Search
  • Follow NativePlanet
Share
» »సుల్తాన్ బతేరి - కొండల మధ్యలో పరవశం !

సుల్తాన్ బతేరి - కొండల మధ్యలో పరవశం !

By Mohammad

సుల్తాన్ బతేరి పట్టణాన్ని గతంలో గణపతి వాటం అనేవారు. ఈ చారిత్రక పట్టణం కేరళలోని వయనాడు జిల్లాలో కలదు. ఒక్క రోజు పర్యటన చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం సరైనది. ప్రశాంతమైన ఈ పట్టణం మైసూరు పాలించిన టిప్పు సుల్తాన్ చే దండయాత్ర చేయబడింది. ఇక్కడి జైన టెంపుల్ ని టిప్పు సుల్తాన్ తన బాటరీ గా వాడుకోనటం చేత ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది.

సుల్తాన్ బతేరి కి చారిత్రిక ప్రాధాన్యతే కాదు, అందమైన కొండల సమూహాలతో , పచ్చటి పచ్చిక భూములతో ఈ ప్రదేశం అతి మనోహరంగా ఉంటుంది. వయనాడు జిల్లాలో సుల్తాన్ బతేరి ఒక ప్రధాన పట్టణం మరియు వాణిజ్య కేంద్రం.

సుల్తాన్ బతేరి పచ్చని వరి పంటలు

సుల్తాన్ బతేరి పచ్చని వరి పంటలు

చిత్ర కృప : Nijusby

ప్రకృతి దృశ్యాలు మరియు సుగంధాల కొండలు

సుల్తాన్ బతేరి సుగంధాల తోటలకు ప్రసిద్ధి గాంచింది. పట్టణానికి వెళితే చాలు సుగంధాల వాసనలు అద్భుతంగా వ్యాపించి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉండటం చేత అన్ని కాలాలలోనూ వాతావరణం బాగుంటుంది.

గుహలను చూడటానికి పైకి వెళుతున్న పర్యాటకులు

గుహలను చూడటానికి పైకి వెళుతున్న పర్యాటకులు

చిత్ర కృప : Shareef Taliparamba

ఎడక్కల్ గుహలు

ఎడక్కల్ గుహలు నవీన యుగం నాటివి. ఇవి సుల్తాన్ బతేరి కి సుమారు 12 కి.మీ. దూరంలో కలవు. ఇవి అమ్బుకుతి పర్వతాలపై సుమారు 1000 మీటర్ల ఎత్తున ఉంది. పర్యాటకులను అన్ని కాలాలలో ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ గుహలలో కల చిత్రపు చెక్కడాలు, శిలా శాసనాలు చరిత్రకారులకు మరియు పర్యాటకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

గుహలలో గల చిత్రపు చెక్కడాలు

గుహలలో గల చిత్రపు చెక్కడాలు

చిత్ర కృప : Shekure

పురాతన కాలంలో మానవ స్థావరాలు ఉన్నాయనే దానికి ఈ గుహలు నిదర్శనంగా ఉంటాయి. ఈ గుహల గోడలు వివిధ పురాతన శిలా శాసనాలు, వివిధ జంతువులు, మానవుల చిత్రాలు, పురాతన ఆయుధాలు బొమ్మలు, గుర్తులు కలిగి ఉంటాయి. ఇవన్నీ సుమారు 7000 సంవత్సరాల కిందటివిగా చెపుతారు. ఈ ప్రదేశం ట్రెక్క ర్లకు మరియు ప్రకృతి ప్రియులకు ఆనందం కలిగిస్తుంది. ఉదయమే చేసే ట్రెక్, సందర్శకుల మనసు మరియు శరీరాలను ఉత్సాహపరుస్తుంది.

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి ప్రవేశ మార్గం !

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి ప్రవేశ మార్గం !

చిత్ర కృప : Mrriyad

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి

వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి వయనాడ్ పీఠభూమి ప్రాంతంలో కలదు. కేరళలో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. ఇది రెండవ స్థానాన్ని పొందగా, దక్షిణ భారత దేశంలోని శాంక్చురీలలో ఇది ప్రసిద్ధి గాంచిన వాటిలో ఒకటి. ప్రతి సంవత్సరం దీనికి వేలాది పర్యాటకులు వస్తారు.

వయనాడ్ శాంక్చురిలో కెమెరాకు చిక్కిన ఏనుగు

వయనాడ్ శాంక్చురిలో కెమెరాకు చిక్కిన ఏనుగు

చిత్ర కృప : Nagesh Jayaraman

జింకలు, ఏనుగులు, ఇండియన్ బైసన్, పులి, చిరుత మరియు అనేక పక్షులని కూడా చూడవచ్చు. వాతావరణం చాలా ప్రశాంతంగా వుంటుంది. ఈ శాంక్చురి ఎంతో పచ్చటి మరియు అందమైన పరిసరాలను కలిగి ఉంది. టేకు చెట్లు అధికంగా కలవు. పిల్లలతో పర్యటించే టపుడు , మీరు తప్పక ఈ ప్రదేశాన్ని చూసి ఆనందించాలి. ఈ సాన్క్చురి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో హెరిటేజ్ కమిట్టీ చే గుర్తించబడింది.

వయనాడు వసతికై అనువైనది/ సూచించదగినది. ఇది సుల్తాన్ బతేరి నుండి 41 కి. మీ ల దూరంలో కలదు. పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి వరకు అన్ని రకాల గదులు లభిస్తాయి.

వయనాడు హోటళ్ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి : వయనాడు లో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు !

రోడ్డుకిరువైపులా సుగుంధ తోటలు

రోడ్డుకిరువైపులా సుగుంధ తోటలు

చిత్ర కృప : Menas Ahmed

సుల్తాన్ బతేరి ఎలా చేరుకోవాలి ?

విమాన ప్రయాణం

కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 100 కి.మీ. ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం నుండి దేశ విదేశాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి ప్రయాణీకులు సుల్తాన్ బతేరికి టాక్సీ లలో చేరవచ్చు.

రైలు ప్రయాణం

సుల్తాన్ బతేరి కి రైల్వే స్టేషన్ లేదు. దీనికి 110 కి.మీ. దూరంలో కోజికోడ్ రైలు స్టేషన్ కలదు. మైసూరు మరియు బెంగుళూరు లు కూడా ఈ ప్రదేశానికి సమీపమే. ఈ రైలు స్టేషన్ లు నుండి సుల్తాన్ బతేరి కి రోడ్డు మార్గంలో చేరవచ్చు.

రోడ్డు/ బస్సు మార్గం

మైసూరు, బెంగుళూరు, కాలికాట్ ల నుండి సుల్తాన్ బతేరి కి మంచి రోడ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలవి తరచుగా ఈ పట్టణానికి చేరుకుంటాయి. ఊటీ, కోయంబత్తూర్, మంగళూరు, కన్నూర్ మరియు కాసర్గోడు నుండి సుల్తాన్ బతేరికి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X