పరిజ్జానం ఎంతగా అందుబాటులోకి వచ్చినా ఆ ప్రశ్నలకు జవాబులు కనుగొనడానికి లేదా ఆ రహస్యాలను ఛేదించడానికి వీలు కావడం లేదు. ఇప్పుడు మనం తెలుసుకునే గుహ కూడా ఇదే కోవకు చెందినది, ఈ గుహలోకి వెళ్లిన వ్యక్తి అదృశ్యమవుతాడు. మరలా ఎప్పటికీ కనబడడు. ఇందుకు గల కారణాలు కనుగొనడానికి ఎంతో మంది ప్రయత్నించినా వీలు కుదరడం లేదు.

1. ఆ గుహలోనికి వెళ్లిన వ్యక్తి..

1. ఆ గుహలోనికి వెళ్లిన వ్యక్తి..


Image source:


గుహలోనికి వెళ్లిన వ్యక్తి తిరిగి రావడం లేదనే కథలు మనం ఎన్నో విని ఉంటాం. బహుశా ఆ కథలు ఛత్తీస్‌గఢ్ లోని సింగన్పూర్ గుహ గురించే అయి ఉంటాయి. ఇక్కడ చిన్నవి, పెద్దవి కలుపుకొని దాదాపు 11 గుహలు ఉన్నాయి. వీటి రహస్యాలను కనుగొనడం ఎవరికీ సాధ్యం కాలేదు. వీటిలో మ్యాగ్నెటిక్ ప్రపంచం ఉందని చెబుతారు. ఇక్కడికి వెళ్లిన వారిని సదరు ప్రపంచం తనలోకి తీసుకుంటుందని స్థానిక కథనం. అందువల్లే ఇక్కడకు వెళ్లడానికి ఎవరూ సాహసం చేయరు.

2. ఆ మూడు గుహలు అతి ప్రాచీనమైనవి...

2. ఆ మూడు గుహలు అతి ప్రాచీనమైనవి...

Image source:


ఈ పదకొండు గుహల్లో మూడు గుహలు అతి ప్రచీనమైనవిగా పురాతన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థానికులు చెప్పడాన్ని అనుసరించి ఈ మూడు పెద్ద గుహల్లో రెండింటిలోని వెళ్లి తిరిగి రావచ్చు. ఇక్కడ ప్రాచీన కాలం నాటి చిత్రాలు, గుహల్లోని రాతులను శిల్పాలుగా మలిచిన తీరు మనం చూసి రావచ్చు. అయితే అందులోనూ చీకటి పడిన తర్వాత ఈ రెండు గుహల్లోకి ఎవరిని అనుమతించరు. రాత్రి పూట ఈ గుహల్లో కూడా ప్రాణాపాయం సంభవిస్తుందని నమ్ముతారు.

3. లక్షల కోట్ల రుపాయలు సంపద

3. లక్షల కోట్ల రుపాయలు సంపద

Image source:


మనం చెప్పుకోబోయే మూడో గుహకు ప్రత్యేక పేరు అంటూ ఏదీ లేదు. 11 గుహల్లో ప్రధానమైన గుహ అని అంటారు. ఈ గుహలోపల లక్షల కోట్ల రుపాలయ విలువ చేసే వజ్రవైడుర్యాలు తదితర నవరత్నాలు, వందల కోట్ల బరువైన బంగారు వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిధిని ఈ విషయం తెలుసుకున్న ఆంగ్లేయులు అనేక మంది ఈ గుహలోకి వెళ్లి మరలా తిరిగి రాలేదని తెలుస్తోంది.

4. ఈ గుహలో యక్షులు

4. ఈ గుహలో యక్షులు

Image source:


ఈ గుహలో పదుల సంఖ్యలు యక్షులు తిరుగుతున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఎవరైనా దురుద్దేశంతో ఈ గుహలోనికి ప్రవేశిస్తే వారిని యక్షులు చంపేస్తారని కథనం. రాయ్ ఘడ్ రాజు లోకేశ్ బహద్దూర్ సింగ్, బ్రిటీష్ అధికారి రాబర్ట్ సన్ వంటి ఎంతో మంది ఈ గుహలోని నిధులను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇందులో కొంతమంది ఏమయ్యారన్న విషయం ఇప్పటికీ నిఘూడ రహస్యమే.

5. పూజలు నిలిపేశారు.

5. పూజలు నిలిపేశారు.

Image source:


కొన్నేళ్ల క్రితం వరకూ స్థానికులు సదరు మూడో గుహ వరకూ వెళ్లి అక్కడ ప్రవేశ ద్వారం వద్ద యక్షులను శాంతపరచడానికి పూజలు కూడా చేసేవారు. అయితే గత ఐదేళ్లుగా ఈ పూజలను వారు నిలిపివేశారు. ఇందుకు గల కారణాలు మాత్రం ఎంత అడిగినా వారు చెప్పడం లేదు. ఇక ఈ పదకొండు గుహల్లో ఒక దాట్లో అద`శ్య శక్తులు ఉన్న సింహం, పులి జింక వంటి జంతువులు నివశిస్తున్నట్లు స్థానికులు చెబుతారు. అయితే ఆ జంతువులు మనుష్యులను ఏమీ చేయవనేది వారి వాదన

6.ఎలా వెళ్లాలి

6.ఎలా వెళ్లాలి

Image source:


రాయ్ ఘడ్ నుంచి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఈ గుహ ఉంది. రాయ్ గడ్ నుంచి కార్లు, జీపులు లేదా ట్యాక్సీల ద్వారా సింగన్ పూర్ కు వెళ్లవచ్చు. సింగన్ పూర్ నుంచి ఈ పదకొండు గుహలు ఉన్న ప్రాంతానికి చేరుకోవాలంటే సుమారు 2 కిలోమీటర్ల నడక తప్పదు. రాయ్ ఘడ్ కు విమానాయయాన సర్వీసులు కూడా ఉన్నాయి. వీకెండ్ కు స్థానికులు ఎక్కువగా గుహల వద్దకు వెలుతుంటారు. మీరు కూడా ఒకసారి....

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X