Search
  • Follow NativePlanet
Share
» »సమ్మర్ హాలిడేస్ లో మన ఇండియాలో ఇక్కడ చల్లగా విహరిద్దామా..

సమ్మర్ హాలిడేస్ లో మన ఇండియాలో ఇక్కడ చల్లగా విహరిద్దామా..

సమ్మర్‌ వచ్చిందంటే చాలు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడతారు. కొందరు తమ సొంత ఊర్లకు వెళ్లడానికి ఇష్టపడితే, మరికొంత మంది పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తారు . అయితే, ఎక్కువగా సెలవులను బాగా ఎంజాయ్‌ చేయడానికి రకరకాల పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు. వేసవిలో మండే ఎండలను తప్పించుకునేందుకు, హాయిగా సేదదీరేందుకు కూల్‌ టూరిజంను ఎంచుకుంటున్నారు.

యువతతో పాటు కొన్ని కుటుంబాలు కొన్నేళ్లుగా హిల్స్ స్టేషన్స్ కు వెళ్లి సమ్మర్ టూర్ ను ఎంజాయ్ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సారి నగరవాసులు అరవైశాతం హిల్స్ స్టేషన్స్ వెళ్లేందుకు ఇప్పటికే హోటల్స్, ప్లైట్ టికెట్ లు బుక్ చేసుకున్నారు. దేశంలో దాదాపు పాతిక హిల్స్ స్టేషన్ టూరిజం స్థలాలు ఉన్నా..అందులో పదిహేనింటికి వెళ్లడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. మన ఈ పదిహేను హిల్ స్టేషన్లు పరిశీలిస్తే వరస క్రమంలో ఉంటున్నాయి. సిమ్లా, మనాలీ, మున్నార్, డార్జిలింగ్, ఊటీ, నైనిటాల్, కొడైకెనాల్, మాథెరన్, ముస్సోరీ, శ్రీనగర్ లు వరుస క్రమంలో ఉంటున్నాయి. ఈ హిల్ స్టేషన్స్ లో వేసవిలో కూడా రోజంతా చల్లగా ఉండి, మంచు కురుస్తూ పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉంటాయి.

హిల్ స్టేషన్ లకు టూర్ వెళ్లేందుకు ఏప్రిల్ నుండి జూన్ వరకు సీజన్ కావడంతో నగరవాసులు ఇప్పటి నుండే హిల్స్ స్టేషన్ల లిస్ట్ తీసి ఎక్కడికి వెళ్లాలి, ఎన్ని రోజులు వెళ్లాలి అని ప్లాన్లు వేసుకుంటున్నారు. మరి ఈ సమ్మర్ సీజన్లో టూర్ ఎంజాయ్ చేయాలంటే ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలో ఒకసారి తెలుసుకుందాం...

సిమ్లా:

సిమ్లా:

హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని అయిన సిమ్లా ఆంగ్లేయుల కాలంలో వేసవి రాజధానిగా కొనసాగింది. ఇక్క డ అతిపురాతన భవనాలు, దేవాలయాలు, చర్చిలు బాగా ప్రాచుర్యం పొందాయి. చారిత్రక రైల్వేస్టేషన్‌ కూడ ఇక్కడ ఉంది. ఇక్కడ బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన కాలనీలు, పార్కులును చూడటానికి జనం ఆసక్తి కనబరుస్తారు.

లడఖ్:

లడఖ్:

త్రిల్లింగ్ కోరుకునే సందర్శకులు లడఖ్ వంటి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ ప్రకృతి, పర్వత సముదాయాలు, సెలయేళ్ళు, చెరువులు , పచ్చికలు పర్యాటకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. జమ్ముకాశ్మీర్ నుండి 700కిలోమీటర్ల దూరంలో లడఖ్ ఉంది. జమ్ముకాశ్మీర్ లో జన్ వ్యాలీ, పాంగాంగ్ లేక్, కర్డంగ్ లా పాస్, స్పిటక్ గోంపా, హెమిస్ నేషనల్ పార్క్ వంటివి ఉన్నాయి.

శ్రీనగర్‌:

శ్రీనగర్‌:

దేశంలో ఒకప్పుడు అత్యంత ఫేమస్‌ హిల్‌ స్టేషన్‌ పర్యాటక కేంద్రం శ్రీ నగర్‌ అయితే, నేడు శాంతి భద్రతల కారణంగా పర్యటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి శ్రీనగర్ వేసవి రాజధాని. కశ్మీర్ పర్యాటనకు వచ్చేవారు తప్పకుండా శ్రీనగర్‌కు రావాల్సిందే. ఎందుకంటే అది 'భూలోక స్వర్గం' కాబట్టి. షికార రైడ్స్ (పడవ ప్రయాణం), అందమైన గార్డెన్లు, ఇలా ఎన్నో అందాలు మంత్ర ముగ్దుల్ని చేస్తాయి.

ముస్సోరీ:

ముస్సోరీ:

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రం ఇది. ఉత్తర భారతీయలులు వీకెండ్‌ విడిదిగా ముస్సోరీని వాడుతారని చెబుతారు. కేబుల్‌ కార్‌, గన్స్‌, వాటర్‌ ఫాల్స్‌, హార్స్‌ రైడింగ్‌తో పాటు హిమాలయాలను అత్యంత దగ్గరగా చూడవచ్చును.

 మహాబలేశ్వర్:

మహాబలేశ్వర్:

మహాబలేశ్వర్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడి పర్వత పంక్తులు ‘కృష్ణా' నదికి జన్మస్థానం. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1372 మీటర్లు ఎత్తులో ఉంటుంది. ఇక్కడి జలపాతాలు, నదుల ప్రవాహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మాథెరన్‌:

మాథెరన్‌:

మహారాష్ట్రలో ఉంది ఈ పర్యటకు ప్రాంతం. ముంబాయికి దగ్గర్లో ఉంటుంది. ఇక్కడ వాహనాలతో పాటు సైకిల్‌ కూడ నిషేధం. నో వాయిస్‌, నో పొల్యుషన్‌ నిబంధనలు కచ్చితంగా పాటిస్తుంటారు. వాటింగ్‌, ట్రెకింగ్‌, హార్స్‌ రైడింగ్‌ ఇక్కడ ఫేమస్‌.

నైనిటాల్‌:

నైనిటాల్‌:

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నైనిటాల్‌ హిల్‌స్టేషన్‌ ఉంది. ఉత్తరాఖండ్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. నైనిలేక్‌, మార్కెట్‌ కేంద్రాలు, అందమైన లాన్స్‌తో పాటు అత్యంత కూల్‌గా ఉండే అడవి అందులోని జంతువులను అధికంగా తిలకిస్తుంటారు.నైనిటాల్ సముద్రమట్టం నుంచి దాదాపు 1938 మీటర్ల ఎత్తులో ఉంది. చాలా చల్లని ప్రదేశం. ఇక్కడి పర్వత శ్రేణులు, సహజ చెరువులు పర్యాటకులకు మంచి వినోదాన్నిస్తాయి.

కొడయికెనాల్‌:

కొడయికెనాల్‌:

కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. పలానీ హిల్స్‌ అని కూడ పిలుస్తుంటారు.ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా దీనికి 'పర్వత యువరాణి' అని పిలుస్తారు. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమి పైన ఉన్న ఈ పట్టణం తమిళనాడులోని ది౦డుగల్ జిల్లాలో ఉంది. ఇక్కడ రకరకాల పూల తోటలు, లోయలు, గార్డెన్స్‌ బోటింగ్‌, వాటర్‌ ఫాల్స్‌ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇక్కడ రకరకాల సుగంధ ద్రవ్యాల నూనెలు అమ్ముతుంటారు.

ఊటీ:

ఊటీ:

తమిళనాడు రాష్ట్రంలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం 'ఊటీ'. దీనిని 'ఉదకమండలం' అనికూడా పిలుస్తారు. ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లోని నీలగిరి జిల్లాలో ఒక భాగం. దక్షణ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించిన బ్రిటిషర్లు ఊటీని సమ్మర్‌ హెడ్‌క్వార్టర్స్‌గా వాడుకున్నారు. 19వ సెంచరీ నుంచి ఇక్కడికి పర్యటకులు వస్తున్నారట. ఇక 22 హెక్టార్‌లలో ప్రభుత్వ బోటానికల్‌ గార్డెన్‌ పార్కు ఇక్కడ అత్యంత ప్రముఖమైనది. టీ తోటలు, పాయకార వాటర్‌ఫాల్స్‌, మధుగలై అడవి ప్రాంతం ప్రత్యేకమైనవి.దొడబెట్ట శిఖరం, ఊటీ లేక్, ఎమరాల్డ్ లేక్, ట్రైబల్ హట్స్, డీర్ పార్క్, అప్పర్ భవానీ లేక్, అవలంచె లేక్, జలపాతాలును చూసి ఆనందించవచ్చు

కూర్గ్ :

కూర్గ్ :

'కూర్గ్' అనేది కర్నాటకలోని ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది పడమటి కనుమల మల్నాడు ప్రాంతంలో కర్నాటకలోని నైరుతి ప్రాంతంలో కలదు. ఈ ప్రాంతం ప్రధానంగా పర్వతమయం. సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల నుండి 1715 మీ.ల ఎత్తువరకు ఉంటుంది. కూర్గ్‌ను 'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా'గా పిలుస్తుంటారు. కర్నాటక 'కాశ్మీర్' అని కూడా అంటారు. నిత్యం పచ్చగా ఉండే అడవులు, లోయలు, మంచుపడే కొండ ప్రాంతాలు, విస్తారించిన కాఫీ తోటలు, టీ ఎస్టేట్లు, నారింజ తోటలు, ఎత్తైన శిఖరాలు వేగంగా ప్రవహించే జలపాతాలు పర్యాటకుల మనసును దోచుకుంటాయి.

మున్నార్‌:

మున్నార్‌:

కేరళ రాష్ట్రంలోని పేరొందిన హిల్‌ స్టేషన్‌ ఇది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. టీ గార్డెన్స్‌ ఇక్కడ ప్రత్యేకత. కుందాల లేక్, ఎకోపాయింట్, ఎలిఫెంట్ లేక్, అనముడి కొండలు, టాటా టీ మ్యూజియం, చిత్రపురం, దేవీకులం, చిన్నకనాల్ , చెరువులు, కొండ ప్రాంతాలతో పాటు ఎరివికులం జాతీయ పార్కును చూడవచ్చు.పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. మున్నార్ అంటే మూడు నదులు అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశం మూడు నదులు కలిసే ప్రదేశంలో కలదు.

మనాలీ:

మనాలీ:

హిమాచల్‌ప్రదేశ్‌లోని మరో హిల్‌ స్టేషన్‌ ఇది. బ్యాక్‌డ్రాప్‌ ఆఫ్‌ హిమాలయాస్‌ అని కూడ అంటారు. కొత్తగా వివాహమైన దంపతులకు హిమాచల్‌ప్రదేశ్‌లోని 'మనాలీ' మంచి హనీమూన్ ప్రదేశం. వీరికే కాకుండా.. సాహసాలు చేసేవారికి, భక్తులకు కూడా ఇది అనువైన ప్రాంతం. కూల్‌ఫారెస్ట్‌, రకరకాల టన్నెల్స్‌, బ్లైండ్‌ టన్నెల్స్‌ ఇక్కడ ఫేమస్‌.

డార్జిలింగ్‌:

డార్జిలింగ్‌:

పశ్చిమ్ బంగా రాష్ట్రంలోనూ చూడచక్కని వేసవి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ‘డార్జిలింగ్’ ఇక్కడ ప్రధాన పర్యాటక ప్రాంతంగా రాణిస్తోంది. ఇక్కడా టీ గార్డెన్స్‌ బాగా ఫేమస్‌కంచన్ జంగా శిఖరం ప్రత్యేక ఆకర్షణలు. వీటితో పాటు అందమైన లోయలు, గ్రామాలు, జూపార్కు బాగా ప్రాచుర్యం పొందాయి. వర్షాలు విరివిగా పడతాయి. కంచన్ జంగా శిఖరం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇది ప్రపంచంలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద పర్వత శిఖరం కావడం విశేషం.

ముస్సోరీ:

ముస్సోరీ:

కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. మున్నార్ అంటే మూడు నదులు అని అర్ధం చెపుతారు. ఈ ప్రదేశం మూడు నదులు కలిసే ప్రదేశంలో కలదు. అవి మధురపుజ్జ, నల్లతాన్ని మరియు కుండలే నదులు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కావటంచేత ఈ హిల్‌స్టేషన్ కేరళ రాష్ట్రానికి ప్రపంచం వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. దేశ విదేశాలనుండి లక్షలాది పర్యాటకులు మరియు పిక్నిక్ లు కోరేవారు అద్భుతమైన ఈ ప్రాంతానికి వచ్చి తనివితీరా విశ్రాంతి పొందుతారు, ఆనందిస్తారు.

వయనాడ్

వయనాడ్

ఒకసారి వయనాడ్ వెళ్ళిన వారు మరోమారు వయనాడ్ వెళ్లి తీరాల్సిందే. దాని అందాలు, ప్రశాంత వాతావరణం మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఈ ప్రదేశంలో కల ఆకర్షణలైన బాణాసుర సాగర్ డాం, చేమ్బ్రా పీక్ , ఇతర ప్రదేశాలు చూడాలంటే, కల్పెట్టలో దిగాల్సిందే !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X