Search
  • Follow NativePlanet
Share
» »ఎపి లో అత్యంత ఎత్తైన గాలిగోపురం మీకు తెలుసా ??

ఎపి లో అత్యంత ఎత్తైన గాలిగోపురం మీకు తెలుసా ??

మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణము ఉన్నది.

By Mohammad

మంగళగిరి గుంటూరు జిల్లాలోని ప్రముఖ పట్టణం మరియు మండల కేంద్రం. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు.

అంతేకాదు, చేనేత కళలకు పుట్టినిల్లు మంగళగిరి మరియు సంప్రదాయ చీరలకు ప్రసిద్ధి చెందినది. ఈ పట్టణంలో సుమారు 500 ఏళ్ళ క్రితం నుంచే చేనేత కళ పుట్టిందని శాశనాలు చెబుతున్నాయి. 1999 లో ఈ కళకు గుర్తింపు లభించింది.

విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !విజయవాడ కు 100KM లోపు పర్యాటక ప్రదేశాలు !

మంగళగిరి ఎలా చేరుకోవాలి ?

మంగళగిరి పానకాల స్వామి గుడి చేరుకోవాలంటే గుంటూరు లేదా విజయవాడ లో దిగాలి. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. మంగళగిరి, విజయవాడ - గుంటూరు జాతీయ రహదారి మార్గంలో ఉన్నది. గుంటూరు, విజయవాడ నుండి నిత్యం బస్సులు తిరుగుతాయి. మంగళగిరి లో కూడా రైల్వే స్టేషన్ కలదు. విజయవాడ నుంచి 15 కి. మీ ల దూరంలో, గుంటూరు నుండి 24 కిలోమీటర్ల దూరంలో, అమరావతి నుండి 38 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి ఉంది.

లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు.

చిత్రకృప : Adityamadhav83

పానకాల స్వామి

పానకాల స్వామి

కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.

చిత్రకృప : Bhaskaranaidu

ప్రత్యేకత

ప్రత్యేకత

మంగళగిరి పానకాలస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదంగా వదిలిపెడతాడుట.

చిత్రకృప : Bhaskaranaidu

విశేషం

విశేషం

స్వామివారికి ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.

చిత్రకృప : Bshankar31

గాలిగోపురం

గాలిగోపురం

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది. 200 ఏళ్ళు పూర్తిచేసుకుంది.

చిత్రకృప : Durgarao Vuddanti

అద్వితీయ నిర్మాణం

అద్వితీయ నిర్మాణం

11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.

చిత్రకృప : Gautam T

వారసత్వ సంపద

వారసత్వ సంపద

దీనిని నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.

చిత్రకృప : Bhaskaranaidu

పానకం

పానకం

పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట.

చిత్రకృప : Bhaskaranaidu

యుగాంతం

యుగాంతం

సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు.

చిత్రకృప : Bhaskaranaidu

శాసన స్తంభం

శాసన స్తంభం

ప్రధాన వీధిలో, రామాలయం వద్ద శాసన స్తంభం వీధి అనే వీధి ఉంది. ఈ వీధిలో ఎనిమిది ముఖాలు కలిగిన ఒక శాసనం ఉంది. ఈ కారణం చేత ఈ వీధికి ఆ పేరు వచ్చింది. ఈ శాసనంలో 46 పంక్తులు తెలుగులోను, 4 పర్షియన్ లోను వ్రాసి ఉన్నాయి.

చిత్రకృప : Han Jun Zeng

పెద్ద కోనేరు

పెద్ద కోనేరు

మంగళగిరి మధ్యలో, అర ఎకరం వైశాల్యంలో కోనేరొకటుంది. దీని పేరు కల్యాణ పుష్కరిణి. చాలా లోతైన ఈ కోనేటికి నాలుగు వైపుల మెట్లు ఉన్నాయి. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన ఈ కోనేటిలో రెండు బావులు ఉన్నట్లుగా చెబుతారు. గుడికి తూర్పున శివలింగం ఉంది. శతాబ్దాలపాటు ప్రజలీ కోనేటి నీటితో దేవునికి అభిషేకం జరిపించారు.

చిత్రకృప : Han Jun Zeng

జయ స్తంభం

జయ స్తంభం

పానకాలస్వామి దేవాలయం (కొండమీది గుడి) మెట్ల మొదట్లో ఈ శాసనం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలచే ఈ శాసనం ప్రతిష్ఠింపబడినదని చెబుతారు. వాస్తవానికి ఇది రాయల మహామంత్రి సాళువ తిమ్మరుసుకు చెందినది. రాయల విజయాన్ని సూచించే ఈ స్తంభాన్ని జయ స్తంభం అన్నారు.

చిత్రకృప : Bhaskaranaidu

మంగళగిరి పట్టణంలోని ఇతర దేవాలయాలు

మంగళగిరి పట్టణంలోని ఇతర దేవాలయాలు

శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంశ్రీ అఖిలాండేశ్వరీ అమ్మవారి ఆలయం, శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం, అంకమ్మ దేవర ఆలయం, శ్రీరామ మందిరం మొదలుగునవి దర్శించవచ్చు.

చిత్రకృప : Adityamadhav83

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X