Search
  • Follow NativePlanet
Share
» » ఏలినాటి శనిని పోగొట్టే సూర్య దేవాలయం సందర్శించారా?

ఏలినాటి శనిని పోగొట్టే సూర్య దేవాలయం సందర్శించారా?

తమిళనాడులోని సూర్యదేవాలయానికి సంబంధించిన కథనం.

తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకు వేర్వేరుగా తొమ్మది దేవాలయాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటే సూర్య దేవాలయం. మిగిలిన అన్ని నవగ్రహ ఆలయాల్లో ప్రధాన దైవం శివుడు కాగా ఈ దేవాలయంలో సూర్యుడే ప్రధాన దైవం. ఇక్కడ సూర్యభగవానుడి వేడిని తగ్గించడానికి నవగ్రహాల్లో ఒకటైన గురుడు ఆ సూర్య భగవానుడికి ఎదురుగా ఉంటారు. అదేవిధంగా శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. రధసప్తమి సమయంలో పదిరోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సూర్య దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. సూర్యభగవానుడికి చక్రపొంగలి నైవేద్యంగా పెడుతారు. అదే చక్రపొంగలిని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం విశిష్టతకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

కలవ మహర్షి

కలవ మహర్షి

P.C: You Tube

పూర్వం కలవ మహర్షి బ్రహ్మ శాపం వల్ల కుష్టురోగంతో బాధపడేవాడు. నారదుడి సూచనమేరకు ఆ కలవ మహర్షి నవగ్రహాలని ప్రార్థించి తన వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. దీంతో బ్రహ్మకు ఆ నవగ్రహాల పై తీవ్ర మైన కోపం వచ్చింది.

శివుడి అనుమతితో

శివుడి అనుమతితో

P.C: You Tube

దీంతో బ్రహ్మ దేవుడు శివుడి అనుమతి తీసుకొని బ్రహ్మ దేవుడు ఆ నవగ్రహాలు ఇక పై భూలోకంలో ఉండాలని అంతేకాకుండా వాటికి వరాలిచ్చే అధికారం ఉండకూడదని పేర్కొంటాడు. ముఖ్యంగా కుష్టు రోగంతో బాధపడాల్సిందిగా శపిస్తాడు.

వెల్లురుక్కవనంలో

వెల్లురుక్కవనంలో

P.C: You Tube
బ్రహ్మ శాపం ప్రకారం నవగ్రహాలు భూమి పై వెల్లురుక్కవనం అంటే తెల్లని అడవి పూలు ఉన్న ప్రాంతంలో వేర్వేరు చోట్ల ఉండిపోవాల్సి వస్తుంది. ఆ వెల్లురుక్కవనం తమిళనాడులోని కుంభకోణం చుట్టు పక్కల ఉంది.

వెయ్యి సంవత్సరాలు

వెయ్యి సంవత్సరాలు

P.C: You Tube

ఇక భూమి పైకి వచ్చిన నవగ్రహాలు శివుడిని ప్రార్థిం కొలువైన దేవాలయంలో ఆ పరమశివుడు ప్రధాన దైవంగా ఉండేలా వరాన్ని పొందుతాయి. ఇలా తమ చెంత ఉన్న ఈశ్వరుడిని వెయ్యి సంవత్సరాల పాటు పూజించి తమ కుష్టురోగాన్ని పోగొట్టుకొంటాయి.

అన్ని చోట్లా పరమశివుడు

అన్ని చోట్లా పరమశివుడు

P.C: You Tube

అంతేకాకుండా తమ వద్దకు వచ్చే వారి ఏలినాటి శనిని కూడా పోగొట్టేలా వరాన్ని కూడా పొందాయి. అందుకే కుంభకోణం చుట్టు పక్కల ఉన్న తొమ్మిది నవ గ్రహాల దేవాలయాల్లో ప్రధాన దైవం శివుడు.

 సూర్యుడు ప్రధాన దైవం

సూర్యుడు ప్రధాన దైవం

P.C: You Tube

అయితే ఒక్క సూర్యుడి దేవాలయంలో మాత్రం పరమశివుడు కాక సూర్యుడు ప్రధాన దైవంగా ఉంటాడు. అందువల్లే ఈ దేవాలయంలో సూర్యుడితో పాడు గురుడిని 12 ఆదివారాలు ఆలయంలోనే ఉండి కొలిస్తే ఏలినాటి శని వదులుతుందని భక్తుల నమ్మకం.

స్థలవాసం

స్థలవాసం

P.C: You Tube

ఆలయంలో భక్తులు ఉండటానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా ఆలయంలోనే ఉండి పూజలు చేయడాన్ని స్థలవాసం అంటారు. ఈ స్థలవాసం చేయడానికి దేశంనలుమూలల నుంచి ఎంతో మంది నిత్యం ఇక్కడకు వస్తుంటారు.

కుళోత్తంగ చోళుడు

కుళోత్తంగ చోళుడు

P.C: You Tube

ఇక ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతమున్న ఆలయాన్ని కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు. అటు పై విజయనగర రాజుల కాలంలో అభివ`ద్ధి చెందింది. ఐదు అంతస్తుల రాజ గోపురం, ఉట్టూ గ్రానైట్ తో నిర్మించిన ప్రహరీగోడ ఉంటుంది.

ఉషా, ఛాయా దేవతలు

ఉషా, ఛాయా దేవతలు

P.C: You Tube

ఇక ఆలయ గర్భగుడిలో మధ్యలో సూర్యభగవానుడు కొలువై ఉండగా అటుపక్కా ఇటు పక్కా ఉషా, ఛాయా దేవతలు ఉంటారు. సూర్యుడు వేడికి చిహ్నం. ఆయన ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది.

నవగ్రహాల్లో ఒకటైన గురువు

నవగ్రహాల్లో ఒకటైన గురువు

P.C: You Tube

ఆ వేడి వాతావరణాన్ని చల్లబరచడానికి అన్నట్లు ఇక గర్భగుడిలోనే సూర్య భగవానుడికి ఎదురుగా నవగ్రహాల్లో ఒకటైన గురువు ఉంటాడు. అందువల్ల సూర్యుడి వేడి కొంత తగ్గి ఉంటుందని భక్తుల నమ్మకం. సూర్యుడి రథాన్ని లాగేది గుర్రాలు.

సూర్యుడి విగ్రహానికి ఎదురుగా గుర్రం

సూర్యుడి విగ్రహానికి ఎదురుగా గుర్రం

P.C: You Tube

అందువల్లే శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. ఆలయంలో సూర్యుడు పటమర ముఖంగా ఉంటాడు. రెండు చేతుల్లో కలువపువ్వులతో ప్రసన్న వదనంతో భక్తులకు సూర్య భగవానుడు దర్శనమిస్తాడు.

రథ సప్తమి రోజు

రథ సప్తమి రోజు

P.C: You Tube

రధసప్తమి సమయంలో పదిరోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సూర్య దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. అదే విధంగా తమిళ నెలల్లో మొదటి రోజున కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. దీనినే మహాభిషేకం అంటారు.

 చక్రపొంగలి నైవేద్యం

చక్రపొంగలి నైవేద్యం

P.C: You Tube

అదేవిధంగా శని, గురువారాలతో పాటు గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారేటప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక సూర్యభగవానుడికి చక్రపొంగలి నైవేద్యంగా పెడుతారు. అదే చక్రపొంగలిని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు.

ఎక్కడ ఉంది

ఎక్కడ ఉంది

P.C: You Tube

కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం ఇక్కడకు అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రానికి దగ్గర్లోనే తిరుమంగళకుడి, కంజనూర్ అనే క్షేత్రాలు కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X