Search
  • Follow NativePlanet
Share
» »రాక్షసుడి శరీరభాగాలు పడినే చోటే...శక్తి పీఠాలు అందుకే వీటి సందర్శనతో

రాక్షసుడి శరీరభాగాలు పడినే చోటే...శక్తి పీఠాలు అందుకే వీటి సందర్శనతో

త్రి గయ క్షేత్రాలకు సంబంధిచించిన కథనం.

By Kishore

హిందూ పురాణాలను అనుసరించి దేవతలు స్వయంగా వెలిసిన చోటు పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందుతాయి. అయితే కేవలం కొన్ని చోట్ల మాత్రమే రాక్షసులు కొలువైన చోటు కూడా పరమ పవిత్రమైన ప్రాంతాలుగా భక్తుల చేత నీరాజనలు అందుకొంటాయి. అటువంటి కోవకు చెందిన త్రి గయ క్షేత్రాలు. గయాసురడనే రాక్షస రాజు శరీర భాగాలు పడిన ప్రాంతాలు మూడు పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా రూపు దిద్దుకొన్నాయి. ఇక్కడ త్రిమూర్తులు స్వయంగా వెలిసినట్లు చెబుతారు. అంతే కాకుండా ఆ మూడు క్షేత్రాల్లో పరమ పవిత్రమైన మూడు శక్తి పీఠాలు ఉండటం గమనార్హం. ఇలా త్రిమూర్తులు ఉన్న చోట శక్తి పీఠాలు కూడా ఉండటం చాలా అరుదైన విషయం. అందువల్ల వీటి సందర్శనతో కోరిన కోర్కెలన్నీ తీరుతాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గయాసురిడి కథతో పాటు సదరు శక్తి పీఠాలకు సంబంధించిన కథనం మీ కోసం

పూణె వెళితే ఆ సమయంలో ఇక్కడకు మాత్రం వెళ్లకండిపూణె వెళితే ఆ సమయంలో ఇక్కడకు మాత్రం వెళ్లకండి

1. గయాసురుడు

1. గయాసురుడు

P.C:You Tube

పూర్వం గయాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను రాక్షసుడైనా పరమ విష్ణుభక్తుడు. విష్ణువు గురించి వెయ్యేళ్లు ఘోర తపస్సు చేసి విశ్వంలోని అన్ని తీర్థాల కన్నా తన శరీరం పరమ పవిత్రమయ్యే వరం పొందుతాడు.

2. ప్రతి ఒక్కరూ స్వర్గానికే

2. ప్రతి ఒక్కరూ స్వర్గానికే

P.C:You Tube

అంతేకాకుండా విశ్వంలో అందరి కంటే పరాక్రమ వంతుడవుతాడు. దీంతో ఆయన శరీరాన్ని తాకిన వారందరూ పాపాలను పోగొట్టుకొంటూ ఉంటారు. దీంతో చనిపోయిన ప్రతి ఒక్కరూ స్వర్గానికే పోతూ ఉంటారు.

3. ప్రజలను ఇబ్బందులకు

3. ప్రజలను ఇబ్బందులకు

P.C:You Tube

ఇదిలా ఉండగా గయాసురుడు మంచివాడైనా అతని బంధువులు, సైనికులు విశ్వంలోని మునులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు.

4. అష్టదిక్పాలకులను

4. అష్టదిక్పాలకులను

P.C:You Tube

అంతేకాకుండా అష్ట దిక్పాలకులను తమ గుప్పిట్లో పెట్టుకొని కరువును, వరదలను స`ష్టిస్తూ ఉంటారు. మరోవైపు గయాసురుడికి లభించిన వరం వల్ల అతనికి ఇంద్రపదవి కూడా దక్కుతుంది.

5. ఇంద్రుడు

5. ఇంద్రుడు

P.C:You Tube

దీంతో ఇంద్రుడు పదవిని కోల్పోతాడు. ఇలా స`ష్టిలోని ప్రతి విషయం అదుపు తప్పుతుంది. దీంతో ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్లి పరిస్థితి మొత్తం వివరిస్తాడు. ఇలాగే కొనసాగితే ఈ స`ష్టి మొత్తం అల్లకల్లోలమవుతుందని మొరపెట్టుకొంటారు.

6. గయాసురుడిని సంహరించాలని

6. గయాసురుడిని సంహరించాలని

P.C:You Tube

దీంతో త్రిమూర్తులు గయాసురిడిని సంహరించాలని నిర్ణయించుకొంటారు. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళిక రచిస్తారు. దాని ప్రకారం త్రిమూర్తులు గయాసరుడి వద్దకు వెళ్లి తాము లోక కళ్యాణం కోసం ఒక గొప్ప యాగాన్ని చేయాలనుకొంటామని చెబుతారు.

7. వారు ముగ్గురూ

7. వారు ముగ్గురూ

P.C:You Tube

అయితే ఈ లోకం మొత్తం పాపాత్ముల వల్ల కలుషితమై పోయిందని పవిత్రమైన స్థలం అన్నదే లేకుండా పోయిందని పేర్కొంటారు. సమస్య పరిష్కారం కోసం ఈ విశ్వంలో అన్ని తీర్థాల కంటే పవిత్రమైన నీ శరీరాన్ని యాగ స్థలంగా వినియోగించుకొంటామని అడుగుతారు.

8. ఒక షరత్తు విధిస్తాడు

8. ఒక షరత్తు విధిస్తాడు

P.C:You Tube

ఇందుకు సంతోషంగా అంగీకరించిన గయాసురుడు అంగీకరిస్తాడు. అయితే త్రిమూర్తులు ఒక షరత్తును విధిస్తారు. ఏడు రోజుల పాటు యాగం జరుగుతుందని మధ్యలో యాగానికి భంగం కలిగితే మరణిస్తావని గయాసురుడికి చెబుతారు.

9. శరీరాన్ని భారీ పరిమాణంలో పెంచి

9. శరీరాన్ని భారీ పరిమాణంలో పెంచి

P.C:You Tube

ఇందుకు సంతోషంగా అంగీకరించిన గయాసురుడు తన శరీరాన్ని భారీ పరిమాణంలో పెంచేస్తాడు. దీంతో అతని తల బీహార్ లోని గయ వద్ద, వక్షస్థలం ఒరిస్సా లోని జాజ్ పూర్ వద్ద, పాదాలు పిఠాపురం వద్ద ఉంటాయి.

10. మూడు ప్రాంతాల్లో ముగ్గరు

10. మూడు ప్రాంతాల్లో ముగ్గరు

P.C:You Tube

గయాసురుడి శిరస్సు వద్ద విష్ణువు కుర్చొంటాడు. వక్షస్థలం వద్ద బ్రహ్మ కుర్చొనగా, పాదాల వద్ద పరమేశ్వరుడు కుర్చొని త్రిమూర్తులు ముగ్గురూ ఒకేసారి యాగా ప్రారంభిస్తారు.

11. యోగ మాయ

11. యోగ మాయ

P.C:You Tube

యోగ మాయ ద్వారా గయాసురుడు తన శరీరాన్ని కదలకుండా చేస్తాడు. అయితే ఎన్ని రోజులు గడిచిపోయాయో తెలుసుకోవడానికి వీలుగా కేవలం కూడి కూత మాత్రం వింటూ ఉంటాడు.

12. చివరి రోజు

12. చివరి రోజు

P.C:You Tube

ఆరు రోజుల పాటు యాగం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇక ఏడు రోజు ప్రారంభమయ్యే సమయంలో పరమశివుడు కోడి రూపంలో కూస్తాడు. దీంతో ఏడు రోజులు పూర్తయ్యిందని భావించిన గయాసురుడు సంతోషంతో కదులుతాడు.

13. నియమభంగం

13. నియమభంగం

P.C:You Tube

నియమభంగం అయ్యిందని చెప్పి గయాసురుడిని త్రిమూర్తులు సంహరించడానికి సిద్ధపడుతాడు. త్రిమూర్తుల చేతుల్లో మరణాన్ని సంతోషంగా అంగీకరిస్తానని పేర్కొన్న గయాసురుడు ఒక వరం ఇవ్వమని అడుగుతాడు.

14. మోక్షం

14. మోక్షం

P.C:You Tube

దాని ప్రకారం తన తల, వక్షస్థలం, పాదాలు పడిన చోట వరుసగా విష్ణువు, బ్రహ్మ, పరమేశ్వరుడు కొలువై ఉండాలని అంతేకాకుండా అవి శక్తిపీఠాలుగా మారాలని కోరుతాడు. ఇక్కడ పిత`దేవతకు కర్మలు నిర్వహిస్తే వారికి మోక్షం కలిగేలా వరం ఇవ్వమని కోరుకొంటాడు.

15. మోక్షం ప్రసాదిస్తాడు

15. మోక్షం ప్రసాదిస్తాడు

P.C:You Tube

చనిపోయే సమయంలో కూడా లోక కళ్యాణం కోసం, ప్రజల బాగోగుల కోసం ఆలోచించిన గయాసురుడి వ్యక్తిత్వానికి మెచ్చుకొన్న త్రిమూర్తులు అతనికి మోక్షం కూడా ప్రసాదిస్తారు.

16. శిరో గయ

16. శిరో గయ

P.C:You Tube

ఇక గయాసురుడి కోరిక మేరకు తల పడిన చోటు శిరో గయ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది. ఇది బీహారులో ఉన్న గయ. ఇది విష్ణు నివాసం. ఇక్కడ ఉన్న ఫల్గుణా నదీ తీరంలో విష్ణుపాద ఆలయం ఉంది.

17. మంగళగౌరి దేవాలయం

17. మంగళగౌరి దేవాలయం

P.C:You Tube

ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మంగళగౌరీ దేవాలయం ఉంది. ఇక ఇక్కడ శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు.

18. నాభిగయా

18. నాభిగయా

P.C:You Tube

ఒరిస్సాలోని కటక్ కు సమీపంలో ఉన్న జాజ్ పూర్ లో గయాసురిడి వక్షస్థలం పడిందని చెబుతారు. దీనిని నాభిగయా అంటారు. ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు యాగం చేసాడు.

19. వేదిక స్వరూపంగా

19. వేదిక స్వరూపంగా

P.C:You Tube

అయితే బ్రహ్మకు ఆలయాలు ఉండవు కాబట్టి యాగ వేదిక స్వరూపంగా ఆయన ఇక్కడ కొలువై ఉన్నారని చెబుతారు. ఆలయంలో ఒక బావి ఉంటుంది. దీనినే బ్రహ్మదేవుడి యాగ కుండం అంటారు.

20. గిరిజా దేవి శక్తి పీఠం

20. గిరిజా దేవి శక్తి పీఠం

P.C:You Tube

ఇక ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన గిరిజాదేవి శక్తిపీఠం ఉంది. స్థానికులు ఈ దేవతను విరజాదేవి, బిరజాదేవి అని పిలుస్తారు.

21. పిఠాపురం పాదగయా

21. పిఠాపురం పాదగయా

P.C:You Tube

ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో గయాసురుడి పాదాలు పడ్డాయి. అందువల్ల దీనిని పాదగయ అని అంటారు. ఇక్కడే ఈశ్వరుడు కోడి రూపంలో వచ్చి యాగ భంగం గావించినట్లు చెబుతారు. అందువల్ల ఇక్కడ ఈశ్వరుడు కుక్కుటేశ్వరుడిగా వెలిశాడు.

22. పురూహూతికా దేవి

22. పురూహూతికా దేవి

P.C:You Tube

అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ క్షేత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ అమ్మవారిని పురూహూతికాదేవి అని పిలుస్తారు. త్రిగయా క్షేత్రాల్లో పాదగయ శ్రేష్టమైనదని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X