Search
  • Follow NativePlanet
Share
» »మహాబలేశ్వర్ వద్ద ఉన్న ఈ శివసాగర్ సరస్సు అందాలను తనివి తీరా చూడాల్సిందే..

మహాబలేశ్వర్ వద్ద ఉన్న ఈ శివసాగర్ సరస్సు అందాలను తనివి తీరా చూడాల్సిందే..

మహాబలేశ్వర్ వద్ద ఉన్న ఈ శివసాగర్ సరస్సు అందాలను తనివి తీరా చూడాల్సిందే..

చుట్టూ పచ్చదనం పరుచుకున్న కొండలు, ఆకాశంలో నుంచి జాలువారుతున్నట్టుగా జలపాతాలు, చరిత్రను కళ్లముందుంచే కోట... ఇవన్నీ మహాబలేశ్వరంలో కనిపిస్తాయి. మహాబలేశ్వరానికి ఘనమైన చరిత్రే ఉంది. ఇక్కడి ప్రదేశాలు అత్యంత రమణీయంగా, సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి వాటర్‌ఫాల్స్‌ను చూసి తరించాల్సిందే. ఇండియాలోని హిల్‌స్టేషన్‌లలో ఇది ప్రముఖమైనదిగా పేరుగాంచింది. హాలీడే స్పాట్‌గా, హానీమూన్‌ ప్లేస్‌గా మహాబలేశ్వరానికి గుర్తింపు ఉంది. మహాబలేశ్వరంకు 25కిలోమీటర్ల దూరంలో మరో అద్భుతమైన ప్రదేశం తపోలా .

మహాబలేశ్వరంలోని తపోలా లో ప్రధాన ఆకర్షణ శివసాగర్ సరస్సు. తపోలా మహాబలేశ్వర్ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఈ ప్రదేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ చిన్న పట్టణాన్ని మినీ కశ్మీర్‌ అని పిలుస్తారు. మినీ కాశ్మీర్ గా కూడా పిలువబడే తపోలా ప్రకృతి అనుభవించడానికి సరైన ప్రదేశం. పచ్చని పకృతి, సెలయేళ్ళ మద్య ఎలాంటి కాలుష్యం లేని ప్రశాతమైన వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుంది. కొయనా వ్యాలీలో ఉన్న ఇక్కడ ఉన్న శివసాగర్‌ లేక్‌ అందాలను తనివి తీరా చూడాల్సిందే.

అడవిలో ట్రెక్కింగ్ చేయడానికి ఇది ప్రసిద్ది చెందిన ప్రదేశం.

అడవిలో ట్రెక్కింగ్ చేయడానికి ఇది ప్రసిద్ది చెందిన ప్రదేశం.

ఈ లేక్‌లో మోటర్‌ బోట్స్‌, స్పీడ్‌బోట్స్‌ నడపొచ్చు. వాటర్‌లో స్కూటర్‌రైడ్‌ చేయాలనుకునే వారికి ఇది మంచి ప్రదేశం. అడవిలో ట్రెక్కింగ్ చేయడానికి ఇది ప్రసిద్ది చెందిన ప్రదేశం. తపోలా ఫారెస్ట్ చుట్టూ కోటలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రసిద్ది చెందినవి వసోట మరియు జయగడ్ కోటలు. అయితే ఈ కోటలను చేరుకోవడం అంత సులభమైన పని కాదు. మీరు కనుక వాటర్ స్పోర్ట్స్ ఇష్టడపుతున్నట్లైతే జలవిహారం చేయాలంటే తపోలా తప్పనిసరిగా వెళ్ళవచ్చు.

కొయినా జలాశయానికి ఆనకట్టగా

కొయినా జలాశయానికి ఆనకట్టగా

90 కిలోమీటర్ల పొడవున్న ఈ చెరువు కొయినా జలాశయానికి ఆనకట్టగా ఉంది. జలక్రీడ ప్రేమికులు ఇక్కడ ఆనందిస్తారు. ఇక్కడ చాలా వాటర్ స్పోర్ట్స్ అవకాశాలు వుంటాయి. స్కూటర్ రైడ్ లు, ఈత, కయాకింగ్, బోటింగ్ మరియు స్విమ్మింగ్ లాంటి వాటిలోంచి ఏదైనా ఎంచుకోవచ్చు. ఇక్కడ బోటింగ్ సౌకర్యాలు అందుబాటు ధరల్లో దొరుకుతాయి, స్కూటర్ రైడర్, స్పీడ్ బొట్ లేదా మోటార్ బోట్ల లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

శివసాగర్ సరస్సు

శివసాగర్ సరస్సు

తపోలా ప్రధాన ఆకర్షణలో శివసాగర్ సరస్సు ఒకటి. ఇది తపొలా నుండి 90కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కొయినా డ్యాం జలాశయాన్ని ఆనకట్టగా ఉంది. ఇక్కడ బోటింగ్ అద్భుతమైన అనుభవం, సరస్సు సుందరమైనది. ఇక్కడ సరస్సులో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. శివసాగర్ సరస్సులో బోటింగ్, వాటర్ స్కూటర్ రైడ్,కాయకింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి చేయవచ్చు.

కాస్ పత్తర్ లేదా కాస్ మైదానం

కాస్ పత్తర్ లేదా కాస్ మైదానం

నిజానికి మహారాష్ట్ర లోని తపోలా లో వున్న ఆశ్చర్య పరిచే పూల లోయ.వర్షాకాలం తర్వాత ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా పూల పాన్పులా వుండే ఈ విశాలమైన మైదానాన్ని సందర్శించడానికి మంచి సమయం. ఆ సమయంలో ఇక్కడ 150 కన్నా ఎక్కువ రకాల పూలు ఇక్కడ కనబడతాయి.దగ్గరలోని కాస్ సరస్సు వర్షాకాలం తర్వాతి సమయంలో తనదైన మనోహర దృశ్యాలను కలిగి వుంటుంది.

వసోతా, జయగడ్ కోటలు

వసోతా, జయగడ్ కోటలు

ఒకప్పుడు ధృడంగా వున్న వసోతా, జయగడ్ కోటలు ఇప్పుడు శిదిలావస్థకు చేరుకున్నాయి. శివసాగర్ సరస్సు దగ్గర కొయినా అభయారణ్యం లోని హరిత వనాల లోపల నెలకొని వుంది వసోతా కోట. దీన్ని శిలాహర రాజు రెండో భోజరాజు నిర్మించగా తర్వాత శివాజీ మహారాజు చేతికి వచ్చింది. ఈ కోటను పూర్వం వ్యాఘ్రగడ కోటగా పిలిచేవారు – దీన్ని మూడు ప్రధాన కోటలుగా విభజించారు – జునా వసోతా, నవీన్ వసోతా, నాగేశ్వర్. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తున వున్న ఈ కోటకు నాలుగింట మూడు వైపులా నీరు వుంటుంది. ఈ కోటలు ఇప్పుడు ప్రమాదకరమైన స్ధలాలుగా మార్పు చెందాయి.

వెన్న లేక్‌

వెన్న లేక్‌

మహాబలేశ్వరంలో ఇది ముఖ్యమైన టూరిస్ట్‌ ప్లేస్‌. ఎస్‌టీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేక్‌ చుట్టూ చెట్లతో నిండి ఉంటుంది. లేక్‌లో బోటింగ్‌ చేయవచ్చు. ఇక్కడ రెస్టారెంట్లకు కొదవ లేదు. లేక్‌కు వెళ్లే దారిలోనే మార్కెట్‌ ఉంటుంది.

సమయం:

సమయం:

హిల్‌స్టేషన్‌ కాబట్టి వేసవిలోనూ చల్లగా ఉంటుంది. అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కాబట్టి వర్షపాతం ఎక్కువే ఉంటుంది. అక్టోబర్‌ నుంచి జూన్‌ మధ్యకాలంలో మహాబలేశ్వరంను సందర్శించవచ్చు. లింగామల వాటర్‌ఫాల్స్‌ను చూడటానికి అనువైన సమయం జూలై నుంచి డిసెంబర్‌. జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య జల్లులు పడుతూనే ఉంటాయి. రెయినీ సీజన్‌లో మొత్తం పచ్చదనం పరుచుకుని ఉంటుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య ఉంటాయి. అక్టోబర్‌, నవంబర్‌లో 17 డిగ్రీలు ఉంటే డిసెంబర్‌, జనవరిలో సరాసరి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.

ఎలా వెళ్లాలి

ఎలా వెళ్లాలి

విమాన మార్గం : మహాబలేశ్వరానికి 120 కి.మీల దూరంలో పూనె ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడికి అన్ని ప్రాంతాల నుంచి విమాన సర్వీసులున్నాయి. పూనె వరకు విమానంలో వచ్చినా అక్కడి నుంచి బస్సులో, కారులో మహాబలేశ్వరం చేరుకోవచ్చు. అక్కడి నుండి లోకల్ బస్సులు, క్యాబ్ ల ద్వారా లేక్ చేరుకోవచ్చు.

రైలు మార్గం : మహాబలేశ్వరానికి 60 కి.మీల దూరంలో వాతర్‌ రైల్వేస్టేషన్‌ ఉంది. 120 కి.మీల దూరంలో పూనె రైల్వేస్టేషన్‌ ఉంది. పూనెకు హైదరాబాద్‌ నుంచి, విశాఖపట్టణం నుంచి రైళ్లున్నాయి. పూనెకు చేరుకుని అక్కడి నుంచి బస్సులో లేక క్యాబ్‌లో మహాబలేశ్వరం చేరుకోవచ్చు. ముంబై, హుస్సేన్‌సాగర్‌, పూనె శతాబ్ది, హైదరాబాద్‌ పూనె ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు హైదరాబాద్‌ నుంచి వెళతాయి. లోకమాన్య తిలక్‌, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు విశాఖపట్టణం నుంచి బయలుదేరి హైదరాబాద్‌ మీదుగా పూనె వెళతాయి.

రోడ్ మార్గం : మహాబలేశ్వరానికి నాసిక్‌, ముంబై, పూనె, కొల్హాపూర్‌ వంటి ప్రధాన నగరాల నుంచి మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ట్రాన్స్‌పోర్టు బస్‌ సర్వీసులున్నాయి.
పూనె టు మహాబలేశ్వరం దూరం 120 కి.మీ, ప్రయాణానికి పట్టే సమయం 2.30 గంటలు (బస్సు, కారులో)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X