Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ పిండ ప్రధానం చేస్తే మోక్షం తథ్యం

ఇక్కడ పిండ ప్రధానం చేస్తే మోక్షం తథ్యం

పిండప్రధానం, శ్రద్ధలకు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

అస్థిపంజరాల సరస్సు ఇక్కడే...అస్థిపంజరాల సరస్సు ఇక్కడే...

శవ భస్మంతో అర్చన జరిగే దేవాలయం గురించి మీకు తెలుసాశవ భస్మంతో అర్చన జరిగే దేవాలయం గురించి మీకు తెలుసా

హిందూ పురాణాల్లో శ్రద్ధ, కర్మ, పిండప్రదానం, తర్మణం వదలడం వంటి ప్రక్రియలకు చాలా ప్రాధాన్యత ఉంది. భక్తి శ్రద్ధలతో ఈ విధులను నిర్వహిస్తే చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందనేది ప్రజల విశ్వాసం. ఇక ఈ ప్రక్రియల కోసం భారత దేశంలో కొన్ని ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. స్థల మహత్యంతో పాటు అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇందుకు కారణం. ప్రస్తుత కథనంలో శ్రద్ధ, కర్మ, పిండప్రదానం చేయడానికి అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రాల గురించి తెలుసుకుందాం.

1. రిషికేష్

1. రిషికేష్

1. రిషికేష్

Image Source:

గంగానది ప్రవహించే ప్రాంతం. హిందూ పురాణాల ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ పిండ ప్రదానం చేయడానికి వేల సంఖ్యలో ఇక్కడకు వస్తారు. భక్తి శ్రద్ధలతో అత్యంత పవిత్రమైన మనస్సుతో ఇక్కడ కర్మకాండలను నిర్వహిస్తారు.

2. రామేశ్వరం

2. రామేశ్వరం

2. రామేశ్వరం

Image Source:

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో రామేశ్వరం మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఛార్ దామ్ యాత్రలో ఇది కూడా ఒకటి. దక్షిణ భారత దేశంలోని తమిళనాడులో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ఉన్నటు వంటి రామనాథస్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందినది.

3. కాశి

3. కాశి

3. కాశి

Image Source:

ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచీనమైన నగరాల్లో కాశి ఒకటి. ఈ నగరంలో కాశీ విశ్వేశ్వరనాథ దేవాలయం, సంకటమోచ దేవాలయం ప్రసిద్ధి చెందినవి. ఇక ఇక్కడ ఉన్న ఘాట్ లలో పిండప్రధానం చేయడానికి నిత్యం వేల సంఖ్యలో ఇక్కడకు ప్రజలు వస్తూ ఉంటారు.

4. గయ

4. గయ

4. గయ

Image Source:

బీహార్ లోని గయ అతి పెద్దనగరాల్లో ఒకటి. ఇది పల్గున నది ఒడ్డున ఉంది. పిండ ప్రదానం కోసం బీహార్ నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ పిండ ప్రధానం చేస్తే చనిపోయినవారు నేరుగా వైకుంఠానికి వెలుతారని చెబుతారు. అందువల్లే ఇక్కడకు వేల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు.

5. మెందకర్ తీర్థ , మహారాష్ట్ర

5. మెందకర్ తీర్థ , మహారాష్ట్ర

5. మెందకర్ తీర్థ , మహారాష్ట్ర

Image Source:

మహారాష్ట్రలోని రామ్ గావ్ నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో మెందకర్ తీర్థం ఉంది. ఈ ప్రాంతం గురించి హిందూ పురాణాల్లో చాలా సార్లు వివరించారు. ఇక్కడ స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయని నమ్ముతారు. బ్రహ్మ యజ్జం చేసే సమయంలో ఇక్కడ ఉన్న నది ఉద్భవించిందని చెబుతారు. ఇది పశ్చిమ దిక్కుగా ప్రవహించడం వల్ల దీనిని మరింత పవిత్రమైనదని భావిస్తారు. ఇక్కడ పిండ ప్రధానం చేయడం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు.

6. లక్ష్మణబాణ, కర్ణాటక

6. లక్ష్మణబాణ, కర్ణాటక

6. లక్ష్మణబాణ, కర్ణాటక

Image Source:

ఇక్కడ నీటి చలిమను లక్షణుడు తన బాణం ద్వారా సృష్టించడం వల్ల దీనికి లక్ష్మణబాణ అనే పేరు వచ్చింది. శ్రీరాముడు తన తండ్రి దశరథుని కర్మలు నిర్వహించిన ప్రాంతం లక్ష్మణబాణ. అందువల్ల ఇక్కడకు చాలా మంది తమ పూర్వీకుల శ్రద్ధ, కర్మలను నిర్వహించడానికి వస్తుంటారు. హంపి నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో లక్ష్మణబాణ ఉంది.

7. ప్రయాగ, ఉత్తరప్రదేశ్

7. ప్రయాగ, ఉత్తరప్రదేశ్

7. ప్రయాగ, ఉత్తరప్రదేశ్

Image Source:

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ కూడా పిండ ప్రదానానికి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. త్రివేణి సంగం వద్ద ఇక్కడ కర్మలను నిర్వహిస్తారు. ఇక్కడ పిండ కర్మలు చేస్తే ఆ చనిపోయిన వారికి పునర్ జన్మ ఉండదని నమ్ముతారు.

8. సిద్ధనాథ్, మధ్యప్రదేశ్

8. సిద్ధనాథ్, మధ్యప్రదేశ్

8. సిద్ధనాథ్, మధ్యప్రదేశ్

Image Source:

సిద్ధనాథ్ తీర్థం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లోని శీప్ర నది తీరంలో ఉంది. ఇక్కడ ఉన్న ఓ మర్రిచెట్టు కింద పిండ ప్రధానం చేయడం ఉత్తమమని నమ్మకం. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి పిండప్రదానం చేయడానికి వస్తారు.

9. బ్రహ్మకపాల్, ఉత్తరాఖండ్

9. బ్రహ్మకపాల్, ఉత్తరాఖండ్

9. బ్రహ్మకపాల్, ఉత్తరాఖండ్

Image Source:

బ్రహ్మకపాల్ లో ఉత్తరాధి క్రియలు నిర్వహించడం శ్రేష్టమని మన పురాణాలు చెబుతాయి. ఇది బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ పిండ ప్రధానం చేసిన తర్వాత మరెక్కడా సదరు కర్మలను చేయాల్సిన అవసరం ఉండదని చెబుతారు. అలకనంద నదీ హోయలను ఇక్కడ చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X