Search
  • Follow NativePlanet
Share
» »పూరీ జగన్నాథ రథం తయారీకి వాడే కలప ముక్కల సంఖ్య శతాబ్దాలుగా మారడం లేదు తెలుసా

పూరీ జగన్నాథ రథం తయారీకి వాడే కలప ముక్కల సంఖ్య శతాబ్దాలుగా మారడం లేదు తెలుసా

పూరిజగన్నాథుడి రథయాత్రకు సంబంధించిన కథనం

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుడి రథయాత్ర ఉత్సవాలు పూర్తి కావచ్చాయి. శనివారం నుంచి ఈ రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా లక్షల సంఖ్యలో పూరికి చేరుకొంటారు. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కడా లేనట్లు ఒక్క పూరిలోని మూల విరాట్టులే ఉత్సవ విగ్రహాలుగా ఊరేగుతాయి. అంతేకాకుండా ప్రతి ఏడాది కొత్త రథాలను తయారు చేస్తారు. ఇది కూడా పూరీ ప్రత్యేకమే. ఇక ఈ రథాల తయారీ ఒక ఒక లెక్క ప్రకారమే సాగుతుంది. అందులో వాడే కలప ముక్కల సంఖ్య శతాబ్దాలుగా ఒకటి ఎక్కువ కాని ఒకటి తక్కువ కాని కావడం లేదు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

1072 ముక్కలు అటు పై 2188

1072 ముక్కలు అటు పై 2188

P.C: You Tube

ప్రతి ఏడాది రథాల తయారీకి అవసరమైన చెట్లను ఎంపిక చేసి వాటిని సరిగ్గా 1072 ముక్కలుగా ఖండిస్తారు. అటు పై పూరీకి తరలిస్తారు. ప్రధాన అర్చకుడితో సహా మొత్తం తొమ్మిది మంది శిల్పులు, వారికి సహాయకులు కలిపి 125 మంది ఈ రథాల తయారీలో పాల్గొంటారు. 1072 వ`క్ష భాగాలను రథం తయారుచేయడానికి అనువుగా 2188 ముక్కులుగా ఖండిస్తారు. అటు పై వీటిలో 832 భాగాలతో జగన్నాథుడి రథం తయారు చేస్తారు.

45 అడుగుల జగన్నాథుడి రథం

45 అడుగుల జగన్నాథుడి రథం

P.C: You Tube

అదే విధంగా జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం ఎత్తు ఎప్పుడూ కూడా 45 అడుగులు ఉంటుంది. మొత్తం 16 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న పసుపు రంగం వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. 763 భాగాలతో బలరాముడి రథం తయారు చేస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. ఈ రథం ఎత్తు 44 అడుగులు. మొత్తం 14 రథ చక్రాలు ఉంటాయి. దీనికి ఎర్రటి చారలు ఉన్న నీలి రంగు వస్ర్తంతో దీనిని అలంకరిస్తారు.

250 అడుగుల తాళ్లు

250 అడుగుల తాళ్లు

P.C: You Tube

593 భాగాలతో సుభద్ర రథాన్ని తయారు చేస్తారు. సుభద్రదేవి రథాన్ని పధ్మధ్వజం అని అంటారు. ఇది 43 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం 12 రథ చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న నలుపు వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ఉండే తాళ్లను కడుతారు.

నేత్రోత్సవంతో ప్రారంభమయ్యి

నేత్రోత్సవంతో ప్రారంభమయ్యి

P.C: You Tube


జగన్నాథుడి రథోత్సవం నేత్రోత్సవంతో ప్రారంభమై రసగుల్ల ఉత్సవంతో ముగుస్తుంది. ఈ ఏడాది నేత్రోత్సవం శుక్రవారం అంటే జులై 04న ప్రారంభమయ్యి రసగుల్ల ఉత్సవంతో జులై 15న ముగుస్తుంది. కాగా నేత్రోత్సవం తర్వాతి రోజున అంటే శనివారం రథోత్సవం గర్భగుడి దగ్గర నుంచి గుడిచా వద్దకు బయలు దేరుతుంది. తొమ్మది రోజుల పాటు గుడిచా వద్దనే ఉండి అటు పై తిరిగి గర్భగుడికి చేరుకొంటుంది.

రసగుల్లా ఉత్సవంతో ముగుస్తుంది.

రసగుల్లా ఉత్సవంతో ముగుస్తుంది.

P.C: You Tube


మధ్యలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. జులై 18న హీరా పంచమి ఉత్సవం జరుగుతుంది. అటు పై జులై 22న తిరుగు ప్రయాణం మొదలవుతుంది. అదే రోజు రాత్రి గర్భగుడి వద్దకు చేరుకొంటాడు. అటు పై రెండు రోజులూ కూడా ఉత్సవాలు జరుగుతాయి. అందులో ఈనెల 23న జరిగే స్వర్ణాభరణాల వేడుక, జులై 24 న జరిగే అధర పాణా వేడుక జరుగుతుంది. ఇక చివరిగా జులై 25న రసగుల్ల ఉత్సవంతో జగన్నాథుడి రథయాత్ర ముగుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X