Search
  • Follow NativePlanet
Share
» »బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ !

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ !

తంజావూర్ బృహదేశ్వర ఆలయానికో విశిష్టత ఉంది. సుమారు వెయ్యేళ్ల చరిత్రతో ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది.

By Venkatakarunasri

తంజావూర్ బృహదేశ్వర ఆలయానికో విశిష్టత ఉంది. సుమారు వెయ్యేళ్ల చరిత్రతో ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. పూర్వం 'తంజన్' అనే రాక్షస రాజు ఏలుబడిలో వైభవోపేతంగా విరాజిల్లిన ఈ ప్రాంతం ఆ తర్వాతికాలంలో అతడి పేరుతోనే ప్రభంజనాన్ని సృష్టించింది. తమిళనాట " ధాన్యాగరం" గా అభివర్ణింపబడిన తంజావూర్ చోళుల కాలంలో స్వర్ణయుగాన్ని చవి చూసింది. ఒకనాడు - ఈ ప్రాంతం కొండలూ గుట్టలతో నిండి ఉండేది. బృహదేశ్వర ఆలయాన్ని పట్టణ నడిబొడ్డున నిర్మింపజేసి - ఆ చుట్టూ పల్లెటూళ్లకు రూపకల్పన చేయటంతో.. ఇటు మతపరంగా.. రాజ్యపరంగా సువర్ణాధ్యాయనాన్ని లిఖించింది. తంజావూర్ , కళ నిర్మాణ పరిణామంలో ఒక మైలురాయిగానిలిచింది. ఈ ఆలయం యునెస్కో సంస్థ చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడినది.

తంజావూర్ ఆరు ఉప జిల్లాలుగా ఉండి,అదే పేరుతో జిల్లాలో ఉన్న ఒక మునిసిపాలిటీ. తంజావూర్ ను తమ రాజధానిగా చేసుకోవటం వల్ల చోళ రాజులు పరిపాలనా కాలంలో ప్రాముఖ్యత పెరిగింది.తంజావూరు, 18 వ శతాబ్దం చివరలో దేశంలోని సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉన్నది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఆ గుర్తింపుని ఇప్పటికి కాపాడుకుంటుంది.

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర దేవాలయం

తంజావూర్ లోనే కాదు... దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా ముద్రపడ్డ ఈ ఆలయం, శిల్పకళలకూ సాంస్కృతిక చారిత్రక ప్రాభవానికి ప్రతీకగా నిలిచింది బృహదేశ్వర దేవాలయం. ఇక చరిత్ర విషయానికొస్తే , క్రీ.శ.11 వ శతాబ్దంలో రాజరాజ చోళ-1 తన సైనిక బలగాలతో చుట్టుపక్కల ప్రాంతాలపై యుద్ధభేరి మోగించి.. తన ఏలుబడిలోకి తెచ్చుకున్న సందర్భంగా బృహదేశ్వర ఆలయంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడని చరిత్ర కథనం. ఆనాటి నుంచీ రాజరాజ చోళునికి ఎదురనేది లేకుండా పోయింది. తమ రాజ్యాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా చేయటమే కాదు.. పదుగురికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్ది చూపించాడు.ఇదంతా ఎలా జరిగిందంటే? ఇది పరమశివుని కృప అంటాడు. అందువల్లనేనేమో - నిత్యం ధూప దీప నైవేద్యాలతో.. భక్తుల శివనామ స్మరణతో బృహదేశ్వర ఆలయం కళకళ లాడుతూండేది. క్రీ.శ. 16 వ శతాబ్దంనాటికి ఈ ఆలయం మరిన్ని హంగులను పొదువుకుంది. 29 అడుగుల మందపాటి పునాదులతో.. ఎతైన స్తంభాలతో.. మరింత ఎతైన గోపురాలతో.. అలరారే ఈ ఆలయం పక్కన ‘అనాయ్‌కట్' నది ప్రవహించటం విశేషం. బృహదేశ్వర ఆలయ కుడ్యాలపై చోళులు, నాయక్‌ల కాలంనాటి శిలా శాసనాలు.. శిల్ప శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తూంటాయి.

Photo Courtesy: Arian Zwegers

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

మహానంది

ఈ ఆలయంలో సుమారు 12 అడుగుల ఎతైన శివలింగం సాక్షాత్కరిస్తూ భక్తులను ఆధ్యాత్మిక లోకాల్లో విహరింపజేస్తూంటుంది. అందుకు తగ్గట్టుగా.. ఆలయ ముఖ ద్వారంలో 12 అడుగుల మహానంది క్షేత్ర పాలకునిగా.. ద్వార పాలకునిగా పర్యవేక్షిస్తూండటం విశేషం. ఇది ఆలయ ముఖ ద్వారం వద్ద ప్రతిష్ఠించబడి ఉంటుంది.

Photo Courtesy: Arian Zwegers

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

వీడని మిస్టరీ

బృహదేశ్వరాలయంలో మనకు తెలియని ఒక ప్రత్యేక ఉంది అది ఏమిటంటే- గోధూళి వేళ ఈ ఆలయ ‘ఛాయలు' కనిపించవు. సంవత్సరం పొడవునా.. ఏ రోజూ సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు.. పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఏ రీతిన చూసినా.. ఇప్పటికీ వీడని మిస్టరీ గానే మిగిలింది.

Photo Courtesy: Varun Shiv Kapur

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

మొట్టమొదటి గ్రానైట్ దేవాలయం

ప్రపంచంలోనే మొదటిసారిగా పూర్తి స్థాయి గ్రానైట్‌ తో నిర్మించిన ఆలయం ఇది. ఐతే- వందల మైళ్ల దూరం వరకూ ఎక్కడా గ్రానైట్ అనేది కనిపించదు. గ్రానైట్ క్వారీల నుంచీ ఇక్కడి రాళ్లను ఏ విధంగా తీసుకువచ్చారో? ఎంత కాలం పట్టిందీ?? లాంటి ప్రశ్నలకు సమాధానం లేదనే చెప్పాలి. గ్రానైట్‌ పై శిల్పాలను మలచటం కష్టంతో కూడుకొన్న పని. అటువంటిది అంతదూరం నుంచి రాళ్లను తీసుకొచ్చి.. ఇక్కడ ప్రతిష్ఠించటానికి ఆనాటి శిల్పులు,కళాకారులు ఎంత శ్రమ పడ్డారో?? ఆలయ నిర్మాణానికి ఏడేళ్ల కాలం పట్టింది. ప్రతిరోజూ 50 టన్నుల గ్రానైట్ శిలలను తరలించేవారని ఆనాటి స్థానికుల కథనం. క్రీ.శ. 1003 నాటికి బృహదేశ్వర ఆలయానికి సంబంధించిన మహత్తర కార్యక్రమం ముగిసింది. ఆలయ శిఖరంపై నెలకొల్పిన ‘విమానం' 80 టన్నుల బరువు తూగుతుందని ఒక అంచనా. ఎతైన ఆ శిఖరంపైకి ఆ బరువైన రాతిని ఎలా చేర్చారో ఊహకందని విషయం.

Photo Courtesy: Jean-Pierre Dalbéra

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

సంగీత స్తంభాలు

ఆలయ ప్రవేశ ద్వారంలోకి ప్రవేశించగానే ముందుగా గణపతి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడి శిలలు వీక్షకులను అబ్బుర పరుస్తాయి. ఒక రాతిపై సుతారంగా మీటితే రాతి శబ్దం.. మరో రాతిపై మీటితే లోహ శబ్దం వినిపించటం ఇక్కడి ప్రత్యేకత. ఇవేకాకండా మరిన్ని రాళ్లు విభిన్న శబ్దాలను పలికిస్తాయి.

Photo Courtesy: Varun Shiv Kapur

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

పండుగలు

రాజరాజ చోళుని జన్మదినం సందర్భంగా ఇక్కడ ప్రతి నెల పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆ మహారాజు పేరిట ఉత్సవాలు పూజాదికాలు నిర్వహిస్తారు.అంతేకాకండా వైశాఖ మాసంలో తొమ్మిది రోజులపాటు బృహదేశ్వర ఆలయంలో జరిగే వేడుకలకు దేశ విదేశీ పర్యాటకులు భక్తులు హాజరై.. తమ మొక్కులను తీర్చుకుంటారు.ఇక ఆలయ వైభవాన్నీ.. శిల్ప కళాచాతుర్యాన్నీ వర్ణించటానికి మాటలు చాలవు. ఏమైతేనేం ఇంతటి మహోన్నత చరిత్ర గల ఆలయాన్ని తనివితీరా చూసి తరించాల్సిందే!!

Photo Courtesy: Arian Zwegers

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

మరాఠ ప్యాలెస్

ఈ ప్యాలెస్ ను మొదట తంజావూర్ నాయక్ వంశీయులు నిర్మించారు. వారి పతనం తరువాత ఇది మరాఠ అధికారిక నివాసంగా ఉండేటిది. 1674 నుండి 1885 వరకు తంజావూర్ ని పాలించిన భోంస్లే కుటుంబం దీనిని అధికారిక నివాసంగా మార్చుకుంది. ఈ కోట అప్పటి చరిత్రకు ఒక గుర్తుగా నిలిచింది. ఈ కోట 1799 వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్యంలోకి వెళ్ళకుండా ఉండటానికి కోటచుట్టూ రక్షణ వలయాలు ఏర్పాటు చేశారు. అంతే కాదు ఈ కోటకి దక్షిణం వైపున 190 అడుగుల ఎత్తులో గూడగోపురం అని పిలువబడే ఒక టవర్ లాంటి భవనం ఉంది.

Photo Courtesy: Jean-Pierre Dalbéra

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

సరస్వతి మహల్

లైబ్రరీ తంజావూర్ యొక్క సరస్వతి మహల్ లైబ్రరీ ఆసియాలోనే పురాతనమైన వాటిలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ తాళపత్ర మరియు తమిళ, మరాఠీ, తెలుగు, మరియు ఆంగ్ల భాషల సమూహంతో వ్రాయబడిన కాగితం పుస్తకాలపై అచ్చు ప్రతుల అసాధారణమైన సేకరణ ఉంది.సరస్వతి మహల్ లైబ్రరీ క్రీ.శ. 1535-1675 నుండి పాలించిన నాయక్ కింగ్స్ రాయల్ లైబ్రరీ ని ప్రారంభిచారు . 1918 వ సంవత్సరం నుండి ఈ లైబ్రరీ తమిళనాడు రాష్ట్ర నియంత్రణలో ఉంది.పబ్లిక్ లైబ్రరీ యొక్క కార్యకలాపాలకు కంప్యూటరీకరణ 1998 లో ప్రారంభమైంది.ఇక్కడ 1791 లో ఆమ్స్టర్ ముద్రించిన మద్రాస్ అల్మానాక్ మరియు 1807 లో ముద్రించిన చిత్ర బైబిల్ వంటి అరుదైనవి ఈ గ్రంథాలయంలో ఉంచబడ్డాయి.

Photo Courtesy: Wiki-uk

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

బృహదేశ్వర ఆలయ నీడ మిస్టరీ ..!

తంజావూర్ కు ఎలా వెళ్ళాలి??

విమానాశ్రయం

తంజావూర్ కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం.. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం తంజావూర్ కి 56 కి. మీ. దూరంలో ఉంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ పట్టణం, విజయవాడ తదితర నగరాల నుంచి నిత్యం ఇక్కడికి విమానాలు తిరుగుతూనే ఉంటాయి.

రైల్వే స్టేషన్

తంజావూర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది ఒక ప్రధాన రైల్వే జంక్షన్ గా తీర్చిదిద్దబడినది. ఇక్కడికి నిత్యం రైళ్లు పరుగెడుతూనే ఉంటాయి. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు. రోడ్డు సదుపాయం తంజావూర్ కి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. దగ్గరలోని తిరుచిరాపల్లి నుంచి నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. చెన్నై, మధురై తదితర ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు సదుపాయం బాగానే ఉంది.

జల మార్గం

తంజావూర్ కి దగ్గరలోని ఓడరేవు నాగపట్నం ఓడరేవు. ఇది తంజావూర్ కి 84 కి. మీ. దూరంలో తూర్పు వైపున ఉన్నది. అంతేకాక కరైకల్ ఓడరేవు నుంచి కూడా తంజావూర్ కి చేరుకోవచ్చు. ఇది కూడా సుమారుగా 94 కి. మీ. దూరంలో ఉన్నది.

Photo Courtesy: Prince Gladson

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X