Search
  • Follow NativePlanet
Share
» »ఈ మందిరం పై పాకిస్తాన్ 3000 బాంబులు వేసినా పేలలేదు, ఈ దేవాలయాన్ని సందర్శిస్తే

ఈ మందిరం పై పాకిస్తాన్ 3000 బాంబులు వేసినా పేలలేదు, ఈ దేవాలయాన్ని సందర్శిస్తే

రాజస్థాన్ లోని తనాట్ మందిరానికి సంబంధించిన కథనం.

మన అర్థ, అంగ, సైనిక బలంతో పాటు మరో అతీతమైన, కంటికి కనిపించని శక్తి కూడా సహకారం అందించాలి. అప్పుడు మాత్రమే మనం చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సిద్ధిస్తుందని పెద్దవాళ్లు చెబుతారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే తానాట్ మాతా మందిరం. ఈ మందిరాన్ని నేలమట్టం చేయాలని పాకిస్తాన్ సైనికులు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3వేల బాంబులను కురిపించినా చెక్కుచెదరలేదు.

పైగా వారంతా మన సైనికుల చేతికి సులభంగా చిక్కి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్ తో జరిగిన రెండు యుద్ధాల్లో మనం విజయం సాధించడానికి ఈ దేవాలయమే ప్రధాన కారణమని చెబుతారు. ఈ ఏదేని ముఖ్యకార్యక్రాన్ని ప్రారంభించేముందు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అందులో విజయం సాధిస్తామని చాలా మంది నమ్ముతారు.

ముఖ్యంగా రాజకీయనాయకులు. అందుకే ఈ దేవాలయాన్ని సందర్శించేవారిలో ఆ వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇంతకీ ఆ దేవాలయం ఎక్కడ ఉంది. అక్కడికి ఎలా చేరుకోవాలి తదితర వివరాలన్నీ కోసం....

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

తనాట్ మాతా మందిరం రాజస్థాన్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం జై సల్మీర్ కు చాలా దగ్గరగా ఉంది. భారత పురాణాలను అనుసరించి తనాట్ మాతా ఆదిపరాశక్తికి ప్రతిరూపంగా భావిస్తారు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

జై సల్మీర్ నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మందిరం భారత, పాకిస్తాన్ సరిహద్దులో ఉంది. జై సల్మీర్ నుంచి ఇక్కడకు వెళ్లడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

ఇక్కడ ఒక్క బీఎస్ ఎన్ ఎల్ తప్ప మరే నెట్ వర్క్ పనిచేయదు. ఈ గ్రామంలో పబ్లిక్ టెలిఫోన్ కూడా అందుబాటులో ఉండదు. ఇక్కడ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెంటీగ్రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

నవంబర్ నుంచి జనవరి మధ్య ఈ దేవాలయాన్ని చూడటానికి వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతారు. ఈ మందిరం తర్వాత మనం వెళ్లడానికి వీలు ఉండదు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

ప్రస్తుతం ఈ దేవాలయం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పర్యవేక్షణలో ఉంది. వారి అనుమతి లేనిదే ఇక్కడ పూజలు కూడా నిర్వహించుకోవడానికి వీలుపడదు. అయినా చాలా మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

ప్రతి సైనికుడు ఈ ఆలయం పరిసర ప్రాంతాలకు వచ్చిన వెంటనే వినయంగా మాతకు నమస్కరించి అక్కడి ఇసుకను నుదురు పై పెట్టుకొంటాడు. దీని వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

ఈ ఆలయం ఇంత ఫేమస్ కావడానికి కారణం పాకిస్తాన్ తో మనకు రెండు సార్లు జరిగిన యుద్ధం సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలేనని ఇక్కడి వారు చెబుతారు. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయి.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

1965లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో శత్రుశైనికులు మన సరిహద్దులోని ఈ తనాట్ మందిరం పై 3వేల బాంబులు తమ యుద్ధట్యాంకుల ద్వారా కురిపించారు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

అయితే అందులో ఒక్కటి కూడా పేలలేదు. ఇక ఈ యుద్ధంలో మన దేశం గెలిచిన విషయం తెలిసిందే. యుద్ధ వాతావరణం చల్లబడిన తర్వాత పాకిస్తాన్ జనరల్ ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ దేవాలయాన్ని సందర్శించాడు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

ఇక్కడి తానాట్ మాతను మనసారా కొలిచి మాతకు అతీత శక్తులు ఉన్నాయని ప్రకటించాడు. అటు పై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షణలో ఈ దేవాలయం నిర్వహించబడేది.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

అదే విధంగా 1971లో మరోసారి పాకిస్తాన్ సైన్యాలు ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధ ట్యాంకులను ముందుకు కదలించాయి. దూరం నుంచే బాంబులు కూడా కురిపించాయి.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

అయితే ఆ ట్యాంకులు ఈ దేవాలయం సమీపంలోకి రాగానే ఇసుకలో ఉన్నట్టుండి కూరుకుపోయాయి. ఒక్క ఇంచి కూడా కదలలేదు. ఎవరైతే ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ట్యాంక్ లను ముందుకు కదిలించారో వారంతా చనిపోయారు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

ఆ సంఖ్య 200 మందికి పైగా ఉంది. అయితే ఆ సంఖ్య వేలల్లో ఉంటుందని ఇక్కడి గ్రామస్తులు చెబుతారు. మిగిలిన సైనికులు ఆ ట్యాంక్ లను అక్కడే వదిలివేసి ప్రాణాలను అరచేతిలోపెట్టుకొని పరిగెత్తి పోయారు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

ఈ విషయాలన్నీ అధికారికంగా రికార్డ్ కూడా చేయబడ్డాయి. ఇక పేలని బాంబులను ఈ దేవాలయం వద్ద ఉన్న మ్యూజియంలో మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈ గ్రామ జనాభ 250 కు మించదు.

తానాట్ మాతా మందిరం

తానాట్ మాతా మందిరం

P.C: You Tube

వెళ్లేటప్పుడే తిండి, నీరు తీసుకొని వెళ్లడం మంచిది. వసతి సరిగా ఉండదు. అందువల్ల తిరిగి జై సల్మీర్ కు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X