Search
  • Follow NativePlanet
Share
» »రాముడు నడిచిన రాళ్లు ఇంట్లో ఉంటే ఐశ్వర్య వృద్ధి

రాముడు నడిచిన రాళ్లు ఇంట్లో ఉంటే ఐశ్వర్య వృద్ధి

ద్వాదశ జ్జోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. ఇక్కడి నుంచే రాముడు లంకకు సముద్రం పై సేతువు నిర్మించాడని రామాయణం చెబుతోంది. ఇందు కోసం వాడిన రాళ్లు ఇప్పటికీ అక్కడ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

By Beldaru Sajjendrakishore

ఇక్కడకు వెళితే బ్రహ్మచారులకు వివాహం...దంపతులకు వెంటనే సంతానంఇక్కడకు వెళితే బ్రహ్మచారులకు వివాహం...దంపతులకు వెంటనే సంతానం

త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం దర్శిస్తే అన్నింటా విజయమేత్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహం దర్శిస్తే అన్నింటా విజయమే

శివ లింగం పెరగకుండా మేకు కొట్టిన ప్రదేశం...సందర్శిస్తే కైలాసాన్ని చూసినంత పుణ్యంశివ లింగం పెరగకుండా మేకు కొట్టిన ప్రదేశం...సందర్శిస్తే కైలాసాన్ని చూసినంత పుణ్యం

ద్వాదశ జ్జోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. ఇక్కడి నుంచే రాముడు లంకకు సముద్రం పై సేతువు నిర్మించాడని రామాయణం చెబుతోంది. ఇందు కోసం వాడిన రాళ్లు ఇప్పటికీ అక్కడ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రాళ్లను ఇంటిలో పెట్టుకుంటే ఐశ్వర్య వృద్ధి సాధ్యమవుతుందని భక్తులు నమ్మకం. ఇందు కోసం ఆ రాళ్లను తమ సొంతం చేసుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. ఒక్కొక్కసారి దొంగచాటుగా కూడా ఈ రాళ్లను సొంతం చేసుకుంటుంటారు. ఇక రామసేతువు పై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామేశ్వరంతో పాటు రామసేతువు గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

1. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

1. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి

Image Source:

రామేశ్వరము తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉంది.తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కి.మి దూరములో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు.

2. రామ సేతువు ఇక్కడే

2. రామ సేతువు ఇక్కడే

2. రామ సేతువు ఇక్కడే

Image Source:

ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరములో రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.రామేశ్వరము తీర్థ స్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ ల వల్ల పర్యాటక స్థలము కూడా ప్రాముఖ్యకత సంపాదించుకొంది.

3. కాశీ యాత్ర

3. కాశీ యాత్ర

3. కాశీ యాత్ర

Image Source:

భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీలోని గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని నమ్ముతారు. దాని వల్ల దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. అందువల్లే కాశీ యాత్రకు వెళ్లిన వారు ఇక్కడికి వచ్చి తప్పకుడా ఈ వైదిక కార్యాన్ని నిర్వహిస్తారు.

4. ప్రధాన దేవుడు శివుడు

4. ప్రధాన దేవుడు శివుడు

4. ప్రధాన దేవుడు శివుడు

Image Source:

ఇక్కడ ప్రధానదైవం అయిన శివుని రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమబాహు చేత నిర్మించబడింది. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడవ (నడిచేదారి) దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయనిర్మాణం వివిధ రాజుల చేత నిర్మించబడింది.

5. అనేక స్థంభాలు

5. అనేక స్థంభాలు

5. అనేక స్థంభాలు

Image Source:

ఆలయంలోని పెద్ద భాగమైన నడవ లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధముగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది.

6. సైతక శిల్పం

6. సైతక శిల్పం

6. సైతక శిల్పం

Image Source:


ఇక్కడి ఇసుకలింగం (సైకత లింగం) శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడింది. రావణుడు బ్రహ్మమనుమడు కనుక బ్రాహ్మణుడు కనుక అతడిని రణ రంగమున సంహరించడం చేత తనకు బ్రహ్మహత్యా పాతకం వస్తుందని భావించాడు. అందుకు పరిహారంగా మహామునుల అదేశానుసారం శ్రీరామచంద్రుడు సీతా దేవితో కలిసి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

7. అలిగిన హనుమంతుడు

7. అలిగిన హనుమంతుడు

7. అలిగిన హనుమంతుడు

Image Source:

ఇక్కడ లింగప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుండి లింగం తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు నిర్ణీతముహూర్తానికి లింగం తీసుకురాని కారణంగా ఋషులు సీతాదేవి స్వహస్థాలతో చేసిన ఇసుకలింగమును శ్రీరాముడి చేత ప్రతిష్ఠ చేయించాడు. ముహూర్తం దాటిన తరువాత కైలాసగిరి నుండి తాను తీసుకు వచ్చిన లింగంతో హనుమంతుడు తాను తీసుకువచ్చిన లింగం ప్రతిష్ఠ చేయలేక పోయినందుకు మిక్కిలి ఆగ్రహించాడు.

8. మొదట ఆయన తెచ్చిన లింగానికే

8. మొదట ఆయన తెచ్చిన లింగానికే

8. మొదట ఆయన తెచ్చిన లింగానికే

Image Source:

అది చూసిన శ్రీరాముడు హనుమ తీసుకువచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేసి ముందుగా హనుమ తీసుకు వచ్చిన లింగానికి పూజలు చేసి తరువాత తాను ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేయాలని ఆదేశించాడు అని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ప్రాతఃకాల మణిదర్శనకాలంలో పవిత్రమైన స్పటిక లింగదర్శనం చేయవచ్చు. ఈ లింగాన్ని చేసిన మణి ఆదిశేషుని చేత ఇవ్వబడినదని పురాణకథనాలు వివరిస్తున్నాయి.

9. అనేక పరిశోధనలు

9. అనేక పరిశోధనలు

9. అనేక పరిశోధనలు

Image Source:

రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై (సేతు తీరం) అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ఈ సేతువు పై జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఎన్నో పరిశోధనలు చేశాయి. కొందరు ఇది ప్రక`తి సిద్ధంగా ఏర్పడిందని చెబుతుండగా మరి కొందరు ఇది మానవ నిర్మితమని చెబుతున్నారు.

 10. గంధమాదన పర్వతము

10. గంధమాదన పర్వతము

10. గంధమాదన పర్వతము

Image Source:

రామాయణ యుద్ధకాండంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. హనుమంతుడు లంకకు వెళ్ళటానికి, శ్రీరాములవారు తన వానర సైన్యమును నడిపించినది కూడ ఇక్కడి నుండే. శ్రీరాముల వారు రావణున్ని సంహరించిన తర్వాత లింగప్రతిష్ఠను గూర్చి అలోచించినదిక్కడేనట. రెండస్థుల ఈ దేవాలయం ఎక్కితే రామేశ్వర ద్వీపం కనబడుతుంది. ఈ గంథ మాదన పర్వతము రామనాథేశ్వర స్వామి దేవాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.

11. నీటి పై తేలే రాయి

11. నీటి పై తేలే రాయి

11. నీటి పై తేలే రాయి

Image Source:

తమిళనాడులోని రామేశ్వరం గుడిలో 15 కిలోలు ఉన్న ఈ రాయి నీటిపైన తేలాడుతూ ఉంటుంది. ఇది మహిమ గల రాయి. భక్తులందరూ దీనిని చేతితో పైకి ఎత్తి మళ్లీ నీళ్ళలో వదిలి దానికి దండం పెట్టుకుంటుంటారు. అయితే ఇటువంటి రాళ్ళతోనే లంకకు రాముడు వానరుల సహాయంతో వారధి నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి నీటిలో యాత్రికులు స్నానాలు చేస్తారు. చాలామంది కాశీ వెళ్ళే వారు ధనుష్కోడిలో తప్పక స్నానం ఆచరించాలని చెపుతారు.

12. ధనుష్కోటిలో ఇప్పటికీ లభ్యం

12. ధనుష్కోటిలో ఇప్పటికీ లభ్యం

12. ధనుష్కోటిలో ఇప్పటికీ లభ్యం

Image Source:

రామసేతులో ఉపయోగించిన రాళ్లు (నీటిపై తేలే రాళ్లు) ఇప్పటికీ ధనుష్కోటి వద్ద ఉన్న సముద్రంలో కనిపిస్తాయి. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు వలలో పడతాయి ఇవి. జాగ్రత్తగా తీసుకొచ్చి పర్యాటకులకు అమ్ముతారు వీళ్లు. అమ్మడం, కొనడంపై నిషేధం ఉన్నా.. ధనుష్కోడిని దాటిచ్చేస్తారు. ఆ రాయి ఇళ్లలో ఉండటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందువల్ల ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు.

 13. అందుకే ఆ పేరు

13. అందుకే ఆ పేరు

13. అందుకే ఆ పేరు

Image Source:

ఇది ఒక ద్వీపం. ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుజొచ్చినచోటు. యుద్ధం తర్వాత వానరులు నిర్మించిన ఈ సేతువును పగుల గొట్టారట ఇక్కడ. శ్రీరాముడు బాణముతో గట్టిగా కొట్టగా వంతెన విచ్చిపోయి రత్నాకరము, మహొదధి, రెండున్నూ కలిసిపోయాయట. ధనుస్సుచే పగులగొట్టటంచేత ధనుష్కోటి అనే పేరు సార్ధకమయిందని ఇక్కడి వారు చెబుతుంటారు.

15. ఎలా వెళ్లాలి

15. ఎలా వెళ్లాలి

15. ఎలా వెళ్లాలి

Image Source:

రామేశ్వరం ఎలా చేరుకోవాలి ? వాయు మార్గం: రామేశ్వరము సమీపాన మదురై దేశీయ విమానాశ్రయం కలదు. టాక్సీ లేదా క్యాబ్ ఎక్కి రామేశ్వరం సులభంగా చేరుకోవచ్చు. రైలు మార్గం చెన్నై నుండి రామేశ్వరానికి ప్రతి రోజూ రెండు, మంగళ, శని వారాలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు రైళ్ళు తిరుగుతుంటాయి. యాత్రికులు ముందుగానే టికెట్ రిజర్వ్ చేసుకోవటం సూచించదగినది.

16. రోడ్డు మార్గం ద్వారా

16. రోడ్డు మార్గం ద్వారా

16. రోడ్డు మార్గం ద్వారా

Image Source:

రోడ్డు మార్గం చెన్నై మరియు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పట్టణాల నుండి రామేశ్వరం కు ప్రతి రోజూ ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు నడుస్తాయి. రామేశ్వరంలో వసతులు రామేశ్వరంలో వసతి సదుపాయాలూ చక్కగా అందుబాటులో ఉన్నాయి. అన్ని తరగతులవారికి గదులు దొరుకుతాయి. 25.గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏసీ, నాన్ - ఏసీ గదులతో పాటు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లు కలవు. స్థానిక ఆహారాలు రుచించదగ్గవి. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ పుట్టిన ప్రదేశం రామేశ్వరంలోని ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ పుట్టిన ఇల్లు చూడవచ్చును.

17. రామ సేతు గురించి

17. రామ సేతు గురించి

17. రామ సేతు గురించి

Image Source:

రామసేతు అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఒక భాగమైన రామేశ్వరం (పంబన్) ద్వీపానికి, మరియు శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య ఉన్న ఇసుక దిబ్బల శ్రేణి . ఈ దిబ్బ ముఖ్యంగా ఇసుక, మరియు సున్నపు రాళ్ళను కలిగియుంటుంది. హిందూ మహాసముద్రంలో కొన్ని చోట్ల సుమారు 1.2 మీటర్ల లోతులో మునిగియుండే ఈ ఇసుక దిబ్బ పొడవు 18 మైళ్ళు (అనగా 30 కిలోమీటర్లు). ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రామసేతుని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జి (Adam's Bridge) గా అభివర్ణించారు.

18. వాల్మీకి రామాయణం ప్రకారం

18. వాల్మీకి రామాయణం ప్రకారం

18. వాల్మీకి రామాయణం ప్రకారం

Image Source:

కవి వాల్మీకి వ్రాసిన రామాయణం ప్రకారం శ్రీరాముడు వానర సైన్యంతో ఈ వంతెన నిర్మింపజేసాడు. ఈ వారధిని పలురకాల చెట్ల కాండాలతోను, రాళ్ళతోను నిర్మించారు. ఆ విధంగా వానరులసహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. కనుక రాముడే ఈ వారధిని నిర్మించాడని, అందుకే దీనిని రామసేతు అంటారని హిందువుల నమ్మకం.

19. యోజనం అనగా 3 మైళ్లు

19. యోజనం అనగా 3 మైళ్లు

19. యోజనం అనగా 3 మైళ్లు

Image Source:

యుద్ధకాండ 22:66-70 ప్రకారం వానరులు మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాల్గవ రోజు 22 యోజనాలు, ఐదవరోజు 23 యోజనాలు - మొత్తం 100 యోజనాలు శ్రీలంక గట్టువరకూ నిర్మించి చివరకు లంక ఒడ్డుకు చేరారు.. అనగా 5 రోజుల్లో నిర్మించిన రామ సేతువంతెన పొడవు 14+20+21+ 22+23 = 100 యోజనాలు . యోజనము అనగా 3 మైళ్ళు. అనగా ఐదు రోజుల్లో 100x3= 300 మైళ్ళు నిర్మించడం జరిగింది.

20. మైలు అనగా 1.6 కిలో మీటరు

20. మైలు అనగా 1.6 కిలో మీటరు

20. మైలు అనగా 1.6 కిలో మీటరు

Image Source:

మైలు అనగా 1.6 కిలో మీటర్లు, అనగా వానరులు 5 రోజుల్లో 300x1.6=480 కిలోమీటర్ల వంతెన కట్టడం అతిశయోక్తి అని, రామసేతు అసలైన పొడవు కేవలం 30 కిలోమీటర్లు అయితే 480 కిలోమీటర్లు ఎలా సాధ్యం అయ్యిందని, అసలు 5 రోజుల్లో కనీసం 30 కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించడం అసంభవమని వాదించేవారు లేకపోలేదు . లంక అనగా సముద్ర తీర ప్రాంతము లేక చిన్న ద్వీపము.

21. దూరం సరిపోవడం లేదు

21. దూరం సరిపోవడం లేదు

21. దూరం సరిపోవడం లేదు

Image Source:

రామాయణం ప్రకారం లంకా ద్వీపం భారత దేశానికి 480 కిలోమీటర్లు (100 యోజనాలు) దూరంలో ఉంది. కాని నేటి వాస్తవాన్ని పరిశీలిస్తే భారతదేశం నుండి శ్రీలంక కేవలం 30 నుండి 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. భూమి పై మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టం పెరిగి రెండు ప్రదేశాల మధ్య దూరం పెరుగుతుందే గాని తగ్గదు. కనుక రామయణంలో పేర్కొనబడిన లంక అనగా వాస్తవంగా శ్రీలంక అని అనుకోవక్కర్లేదని వాదించేవారు లేకపోలేదు.

22. వేర్వురు వాదన వేర్వేరుగా

22. వేర్వురు వాదన వేర్వేరుగా

22. వేర్వురు వాదన వేర్వేరుగా

Image Source:

"దైవసంభూతుడైన శ్రీరాముడు చివరకు వానరుల మీద ఎందుకు ఆధారపడవలసి వచ్చింది? నేరుగా శ్రీరాముడే పడవమీద లంకకు వెళ్ళొచ్చు కదా? లేదా హనుమంతుడి వీపు మీదే వెళ్ళొచ్చు కదా? వాల్మీకి మహర్షి బ్రతుకు తెరువు కోసం ఉత్తరం నుండి దక్షిణానికి వలస వస్తూ మార్గ మధ్యంలో తన రామాయణ కావ్యాన్ని వ్రాసుకుంటూ, ఆఖరిగా రామేశ్వరానికి వచ్చి అక్కడ యుద్ధకాండ ఊహించుకొని వ్రాసివుంటాడని, తర్వాత అక్కడే లేదా లంకలోనే తనువుచాలించాడని " కొంతమంది విష్లేషకుల వాదన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X