Search
  • Follow NativePlanet
Share
» »6000 సంవత్సరాల నుండి పూజలు స్వీకరిస్తున్న ఆది భిక్షువు...

6000 సంవత్సరాల నుండి పూజలు స్వీకరిస్తున్న ఆది భిక్షువు...

ద్రోణ గుహ: 6వేల సంవత్సరాల నాటి శివాలయం(తప్కేశ్వర టెంపుల్) యొక్క రహస్యం

ప్రపంచంలో చాలా పురాతనమైన దేవాలయాలున్నాయి. కొన్ని దేవాలయాల గురించి మనకు సరిగా తెలియదు. వాటి వెనుక కొన్ని రహస్యాలు కూడా దాగి ఉంటాయి. అలాంటి రహస్య దేవాలయాల్లో ఒకటి శివుడి ఆలయం. ఈ ఆలయం 6000సంవత్సరాల కాలం నాటిదని అంటుంటారు. 6వేల సంవత్సరాల కంటే అతి పురాతనమైన ఈ శివాలయంలోని పరమశివుడు భక్తులకు నిత్యం దర్శనమిస్తుంటాడు.

ఈ ప్రాచీనమైన, అత్యంత పవిత్రమైన శివలింగం ఒక గుహలో ఉంది, అందుకే ఈ శివలింగం గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ శివలింగం గురించి పెద్ద విశేషమేంటని అందురూ అనుకోవచ్చు. ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, శివలింగాన్ని నదిలోని నీరు నిరంతరం అభిషేకిస్తుంటుంది. ఇంకా పాండవుల మరియు కౌరవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు మహాభారత సమయంలో ఇక్కడే ద్యానం చేసేవారని, అందుకే ఈ గుహను ద్రోణ కేవ్ అని పిలుస్తారు. మరి ఈ ద్రోణ కేవ్ కు తప్కేశ్వర్ టెంపుల్ అని ఎలా పేరు వచ్చింది, ఈ టెంపుల్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం..

 తపకేశ్వర్ మహాదేవ్

తపకేశ్వర్ మహాదేవ్

అతి ప్రాచీనమైన మరియు 6000 సంవత్సరాల కంటే అతి పురాతనమైన ఈ గుహలోని పరమశివున్ని తపకేశ్వర్ మహాదేవ్ అని పిలుస్తారు. ఈ ఆలయం డెహ్రుడూన్ లోని ఒక దట్టమైన అరణ్య ప్రాంతంలో కలదు.

PC:YOUTUBE

నీరు నిరంతరం ఆ శివలింగంపై నీటి ధారగా పడుతుంది

నీరు నిరంతరం ఆ శివలింగంపై నీటి ధారగా పడుతుంది

సహజ సిద్దంగా ఏర్పడిన తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం గుహపై ఉండే నీరు నిరంతరం ఆ శివలింగంపై నీటి ధారగా పడుతుంది. ‘‘తపక్’’ అనేది హింది పదం. తపక్ అంటే నీటి బొట్టు అని అర్థం. ఈ గుహ యొక్క పై కప్పు నుండి సహజంగా నీటి బొట్లు శివలింగంపై పడుతుంటాయి(అభిషేకిస్తుంటాయి). ఇది చూడటానికి భక్తులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఈ శివాలయానికి అంత ప్రత్యేకత ఉంది.

PC:YOUTUBE

మహాభారతంలోని ప్రసిద్ద గురువు

మహాభారతంలోని ప్రసిద్ద గురువు

ఇంకా పురాణాల ప్రకారం భారత ఇతిహాసాలలో ఒకటైన మహాభారతంలోని ప్రసిద్ద గురువు ద్రోణాచార్యులు. అతని కుమారుడు అశ్వద్ధామ, ఈ గుహలోని శివునికి నిత్యం పాలాభిషేకం చేసేవాడని చెబుతుంటారు.

PC:YOUTUBE

దీని వెనుక ఒక కథ కూడా ఉంది.

దీని వెనుక ఒక కథ కూడా ఉంది.

దీని వెనుక ఒక కథ కూడా ఉంది. ద్రోణాచార్యుడు తన భార్యతో ఈ గుహలో నివాసం ఉన్నప్పుడు అశ్వద్దామ పుట్టిన తర్వాత పాలు ధారగ మారి పసివాడి ఆకలి తీర్చిందని అంటుంటారు. కారణం తల్లి క్రుపారాణికి ప్రసవం తర్వాత పాలు రాకపోవడమే. ఇప్పటికి ఈ లింగముపైన నీటి ధార పడటం విశేషంగా చెప్పుకుంటారు.

PC:YOUTUBE

ఇక్కడ శివలింగముకు చేసే విశేష అలంకరణలు

ఇక్కడ శివలింగముకు చేసే విశేష అలంకరణలు

ఇక్కడ శివలింగముకు చేసే విశేష అలంకరణలు చాలా బాగుంటాయి.కాబట్టి ఇప్పటికే మీకు అర్థం అయ్యుంటుంది. ఈ కథ ద్వారా ఈ ఆలయం మహాభారత కాలంనాటి శివాలయం అని. ఇక్కడ మహా శివరాత్రి నాడు పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తుంటారు. అలాగే లార్డ్ శివ, పార్వతుల యొక్క పవిత్రమైన కళ్యాణోత్సవ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయంను సందర్శిస్తారు.

PC:YOUTUBE

హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా

హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా

హిందూ దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో చూడదగ్గ ముఖ్యమైన ఆలయం ఇది. ఈ తపకేశ్వర్ మహదేవ్ ఆలయం డెహ్రుడూన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్రోణ గుహ చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

PC:YOUTUBE

ఇది పిక్ నిక్ స్పాట్ కు సరైన ప్రదేశం.

ఇది పిక్ నిక్ స్పాట్ కు సరైన ప్రదేశం.

యంగ్స్టర్స్ ఈ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం లేకపోవచ్చు. కానీ, ఇది పిక్ నిక్ స్పాట్ కు సరైన ప్రదేశం.సాదారణంగా డెహ్రాడూన్ మరియు చుట్టుప్రక్కల జిల్లాల వారు పిక్నిక్ స్పాట్ గా ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు.

PC:YOUTUBE

అటవీ మార్గం నుండి ఒక చిన్న ట్రెక్కింగ్ చేయవచ్చు.

అటవీ మార్గం నుండి ఒక చిన్న ట్రెక్కింగ్ చేయవచ్చు.

అటవీ మార్గం నుండి ఒక చిన్న ట్రెక్కింగ్ చేయవచ్చు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ తోటి ట్రెక్కింగ్ వల్ల సౌకర్యంగాను మరియు ఉత్తేజంగాను ఫీలవుతారు.

PC:YOUTUBE

 ఒక్క సారి ఆ ప్రదేశంలోనికి ప్రవేశించగానే

ఒక్క సారి ఆ ప్రదేశంలోనికి ప్రవేశించగానే

అంతే కాదు ఒక్క సారి ఆ ప్రదేశంలోనికి ప్రవేశించగానే అక్కడ వినిపించే పవిత్రమైనటువంటి పాటలు, దేవాలయంలోని గుడి గంటలు తన్మయత్వానికి గురి చేసి మరో ప్రపంచానికి తీసుకెళుతుంది.

PC:YOUTUBE

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

డెహ్రూడూన్ మెయిన్ సిటీకి చాలా దగ్గర. గోవింద నగర్ రైల్వే ష్టేషన్ నుండి 7.5కిలోమీటర్లు. ఇక్కడ నుండి బస్ లేదా క్యాబ్ లో వెళ్లవచ్చు.

PC:YOUTUBE

ఎలా వెళ్లాలి:

ఎలా వెళ్లాలి:

అలాగే జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ డ్రెహ్రూడూన్ నుండి 30కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది. మీరు కావాలంటే క్యాబ్ షేర్ చేసుకోవచ్చు.

PC:YOUTUBE

తప్కేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం:

తప్కేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం:

శివరాత్రి సమయంలో చాలా బాగుంటుంది. ఇక శివ భక్తులు మాత్రం సంవత్సరం మొత్తం ఈ శివాలయాన్ని సందర్శిస్తుంటారు. సాధారణ భక్తులు అక్టోబర్ నుండి జూన్ మద్య వెళ్లడం మంచిది.

PC:YOUTUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X