Search
  • Follow NativePlanet
Share
» »'సుందరమైన' అడవిలో అద్భుత జంతుసంపద !!

'సుందరమైన' అడవిలో అద్భుత జంతుసంపద !!

రోడ్లు, జీపులు. గైడ్ లు అంతా మరచిపోండి. ఈ ప్రాంతానికి వస్తే మీరు చూసేవి నీటిలో తేలియాడే బోటు లు, నిశ్శబ్దం, అనాది కాల అడవులు. ఈ ప్రదేశంలో ఎటు నుండి ఆపద ముంచుకు వస్తుందో ఎవరికీ తెలియదు. నీటి లోపల ఏ జంతువు ఉన్నదో తెలియదు, పాము లేదా మొసలి ఏదైనా ఉండవచ్చు. అడవిలో తిరుగాడాలంటే, పులులు తారసపడవచ్చు. చుట్టూ అంతా పచ్చటి అడవి. భరించలేని నిశ్శబ్దంలో వినబడే నీటి గల గలలు బోటు శబ్దాలు, పక్షుల కూతలు. ఇవి అన్నీ మిమ్ములను పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ వనాలకు స్వాగతిస్తాయి.

సుందర్బన్స్ ప్రదేశం గంగా నది ముఖద్వారం వద్ద కలదు. ఈ ప్రదేశం మొత్తంగా 54 చిన్న ద్వీపాలు ఇవి గంగానది ఉప నదుల మధ్య ఏర్పడ్డ చిన్న చిన్న భూ భాగాలు.

 సముద్రపు అడవులు

సముద్రపు అడవులు

దట్టమైన ఈ సముద్రపు అడవులు సైంటిఫిక్ మేనేజ్ మెంట్ కిందకు తెచ్చిన అడవులలో ప్రపంచంలోనే మొట్ట మొదటి అడవులు.

సుందర వనాలు

సుందర వనాలు

సుందర్బన్ అనే పదం సుందరమైన చెట్ల నుండి వచ్చింది. ఈ చెట్లు సముద్రపు ఒడ్డున కల మట్టిలో కూరుకు పోయి వేళ్ళు పాతుకు పోయి పెరుగుతాయి. ఈ సుందర్బన్స్ ప్రదేశం ఇండియా లోని అయిదు సహజ ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి.
Pic credit: Frances Voon

రాజస జంతువు

రాజస జంతువు

బెంగాల్ పులులలో రాచ ఠీవి ఉట్టిపడుతూ వుంటుంది. మీ అదృష్టం బాగుంటే, ఈ హుందా అయిన పులిని దాని సహజ నివాస ప్రదేశం అయిన అడవిలో చూడవచ్చు. ఒక పులిని దాని సహజ పరిసరాలలో చూపాలనే ఉద్దేశ్యం తో అక్కడ అక్కడా టవర్లు పెట్టారు. సుందర్బన్స్ అరన్యాలలోని ఆపదలు ఎలా వస్తాయో తెలుపటానికి ఒక ఉదాహరణగా ఈ టవర్లు పెట్టారు. ఈ టవర్లు పైకి చేరాలంటే, రక్షిత ఫెన్సింగ్ కారిడార్ గుండా నడిచి చేరాలి.
Pic credit: Shutterstock

పట్టు వదలని మొసళ్ళు

పట్టు వదలని మొసళ్ళు

సుందర్బన్స్ లో రాయల్ బెంగాల్ టైగర్ తో పాటు మీరు భయంకరమైన మొసళ్ళు కూడా చూడవచ్చు. మోసళ్ళు మాత్రమే కాక ఇక్కడ మీకు యాక్సిస్ డీర్ , వైల్డ్ బోర్ మరియు రీసస్ మంకీ లు కూడా కనపడతాయి.

Pic credit: Marufish

కిల కిల లాడే పక్షులు

కిల కిల లాడే పక్షులు

ఈ అడవులలో పక్షుల కిల కిల ధ్వనులు సాధారణం. వైట్ బెల్ల్య్ సి గ్రద్దలు, కింగ్ ఫిషర్ పక్షి, సాంద్ పైపర్ లు వంటి వాటిని చెట్ల మీద, ఆకాశంలో ఎగరటం చూసి ఆనందించవచ్చు.
Pic credit: sayamindu

ప్రకృతి - మనిషి

ప్రకృతి - మనిషి

ఇక్కడి గ్రామాల ప్రజలు నిరంతరం ప్రకృతి తో పోరాటం సాగిస్తూనే వుంటారు. అడవుల మధ్య నివసిస్తూ ఉండటంతో, అటవీ దేవుళ్ళ ను, దేవతలను పూజిస్తారు. ఈ సుందర్బన్ ప్రదేశ అది దేవత వన బీబీ, మరి కొన్ని ఇతర దేవతలు కూడా కలరు. వీరంతా అక్కడి గ్రామాల ప్రజలను హిందువులను, ముస్లిం లను ఒకే రకంగా వారు అడవిలోకి కలప, హనీ లేదా ఫిష్ కొరకు వెళ్లి పుడు సంరక్షిస్తారని నమ్ముతారు.

వన బీబీ కటాక్షం

వన బీబీ కటాక్షం

ఇక్కడ కల ఒక పురాతన థియేటర్ లో డ్రామాలు జరుగుతాయి. వాటిలో ఈ దేవుళ్ళ గురించి వారు ఏ రకంగా అక్కడి ప్రజలను, అటవీ సంపదను పరి రక్షించి ఇరువురి మధ్య బాలన్స్ ఎట్లా కాపాడు తున్నారనేది తెలియ చేస్తారు.
Pic Credit: sayamindu

బోటు విహారం

బోటు విహారం

సుందర్బన్స్ సందర్శనకు బోటు విహారం అనుకూలం. ఇక్కడ సంచరిన్చటా నికి ఏ ఇతర వాహనాలు వుండవు. సుందర్బన్స్ లో మూడు వన్య జంతువుల అభయ అరణ్యాలు కలవు. ఒకటి సజనేఖలి లోని నేషనల్ పార్క్ లోనే కలదు.
Pic Credit: Shutterstock

సుందర్బన్ కు ట్రైన్ లో ఎలా చేరాలి ?

సుందర్బన్ కు ట్రైన్ లో ఎలా చేరాలి ?

కోల్కతా లోని సీల్దా స్టేషన్ నుండి కేనింగ్ కు రెండు గంటల ప్రయాణం. అక్కడ నుండి సజ్ నేఖలి కు బోటు లో అయిదు గంటల ప్రయాణం. లేదా రోడ్డు ప్రయాణంలో గోసాబా చేరి అక్కడ న్లుంది బోటు బార్గంలో గోద్ఖలి పోర్ట్ నుండి వెళ్ళాలి. బోటు లు గైడ్ లు విహారాలకు గాను అందుబాటులో వుంటారు. సజనేఖలి నుండి ఈ అటవీ ప్రాంతాలు చూడవచ్చు.

Pic credit: sayamindu

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X