Search
  • Follow NativePlanet
Share
» »ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ ప్రపంచంలో ఏకైక సరస్సును చూశారా

ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ ప్రపంచంలో ఏకైక సరస్సును చూశారా

ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ లోనార్ సరస్సు గురించి

By Beldaru Sajjendrakishore

మనదేశంలోనూ ఆ మ్యూజియంలుమనదేశంలోనూ ఆ మ్యూజియంలు

ఆసియాలో పొడవైన గుహ...అనంత సంపదఆసియాలో పొడవైన గుహ...అనంత సంపద

ప్రతి రోజూ దుప్పటి నలిగి...పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదేప్రతి రోజూ దుప్పటి నలిగి...పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే

ఆకాశం నుంచి పడ్డ ఓ పెద్ద ఉల్క వల్ల ఏర్పడిన సరోవరం ఎక్కడుందో తెలుసా. అసలు అటువంటి సరోవరం ఉందన్న విషయం మీరెప్పుడైనా విన్నారా. ప్రపంచంలో ఇటువంటి సరోవరం ఒకటే ఒకటి ఉంది. అది ఎక్కడో కాదు మన భారత దేశంలోని మహారాష్ర్టలోనే. కొన్ని వేల సంవత్సారాల క్రితం భూమి పై పడిన ఉల్క వల్ల ఈ సరోవరం ఏర్పడింది. ప్రస్తుతం ఇది పర్యాటక ప్రియులను ఆకర్షిస్తోంది. అసలు ఈ సరోవరం ఎక్కడుంది ఎలా ఏర్పడింది ఎలా వెళ్లాలి అన్న విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

1. ఎక్కడ ఉంది

1. ఎక్కడ ఉంది

Image Source:

మహారాష్ట్ర లోని లోనార్ ప్రాంతంలో ఈ సరోవరం ఉంది. అన్నట్టు ఇది ఉప్పునీటి సరస్సు. ముంబై నుంచి ఇక్కడకు 550 కిలోమీటర్లు కాగా మీరట్, ఔరంగాబాద్ నుంచి 160 కిలోమీటర్లు మాత్రమే.

2. సుమారు 52 వేల ఏళ్ల క్రితం

2. సుమారు 52 వేల ఏళ్ల క్రితం

2. సుమారు 52 వేల ఏళ్ల క్రితం

Image Source:

సుమారు 52,000 ఏళ్ల క్రితం విశ్వం నుంచి పడిన ఉల్క వల్ల మొదట ఇక్కడ పెద్ద గుంత ఏర్పడింది. అటు పై కొన్ని సంవత్సరాలకు భూమి లోపలి నుంచే నీరు వచ్చి ఆ గుంత సరస్సుగా మార్పు చెందింది. ఇలా ఉల్క వల్ల ఏర్పడిన సరస్సు ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా లేదు.

3. ప్రతి ఏడాది 1,50,000 వరకూ

3. ప్రతి ఏడాది 1,50,000 వరకూ

3. ప్రతి ఏడాది 1,50,000 వరకూ

Image Source:

సాధారణంగా ప్రతి ఏడాది ఆకాశం నుంచి తమ కక్షల గతి తప్పి 30 వేల నుంచి 1,50,000 వరకూ ఉల్కలు భూ వాతావరణం లోకి అత్యంత వేగంగా చొచ్చుకుని వస్తాయి. అయితే గురుత్వాకర్షణ, ఘర్షణ బలం వల్ల ఆ ఉల్కలు భూ వాతవరణం లోకి చేరిన వెంటనే కాలిపోతాయి. సదరు గురుత్వాకర్షణ, ఘర్షణ బలాన్ని కూడా దాటుకుని వచ్చి ఓ ఉల్క వల్ల ఈ సరస్సు ఏర్పడింది.

4. పక్షి ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు.

4. పక్షి ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు.


Image Source:

ముఖ్యంగా ఈ సరస్సు పక్షి ప్రేమికులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం స్థానిక పక్షులే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడకు పక్షులు వలస వస్తాయి. ముఖ్యంగా షెల్డక్, స్కిల్ట్స్, బ్రాహినీ జాతికి చెందిన బాతులు, ఎర్రని వ్యాటల్డ్ ల్యాఫ్టింగ్, నీలం రంగు జేస్, బేవే వివర్స్, హోపోస్, బార్న్ జాతికి చెందిన గుడ్లగూబలు, గోల్డన్ ఓనియల్, ల్యాక్కర్, రంగరంగుల చిలుకలు, ఫీఫల్ తదితర పక్షలను ఇక్కడ చూడవచ్చు.

5. అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి

5. అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి

5. అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి

Image Source:

లోనార్ సరస్సు చుట్టూ అనేక ఔషద గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. అందువల్ల ఆయుర్వేద వైద్యులు ఇక్కడకు ఎక్కవ సంఖ్యలో వస్తుంటారు. ఇక ఇక్కడ రామగయ దేవస్థానం, కమల్జా దేవి దేవాలయం, కొంత నీటిలో మునిగిన శంకర గణేశ దేవాలయాలు కూడా ఉండటం వల్ల హిందూ భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X