Search
  • Follow NativePlanet
Share
» »యాగం అగ్ని జ్వాల నుంచి ఉద్భవించిన క్షేత్ర సందర్శనంతో

యాగం అగ్ని జ్వాల నుంచి ఉద్భవించిన క్షేత్ర సందర్శనంతో

నెల్లూరులో తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం గురించి కథనం

ఈ క్షేత్రం ఓ యాగ త్రేతాగ్ని జ్వాలల్లో నుంచి ఉద్భవించింది. అందుకు ఈ క్షేత్ర సందర్శనం మోక్షమార్గానికి తొలిమెట్టుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో మహావిష్ణువు ఈ భూమండలం ఉన్నత వరకూ కొలువై ఉంటాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణం చెబుతోంది. ఈ దేవాలయంలో ఆ మహావిష్ణువు మనకు రంగనాథుడి రూపంలో దర్శనమిస్తాడు.

ఈ క్షేత్రాన్ని ఉత్తర శ్రీరంగం అని కూడా పిలుస్తారు. తెలుగు నేల పై ఉన్న ఈ పుణ్యక్షేత్రం పరమ పవిత్రమైన పెన్నానది తీరంలో కొలువై ఉంది. ఇక ఈ దేవలయంలోని అద్దాల మంటపాన్ని చూసి తీరాల్సిందే. భారతీయ చిత్రకళా విశిష్టతను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం...

మహావిష్ణువు రంగనాథుడి రూపంలొ

మహావిష్ణువు రంగనాథుడి రూపంలొ

P.C: You Tube

దక్షిణ భారత దేశంలోనే అతి ప్రాచీనమైన పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాల్లో నెల్లూరులోని తల్పిగిరి రంగనాథస్వామి దేవాలయం ఒకటి. నెల్లూరులో పెన్నానదికి దక్షిణ దిశలో ఉన్న ఈ దేవాలయంలో సాక్షాత్తు మహావిష్ణువు రంగనాథుడి రూపంలో కొలువై ఉన్నాడు.

అందుకే ఉత్తర శ్రీరంగం

అందుకే ఉత్తర శ్రీరంగం

P.C: You Tube

అందుల్లే ఈ ప్రాంతానికి రంగనాయకుల పేట అని పిలుస్తారు. ఈ క్షేత్రం రంగనాథుడు కొలువై ఉన్న శ్రీరంగానికి ఉత్తర దిశలో ఉంది కాబట్టి ఈ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయాన్ని ఉత్తర శ్రీరంగం అని పిలుస్తారు.

పుండరీక యాగం

పుండరీక యాగం

P.C: You Tube

ఇక ఇక్కడ శ్రీ మహావిష్ణువు రంగనాథుడి రూపంలో కొలువై ఉండటం వెనుక మనకు ఒక పురాణ కథనం వినిపిస్తుంది. కశ్యప మహాముని ఇక్కడ పుండరీక యాగం నిర్వహిస్తాడు. ఆయన భక్తికి మహావిష్ణువు కరిగిపోతాడు.

ఈ భూమండలం ఉన్నంత వరకూ

ఈ భూమండలం ఉన్నంత వరకూ

P.C: You Tube

దీంతో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి యాగం నిర్వహించిన చోట తాను రంగనాథుడిగా ఈ భూ మండలం ఉన్నంత వరకూ కొలువై ఉంటానని చెబుతాడు. అలా ఇక్కడ విష్ణువు మనకు రంగనాథ స్వామి రూపంలో కరుణిస్తున్నాడు.

స్కాంద పురాణం ప్రకారం

స్కాంద పురాణం ప్రకారం

P.C: You Tube

అయితే స్కాంద పురాణం లోని వైష్ణవ సంహిత ప్రకారం కశ్యప మహాముని నిర్వహించిన యాగంలో నుంచి వచ్చిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథస్వామి ఆలయంగా, మరొకటి ఇక్కడికి దగ్గర్లో ఉన్న జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం, ఇంకొకటి వేదగిరి నారసింహ క్షేత్రంగా వెలిసినట్లు తెలుస్తుంది.

తల్పగిరి అని పేరు రావడం వెనుక

తల్పగిరి అని పేరు రావడం వెనుక

P.C: You Tube

శ్రీమహావిష్ణువు రంగనాథుడి రూపంలో కొలువై ఉన్న ఈ క్షేత్రానికి తల్పగిరి అని పేరు రావడం వెనుక ఓ ఆసక్తికర కథనం మన పురాణాల్లో వినిపిస్తుంద. శ్రీ మహావిష్ణువు శ్రీదేవి సమేతంగ భూలోకంలో విహరించాలని భావిస్తాడు.

ఆదిశేషుడు

ఆదిశేషుడు

P.C: You Tube

అందుకు అనువైన ప్రాంతం చూడాల్సిందిగా ఆదిశేషుడిని ఆదేశిస్తాడు. శ్రీ మహావిష్ణువును క్షణకాలం కూడా విడిచి ఉండలేని ఆదిశేషుడు ప్రస్తుతం నెల్లూరులోని పినాకినిగా పిలువబడే పెన్నానదీ తీరంలో ఓ గిరి అంటే కొండగా మరి పోయి తన పై విహరించాల్సిందిగా కోరుతాడు.

తల్పంగా మారిపోయి

తల్పంగా మారిపోయి

P.C: You Tube

వన వివాహరం ముగిసిన తర్వాత మహావిష్ణువుకు ఈ ఆదిశేషుడు తల్పంగా మరిపోయి తన పై కొంత సేపు విశ్రమించాల్సిందిగా కోరుతాడు. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇదే కాబట్టి దీనిని తల్పగిరి రంగనాథస్వామి క్షేత్రంగా పిలుస్తున్నారు.

12 అడుగుల ఆదిశేషుని పై

12 అడుగుల ఆదిశేషుని పై

P.C: You Tube

శ్రీరంగంలో మాదిరిగానే తల్పగిరి రంగనాథస్వామి దేవాలయంలో మూలవిరాట్టు 12 అడుగుల ఆదిశేషుని పై భారీ రూపంలో మనకు దర్శనమిస్తాడు. గర్భగుడిలో పశ్చిమ దిశగా పెన్నానదికి అభిముఖంగా స్వామివారు శయనించిన స్థితిలో ఉంటారు.

వెనుక వైపు మరో ద్వారం

వెనుక వైపు మరో ద్వారం

P.C: You Tube

స్వామి పాదల వద్ద శ్రీదేవి, భూదేవి ఉండగా నాభి నుంచి ఉద్భవించిన కమలంలో బ్రహ్మ కొలువై ఉంటాడు. సాధారణంగా ముఖద్వారం ప్రవేశ ద్వారంగా ఉంటుంది. కానీ పెన్నానది ఈ ఆలయం ముఖ ద్వారం వరకూ రావడంతో ఆలయం వెనక వైపు వేరొక ముఖ ద్వారం ఉంటుంది.

కుళుత్తోంగ చోళులు

కుళుత్తోంగ చోళులు

P.C: You Tube

అందువల్లే ఈ ఆలయంలో ప్రధాన ద్వారం స్వామి వారికి వెనుకవైపు ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాలను అనుసరించి క్రీస్తుశకం 1178-1216 మధ్య కుళుత్తోంగ చోళుల హయాంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.

ఏడంతస్తుల 96 అడుగుల గాలి గోపురం

ఏడంతస్తుల 96 అడుగుల గాలి గోపురం

P.C: You Tube

అటు పై క్రీస్తు శకం 1859లో యరగుడిపాటి వెంకటాచలం పంతుల ఆధ్వర్యంలో ఏడు అంతుస్తులతో 96 అడుగుల ఎతైన గాలి గోపురాన్ని నిర్మించారు. ఈ గాలిగోపురం నిర్మాణం పూర్తి కావడానికి పద్నాలుగేళ్లు పట్టింది.

అద్దారల మందిరం

అద్దారల మందిరం

P.C: You Tube

ఈ గాలిగోపురం పై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు వీక్షకులను ఇట్టే ఆకట్టు కొంటాయి. ఇదిలా ఉండగా 1928లో ముప్పిరాల చిన నారసింహాచారి స్వామి వారికి తంజావూరు చిత్రకళతో కూడిన అద్దాల మందిరాన్ని నిర్మించాడు.

వటపత్రశాయి

వటపత్రశాయి

P.C: You Tube

అక్కడ గజేంద్రమోక్షం, దశావతారాలు, ఆళ్వారాచార్యల చిత్రాలు బంగారు పూతతో కనువిందుచేస్తున్నాయి. ముఖ్యంగా మందిరం పై భాగంలో శ్రీమన్నారయణుడు వటపత్రశాయిగా పవళించి ఏవైపు నుంచి చూసినా తమనే చూస్తున్న భావనను భక్తులకు కలిగిస్తాడు.

పుణ్యస్నానాలు

పుణ్యస్నానాలు

P.C: You Tube

శ్రీరంగనాథుడు ఈ భూమి పై అవతరించిన పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున 12 ప్రముఖ నదులు ఇక్కడి పెన్నానదిలో సంగమించాయని పినాకినీ క్షేత్ర మహత్య గ్రంథం వివరిస్తుంది. అందుకే ప్రతి ఏడాది ఆ రోజున ఇక్కడ పుణ్యస్నానాలు చేయడానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు.

పంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం

పంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం

P.C: You Tube

ఈ తల్పగిరి రంగనాథుడి సన్నిధిలో స్వామివారికి జరిగే ఉత్సవాలు నభూతో నభవిష్యతి అన్నరీతిలో సాగుతాయి. ఈ ఉత్సవాలన్నీ పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతాయి. ముఖ్యంగా ఏటా 45 రోజుల పాటు తైల సమర్పణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

వైకుంఠ ద్వారం

వైకుంఠ ద్వారం

P.C: You Tube

ఇక మార్గశిర మాసంలో 20 రోజుల పాటు పగల్ పత్తు-రాపత్తు ఉత్సవాలు వేడుకగా నిర్వస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి రంగనాథుడి దర్శించుకొంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ రోజున ఈ దేవాలయాన్ని స్థానిక భక్తులు వేల సంఖ్యలో దర్శించుకొంటారు.

బ్రహ్మోత్సవాలు.

బ్రహ్మోత్సవాలు.

P.C: You Tube

పాల్గుణ శుద్ధ దశమి నుంచి శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా నిర్వహిస్తారు. నెల్లూరు నుంచి ఈ దేవాలయం కూత వేటు దూరంలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి నెల్లూరుకు బస్సు, రైలు సర్వీసులు చాలా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X