Search
  • Follow NativePlanet
Share
» »నైట్ ట్రెక్కింగ్ ఎప్పుడైనా వెళ్లారా?...ఈవన్నీ ఇందుకు అనుకూలమైన ప్రాంతాలే

నైట్ ట్రెక్కింగ్ ఎప్పుడైనా వెళ్లారా?...ఈవన్నీ ఇందుకు అనుకూలమైన ప్రాంతాలే

నైట్ ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలకు సంబంధించిన సమాచారం.

By Beldaru Sajjendrakishore

అక్కడికి వెళ్లినప్పుడు ఆ కబాబ్ లు తినడం మరిచిపోవద్దు..అక్కడికి వెళ్లినప్పుడు ఆ కబాబ్ లు తినడం మరిచిపోవద్దు..

ఇక్కడ స్వర్గపు ద్వారాలు తెరుచుకున్నాయి.ఇక్కడ స్వర్గపు ద్వారాలు తెరుచుకున్నాయి.

ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ ప్రపంచంలో ఏకైక సరస్సును చూశారాఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ ప్రపంచంలో ఏకైక సరస్సును చూశారా

ట్రెక్కింగ్ గత కొంత కాలంగా యువత నోట వినిపిస్తున్న మాట. ముఖ్యంగా వారాంతాల్లో పర్యాక ప్రియులను అలరిస్తున్న పదం. ఈ ట్రెక్కింగ్ కోసం కొంత మంది గ్రూపులుగా కూడా ఏర్పడి తమకు నచ్చిన ట్రెక్కింగ్ కు అనుకూల మైన ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు నైట్ ట్రెక్కింగ్. పేరులో ఉన్నట్లే రాత్రి సమయాల్లో చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రకృతిని ఆస్వాధిస్తూ ముందుకు సాగిపోవడాన్ని నైట్ ట్రెక్కింగ్ అంటారు. ప్రతి ట్రెక్కింగ్ ప్రాంతమూ నైట్ ట్రైక్కింగ్ కు అనుకూలం కాదు. అయితే ప్రతి నైట్ ట్రెక్కింగ్ ఉదయం పూట ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మరో విషయం నైట్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు ముందుగా స్థానిక అధికారుల అనుమతి తీసుకోవడంతో పాటు పోలీసులకు సమాచారం అందించడం మేలు. ఇక నైట్ ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రాంతాలన్నీ కొండలు, గుట్టలు కావడంతో వేసవి విడిది ప్రాంతాలుగా కూడా ఇవి పేరుగాంచాయి. గురించి తెలుసుకుందాం.

1. కుంతి బెట్ట

1. కుంతి బెట్ట

1. కుంతి బెట్ట

Image Source:

బెంగళూరు నుంచి సుమారు 125 కిలోమీటర్ల దూరంలోని పాండవపురలో ఈ కుంతి బెట్ట ఉంది. ఈ కొండలో కుంతి దేవి కొంత కాలం ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ ఉదయంతో పాటు రాత్రి సమయంలో ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

2. రామనగర

2. రామనగర

2. రామనగర

Image Source:

బెంగళూరు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్కన ఈ రామనగర ప్రముఖ పర్యాటక ప్రాంతం అన్న విషయం సందేహం అక్కర లేదు. ఇక్కడ బోటింగ్, గేవింగ్ (గుహ అన్వేషణ) తదితర అడ్వెంచర్ టూర్స్ కు ఈ రామనగర మిక్కిలి అనుకూలమైనది. ఇక రాత్రి సమయంలో కూడా ఇక్కడ ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

3. బిలికల్ రంగనాథ స్వామి బెట్ట

3. బిలికల్ రంగనాథ స్వామి బెట్ట

3. బిలికల్ రంగనాథ స్వామి బెట్ట

Image Source:

బిళికల్ రంగస్వామి బెట్ట రామనగర జిల్లాలోని కనకపుర తాలూకాలో ఉంది. ఇది కనకపుర నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండ చివర మనకు తెల్లటి (బిలి) పెద్ద రాయితో పాటు అక్కడ ఉన్న రంగనాథ స్వామి దేవాలయం వల్ల దీనిని బిళికల్ రంగనాథ స్వామి బెట్ట అని అంటారు. రాత్రి సమయంలో ఈ కొండ పైకి వెళ్లడం మరిచిపోలేని అనుభూతి.

4. మాకలిదుర్గ

4. మాకలిదుర్గ

4. మాకలిదుర్గ

Image Source:

బెంగళూరు నుంచి నైట్ ట్రెక్కింగ్ కు వెళ్లాలనుకునే వారికి మాకలిదుర్గ బెస్ట్ ఆఫ్షన్. ఈ ప్రాంతం బెంగళూరు నుంచి 60 కిలోమీటర్లు, దొడ్డబళాపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టం నుంచి 1350 మీటర్ల ఎత్తున ఉన్న ఈ కొండ పైకి వెళ్లడం అంత సులభం కాదు. అయితే ట్రెక్కింగ్ ప్రియులు మాత్రం దీనని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని నైట్ ట్రెక్కింగ్ కు ఇక్కడకు వెలుతుంటారు.

5. శివగంగ

5. శివగంగ

5. శివగంగ

Image Source:

బెంగళూరు నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో శివగంగ కూడా ఒకటి. ఈ ప్రాంతం తుమకూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రపట్టానికి 1368 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శివగంగ పర్వతం ట్రెక్కింగ్ ప్రియులకు సవాలు విసురుతోంది. నైట్ ముఖ్యంగా పున్నమి రోజుల్లో ఇక్కడ ట్రెక్కింగ్ ప్రియులు ఎక్కువ మంది వస్తుంటారు.

6. సవర్ణదుర్గ

6. సవర్ణదుర్గ

6. సవర్ణదుర్గ

Image Source:

సముద్రమట్టానికి 1,226 మీటర్ల ఎత్తులో సవర్ణ దుర్గ అనే కొండ ఉంటుంది. బెంగళూరు నుంచి ఇక్కడకు 65 కిలోమీటర్ల దూరం. బెంగళూరు నుంచి సవర్ణదుర్గకు వెళ్లే మార్గమధ్యలో టిప్పు సుల్తాన్ నిర్మించిన కోటను కూడా చూడవచ్చు. ట్రెక్కింగ్ దాదాపు 4 కిలోమీటర్ల దూరంసాగుతుంది.

7. కనకపుర

7. కనకపుర

Image Source:

బెంగళూరు నుంచి కనకపుర దాదాపు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న కొండలు ఎన్నో ఉన్నాయి. బెంగళూరులోని ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం ఎప్పుడూ రారమ్మని ఆహ్వానిస్తుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X