Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ అమ్మవారికి బొట్టు పెడితే అనుకున్నది 41 రోజుల్లో జరుగుతుంది

ఇక్కడ అమ్మవారికి బొట్టు పెడితే అనుకున్నది 41 రోజుల్లో జరుగుతుంది

ప్రకృతిరమణీయతకు జలపాతాలకు, ఎన్నో రహస్యాలకు, పురాతన ఆలయాలకు, కోటలకు మన నల్లమలఅడవులు ప్రకృతి ప్రేమికులకు ఒక అడ్వెంచర్ గా భక్తుల కోర్కెలు తీర్చే అద్భుతఆలయాలకు ఆలవాలంగా వున్నాయి.

By Beldaru Sajjendrakishore

ప్రకృతిరమణీయతకు జలపాతాలకు, ఎన్నో రహస్యాలకు, పురాతన ఆలయాలకు, కోటలకు మన నల్లమలఅడవులు ప్రకృతి ప్రేమికులకు ఒక అడ్వెంచర్ గా భక్తుల కోర్కెలు తీర్చే అద్భుతఆలయాలకు ఆలవాలంగా వున్నాయి. ఆ అద్భుతమైన ప్రకృతిదృశ్యాలను చూడాలని ఆ కొండకోనలలో దాగివున్న ఆలయాలను దర్శించాలని అందరికి వుంటుంది. కానీ అది అంత సులభం కాదు.

చెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదేచెడు కలల నుంచి విముక్తిని ఇచ్చే దేవాలయం ఇదే

శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం...మన ఆంధ్రప్రదేశ్ లోనేశివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం...మన ఆంధ్రప్రదేశ్ లోనే

ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...ఇక్కడ దెయ్యానికి మినరల్ వాటర్, సిగరెట్ ఇవ్వాల్సిందే లేదంటే ప్రయాణం...

దట్టమైన అడవి, కొండలు, కోనలు, జలపాతాలు, క్రూరమృగాలు మరి ఇలాంటివి ఎన్నో దాటుకునివెళ్తేనే ఆ అద్భుతమైన ఆలయాలను ఆ అద్భుతమైన ప్రకృతిదృశ్యాలను చూడగలం. ముఖ్యంగా నల్లమల అడవుల్లో ఉన్న ఒక ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ ఆలయంలోని దేవతకు బొట్టు పెడితే 41 రోజుల్లో మనం అనుకొన్నది తప్పక నెరవేరుతుందని విశ్వాసం. ఆ ఆలయంతో పాటు నల్లమల అడవుల విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1. అతి విశాలమైన అటవీ ప్రాంతం

1. అతి విశాలమైన అటవీ ప్రాంతం

1. అతి విశాలమైన అటవీ ప్రాంతం

Image source:

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిరంతర అటవీ ప్రాంతాల్లో నల్లమల అడవి ఒకటి. ఇది తూర్పు కనుమలలో ఒక భాగమైన నల్లమల కొండలలో ఉంది. ఇది కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం ఈ అడవి క్రీడలకు పేరుగాంచింది. ప్రసిద్ధ వన్యప్రాణుల రచయిత కెన్నెత్ ఆండర్సన్ ఈ అడవిలోని సాహసాల గురించి రాసారు. ఈ అడవిలో పులులు ఎక్కువగా ఉండేవి, నాగార్జునసాగర్-శ్రీశైలం కు చెందిన పులులు ఈ అడవిలో ఒక భాగం. ఈ అడవులలో చిరుతలు తరచుగా కనిపిస్తాయి.

2. ఎక్కడ వుంది?

2. ఎక్కడ వుంది?

2. ఎక్కడ వుంది?

Image source:
కర్నూలు జిల్లా ఆత్మకూర్ అటవీప్రాంతంలో కోటలయొక్క అవశేషాలను, దేవతా మూర్తులను, రాతిపై చెక్కబడిన శిలాశాసనాలను,కొలను ఇలాంటి ఎన్నో అద్భుతమైన అవశేషాలను కనుగొన్నారు. మరి కోటకి పరిసరప్రాంతాలలో స్మశానవాటిక కోట నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంగా కనుగొన్నారు.అంతేకాకుండా అక్కడ 400 ల సంవత్సరాల క్రితం దర్గా అనేది కూడా వుండేదట. అయితే ఇప్పుడు అది శిథిలమై పోయిందని చెబుతారు.

3. అప్పట్లో కోటలు కూడా

3. అప్పట్లో కోటలు కూడా

3. అప్పట్లో కోటలు కూడా

Image source:

అందులో రాజులకోసం నిర్మించుకునే కోట రాజులకోట,రాజులు నివసించటానికి నిర్మించుకున్న నివాస గృహాలు అప్పుడు అదొక పట్టణంగా వుండేదట. ఇంతకుముందు ఇక్కడ 8 కి పైగా అమ్మవారి విగ్రహాలు, శివలింగాలు అనేవి వుండేవి.ఇదొక మహాపట్టణంగా వుండేది.మరిప్పుడు అక్కడ కోటలోపల రంగురాళ్ళు, ఒకప్పటి పాత నాణేలు అనేవి లభ్యం అవుతున్నాయి. వీటిని చేజెక్కించుకోవడం కోసం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

4. గుప్త నిధుల కోసం

4. గుప్త నిధుల కోసం

4. గుప్త నిధుల కోసం

Image source:

ఈ విషయం తెలిసి అనేకమంది గుప్త నిధులకోసం తవ్విన త్రవ్వకాలలో విగ్రహమూర్తులను దొంగిలించటం,లేదా ఆ ఆలయాలను ధ్వంసం చేయటం జరిగింది. మరి పురాతత్వశాఖ వారు ఇక్కడ పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపి మరి ఆ కోటయొక్క చరిత్రని వెలికితీసుకురావాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు. ప్రజలు ఎంతా చెబుతున్నా అక్కడి అధికారులు మాత్రం కొంత నిర్లక్షంగానే వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

5. వజ్రాల కొండ

5. వజ్రాల కొండ

5. వజ్రాల కొండ

Image source:

మరి రాయలు ఏలిన రతనాలసీమగా పేరుపొందిన ఇక్కడ వజ్రాలకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవచ్చును.అంతేకాకుండా వజ్రాలకొండలో సహజ సిద్ధంగా ఏర్పడిన పార్వతీ పరమేశ్వరుల దివ్య మూర్తులను కూడా సందర్శించుకొనవచ్చును. గుప్త నిధుల కోసం ఇక్కడే ఎక్కువగా తవ్వకాలు జరుగుతుంటాయి. మనం పార్వతీ పరమేశ్వరులను సందర్శించే సమయంలో ఈ విషయం మనకు అర్థమవుతుంది.

6.ఇష్టకామేశ్వరి

6.ఇష్టకామేశ్వరి

6.ఇష్టకామేశ్వరి

Image source:

ఈ నల్లమల అడవులు అనేవి కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కడప, మహబూబ్ నగర్ మరి నల్గొండలో కొద్దిభాగంగా వ్యాపించివున్నాయి. ఈ నల్లమలఅడవుల్లోనే మరో అద్భుత ఆలయం ఇష్టకామేశ్వరి. ఆలయం. అంటే మన మనస్సులోని కోర్కెలనుతీర్చే తల్లి. పార్వతీపరమేశ్వరులు కలిసివున్న తత్వానికి ప్రతిరూపంగా కామేశ్వరీమాతను పూజిస్తారు. ఈ మాతను దర్శించడం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

7. ప్రపంచంలో మరెక్కడా లేదు

7. ప్రపంచంలో మరెక్కడా లేదు

7. ప్రపంచంలో మరెక్కడా లేదు

Image source:


ఇటువంటి ఆలయం భారతదేశంలోనే కాదు.ప్రపంచంలో మరెక్కడా ఇష్టకామేశ్వరీ ఆలయం అనేదిలేదు. కేవలం శ్రీశైలంలోనే అటవీప్రాంతంలో మాత్రమే వుంది. అమ్మవారు మన కోర్కెలు తీరుస్తుంది. ఇక అమ్మవారు మన కోరినకోర్కెలు తీరుస్తారు అన్నారుకదా ఇంకేముంది వెళ్లి అమ్మవారి అనుగ్రహం పొందితే సరిపోతుంది అనుకోవచ్చు. కాని అది అంత సులభం కాదు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చుకుని ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.

8. చాలా తక్కువగా వాహనాలు

8. చాలా తక్కువగా వాహనాలు

8. చాలా తక్కువగా వాహనాలు

Image source:

అక్కడికి ఎప్పుడో కాని వెహికల్స్ వెళ్ళవు. శ్రీశైలంక్షేత్రం నుండి కొన్ని జీపులుమాత్రమే వెళతాయి. అవి కూడా చాలా తక్కువగా వెళతాయి. గుండెధైర్యం వున్నవారు మాత్రమే ఆ జీప్ లలో ప్రయాణించగలరు. ఆ మార్గం అంత కఠినంగా ఉంటుంది. దారి పొడుగునా మనకు క్రూర జంతువులు ఎదురైనా ఆశ్చర్యం కలుగక మానదు. ఇక ఆలయం అనేది శిథిలావస్థలో వుంది.గుహ మాదిరిగా వుంటుంది.ఇక అమ్మవారి దివ్యమంగళస్వరూపం నాలుగుచేతులతో వుంటుంది.

9. యోగిని రూపంలో

9. యోగిని రూపంలో

9. యోగిని రూపంలో

Image source:


రెండు చేతులలో తామరపువ్వులు, ఒక చేతిలో రుద్రాక్షమాల, మరో చేతిలో పరమ శివుడి స్వరూపమైన లింగంఅనేది వుంటుంది. అమ్మవారు యోగినీ రూపంలో కనిపిస్తుంది. మరి ఎన్నో కష్టాలకోర్చుకొని ప్రయాణిస్తేనే మనం ఆ అమ్మవారిని దర్శించుకోగలం. మరి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి నుదుట బొట్టుపెట్టిన వారికి 41రోజులలో తప్పకుండా వారి కోరిక తీరుతుందని భక్తులు నమ్ముతారు.

10. నుదురు తగులుతుంది

10. నుదురు తగులుతుంది

10. నుదురు తగులుతుంది

Image source:


ఇక్కడ మరో విశేషము ఏమంటే కొందరు సాధువులకి,యోగులకి అమ్మవారి నుదుటన బొట్టుపెడితే మెత్తగా తగులుతుంది నుదురు. అంటే అది విగ్రహమా?నిజంగా అమ్మవారే అక్కడ కూర్చున్నారా?అన్నట్టుగా అనిపిస్తుందట. అందువల్లే ఈ ఆలయం చేరడానికి చాలా ఇబ్బంది అయినా కూడా దేశ విదేశాల నుంచి చాలా మంది ఇక్కడకు వస్తుంటారు. అమ్మవారికి బొట్టు పెట్టి తమ కోర్కెలు తీరాలని మొక్కు కుంటారు.

11. ఇక్కడ ఉండేదంతా చెంచులే

11. ఇక్కడ ఉండేదంతా చెంచులే

11. ఇక్కడ ఉండేదంతా చెంచులే

Image source:

మరిక్కడ అంతా వుండేది చెంచులే. ఇక ఆ ప్రాంతం అనేది సెలయేళ్లశబ్దాలతో ఎంతో ఆహ్లాదకరంగా,ప్రశాంతంగా వుంటుంది.మరిక హిందూపురాణాల ప్రకారం ఇప్పటికీ చిరంజీవులుగా వున్నారని భావించేవారు అశ్వత్థామ ఒకరు. ఈ నల్లమల అడవులలోని అశ్వత్థామకు సంబంధించిన ఆలయం వుందని అంతేకాకుండా అశ్వత్థామ తాను పూజించిన శివ లింగం ఇక్కడ ఈ నల్లమలఅడవులలో వుందని ప్రజలు భావిస్తారు.

12. ఆ ఐదో లింగం ఎక్కడ

12. ఆ ఐదో లింగం ఎక్కడ

12. ఆ ఐదో లింగం ఎక్కడ

Image source:

మరి ఈ నల్లమలలో 12తీర్థాలు, 5 శివలింగాలు వున్నట్లు చెబుతారు. అయితే ఇప్పుడు 4శివలింగాలు మాత్రేమే తెలుసు.5వ శివలింగం ఎక్కడ వుందో తెలియదు. మరి ఈ ఐదో శివలింగం అనేది దట్టమైన ప్రాంతంలో ఈ శివలింగం వుండవచ్చని భావిస్తారు. మరి నల్లమల అడవులవెనుక వున్న పురాతనశివలింగం గురించి తెలుసుకోవాలని డాక్యుమెంటరీతీయాలని కొందరు ఫారినర్ స్టూడెంట్స్ ఈ ప్రాంతానికి ప్రయత్నించారు.

14. ఉల్లేడు మహేశ్వరుడు

14. ఉల్లేడు మహేశ్వరుడు

14. ఉల్లేడు మహేశ్వరుడు

Image source:

మరిక్కడ వున్న శివాలయాలలో ఉల్లేడుమహేశ్వర శివలింగాన్ని దర్శిస్తే అమర్నాథ్ లోని మంచులింగాన్ని దర్శించినట్లుగా భక్తులు భావిస్తారు. ఎందుకంటే ఆ స్వామిని దర్శించటం అంత సులభంకాదు.అహోబిలంనుండి 3కిమీ ల దూరంలో కొండప్రాంతంలో మార్గం అనేది వుంటుంది.అయితే పూర్వం ఆ స్వామిని దర్శించాలంటే కొండలు, కోనలు, జలపాతాలు దాటుకొంటూ 20కిమీ లు నడుచుకుంటూ వెళ్ళాల్సివచ్చేది.

15 కొండలు ఎక్కి దిగాలి

15 కొండలు ఎక్కి దిగాలి

15 కొండలు ఎక్కి దిగాలి

Image source:

అయితే ఇప్పుడు ఉమామహేశ్వరఆలయానికి సమీపంలో వరకూ వాహనాలు అనేవి వెళ్తాయి. మరి అక్కడ దిగి అక్కట్నుండి తాడు పట్టుకుని కొండలు ఎక్కుతూ,దిగుతూ సెలయేళ్ళు దాటుకొంటూ వెళ్ళాలి. నిత్యపూజ కోన ఇక దట్టమైన అటవీమార్గమున వెళితేనే మనం ఈ క్షేత్రాన్ని చేరుకోగలం. అంతే కాకుండా ఈ నల్లమల అడవులలో 100సంల క్రితమే నిజాం నవాబుల కాలం నాటి వేసవి విడిదిల కోటలశిధిలాలుఅనేవి కనపడతాయి.

16. సలేశ్వరం

16. సలేశ్వరం

16. సలేశ్వరం

Image source:

నల్లమల అడవులలో బయటపడిన పురాతన నగరం రహస్యాలు ! మరి ఈ నల్లమల అడవులలోనే మరో ప్రదానమైన శైవక్షేత్రం సలేశ్వరం. ఏడాదిలో కేవలం 5రోజులు మాత్రమే తెరిచివుంచే ఈ ఆలయానికి చేరుకోవటం కూడా చాలా కష్టం.20కిమీ లు కొండలు, కోనలుదాటుతూ వెళ్లి మరి ఆ పరమశివుని దర్శించుకుంటారు భక్తులు. ఈ ఆలయంపై చెంచులకి మాత్రమే అధికారం వుంటుంది. వారికి ఇబ్బందులు కలిగిస్తే ప్రాణాలకే ప్రమాదం

 17. నంది మల్లన్న ఆలయం

17. నంది మల్లన్న ఆలయం

17. నంది మల్లన్న ఆలయం

Image source:


మరొక ప్రధాన శైవక్షేత్రం నందిమల్లన్న శివాలయం.మరి ఈ ఆలయానికి వెళ్ళటం కూడా అంత సులభంకాదు. మరి ఎన్నో కష్టనష్టాలకోర్చి భక్తులు ఆ స్వామిని దర్శించుకుంటూవుంటారు. శివలింగంఅనేది 30అడుగుల పొడవు, 20అడుగుల ఎత్తుగుహలో ఆ స్వామివారు వుంటారు. ఈ స్వామివారిని దర్శించడం కూడా పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అందువల్లే ఎంత కష్టమైనా ఇక్కడకు భక్తులు వెలుతుంటారు.

18.అడ్వెంచర్ ను ఇష్టపడేవారు

18.అడ్వెంచర్ ను ఇష్టపడేవారు

18.అడ్వెంచర్ ను ఇష్టపడేవారు

Image source:


మరి చెంచుల ఆరాధ్యదైవమైన ఆ పరమశివుడు క్రీశ 6వ శతాబ్దానికి ముందే ప్రతిష్టించివున్నాడని అయితే అక్కడ గిరిజనులు మాత్రమే వుత్సవాలు జరిపేవారు. కాకతీయులకాలం నుండి అక్కడ వుత్సవాలనేవి ప్రారంభించబడ్డాయి. కాబట్టి ఈ విధంగా నల్లమలలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు, ప్రకృతిదృశ్యాలు, వన్యప్రాణసంరక్షణకు సంబంధించిన కేంద్రాలుఅనేవి ఎన్నో వున్నాయి. కాబట్టి వుత్సాహంకలవారు, అడ్వెంచర్స్ ని ఇష్టపడేవారు ఆ ప్రాంతానికి వెళ్లి స్వయంగా ఆ దృశ్యాలను చూడగలరు.

20 రైల్వే స్టేషన్లు

20 రైల్వే స్టేషన్లు

20 రైల్వే స్టేషన్లు


Image source:


రైలు ద్వారా కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. హైదరాబాద్ నుండి రైలులో, అక్కడ నుండి రోడ్డు ద్వారా కర్నూలుకి రైలు ప్రయాణం చాలా తేలిక. కర్నూల్ కి స్థానిక రైళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయి.

21. వాయు మార్గంలో

21. వాయు మార్గంలో

21. వాయు మార్గంలో

Image source:


వాయు మార్గం ద్వారా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ౦, కర్నూలుకి సమీప విమానాశ్రయం. కర్నూల్ నగరం నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి షుమారు మూడున్నర లేదా నాలుగు గంటలు పడుతుంది. విమానాశ్రయం నుండి కర్నూలు నగరానికి కాబ్స్ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X