Search
  • Follow NativePlanet
Share
» »రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది.

By Beldaru Sajjendrakishore

భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే శ్రీరామనవమి రాబోతోంది.

కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటేకలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా...ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే

మహిళా శాపానికి గురై ఇసుక దిబ్బగా మారిన పుణ్యక్షేత్రం ఇదేమహిళా శాపానికి గురై ఇసుక దిబ్బగా మారిన పుణ్యక్షేత్రం ఇదే

ఇక్కడకు మీరు వెళితే.'శని'...మీ నుంచి దూరంగా వెలుతాడు...ఇక్కడకు మీరు వెళితే.'శని'...మీ నుంచి దూరంగా వెలుతాడు...

ఈ నేపథ్యంలో భద్రాచలంలోని స్వామివారి విగ్రహం నుంచి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాల వరకూ ఉన్న ఆనేక విశేషాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మొదట ఈ భద్రాచలం ఎలా ఏర్పడిందన్న విషయం నుంచి మొదలు పెట్టి ఇక్కడ ఉన్న ప్రత్యేకతలను గురించి ఒకొక్కటిగా తెలుసుకుందాం.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

1. ఇక్కడ భద్రాచలం

భద్రాచలం లేదా శ్రీరామ దివ్యక్షేత్రం తెలంగాణ, ఖమ్మం జిల్లాలో, గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. నిత్యం స్వామివారిని దర్శించుకోవడానికి వేల మంది భక్తులు వస్తుంటారు.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

2.భద్రుడి కోరిక పై

Image source:


పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది. ఇదిలా ఉండగా భద్రగిరి మేరు పర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చిందని కూడా చెబుతారు.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

3. గోల్కొండ నవాబు


Image source:


గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి చింతాకుపతకం, పచ్చలపతకం తో పాటు పలు రకాల నగలు చేయించాడు.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

4. ఆ సొమ్ము విషయమై

Image source:


ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని గోపన్న రాముణ్ణి ప్రార్థించాడు. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

5. నాలుగు చేతులు

Image source:

వైకుంఠ రాముడు శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది. భద్రుని కోరికమేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్షనమివ్వటంవల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

6. సీతమ్మవారు ఇలా

Image source:


సీతమ్మవారు ఇతర దేవాలయములలో సీతమ్మవారు రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనయై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

7. అశేష ప్రజానీకం


Image source:

ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. సీతారామ కళ్యాణ ఉత్సవం ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

8. వైకుంఠ ఏకాదశి


Image source:

వైకుంఠ ఏకాదశి పర్వదినం వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనమివ్వటంవల్ల వైకుంఠఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారదర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్దిచెందింది. నిత్యపూజలు తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుచే తీసుకురాబదడిన ఆరు వంశాలకు చెందిన శ్రీవైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికి భద్రాచలంలో నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. రామానుజులవారిచే శ్రీరంగంలో నిర్ణయించబడిన విధంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తున్నారు.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

9. పర్ణశాల


Image source:


పర్ణశాల ఇది భద్రాచలంనుండి 35 కి.మీ. దూరంలో ఉన్నది. సీతారామలక్ష్మణులు తమ వనవాస వనవాసం సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర, శిల్ప రూపాలలో ప్రదర్శింపబడుతున్నాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడిరూపంలో వచ్చిన మారీచుని బొమ్మ. పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మవాగువద్ద సీత ఆరవేసిన చీర గుర్తులనీ, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్ళనీ కొన్ని చిహ్నాలను చూపిస్తారు. నదికి ఆవలివైపుని రావణుని రథపు జాడలని కొన్ని గుర్తులను చూపిస్తారు.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

10.సీతమ్మను అపహరించిన ప్రదేశం

Image source:

భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి రావణుడు సీతను అపహరిమంచిన ప్రదేశం ఇది. సీత వియోగాన్ని పొందిన రామచమంద్రుడు శోక మూర్తిగా కనిపిస్తాడు. భద్రాచలంలో ఉన్న రామచమంద్ర మూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు. ఇక జటాయుపాక భద్రాచలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణుని ఎదుర్కొని సీతను రక్షించే యత్నంలో తన ప్రాణాలను ఇచ్చిన స్థలంగా దీనిని చెబుతారు. జటాయువు యొక్క ఒక రెక్క ఇక్కడికి 55 కి.మీ. దూరంలో ఉన్న వి.ఆర్.పురం మండలంలో రెఖపల్లి గ్రామంలో పడిందట.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

11. వేడినీటి బుగ్గలు

Image source:


వేడినీటి బుగ్గలు ఇవి భద్రాచలానికి 5 కి.మీ. దూరంలో ఉన్న వేడినీటి బుగ్గలు. ఇక్కడ నదిఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారట.
దుమ్ముగూడెం ఇక్కడ జరిగిన భీకరయుద్ధంలో రాముడు 14,000 రాక్షసులను హతమార్చాడట. ఆ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉన్నది గనుక దీనిపేరు దుమ్ముగూడెం. ఇక్కడి రాముడిని ఆత్మారాముడంటారు

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

12. యోగ రామ మందిరం

Image source:

శ్రీరామగిరి ఇది గోదావరి దిగువన 55 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన యోగరాముని మందిరం ఉంది. ఇక పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక కొండల శ్రేణి. ఇవి ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ ఆనుకొని ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణము సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

13. చల్లని వాతావరణం


Image source:


ఎండాకాలంలో కూడా పాపికొండల ప్రాంతం చల్లగానే ఉంటుంది. పాపికొండల అడవులు పాపికొండల అడవుల్లో వివిధ రకాల జంతువులు, పక్షులు, విష కీటకాలు ఉంటాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు ఉంటాయి. భధ్రాచలం వద్ద మునివాటం అను ప్రదేశం దగ్గరలో జలపాతం ఉన్నది. ఇక్కడే ఒక శివలింగం సర్పం నీడలో అద్భుతంగా ఉంటుంది. గోదావరి నది పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఆ వాతావరణంకు మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

14. రవాణా ఇలా

Image source:


బస్సు సౌకర్యం భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా అనుసంధానమై వుంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

రాముడి తొడపై సీత కుర్చొన్నట్లు ఉన్న విగ్రహం

15. లాంచీ ప్రయాణం


Image source:


ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి. లాంచీ సౌకర్యం గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X