Search
  • Follow NativePlanet
Share
» »గురుపూర్ణిమ నాడు దర్శించే ఆలయాలు !

గురుపూర్ణిమ నాడు దర్శించే ఆలయాలు !

By Mohammad

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురుపూర్ణిమ అని అంటారు. ఇది వేదవ్యాసుని జయంతి. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం జులై - ఆగస్టు నెలల్లో ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పూర్ణిమ వస్తుంది. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను 'వేదవ్యాసుడు' అని పిలవటం జరిగింది.

వేదవ్యాసుడు తొట్ట తొలి గురువు. వేదవ్యాసుడు మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక సన్మార్గాన్ని వారసత్వంగా వదిలివెళ్ళినాడు కాబట్టే ఆయన్ను మానవాళి అంతటికీ గురువుగా భావిస్తుంటారు.

దక్షిణ భారత దేశంలో గురుపూర్ణిమ రోజున ఆదిశక్తి ని పూజిస్తారు. శిరిడీ సాయిబాబా ఆలయంలో ఆ రోజు (గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ) మొదలుకొని మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

వేదవ్యాస ఆలయం , రూర్కెలా

వేదవ్యాస ఆలయం , రూర్కెలా

వేదవ్యాస ఆలయం రూర్కెలా లో పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ప్రదేశం. ఈ అందమైన ప్రదేశంను ఒక తీర్థ యాత్ర గా భావిస్తారు. స్థలం యొక్క స్థానం దాని మనోజ్ఞతను మరియు అందాన్ని జోడిస్తుంది. కోయల్,శంఖ మరియు సరస్వతి నది జలాల సంగమ స్థలం ఒడ్డున వేదవ్యాస శివ పీఠం ఉంది. ఈ కారణంగా ఈ స్థలంను 'త్రిధార సంగం' అని కూడా అంటారు.

చిత్ర కృప : Ramnadayandatta Shastri Pandey

వేదవ్యాస ఆలయం , రూర్కెలా

వేదవ్యాస ఆలయం , రూర్కెలా

రూర్కెలా నగరం నుండి 9 కి.మీ. దూరంలో ఉన్న ఈ స్థలం చారిత్రిక ప్రాముఖ్యత కలిగి ఉంది. గురుకుల విద్య మరియు వేద ఆశ్రమం వ్యవస్థ ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిన లక్షణం. గొప్ప సాధువు, మహర్షి వేదవ్యాస్ ఈ ప్రదేశంలో హిందూ మతం కావ్యం మహాభారతంను రాసేను. ఈ అందమైన ప్రదేశం సందర్శించిన సమయంలో పర్యాటకులు వ్యాస్ గుహలను చూసి ఆనందించండి.

చిత్ర కృప : Sandeep Shande

వేదవ్యాస ఆలయం, వారణాసి

వేదవ్యాస ఆలయం, వారణాసి

గంగా నదికి కుడి వైపున ఉన్న రాంనగర్ లో వ్యాస మహర్షి ఆలయం కలదు. ఈ ఆలయం సంవత్సరం పొడవునా భక్తులతో కిటకిట లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ఆసక్తిని కలిగించే కధనం ఉన్నది. శివుడు వ్యాసుడిని వారణాసి నుండి బహిష్కరిస్తే, అతను గంగా నదికి అవతలి ఒడ్డున ఉన్న రాంనగర్ లో నివశిస్తాడు. అక్కడే దేవాలయాన్ని నిర్మించుకొని ధ్యానం చేస్తాడు. నిజానికి ఈ ప్రదేశాన్ని వ్యాస్ కాశీ ని పేరు పెట్టడం జరిగింది.

చిత్ర కృప : Biswajit_Dey

బాసర, తెలంగాణ

బాసర, తెలంగాణ

వేదవ్యాస మహర్షి ఆలయం, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి దక్షిణాన కలదు. ఇక్కడ వ్యాస మహర్షి కొన్ని సంవత్సరాలు గడిపాడని నమ్ముతారు. వ్యాస మహర్షి మందిరంలో వ్యాస భగవానుడి విగ్రహం, వ్యాస లింగం చూడవచ్చు. ఈ మందిరానికి దగ్గరలో ఒక గుహ కూడా కలదు. ఆ గుహలో వ్యాసుడు తపస్సు చేసినట్లు భావిస్తారు.

చిత్ర కృప : రహ్మానుద్దీన్

షిర్డీ

షిర్డీ

షిరిడి లోని భగవాన్ శ్రీ సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి. దేశంలో ఉన్న టాప్ 5 ఆలయాల్లో ఈ షిరిడి ఆలయం ఒకటి. సాయిబాబా ను ప్రతి గురువారం భక్తులు సందర్శిస్తుంటారు అయినా గురుపూర్ణిమ నాడు బాబా ను అత్యధికులు దర్శిస్తారు. బాబా ఆలయం మొదటి అంతస్థులో ఆయన జీవిత ఘట్టాలను తెలిపే చిత్రపటాలను గమనించవచ్చు.

చిత్ర కృప : pahujaamit

పుట్టపర్తి

పుట్టపర్తి

గురుపూర్ణిమ వేడుకలు పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంలో ఘనంగా నిర్వహిస్తారు. బాబాను ఇక్కడ షిర్డీ సాయిబాబా అవతారంగా భావించేవారు, పూజించేవారు. గురుపూర్ణిమ, కొన్ని ప్రత్యేక పర్వ దినాలలో బాబా భక్తులకు దర్శనం ఇచ్చేవారు. బాబా పరమపదించిన తర్వాత, ప్రస్తుతం ట్రస్ట్ అద్వర్యం లో గురుపూర్ణిమ, ఇతర పర్వదినాల వేడుకలు జరుగుతున్నాయి.

చిత్ర కృప : telugu native planet

వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం

వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం

కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళినప్పుడు వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయానికి తప్పకుండా వెళ్ళాలి. పురాణ గాధ అనుసరించి నరసింహ స్వామి, వేద వ్యాస విగ్రహాలను స్వయానా వేదవ్యాసుడే మధ్వాచార్యుల వారికి ఇచ్చారట. గురుపూర్ణిమ పర్వదినాన భక్తులు గుడిని తప్పకుండా దర్శిస్తారు.

చిత్ర కృప : Reji

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X