Search
  • Follow NativePlanet
Share
» »ఈ దేవాలయంలో బంగారాన్ని ప్రసాదంగా ఇస్తారు? ఉచితంగానే

ఈ దేవాలయంలో బంగారాన్ని ప్రసాదంగా ఇస్తారు? ఉచితంగానే

రత్లామ్ లోని మహాలక్ష్మీ దేవాలయానికి సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

మీకో ప్రశ్న. గుడిలో ప్రసాదంగా ఏమి ఇస్తారు ?? జవాబు : లడ్డు, కేసరి, శనగలు, పులిహోర, దద్దోజనం ఇండియాలో ఎక్కడ పోయినా దేవుళ్లకు నైవేద్యంగా ఇలాంటి పదార్థాలనే పెట్టి వాటిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తుంటారు. అయితే ఒకే ఒక దేవాలయం మాత్రం వీటన్నింటికీ భిన్నం. ఇక్కడ ప్రసాదంగా బంగారు, వెండిని అందజేస్తారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటేకలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే

దక్షిణాది చలనచిత్రాల షూటింగ్ కేరాఫ్ ఈ పర్యటాక ప్రాంతందక్షిణాది చలనచిత్రాల షూటింగ్ కేరాఫ్ ఈ పర్యటాక ప్రాంతం

తలెత్త కుండా వీటిని చూడగలరాతలెత్త కుండా వీటిని చూడగలరా

అంతే కాకుండా అయితే కొన్ని దేవాలయాల్లో కాస్త విచిత్ర మైన ప్రసాదాలను అంటే మద్యం, మాంసం, చాక్లెట్ తదిరాలను అందజేసే దేవాలయాలను గురించి మరొక్కసారి గుర్తు చేసుకుందాం.

1. రత్లామ్ లో

1. రత్లామ్ లో

1. రత్లామ్ లో

Image Source:

భక్తులకు నైవేద్యంగా బంగారాన్ని, వెండిని ఇచ్చే దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే. అదే మహాలక్ష్మి దేవాలయం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ అనే ప్రాంతంలో కలదు. రత్లామ్ ప్రాంతం బంగారానికి, రత్లమి సేవ్ కు, రత్లమి చీరలకు ప్రసిద్ధి చెందినది. అంతే కాకుండా ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది.

2. బంగారు వెండి ఎక్కువ

2. బంగారు వెండి ఎక్కువ

2. బంగారు వెండి ఎక్కువ

Image Source:

రత్లామ్ లోని మహాలక్ష్మి గుడి అత్యంత సంపన్నమైనది. గర్భగుడిలోని దేవతకు నోట్ల దండలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబుచేస్తారు. ప్రతిఏడాది ఈ గుడికి విరాళాలు భారీగా వస్తుంటాయి. అందులో బంగారం, వెండి కీలకం.

3. దీపావళి సమయంలో

3. దీపావళి సమయంలో

Image Source:

దీపావళి ప్రత్యేకం ప్రతిఏడాది దీపావళి రోజున మహాలక్ష్మి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వీటిని మూడు రోజులపాటు నిర్వహిస్తారు. వేడుకలు జరిగేటప్పుడు అమ్మవారిని నోట్ల దండలతో, బంగారు, వెండి వస్తువులతో అలంకరిస్తారు. వీటి విలువ 100 కోట్ల పైమాటే. ఇక ప్రజలు కూడా అమ్మవారికి ఎక్కువ విలువ కలిగిన వస్తువులను కానుకలు ఇవ్వడం ప్రతిష్టగా భావిస్తుంటారు.

4. సుదూర ప్రాంతాల నుంచి

4. సుదూర ప్రాంతాల నుంచి

4. సుదూర ప్రాంతాల నుంచి

Image Source:

బహుశా ఇండియాలో ఎక్కడా ఇలా అలంకరించరేమో ... !! అంత భారీగా విరాళాలుగా వచ్చే బంగారాన్ని, వెండిని దేవస్థానం వారు భక్తులకు ప్రసాదంలా తిరిగి ఇస్తుంటారు. ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల, వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

5. మంచి జరుగుతుందని

5. మంచి జరుగుతుందని

5. మంచి జరుగుతుందని

Image Source:

ఒక్కోసారి భక్తులు పొందే ప్రసాదం (బంగారం, వెండి) వచ్చే రాకపోకల ఖర్చుకు సరిపోదు. అయినా భక్తులు దేవుని ప్రసాదంగా ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఇండోర్, ఉజ్జయిని, వడోదర తదితర ప్రాంతాల నుండి రత్లామ్ చేరుకోవడం సులభం. కాగా, ఇక్కడ తమకు ప్రసాదంగా లభించిన బంగారం, వెండిని చాాలా మంది బ్యాంక్ లాకర్లలో పెడుతుంటారు.

6. అందమైన ఆలయాలకు

6. అందమైన ఆలయాలకు

6. అందమైన ఆలయాలకు

Image Source:


రత్లామ్ సముద్రమట్టానికి 480 మీటర్ల ఎత్తున (1575 అడుగులు) మాళ్వా ప్రాంతంలో కలదు. మధ్యప్రదేశ్లోని రత్లమ్ జిల్లాకు హెడ్క్వాటర్స్ ఇది. రత్లమ్ అందమైన ఆలయాలకు నెలవు. సముద్ర మట్టానికి చాలా వేల అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉండటం వల్ల వాతావరణం కొంత చల్లాగా ఉంటుంది. ట్రెక్కింగ్ కు కూడా ఇది అనుకూలమైన ప్రాంతం

7. కల్కామాత దేవాలయం

7. కల్కామాత దేవాలయం

7. కల్కామాత దేవాలయం

Image Source:


ప్రసిద్ధి చెందిన కల్కామాత దేవాలయం రత్లామ్ లోని కలెక్టరేట్ సమీపంలో ఉన్నది. క్యాక్టస్ గార్డెన్ ఇక్కడికి 20 కి.మీ ల దూరంలో ఉన్నది. ఇక్కడికి దగ్గర్లోని అలాట్ లో నాగేశ్వర టెంపుల్, జఒరా లోని హుస్సేన్ తెక్రి లు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఈ ఆలయాన్ని దర్శించడానికి కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

8. ఎన్నో ఆకర్షక ప్రాంతాలు

8. ఎన్నో ఆకర్షక ప్రాంతాలు

8. ఎన్నో ఆకర్షక ప్రాంతాలు

Image Source:

ఇక్కడి ఆకర్షణలను రెండు రకాలుగా విభజించవచ్చు. 1) ఆర్కియోలాజికల్ ప్రదేశాలు 2) ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్ లు. 1) ఆర్కియోలాజికల్ ప్రదేశాలు బిల్ పాకేశ్వర ఆలయం (18 కి.మీ రత్లామ్ నుండి), ఝర్ లోని శివాలయం (రత్లామ్ నుండి 12 కి. మీ), విరూపాక్ష మహాదెవ్ ఆలయం, అలోట్ షిపవ్ర ఆలయం, ధరోలా మహాదెవ్ ఆలయం (రత్లామ్ నుండి 84 కి.మీ), గార్ఖాన్‌ఖై దేవాలయం, శివగర్హ్ లోని కేదారేశ్వర ఆలయం, అమర్ జీ ఆలయం, జఒరా లోని అయన మహదేవ్ ఆలయం, బార్బాద్ మహదేవ్ ఆలయం మొదలగునవి చూడదగ్గవి.

9. ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్ లు

9. ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్ లు

9. ఆధ్యాత్మిక ప్రదేశాలు మరియు టూరిస్ట్ స్పాట్ లు

Image Source:

గులాబ్ చుక్కర్ పురావస్తు సంగ్రహాలయం, గాడ్ఖంగేమతా ఆలయం(౩౦ కి.మీ), కేదారేశ్వర ఆలయం (20 కి.మీ), ధొలవాద్ డామ్ (15 కి.మీ), సగోడ్ జైన్ ఆలయం, క్యాక్టస్ గార్డెన్, హుస్సేన్ తెక్రి, అందికల్పెశ్వర్ ఆలయం, ఖర్మోర్ బర్డ్ స్యాంక్చురీ, గంగా సాగర్ మొదలుగునవి చూడదగ్గవి. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన ఆకర్షణలు...సంక్షిప్తంగా!! వసతి రత్లామ్, జిల్లా ప్రధాన కేంద్రం కనుక వసతి సదుపాయాలు చక్కగా ఉంటాయి. టూ స్టార్, త్రీ స్టార్ హోటళ్లు, లాడ్జీలు మరియు గెస్ట్ హౌస్ లలో యాత్రికులు వసతి పొందవచ్చు.

10. రత్లామ్ ఎలా చేరుకోవాలి ?

10. రత్లామ్ ఎలా చేరుకోవాలి ?

10. రత్లామ్ ఎలా చేరుకోవాలి ?

Image Source:


రత్లామ్ చేరుకోవడానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చేరువలో ఉన్నాయి. వాయు మార్గం : సమీపాన 104 కి. మీ ల దూరంలో ఇండోర్ విమానాశ్రయం, 190 కి. మీ ల దూరంలో ఉదైపూర్ ఏర్ పోర్ట్ లు కలవు. క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి రత్లామ్ చేరుకోవచ్చు. రైలు మార్గం : రత్లామ్ లో రేల్‌వే జంక్షన్ కలదు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైళ్ళు వస్తుంటాయి. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదైపూర్, కోల్‌కతా ప్రాంతాల నుండి రెగ్యులర్ గా రైళ్ళు స్టేషన్ మీదుగా వెళుతుంటాయి.

బస్సు మార్గం/ రోడ్డు మార్గం : రత్లామ్ కు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి రోడ్డు సదుపాయం కలదు. రోడ్డు మార్గంలో వచ్చేవారు అంతర్ రాష్ట్ర బస్సులు, ట్యాక్సీ లు, క్యాబ్ లలో ప్రయాణించి చేరుకోవచ్చు.

11. మంచ్ మురుగన్ ఆలయం

11. మంచ్ మురుగన్ ఆలయం

11. మంచ్ మురుగన్ ఆలయం,

Image source:

కేరళ పేరులోనే ఉంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో ?. ఇక్కడి మురుగన్ దేవుడికి చాక్లెట్ లంటే ఇష్టమట. అందుకే భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయానికి వచ్చి మంచ్ చాక్లెట్ లను సమర్పిస్తారట. ఇది తెలిసిన చుట్టుపక్కల వారు కూడా మతాలతో సంబంధం లేకుండా ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఇంకో విషయం 'పుష్పాంజలి' మరియు 'అర్చన' తర్వాత భక్తులకు మంచ్ చాక్లెట్లను ప్రసాదాలుగా ఇస్తారట.

12. చైనీస్ కాళీ ఆలయం

12. చైనీస్ కాళీ ఆలయం

12. చైనీస్ కాళీ ఆలయం

Image source:


కలకత్తా చైనీస్ కాళీ ఆలయం, తంగ్రా ప్రాంతంలోని చైనాటౌన్ లో కలదు. ఇక్కడ కాళీ ఆలయంలో నూడుల్స్, చోప్ సుఎయ్ ని భక్తులకు ప్రసాదాలుగా అందిస్తారు. చైనీస్ కాళీ ఆలయం చైనా మరియు ఇండియా కు మధ్య ఒక వంతెన మాదిరి, రెండు దేశాల సంస్కృతులకు, సంప్రదాయాలకు గట్టి బంధంగా ఉన్నది. పశ్చిమ బెంగాళ్ వంటకాలతో పాటు ఇక్కడ నూడుల్స్ వంటి చైనీస్ వంటకాలను మొదట అమ్మవారికి నైవేద్యంగా పెడుతారు. అటు పై వాటిని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.

13. పరస్సినిక్కడవు ఆలయం

13. పరస్సినిక్కడవు ఆలయం

13. పరస్సినిక్కడవు ఆలయం

కన్నూర్ కేరళ రాష్ట్రంలోని పరస్సినిక్కడవు మదప్పురం ఆలయం అది అందించే ప్రసాదాలకు పెట్టింది పేరు. చేపలు, తాటి చెట్ల నుండి తీయబడిన పుల్లని రసం మరియు అల్కాహాలు(ఫుల్ లేదా ఆఫ్ బాటిల్) ను దేవత ముందు పెట్టి పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత, పూజారులు వీటినే ప్రసాదాలుగా భక్తులకు అందిస్తారు. గ్రీన్ గ్రాం మరియు కొబ్బరి ముక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఇలా మాంసాన్ని ప్రసాదంగా అందజేసే దేవాలయం మరెక్కడా ఉండదేమో.

14. ఖబీస్ బాబా ఆలయం

14. ఖబీస్ బాబా ఆలయం

14. ఖబీస్ బాబా ఆలయం,

Image source:

లక్నో ఖబీస్ బాబా ఆలయం, యూపీ లోని లక్నో లో ఉంది. ఖబీస్ అనే సన్యాసి శివున్ని ప్రార్ధిస్తూ చనిపోయాడు. అతని శిష్యులు బాబా చనిపోయిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని కట్టినారు. ఆ ఆలయాన్ని భక్తులు తరచూ సందర్శించి ఆల్కాహాల్ ను నైవేద్యంగా పెడతారు. బాబా ముందు ఉన్న రెండు బీటలలో, ఒకదాంట్లో మద్యాన్ని ధారాళంగా పోస్తారు. చివరగా దాన్ని సేకరించి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దీన్ని భక్తులు పరమ పవిత్రమైనదిగా భావించి చేవిస్తారు.

15. కర్ణి మాతా ఆలయం

15. కర్ణి మాతా ఆలయం

15. కర్ణి మాతా ఆలయం

Image source:

రాజస్థాన్ లోని బికనీర్కు దగ్గరగా ఉన్న కర్ణి మాత ఆలయం బికనేర్ లో క్రీ.శ. 20 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆలయం బయట వెండితో చేయబడిన ప్రధాన గేటు మరియు లోపల మార్బుల్ చెక్కడాలు అనేకం కలవు. కాబాస్ అని పోలువబడుతూ తిరిగే ఇక్కడి ఎలుకను భక్తులు పూజిస్తారు. వాటికి నైవేద్యంగా పాలను పోస్తారు. కాబాస్ ఆ పాలను తాగితే సుభసూచికంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. సదరు పాలను కొంతమంది భక్తులు సేవిస్తారు.

16. యోని స్రావితాన్ని

16. యోని స్రావితాన్ని

16. యోని స్రావితాన్ని

Image source:

శక్తి స్వరూపుణి వెలసిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరం. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠల్లో అత్యంత శక్తిమంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున, గౌహతికి సమీపంలో ఉందీ క్షేత్రం. ఇక్కడ వెలసిన దేవిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. ఇక్కడ సచీదేది యోని పడిపోయి పుణ్యక్షేత్రంగా మారిందని పురాణ కథనం. ఈ యోని పడ్డ భాగం నుంచి వెలువడే జలాన్ని భక్తులు తీర్థంగా శ్వీకరిస్తారు.

17. గంజాయి

17. గంజాయి

17. గంజాయి...

Image source:

వారణాసి కొన్ని స్మశానవాటికల్లో అఘోరాలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆ పూజలు చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడే కాలిన శవం తాలూకు భస్మాన్ని తీసుకువచ్చి అందులో గంజాయిని కలిపి తమ అనుచరులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ అఘోరాల అనుచరుల్లో విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. అదే విధంగా మనాలిలోని కొన్ని హిందూ దేవాలయాల్లో కూడా గంజాయిని స్వల్ప ప్రమాణంలో కొన్ని పదార్థాలతో కలిపి ప్రసాదంగా అందజేస్తారు. ఈ విషయం తెలిసినా పోలీసులు పెద్దగా పట్టించుకోరు.

18. విస్కీ ఇక్కడ ప్రత్యేకం

18. విస్కీ ఇక్కడ ప్రత్యేకం

18. విస్కీ ఇక్కడ ప్రత్యేకం

Image source:

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిన్ లో కాలభైరవ దేవాలయం ఉంది. పూజలో భాగంగా భక్తులు ఇచ్చిన మద్యాన్ని ఒక సాసర్ లో వేసుకుని గుడిలోని పూజారి కాళీ మాత విగ్రహం దగ్గరకు తీసుకువెళుతాడు. అందులో మూడు వంతుల మద్యం సదరు విగ్రహం తాగుతుందని మిగిలినది భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. దేవాలయం బయట మనకు కొబ్బరి కాయలతో పాటు మద్యాన్ని అందజేస్తారు. ఇందుకు కొంత రుసుం వసూలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన మద్యాన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా పెడుతాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X