Search
  • Follow NativePlanet
Share
» »ఆ పరమేశ్వరుడిని ఇక్కడ సుందరేశ్వరుడి రూపంలో పూజిస్తారు

ఆ పరమేశ్వరుడిని ఇక్కడ సుందరేశ్వరుడి రూపంలో పూజిస్తారు

కన్నూర్ .. కేరళ రాష్ట్రంలో ఉత్తర దిక్కున గల జిల్లా. అరేబియా సముద్రంతో సరిహద్దు పంచుకుంటున్న కన్నూర్ విశిష్ట వారసత్వానికి, సంస్కృతి - సంప్రదాయాలకు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతం జానపద కళలకి, వస్త్రాల తయారీ కి పుట్టినిల్లు.

ప్రసిద్దపుణ్య క్షేత్రం సుందరేశ్వర ఆలయం కన్నూర్ పట్టణానికి కేవలం 2కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మహాశివుడు, సుందరేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్నాడు. 1916లో కేరళలోని ఆధ్యాత్మిక గురు సంఘసంస్కర్త అయిన శ్రీ నారాయణ గురుచే ఈ ఆలయం నిర్మించబడినది. శ్రీ నారాయణ గురుచే నిర్మింపబడ్డ నాలుగు ఆలయంలో సుందరేశ్వర్వ ఆలయం చాలా ప్రత్యేకం.

 సౌందర్యానికి దేవుడు

సౌందర్యానికి దేవుడు

సుందరేశ్వర ఆలయంలో కొలువైనా ఆ మహా శివుడు సౌందర్యానికి దేవునిగా కూడా ప్రసిద్ది. దక్షిణ భారత దేశంలో ఉన్న ఆలయాలకు భిన్నంగా కులమతాలకు అతీతంగా ఈ ఆలయాన్ని ఎవరైనా సందర్శించవచ్చు.

ఏప్రిల్ -మే నెలల మధ్యలో ఉత్సవాలు

ఏప్రిల్ -మే నెలల మధ్యలో ఉత్సవాలు

ఏప్రిల్ -మే నెలల మధ్యలో ఉత్సవాలు సుమారు 8రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు వేడుకలలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచా ఉత్సవాలు, ఊరేగింపులు వంటివి ఇక్కడ జరుగుతాయి. సంవత్సరం పొడవునా ఈ ఆలయాన్ని పర్యాటకులు సందర్శించవచ్చు. అయితే పండగలు, ఉత్సవాలలో పాల్గొనాలనుకుంటే మాత్రం ఎండాకాలంలో ఈ ఆలయాన్ని సందర్శించాలి.

సమీపంలో చూడవల్సిన ఇతర దేవాలయాలు:

సమీపంలో చూడవల్సిన ఇతర దేవాలయాలు:

శ్రీ మావిలయిక్కవు ఆలయం 15కి.మీ ,శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం, శ్రీ రాఘవాపురం ఆలయం -35కిమీ పల్లిక్కున్ను మూకాంబికా ఆలయం 3కి.మీ , ఊర్పజ్హస్సికావు టెంపుల్, కిజ్హక్కేకర ఆలయం 7కి.మీ.

శ్రీ మావిలయిక్కవు ఆలయం

శ్రీ మావిలయిక్కవు ఆలయం

ప్రత్యేకమైన ఆచారాలకు, సాంస్కృతిక ప్రదర్శన లకు ప్రసిద్ధి శ్రీ మావిలయిక్కవు ఆలయం. కన్నూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో కన్నూర్ - కులతుపుజ్హ మార్గంలోని మావిలయి గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయంలో వినాయకుడు, భగవతి దేవి, దైవత్తర్ స్వామి, వేత్త కరుమన్కన్ స్వామి వారు కొలువై ఉంటారు.
చిత్ర కృప : Siddhartha Tippireddy

శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం

శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం

పయ్యన్నుర్ లోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం కన్నూర్ లో ప్రఖ్యాతి గాంచినది మరియు ఇతిహాసాలకు సంబంధించినది. పర్యాటకులని మరియు భక్తులని ఆకర్షించడంలో ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రముఖమైనది. ఆలయంయొక్క గర్భగుడి రెండు అంతస్తులు కలిగి ఏనుగు వెనుకభాగాన్ని పోలి ఉంటుంది.
చిత్ర కృప : Ratheesh

శ్రీ రాఘవాపురం ఆలయం

శ్రీ రాఘవాపురం ఆలయం

కన్నూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేరుతజ్హం అనే చిన్న గ్రామంలో శ్రీ రాఘవాపురం ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 8 వ శతాబ్దానికి చెందినది. ఈ గుడిలో ఉన్న విగ్రహాలని తల మీద పెట్టుకుని ఇక్కడ బ్రాహ్మణ పూజారులు నృత్యం చేస్తారు. ఈ ఆచారాన్ని తిడంబు నృత్యం అని పిలుస్తారు. ఆ విశేష ఘట్టాన్ని తిలకించేందుకు అశేష భక్తులు హాజరవుతారు.
చిత్ర కృప : STV

ముజుప్పిలన్గడ్ బీచ్

ముజుప్పిలన్గడ్ బీచ్

విశ్రాంతికి, ఆహ్లాదానికి అనువైన విస్తరించబడిన ఇసుక తీరంతో ఇక్కడి బీచ్ లు పర్యాటకులు తప్పక చూడాలనుకునే సందర్శన ప్రదేశాలు.

ముజుప్పిలన్గడ్ బీచ్
పర్యాటకులు కన్నూర్ కు 16 కి. మీ. దూరంలో ఉన్న ముజుప్పిలన్గడ్ బీచ్ తీరం పొడవున నడుస్తూ అద్భుతమైన బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు. ఏప్రిల్ లో జరిగే బీచ్ పండుగలో ఈ ప్రాంతం అంతా యువతరంతో సాహస విన్యాసాల ప్రేమికులతో నిండిపోతుంది. చిత్ర కృప : sumila.s

పయ్యమ్బలమ్ బీచ్

పయ్యమ్బలమ్ బీచ్

కన్నూర్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పయ్యమ్బలమ్ బీచ్ లో సూర్యాస్తమ దృశ్యాలను చూడటానికి, విశ్రాంతిని పొందటానికి పర్యాటకులు వస్తుంటారు. తల్లి బిడ్డల అద్భుతమైన శిల్పం ఈ బీచ్ లో మరొక ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : Sibi John

ధర్మదమ్ ఐలాండ్

ధర్మదమ్ ఐలాండ్

ధర్మదమ్ అనే ప్రదేశం నుండి 100 మీటర్ల దూరంలో ఉన్న చిన్న ద్వీపమే ఈ ధర్మదమ్ ఐలాండ్. ఈ ద్వీపం ముజ్హుప్పిలన్గడ్ బీచ్ నుండి కనబడుతూ వీక్షకులను మురిపిస్తుంది. పర్యాటకులు అలల తాకిడి తక్కువగా ఉన్న సమయంలో ఈ బీచ్ నుండి ద్వీపానికి నడిచి వెళ్ళవచ్చు.
చిత్ర కృప : telugu native planet

కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

కన్నూర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం
కన్నూర్ కు 121 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలికాట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గాని, 142 కి. మీ. దూరంలో ఉన్న మంగళూరు విమానాశ్రయంలో కానీ దిగి క్యాబ్ లేదా ట్యాక్సీ ల ను అద్దెకు తీసుకొని కన్నూర్ చేరుకోవచ్చు.
రైలు మార్గం
కన్నూర్ నగరానికి నడిబొడ్డున రైల్వే స్టేషన్ ఉన్నది. బెంగళూరు, తిరువనంతపురం, న్యూఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాలకు ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించవచ్చు. నగరంలో వెళ్ళటానికి ఆటో రిక్షాల సదుపాయం, ట్యాక్సీ మరియు సిటీ బస్సుల సదుపాయం కలదు.
రోడ్డు మార్గం
రోడ్డు మార్గం ద్వారా కన్నూర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా , దేశంలోని ప్రధాన నగరాలకు చక్కగా అనుసంధానమై ఉన్నది. తిరువనంతపురం, తలసెరి, కొచ్చి, కాలికాట్, మున్నార్, మంగళూరు నుండి తరచూ ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.
చిత్ర కృప : Anoopan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X