Search
  • Follow NativePlanet
Share
» »కేరళలోని మనోహర సోయగాల ఊయల..తంగస్సేరి బీచ్

కేరళలోని మనోహర సోయగాల ఊయల..తంగస్సేరి బీచ్

PC- Arunvrparavur

ఈశాన్య రుతుపవన శోభకు ప్రకృతి పరచిన అందాల వేదిక అయిన కేరళలోని కొబ్బరాకుల గాలి మనసు మీద ఏ మంత్రం వేస్తుందో, మరేం మాయ చేస్తుందో మాటల్లో చెప్పలేంగానీ, వానాకాలంలో కేరళ మనోహర సోయగాల ఊయల అవుతుందంటే అతిశయోక్తి కానేకాదు.

అందుకేనేమో... ప్రపంచాన్నంతటినీ సృష్టించిన తరువాత విశ్రాంతి తీసుకోవాలని అనిపించిందట దేవుడికి. అప్పుడే తాను ఉండేందుకు ఓ సుందరమైన ప్రదేశాన్ని సృష్టించాలని అనుకున్నాడట. అందుకోసం నిత్యం పచ్చదనంతో కళకళలాడుతూ, ప్రశాంతత తొణికసలాడే ప్రాంతమైతే మరీ బాగుంటుందని ఆలోచించి "కేరళ"ను సృష్టించాడట. అందుకే అది "గాడ్స్ ఓన్ కంట్రీ"గా పేరుగాంచిందని స్థానికులు చెబుతుంటారు. ఓసారి కేరళలో అడుగెడితే అది నిజమని నమ్మకుండా ఉండలేం.

"గాడ్స్ ఓన్ కంట్రీ"గా పేరుగాంచిన కేరళలో ముందుగా చెప్పుకోవాల్సింది 600 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్ర తీర ప్రాంతం గురించే. ఈ రాష్ట్రంలో ఉన్న 14 జిల్లాలకుగానూ... పదకొండు జిల్లాలలో విస్తరించి ఉన్న ఈ సముద్ర తీర ప్రాంతం.. ఆ ప్రాంతవాసులకు ప్రకృతి ప్రసాదించిన అతి గొప్ప వరం.

మలబార్ తీరంలో విహారానికి అనువైన బీచ్‌లు లెక్కలేనన్ని

మలబార్ తీరంలో విహారానికి అనువైన బీచ్‌లు లెక్కలేనన్ని

పోర్చుగీసు పర్యాటకుడు వాస్కోడిగామా తొలిసారిగా విడిది చేసిన కప్పాడ్, తిరువనంతపురంలోని కోవలం బీచ్‌లు కేరళలో ప్రధానంగా పేరెన్నిగన్నవి. వాణిజ్యానికి ఉపయోగపడుతూ నిత్యం కోలాహలంగా ఉండే ఈ బీచ్‌లలో, మలబార్ తీరంలో విహారానికి అనువైన బీచ్‌లు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ దేనికదే సాటి. కోజికోడ్, వర్కల, తంగస్సేరి.

Joseph Jayanth

అరేబియా సముద్ర తీరంలో ఓ పాత ఓడరేవు పట్టణం

అరేబియా సముద్ర తీరంలో ఓ పాత ఓడరేవు పట్టణం

కొల్లం లేదా క్విలాన్ , అరేబియా సముద్ర తీరంలో ఓ పాత ఓడరేవు పట్టణం తంగస్సేరి. ఇది అష్టముడి సరస్సు మీద ఉంది. ఈ ప్రదేశం రోమన్ల కాలం నుండి నిరంతర వాణిజ్య కీర్తిని కలిగి ఉంది. తంగస్సేరి పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటీష్ ప్రాంతాల వారసత్వంగా ఉంది. పోర్చుగీస్ మరియు డచ్ కోటల అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి.

Photo Courtesy: Surajram Kumaravel

సూర్యాస్తమయ సమయంలో సూర్యుని బంగారు కిరణాలు ఇసక తిన్నెల మీద

సూర్యాస్తమయ సమయంలో సూర్యుని బంగారు కిరణాలు ఇసక తిన్నెల మీద

తంగస్సేరి బీచ్ కొల్లాం కి 5 కి.మీ. దూరం లో ఇన్న తంగస్సేరి బీచ్ సేదతీరడానికి, రిలాక్స్ అవటానికి సరైన స్పాట్. తంగస్సేరి బీచ్ యొక్క రమణీయ అందాలు చారిత్రక ప్రాముఖ్యత సందర్శకులని ఆకర్షిస్తాయి. ఈ బీచ్ సాయంత్రానికల్లా సందడిగా మారుతుంది. సూర్యాస్తమయ సమయంలో సూర్యుని బంగారు కిరణాలు ఇసక తిన్నెల మీద పడి ఈ ప్రాంతమంతా భూతల స్వర్గంలా కనిపిస్తుంది.

Mujib MK

144 అడుగుల ఎత్తు గల పాత లైట్ హౌస్ ఈ బీచ్ యొక్క

144 అడుగుల ఎత్తు గల పాత లైట్ హౌస్ ఈ బీచ్ యొక్క

144 అడుగుల ఎత్తు గల పాత లైట్ హౌస్ ఈ బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణ.902 లో బ్రిటిష్ వారిచే నిర్మించబడ్డ ఈ లైట్ హౌస్ లోకి మధ్యాహ్నం 3 : 30 నుండి సాయంత్రం 5 : 30 వరకు సందర్శకులని అనుమతిస్తారు. బీచ్ సమీపంలో పోర్చుగీసు కోట లే కాక 18 వ శతాబ్ద ప్రాంతం లో నిర్మించిన చాలా చర్చిలు ఈ బీచ్ దగ్గర్లో ఉన్నాయి. ఈ బీచ్ ఈదడానికి, జలక్రీడలకి, విహారానికీ సరైన ప్రదేశం.

Photo Courtesy: Joachim Specht

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

విమాన మార్గం: తంగస్సేరికి సమీప విమానాశ్రయం త్రివేండ్రంకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, మీరు ప్రత్యక్ష క్యాబ్‌ను తీసుకోవచ్చు లేదా తంగస్సేరి చేరుకోవడానికి ప్రజా రవాణాను ఉపయోగించవచ్చు. విమానాశ్రయం నుండి మీ గమ్యాన్ని చేరుకోవడానికి మీకు సుమారు 2 గంటల సమయం పడుతుంది.

రైలు మార్గం: కొల్లం రైలు ద్వారా మిగతా అన్ని నగరాలు మరియు పట్టణాలకు బాగా అనుసంధానించబడి ఉంది. అందువల్ల, మీరు కొల్లంకు రైలు ద్వారా చేరుకుని అక్కడ నుండి, తంగస్సేరి చేరుకోవడానికి ఒక క్యాబ్ తీసుకోవచ్చు.

రోడ్ మార్గం: తంగస్సేరి ప్రశంసనీయమైన రహదారి కనెక్టివిటీని కలిగి ఉంది, అందువల్ల ఇది రహదారి ద్వారా సులభంగా చేరుకోవచ్చు. తంగస్సేరి చేరుకోవడానికి మీరు డైరెక్ట్ బస్సులో లేదా డైరెక్ట క్యాబ్‌ను తీసుకోవచ్చు.

PC- Arunvrparavur

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X