Search
  • Follow NativePlanet
Share
» »నంజన్ గూడ్ - ఒక ఆలయాల పట్టణం !

నంజన్ గూడ్ - ఒక ఆలయాల పట్టణం !

By Mohammad

మీరు ఈ వీకెండ్ మైసూర్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా ? అయితే మీ ట్రిప్ లో నంజన్ గూడ్ (నంజనగూడు) ప్రదేశాన్ని కూడా చేర్చుకోండి. ఈ ప్రదేశం మైసూర్ కు కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కపిలానది తీరంలో ఉన్న ఈ పట్టణం, ప్రముఖ ధార్మిక మరియు చరిత్ర అంశాలతో ముడిపడి ఉన్న కేంద్రం. ఈ పట్టణానికి 'ఆలయాల పట్టణం' అనే పేరు కూడా కలదు.

నంజనగూడ లో మీకు కనిపించేవి అన్ని ధార్మిక కేంద్రాలే. వీటితో పాటు మీకు ఒక వంతెన కూడా కన్పిస్తుంది. ఇది పురాతన మైనది. క్రీ. శ 17 వ శతాబ్దంలో కపిలా నది పై వంతెనను నిర్మించారు. ప్రస్తుతం వంతెన మీద నుంచి రైళ్లు, బస్సులు నడుస్తుంటాయి. నేడు ఈ బ్రిడ్జి భారత వారసత్వ కట్టడాలతో ఒకటిగా ఉన్నది.

lord shiva

శివ భగవానుని విగ్రహం

చిత్ర కృప : Siva Ramakrishnan

నంజుండేశ్వ దేవాలయం

నంజన్ గూడ్ పర్యాటకులు నంజుండేశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి. దీనినే 'శ్రీకంఠేశ్వర' అని కూడా అంటారు. ఇక్కడి ప్రధాన దేవుడు శివుడు. ఈ దేవాలయం ద్రవిడ శైలి శిల్పాలతో ఉంటుంది. ఈ దేవాలయం గంగ పాలకులు చే నిర్మించబడింది.

templeచిత్ర కృప : Naveenచిత్ర కృప : Naveen

నంజుండేశ్వ దేవాలయం

చిత్ర కృప : Naveen

చరిత్రకారుల మేరకు, ఈ దేవాలయ దేముడు నంజుండకు ప్రార్ధన చేసిన వెంటనే టిప్పు సుల్తాన్ కు ఎంతో ప్రియమైన ఏనుగు తన జబ్బుల నుండి వెంటనే విముక్తి పొందిందని చెపుతారు. ఆ విధంగా ఈ దేవాలయానికి జబ్బులను నివారించే శక్తి లేదా మహిమలు ఉన్నాయని చెపుతారు.

సంవత్సరానికి రెండు సార్లు జరిగే రధోత్సవ సమయంలో యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. దీనిని 'దొడ్డ జాతర' అంటారు. రధాలలో గణపతి, పార్వతి, శ్రీకంఠేశ్వర, సుబ్రహ్మణ్య మరియు చండికేశ్వర విగ్రహాలను పెట్టి ఊరేగిస్తారు.

utsav

ఆలయం వద్ద ఊరేగింపు

చిత్ర కృప : Rohit Sastry

పరుశురామ క్షేత్రం

నంజుండేశ్వ దేవాలయాన్ని చూసిన తర్వాత, యాత్రికులు పరుశురామ క్షేత్రాన్ని కూడా తప్పక దర్శించుకోవాలి. ఈ ప్రదేశం, కపిల మరియు కౌండిన్య నదుల సంగమ ప్రదేశం. ఇక్కడే పరశురాముడు తన తల్లిని నరికి చంపినందుకుగాను ఈ నదీ సంగమంలో ప్రక్షాళన పొంది పాపాన్ని పోగొట్టుకున్నాడని చెపుతారు. శివుడు ఆజ్ఞ మేరకు పరశురాముడు అక్కడే దేవాలయాన్ని నిర్మించి తపస్సు చేసాడని ఇంకొందరు చెబుతారు.

పరుశురామ క్షేత్రం

కపిల నది వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

చిత్ర కృప : Nayvik

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం

రాఘవేంద్ర మఠాన్ని ప్రీతికా సన్నిధి అని కూడా పిలుస్తారు. ప్రపంచం మొత్తం మీద రాఘవేంద్ర స్వామి విగ్రహం ఉన్న ఏకైక మఠం ఇదొక్కటే. మిగితా అన్ని చోట్ల ఆయనను బృందావనం గానే చూస్తారు. క్రీ. శ. 18 వ శతాబ్దంలో మఠాన్ని శ్రీమదాచార్య పరంపరలో శ్రీ సుజనానేంద్ర తీర్థరు స్థాపించారు. అప్పటి నుండి వేలాది మంది యాత్రికులు సంవత్సరం పొడవునా మఠాన్ని దర్శించుకుంటున్నారు.

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం

శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం

చిత్ర కృప : indiaforyou.in

అరటిపండ్లు

నంజనగూడ ప్రత్యేక రకం అరటి పండ్లకు ప్రసిద్ధి. స్థానికంగా వీటిని నుంజనగూడ రసాబాలే అని పిలుస్తారు. ఈ జాతి అరటిపండ్లను కేంద్రం భౌగోళిక గుర్తింపు నిచ్చింది.

నంజన్ గూడ్ ఎలా చేరుకోవాలి ?

కపిలనది పై పురాతన వంతెన

చిత్ర కృప : Suraj T S

నంజన్ గూడ్ ఎలా చేరుకోవాలి ?

  • విమాన మార్గం : నంజన్ గూడ్ కు 160 KM ల దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో నంజన్ గూడ్ చేరుకోవచ్చు.
  • రైలు మార్గం : నంజన్ గూడ్ లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది మైసూర్ రైల్వే స్టేషన్ తో అనుసంధానించబడినది. స్టేషన్ బయట ఆటో రిక్షాల సదుపాయం కలదు.
  • రోడ్డు / బస్సు మార్గం : బెంగళూరు, మైసూర్ ల నుండి ప్రతి రోజూ నంజన్ గూడ్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X