Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ మాసంలో ఈ దేవాలయాల్లో పూజలు చేస్తే అనుకొన్న కోర్కెలు నెరవేరుతాయి.

శ్రావణ మాసంలో ఈ దేవాలయాల్లో పూజలు చేస్తే అనుకొన్న కోర్కెలు నెరవేరుతాయి.

శ్రావణమాసంలో పూజలు బాగా జరిగే పుణ్యక్షేత్రాలకు సంబంధించిన కథనం.

హైదరాబాద్ లోని జుబ్లీహీల్స్ లోని పెద్దమ్మ దేవాలయం తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాచూర్యం పొందిన శక్తి దేవాలయం. పెద్దమ్మ అంటే ఆదిపరాశక్తి ప్రతి రూపమని అర్థం. ఇక్కడ ఆషాడమాసంలో బోనాలు చాలా బాగా జరుగుతాయి. దీనితో పాటు మకరసంకరాత్రి, వసంతపంచమి, రతసప్తమి, మహాశివరాత్రి, హోలి, యుగాది తదితర పండుగలు బాగా జరుపుతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దమ్మ దేవాలయం బ్రహోత్సవాలు కూడా నిర్వహిస్తారు. మాఘమాసంలో వచ్చే వసంతపంచమి నుంచి రతసప్తమి వరకూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

పెద్దమ్మ దేవాలయం

పెద్దమ్మ దేవాలయం

P.C: You Tube

హైదరాబాద్ లోని జుబ్లీహీల్స్ లోని పెద్దమ్మ దేవాలయం తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాచూర్యం పొందిన శక్తి దేవాలయం. పెద్దమ్మ అంటే ఆదిపరాశక్తి ప్రతి రూపమని అర్థం. ఇక్కడ ఆషాడమాసంలో బోనాలు చాలా బాగా జరుగుతాయి.

ప్రతి శుక్ర, మంగళ

ప్రతి శుక్ర, మంగళ

P.C: You Tube

దీనితో పాటు మకరసంకరాత్రి, వసంతపంచమి, రతసప్తమి, మహాశివరాత్రి, హోలి, యుగాది తదితర పండుగలు బాగా జరుపుతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్దమ్మ దేవాలయం బ్రహోత్సవాలు కూడా నిర్వహిస్తారు. మాఘమాసంలో వచ్చే వసంతపంచమి నుంచి రతసప్తమి వరకూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

బల్కమ్ పేట్ యల్లమ్మ దేవాలయం

బల్కమ్ పేట్ యల్లమ్మ దేవాలయం

P.C: You Tube

పార్వతీదేవి యల్లమ్మ రూపంలో హైదబాద్ లోని బల్కమ్ పేటలో కొలువై ఉందని చెబుతారు. ఈ దేవాలయం 15వ శతాబ్దం నుంచి ఉందని చెబుతారు. అటు పై 1919లో ఈ దేవాలయాన్ని పున: నిర్మించారు. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా చెబుతారు.

బావి నీటితో స్నానం

బావి నీటితో స్నానం

P.C: You Tube

ఈ ఆలయం వెనుక ఉన్న బావిలోని నీటితో స్నానం చేస్తే వ్యాధులన్నీ సమిసిపోతాయని చెబుతారు. ఆ నీటిని తీర్థంగా కూడాతీసుకుంటారు. చిన్నమస్తానమ్మ దేవి ప్రతి రూపంగా యల్లమ్మను పూజిస్తారు.

అమీర్ పేట కనకదుర్గ దేవాలయం

అమీర్ పేట కనకదుర్గ దేవాలయం

P.C: You Tube

శ్రావణ మాసంలో ఎక్కువ మంది సందర్శించే దేవాలయాల్లో అమీర్ పేట కనకదుర్గ దేవాలయం కూడా ఒకటి. శ్రావణ శుక్ల లక్ష్మీ పూజ, శ్రావణ మంగళగౌరీ పూజ, వరలక్ష్మీ పూజ, చాలా బాగా జరుగుతాయి. ఈ దేవాలయాన్ని ప్రాచూర్యంలోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా క`షి చేస్తోంది. అదనపు నిధులు ఇచ్చి స్థానికులతో ప్రత్యేక ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది.

ఉజ్జయినీ మహాకాళి, సికింద్రాబాద్

ఉజ్జయినీ మహాకాళి, సికింద్రాబాద్

P.C: You Tube

హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మీద ఈ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి దేవాలయం నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. ఉజ్జయినీ మహాకాళి ప్రతి రూపమే ఇక్కడ ఉందని భావిస్తారు. అప్పట్లో కలరా వ్యాప్తి చెందకుండా చడటానికి ఈ ఉజ్జయినీ మహాకాళిని ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు.

 లక్ష్మీ విగ్రహం కూడా

లక్ష్మీ విగ్రహం కూడా

P.C: You Tube

ప్రతి రోజూ ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మహాకాళి అమ్మవారితో పాటు మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా శుక్ర, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.

కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం

కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం

P.C: You Tube

ఈ దేవాలయాన్ని కకాతీయ ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1143లో నిర్మించినట్లు చెబతారు. జంటనగరాల్లో ఉన్న అతి ప్రాచీన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయంలో శ్రావణ శనివారాలు, మంగళవారాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.

చిలకూరి బాలాజీ దేవాలయం

చిలకూరి బాలాజీ దేవాలయం

P.C: You Tube

అతి ప్రాచీనమైన చిలకూరి బాలాజీ దేవాలయంలో వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ దేవాలయాన్ని వీసా బాలాజీ దేవాలయంల అని అంటారు. ఉస్మాన్ సాగర్ ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఉంది. కేవలం శ్రావణ మాసంలోనే కాకుండా నిత్యం ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు స్వామి వారిని సందర్శించుకొంటూ ఉంటారు.

కేసర రామలింగేశ్వర స్వామి

కేసర రామలింగేశ్వర స్వామి

P.C: You Tube

శ్రావణ మాసంలో కేసర రామలింగేశ్వర స్వామి దేవాలయాలనికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శైవులు ఈ దేవాలయాన్ని సందందర్శించే వారి సంఖ్య ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. దీనిని కీసరగుట్ట అని కూడా అంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X