Search
  • Follow NativePlanet
Share
» »ఇండియా లోని అద్భుత లోయలు !

ఇండియా లోని అద్భుత లోయలు !

భారత దేశం దానిలోని అందమైన సరస్సులు, జలపాతాలు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, వాటిలోని అందమైన లోయలకు పేరుగాంచినది. ఈ లోయలు, ఎన్నో సాహసాలకు, ప్రకృతి దృశ్యాల విహారాలకు ఒక స్వర్గంలా వుండి అనేక మంది టూరిస్ట్ లను ఆకర్షిస్తున్నాయి. ఈ వాలీ లలో అద్భుతమైన వాటర్ ఫాల్స్, అందమైన పూవులు మరియు ఎన్నో రకాల జంతువులకు, వృక్ష సంపదకు నిలయమైన నేషనల్ పార్క్ లు కలవు. అద్భుతమైన అందాలు కల ఈ వాలీ లను కొన్నింటిని మీకు పరిచయం చేస్తున్నాం. పరిశీలించండి.

ఇండియా లోని అద్భుత లోయలు

 వాలీ అఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్

వాలీ అఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ లోని చంబోలి జిల్లాలో కల వాలీ అఫ్ ఫ్లవర్స్ లోయలో అనేక రకాల అందమైన సుగంధ వాసనల పూవులు కలవు. ఇక్కడ పర్యాటకులు సుమారుగా 300 రకాలకు మించిన పూల జాతులను చూడవచ్చు. పూవులే కాకుండా, అనేక రకాలు కల వన్య జంతువులు కూడా చూడవచ్చు.

జన కార్ వాలీ, లడఖ్

జన కార్ వాలీ, లడఖ్

జన కార్ వాలీ ఇండియా లో ఒక మారు మూల లడఖ్ ప్రాంతంలో కల ఒక వాలీ. ఈ ప్రదేశం రివర్ రాఫ్టింగ్ సౌకర్యాలకు ప్రసిద్ధి. జన స్కార్ వాలీ చుట్టూ కల పరిసరాలు దట్టమైన పచ్చదనంతో అందంగా వుంటాయి. వింటర్ సీజన్లో వాలీ అంతా పూర్తిగా మంచు తో కప్పబడి వుంటుంది. ఈ సమయం వాలీలో చాదర్ ట్రెక్కింగ్ అంటే మంచుగడ్డల సరస్సులో ట్రెక్కింగ్ అనేది చేస్తారు. ఇండియాలో అడ్వెంచర్ పర్యటనలకు లడఖ్ ప్రాంతం ప్రధానమైనది.

సైలెంట్ వాలీ, కేరళ

సైలెంట్ వాలీ, కేరళ

నీలగిరి కొండలలో కల ఈ సైలెంట్ వాలీ ఎన్నో సహజ అందాలకు, ఆకర్షణలకు నిలయంగా వుంటుంది. లోయ అంతా ప్రశాంతంగా చల్లటి వాతావరణంతో వుంటుంది. ఇక్కడ మీరు అనేక రకాల వృక్ష సంపదను, జంతు జాలాలను చూసి ఆనందించవచ్చు.

దీజూకో వాలీ, నాగాలాండ్

దీజూకో వాలీ, నాగాలాండ్

దీజూకో వాలీ నాగాలాండ్ లో కలదు. ఈ ప్రదేశం పర్యాటకులు చాలామందికి తెలియని ప్రదేశం. ఇక్కడ సహజ సాన్క్చురి లు కలవు. నాగాలాండ్ ప్రదేశ అందాలు అభినందించేందుకు ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. ఇండియా లో ట్రెక్కింగ్ ప్రదేశాలలో దీజూకు వాలీ అద్భుత సౌకర్యాలు కలిగి వుంది. ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. వింటర్ లో, ఈ వాలీ పూర్తిగా మంచుతో కప్పబడి వుంటుంది. సమ్మర్ వచ్చిందంటే చాలు, వాలీలో కల అందమైన ఎన్నో రకాల పూవులు వికసించి, అందాలతో పాటు, సువాసనలు కూడా వెదజల్లుతూ వుంటాయి.

కాంగ్రా వాలీ, హిమాచల్ ప్రదేశ్

కాంగ్రా వాలీ, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ లోని కాంగ్రా వాలీలో అనేక నిరంతరం పారే నీటి ప్రవాహాలు కలవు. వీటి చుట్టూ, దట్టమైన అడవులు పచ్చగా కనపడుతూ వుంటాయి.వింటర్ వచ్చిందంటే, ఈ పర్వతాలు, మంచుతో కప్పబడి వుంటాయి. ఇక్కడ టీ గార్డెన్స్, పైన్ చెట్లు, కలవు. కాంగ్రా వాలీ లో పాలంపూర్ హిల్ స్టేషన్, టెంపుల్స్, ఒక ఫోర్ట్ మరియు దలైలామా నివాసం, ధర్మశాల మొదలైనవి ప్రసిద్ధ ఆకర్షణలు.

అరకు వాలీ, ఆంధ్ర ప్రదేశ్

అరకు వాలీ, ఆంధ్ర ప్రదేశ్

అరకు వాలీ ఆంద్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో కాలేదు. ఈ హిల్ స్టేషన్ చుట్టూ అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు, పచ్చటి అడవులు, కాఫీ తోటలు కలవు. తూర్పు కొండలలో కల ఈ వాలీ కొన్ని ప్రధాన ఆకర్షణలు కలిగి వుంది. అవి ఈ ప్రాంత అటవీ తెగల ప్రజలు తయారు చేసే హస్త కళా వస్తువుల ప్రదర్శనా మ్యూజియం, వారి జీవన విధానాలు ప్రతి బిమ్బించే వస్తువులు, మరియు ప్రసిద్ధి గాంచిన బొర్రా గుహలు.

షరావతి వాలీ, కర్ణాటక

షరావతి వాలీ, కర్ణాటక

అపురూపమైన ఈ షరావతి వాలీ కర్నాటక లోని షిమోగా లో కలదు. ఈ ప్రదేశంలో ఇంకనూ చూడవలసినవి ప్రసిద్ధ జోగ్ ఫాల్స్ మరియు షరావతి వైల్డ్ లైఫ్ సంక్చురి. షరావతి వాలీ ట్రెక్కింగ్, వాటర్ స్పోర్ట్స్ లకు కూడా ఇండియా లోనే ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రియులకు ఒక స్వర్గం వలే వుంటుంది.

కాశ్మీర్ వాలీ, కాశ్మీర్

కాశ్మీర్ వాలీ, కాశ్మీర్

కాశ్మీర్ లోయ చాలా సుందరమైనది, చాలా విశాలమైనది. కాశ్మీర్ వాలీ అందాలు, పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. చుట్టూ మంచు తో కప్పబడిన పర్వత శిఖరాలు, పుష్కలమైన పచ్చదనం కలిగి వుంటుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు జమ్మూ కాశ్మీర్ టూరిజం శాఖ అనేక సదుపాయాలను కల్పిస్తోంది. 'భూమి పై స్వర్గం' గా పేరొందిన ఈ కాశ్మీర్ లోయ టూరిస్ట్ లకు ఒక హాట్ స్పాట్ గా వుంటుంది. ఈ లోయలో దళ్ లేక్, గుల్మార్గ్ హిల్ స్టేషన్ ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడ అనేక సినిమా షూటింగ్ లు కూడా జరుగుతాయి.

నియోరా వాలీ, వెస్ట్ బెంగాల్

నియోరా వాలీ, వెస్ట్ బెంగాల్

నియోరా వాలీ, పశ్చిమ బెంగాల్ లో కలదు. ఇది వెస్ట్ బెంగాల్ లోని కాలింపోంగ్ హిల్స్ లో కలదు. అందమైన ఈ వాలీ చుట్టూ, దట్టమైన అడవులు, పచ్చటి టీ గార్డెన్ లు, ఎగుడు, దిగుడు పర్వతశ్రేణులు కలవు. వీటితో పాటు, ఎన్నో అందమైన జలపాతాలు, ప్రవాహాలు, కొన్ని ప్రత్యేక రకాల వన జీవులు ఇక్కడ మీరు చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X