Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో ఈ సమ్మర్ లో ‘కూల్’ ‘కూల్’ గా ఆహ్వానం పలుకుతున్న ప్రాంతాలు ఇవే

ఇండియాలో ఈ సమ్మర్ లో ‘కూల్’ ‘కూల్’ గా ఆహ్వానం పలుకుతున్న ప్రాంతాలు ఇవే

వేసవి నేపథ్యంలో భారత దేశంలో చల్లని వాతావరణం కలిగిన పర్యాటక ప్రాంతాలతో కూడిన కథనం

By Beldaru Sajjendrakishore

వేసవి తాపం అప్పుడే మొదలయ్యింది. మరో కొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేస్తున్నరు. దీంతో ఈ వేసవిని ఎలా ఎదుర్కొనాలనే విషయం పై ఇప్పటికే ఇళ్లలో చర్చలు మొదలయ్యి ఉంటాయి. శ్రీమతి ఏమో పుట్టింటికి వెళ్లాలంటే, ఎప్పటిలాగే శ్రీవారేమో లేదు మా సొంతూరు వెళుదాం అంటారు. ఇక పిల్లలేమో ప్రతి ఏడాది ఈ రెండుప్రాంతాల్లో ఏదో ఒక దగ్గరికే వెలుతున్నామంటూ గారాలు పోతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో మూతి విరుపులు, పిల్లల సత్యాగ్రహాలు సాధారమై పోతున్నాయి. ఇందుకు మీ నేటివ్ ప్లానెట్ పరిష్కార మార్గాన్ని తీసుకువచ్చింది. దేశంలో ఈ వేసవికి అత్యంత అనుకూలమైన కొన్ని పర్యాటక ప్రాంతాలను మీ ముందుకు తీసుకువస్తున్నాం. వాటిలో మీకు దగ్గర, అనుకూలమైన వాటిని ఎన్నుకుని ట్రావెల్ బ్యాగ్ ను సర్దుకోండి. అన్నట్టు ఏ ఏ ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లాలన్న విషయం మీ కుటుంబ సభ్యులందరూ ఒక చోట కుర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవడం మాత్రం మరిచిపోవద్దు.

1. లడక్

1. లడక్

Image source

రోకళ్లు పగిలే ఎండలో కూడా చల్లని వాతావరణం ఆస్వాధించాలనుకునే వారకి లడక్ ఉత్తమమైన ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతంలో అటు పచ్చని పర్వత ప్రాంతాలతో పాటు ఇటు స్వచ్ఛతకు మారుపేరైన ఎన్నో సరస్సులు ఉన్నాయి.

2. రెండు మూపురాలు కలిగిన ఒంటే

2. రెండు మూపురాలు కలిగిన ఒంటే

Image source

ఇక జన్ సాకర్ లోయ, పాన్గోయాంగ్ ట్సో సరస్సు, కద్రగ్ లా పాస్, హేమిస్ నేషనల్ పార్క్ తదితర ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి. రెండు మూపురాలు కలిగిన ఒంటెలాంటి జంతువుల పై స్వారి చేయడాన్ని మర్చి పోకండి. లేహ్ లోని ఎయిర్ పోర్ట్ ఇక్కడకు దగ్గరగా ఉంటుంది. అదే విధంగా జమ్ములో రైల్వే స్టేషన్ లడక్ కు దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్.

3.శ్రీనగర్

3.శ్రీనగర్

Image source

చుట్టూ ఎతైన మంచు కొండలు, స్వచ్ఛమైన నీటిని కలిగిన సరస్సులు ప్రక`తిలోని అందాన్నంతటిని తనలోనే అమర్చుకున్న ఈ శ్రీనర్ వేసవికి రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. చలికాలంలో కంటే వేసవి కాలంలో ఇక్కడ విహరించడానికి అనుకూలం. శ్రీనగర్ లోని సరస్సులో బోట్ పడవుల్లో విహరిస్తూ ప్రక`తిని ఆస్వాధింస్తూ జీవిత భాగస్వామితో ఊసులాడటం మాటలకు అందని ఓ అద్భుత కావ్యమనడం అతిశయోక్తి కాదేమో.

4. వీటిని చూడాల్సిందే

4. వీటిని చూడాల్సిందే

Image source

దాల్ లేక్, నిషాంత్ భాగ్, షాలిమర్ భాగ్, జీల్ ఉల్ అబిద్దీన్ సమాధి, జామా మసీదు, హజ్రత్ మసీదు, శంకరాచార్య హిల్స్ తదిర ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి. శ్రీనగర్ కు దేశంలోని వివిధ ప్రాతంల నుంచి విమాన యాన సేవలు ఉన్నాయి. ఉదమ్ పూర్ రైల్వే స్టేషన్ ఇక్కడకు సమీపంగా ఉంటుంది.

5. మనాలి.

5. మనాలి.

Image source

భారత దేశంలో చాలా మందికి మనాలి అత్యంత ప్రియమైన పర్యాటక ప్రాంతంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడకు హనిమూన్ జంటలు ఎక్కువగా వస్తుంటారు. అదే విధంగా వేసవిలో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే వసతికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో అడ్వెంచర్ స్పోర్ట్ కోసం మనాలిని సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కవవుతోంది.

6.సహజ వేడి నీటి బుగ్గలు

6.సహజ వేడి నీటి బుగ్గలు

Image source

మనాలిలో హాదీంబా దేవాలయం, క్లబ్ హౌస్, సోలాంగ్ లోయా, జోగి వాటర్ ఫాల్స్ అర్జున గుహ, వశిష్ట వేడినీటి బుగ్గలు తదితరాలు ఇక్కడ చూడదగినవి. ఇక బున్ తార్ ఎయిర్ పోర్ట్, జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్లు ఇక్కడకు దగ్గరగా ఉంటాయి.

7.నైనిటాల్

7.నైనిటాల్

Image source

సముద్ర మట్టానికి 1,938 అడుగుల ఎత్తులో ఉత్తరఖండ్ లో నైనిటాల్ ఉంది. భారత దేశంలో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే నగరంలో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఉన్నట ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు, లోయలు, సరస్సులు ఇలా ప్రతి ఒకటి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.

8. నైనాదేవి దేవాలయం

8. నైనాదేవి దేవాలయం

Image source

ఇక్కడ రాజ్ భవన్, నైని సరస్సు, బీమ్ థాల్, నైనాదేవి దేవాలయం, నైనిటాల్ జూ తదితర ప్రాంతాలు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. టిప్పన్ టాప్ నుంచి సూర్యోదయాన్ని చూడటానికి ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడకు పాట్ నగర్ ఎయిర్ పోర్ట్ 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే విధంగా నైనిటాల్ కాథ్ గోడం రైల్వేస్టేషన్ ఇక్కడకు 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

9.ముస్సోరి...

9.ముస్సోరి...

Image source

భారత దేశంలో వేసవిలో ఎక్కువ రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో ముస్సోరి కూడా ఒకటి. ఇక్కడ పర్వత ప్రాంత అందాలతో పాటు మేఘాల మధ్య మనం వెలుతున్న అనుభూతిని పొందవచ్చు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇది కొంత ఖరీదైన ప్రాంతమే అని చెప్పవచ్చు.

10 కేబుల్ కార్ లో

10 కేబుల్ కార్ లో

Image source

కెంప్టీ వాటర్ ఫాల్స్, లాందూర్ క్లాక్ టవర్, జ్వాలా జీ టెంపుల్, రాజాజి నేషనల్ పార్క్, గన్ హిల్స్, జార్జ్ ఎవరెస్ట్ హౌస్ తదితర ప్రాంతాలు చూడదగినవి. గన్ హిల్స్ కు రోప్ వే ద్వారా వెళ్లడం మరిచిపోలేని ఘటన అవుతుందనడంలో సందేహం లేదు. ఇక డెహరాడూన్ లోని జూలి గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 54 కిలోమీటర్ల దూరంలో ఉండగా డెహరడూన్ రైల్వే స్టేషన్ 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

11. మున్నార్

11. మున్నార్

Image source

దక్షిణ భారత దేశంలో వేసవి పర్యాటక ప్రాంతాల జాబితాలో మున్నార్ మొదటి స్థానంలో ఉంటుంది. కేరళాలోని ఈ పర్యాటక ప్రాంతం టీ తోటలకు కూడా ప్రసిద్ధి చెందినది. పర్వత శిఖాల పైకి వెళ్లి అక్క పచ్చటి అందాలను చూడాలనుకునే వారికి మున్నార్ మరిచిపోలేని అనుభూతిని మిగిలుస్తుందనడంలో సందేహం లేదు.

12. ఎలిఫెంట్ సఫారి

12. ఎలిఫెంట్ సఫారి

Image source

ఇక మున్నార్ లో ఎగో పాయింట్, ఎలిఫెంట్ సరస్సు, అన్నాముడి పర్వత శిఖరం, టాటా టీ మ్యూజియం, చిత్తిరాపురం, దేవి కులం, చిన్నకన్నల్ తదితర ప్రాంతాలు ఇక్కడ చూడదగిన ప్రాంతాలు. ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ చాలా ప్రాచుర్యం పొందింది. కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ మున్నార్ కు 125 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆలువా రైల్వే స్టేషన్ 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

13. కొడైకనాల్

13. కొడైకనాల్

Image source

తమిళనాడులోని కొడైకెనాల్ దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రాజాదరణ పొందిన పర్యాటక ప్రాంతం. ఇక్కడ పర్వత శిఖరాలు మొదలు కొని లోయలు, జలపాతాలు మొదలుకొని సరస్సల వరకూ ప్రతి ఒక్కటి చూడటానికి ఎంతో అనువైన ప్రదేశాలు.

14. డాల్ఫినోస్ రాక్

14. డాల్ఫినోస్ రాక్

Image source

కొడైకెనాల్ సరస్సు, పిల్లర్ రాక్, డాల్ఫినోస్ రాక్, నేషనల్ మ్యూజియం, షోలా వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడదగిన ప్రేదేశాలు. ఇక్కడకు మధురై ఎయిర్ పోర్ట్, 120 కిలోమీటర్ల దూరంలో ఉండగా పళణి రైల్వే స్టేషన్ 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

15. ఊటి

15. ఊటి

Image source

తమిళనాడులోని పర్యాటక ప్రాంతంలో ఊటి మొదటి స్థానంలో ఉంటుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. కొయంబత్తూర్ ఎయిర్ పోర్ట్ ఇక్కడకు 105 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.

16. ట్రాయ్ ట్రెయిన్ ప్రయాణం

16. ట్రాయ్ ట్రెయిన్ ప్రయాణం

Image source

దూద్ బెట్ట పార్క్, ఊటి లేక్, ఎమరాల్డ్ లేక్, డీర్ పార్క్, భవానీ లేక్, సెయింట్ జోసఫ్ చర్చ్, కాల్ హట్టి వాటర్ ఫాల్స్, తదితర ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి. ముఖ్యంగా నీలగిరి టాయ్ ట్రైన్ లో ప్రయాణంతో మనం చిన్నతనపు ఆటల్లోకి వెళ్లిపోతాం. మైసూరుకు 128 కిలోమీటర్లు, తమిళనాడులోని కొయంబత్తూర్ కు 86 కిలోమీటర్ల దూరంలోని ఊటికి దేశం మొత్తం నుంచి రవాణా సదుపాయం బాగా ఉంది.

17. కూర్గ్

17. కూర్గ్

Image source

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో అత్యంత ప్రజాధరణ పొందిన పర్యాటక ప్రాంతంలో కూర్గ్ మొదటి స్థానంలో ఉంటుంది. పశ్చిమ కనుమల్లోని ఈ పర్వత ప్రాంతంలో వేసవిలో కూడా కనుచూపు మేర పచ్చదనం కనిసిస్తుంది. ఇక హనుమూన్ జంటలకు కూడా కూర్గ్ రా రామ్మని ఆహ్వనం పలుకుతోంది.

18.వాటర్ ఫాల్స్ హోయలు

18.వాటర్ ఫాల్స్ హోయలు

Image source

అబ్బే ఫాల్స్, బారాపోల్ నది, బ్రహ్మగిరి పర్వత శిఖిరం, ఇరుప్పు వాటర్ ఫాల్స్, నాగర్ హోల్ నేషనల్ పార్క్ ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. ఇక్కడకు బెంగళూరు 220 కిలోమీటర్ల దూరంలో ఉండగా మైసూరు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరుతో పాటు మైసూరుకు విమానయాన సేవలు, రైలు సదుపాయం ఉంది.

19. హార్ల్సీ హిల్స్

19. హార్ల్సీ హిల్స్

Image source

పర్వత పంక్తుల సముదాయం హార్ల్సీ హిల్స్. దీనిని ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఈ పర్వత పర్యాటక ప్రాంతం ఉంది. ఇక్కడ సూర్యోదయాన్ని చూడటానికి చాలా మంది ఈ పర్వత ప్రాంతాలకు చేరుకుంటారు. వేసవిలో చాలా చల్లగా ఉంటుంది.

20. కైగా వాటర్ ఫాల్స్

20. కైగా వాటర్ ఫాల్స్

Image source

మల్లమ్మ టెంపుల్, చెన్నకేశవ దేవాలయం, కైగాల్ ఫాల్స్, తలకొండ వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడదగిన పర్యాటక ప్రాంతాలు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక్కడకు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక మదన పల్లి ఇక్కడకు 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు నగరాల నుంచి బస్సు సౌకర్యం నంది హీల్స్ కు ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X