Search
  • Follow NativePlanet
Share
» » మహా శక్తి ఉత్సవం ...అమ్బుబాచి మేళ !

మహా శక్తి ఉత్సవం ...అమ్బుబాచి మేళ !

అస్సాం లోని కామాఖ్య టెంపుల్ ప్రతి సంవత్సరం జూలై లో జరిగే అమ్బుబాచి ఉత్సవాలకు ప్రసిద్ధి. మహిళలపై నేరాలు అధికం అవుతున్న ఈ రోజులలో ఈ ఉత్సవ వేడుక మహిళా ఔన్నత్యానికే ప్రతీకగా నిలుస్తుంది. కామాఖ్య దేవాలయం యొక్క గొప్పతనం అద్భుతమైన ఆ దేవాలయ శిల్ప శైలి లో కలదు.

ఈ దేవాలయం వివిధ కాలాలలో నాలుగు భాగాలలో నిర్మాణం చేసారు. మొదటి భాగం అయిన 'గర్భ గృహం' చుట్టూ మూడు మండపాలు నిర్మించారు. ఈ గర్భ గృహం ఒక భూగర్భ గుహలో చేసారు. అక్కడి రాతి లో పది అంగుళాల లోతు కల కాలువలో ఎల్లపుడూ నీరు ప్రవహిస్తూ వుంటుంది. దీనిని మాత కామాఖ్య యొక్క 'యోని' లేదా జననాన్గంగా భావిస్తారు.

దేవాలయంలో యోని మండలంగా కూడా పిలువబడే ఈ భాగం భూ దేవి యొక్క సృష్టిగా మరియు ఆమె మహిమాన్విత శక్తి గా భావించి అత్యధిక భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కామాఖ్య దేవాలయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ అమ్బుబాచి మేళ ఉత్సవం మాత యొక్క నెలసరి ఋతుస్రావం గా భావిస్తారు. మాతను భూదేవి గా కొలుస్తూ ఆరాధిస్తారు. అస్సాం భాషలో 'అంబు బాచి ' అంటే 'నీరు ఉబుకుట' గా చెపుతారు. అంటే ఈ వర్ష రుతువు సమయంలో భూమిపై కల నదులు, ఇతర నీటి సరస్సులన్నీ ఉప్పొంగి నీటితో కళకళ లాడుతూ ఉంటాయని అర్ధం చెపుతారు.

 మహా శక్తి ఉత్సవం ...అమ్బుబాచి మేళ

Photo Courtesy: Carol Mitchell

మొత్తంగా నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలలో మొదటి మూడు రోజులు మాత యొక్క నెలసరి రుతు చక్రంగా భావించి సమీపంలో కల అన్ని దేవాలయాలు మూసి వేస్తారు. మార్పులు జరుగుతున్న కారణంగా, మాతకు ప్రశాంతత ను ఇవ్వటమే దీని వెనుక లక్ష్యంగా చెపుతారు. నాల్గవ రోజున మాత ఆశీర్వాదం కొరకు వచ్చే భక్తులకు దేవాలయం తలుపులు తెరుస్తారు. అపుడు భక్తులకు ఇచ్చే ప్రసాదం ఒక ఎర్రటి బట్టగా వుంటుంది. ఆమె శక్తికి మరియు సంక్షేమానికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ కామాఖ్య టెంపుల్ నీలాచల్ కొండ పై కలదు. కొండపైకి ఎక్కేందుకు మెట్లు కలవు. కొండపై భాగాన కల ఈ దేవాలయ సముదాయంలో కామాఖ్య దేవాలయం తో పాటు మైనా దేవి టెంపుల్, మరియు విష్ణు మూర్తి గుడి కూడా కలవు.

మాత కామాఖ్య ను కోర్కెలు తీర్చే జ్మాతగా, సంతానం అనుగ్రహించే దేవతగా మరియు ముక్తిని ప్రసాదించే మోక్ష దాయనిగా కొలుస్తారు. ఈ దేవాలయానికి భక్తులు దేశ వ్యాప్తంగా వస్తారు. తమ పూజలు స్వీకరించి కోరుకున్న కోరికలు తీరుస్తుందని గాధంగా నమ్ముతారు.

కామాఖ్య టెంపుల్ ఎలా చేరాలి ?
గౌహతి నగరానికి 8 కి. మీ. ల దూరంలో కల ఈ టెంపుల్ ను టాక్సీ లేదా బస్సు లలో చేరవచ్చు. సమీప విమానాశ్రయం గౌహతి ఎయిర్ పోర్ట్ సుమారు 20 కి. మీ. ల దూరంలో కలదు. సమీప రైలు స్టేషన్ టెంపుల్ నుండి 6 కి. మీ. ల దూరంలో కలదు.

గౌహతి హోటల్ వసతులకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X