Search
  • Follow NativePlanet
Share
» »కొత్తు పరాట, పీతల వేపుడు, పొంగల్ ఇవన్నీ ఇక్కడ చూస్తే మరెక్కడా..

కొత్తు పరాట, పీతల వేపుడు, పొంగల్ ఇవన్నీ ఇక్కడ చూస్తే మరెక్కడా..

తమిళనాడు రాజధాని చెన్నైలో స్ట్రీట్ ఫుడ్ కు ప్రాచూర్యం పొందిన ప్రాంతాల గురించి కథనం.

చెన్నై దక్షిణ భారత దేశంలోని ప్రముఖ పర్యాటక నగరం. ఇక్కడ ప్రకృతి సౌదర్యంతో పాటు చారిత్రాత్మకంగా, పురాణ పరంగా ప్రఖ్యాతి గాంచిన ఎన్నో దేవాలయాలను, ప్రాంతాలను మనం చూడవచ్చు. వాటిని చూడటంతోనే మన కడుపు నిండదు కదా? ఆ ప్రాంతాలను చూడాలంటే మనకు శక్తి కావాలి కదా? ఇందుకోసం ఆత్మారాముడిని సంతృప్తిపరచాలి కదా? అయితే ఫై స్టార్ హోల్స్, పెద్ద పెద్ద రెస్టోరెంట్ల దగ్గరికి వెళితే మన పర్స్ ఖాళీ అవడం మినహా సంతృప్తిగా తినలేం అన్నది బహిరంగ రహస్యం. సమస్య పరిష్కారం కోసం చెన్నైలో చాలా ప్రాముఖ్యం చెందిన స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. చాలా తక్కువ ధరకే, రుచి, శుచికరమైన పదార్థాలను మనం తినవచ్చు. అటువంటి ప్రాంతాలు, అక్కడ దొరికే పదార్థాలకు సంబంధించిన కథనం మీ కోసం...

కపలీశ్వర్ దేవాలయం ఫుట్ స్ట్రీట్

కపలీశ్వర్ దేవాలయం ఫుట్ స్ట్రీట్

P.C: You Tube

చెన్నై వెళ్లారు. మీరు వెజిటేరియన్స్. మీకు తక్కువ ఖర్చులో వేర్వేరు రుచుల్లో అత్యంత టేస్టీ ఫుడ్ తినాలని ఉంటే కపిలేశ్వర్ దేవాలయం ఫుడ్ స్ట్రీట్ కు మించిన ప్రాంతం మరొకటి ఉండదు. దేవాలయం వీధుల్లో ఇడ్లీ, వడ సాంబర్ నుంచి ప్రతి ఒక్క ఫలహారం దొరుకుతుంది. ముఖ్యంగా ఈ వీధిలో పొంగల్ తో పాటు రోజ్ మిల్క్ రుచి చూడకుండా ఎవరూ ముందుకు కదలరు.

మెరినాబీచ్ బజ్జీ, ఫిష్ ఫ్రై

మెరినాబీచ్ బజ్జీ, ఫిష్ ఫ్రై

P.C: You Tube

చెన్నై అన్న తక్షణ మనకు మెరినా బీచ్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ దొరికే స్ట్రీట్ ఫుడ్ మరెక్కడా మనకు దొరకదు. బజ్జీ నుంచి ఫిష్ ఫ్రై వరకూ వేడివేడిగా మనకు అందిస్తారు. ముఖ్యంగా మిర్చి బజ్జీ, చెట్నీతో కలుపుకొని తినడాన్ని ఇక్కడికి వచ్చినవారు ఎవరూ మిస్ చేసుకోరూ. అదే విధంగా అప్పుడే పట్టి తెచ్చిన చేపలు, పీతల ఫ్రై కూడా మన నాలుకకే కాకు మనసుకు కూడా పసందు రుచులను అందజేస్తుంది.

శ్రీనివాస రోడ్, టీ నగర్

శ్రీనివాస రోడ్, టీ నగర్

P.C: You Tube

టీ నగర్ లో సాయంత్రం పూట శ్రీనివాస్ రోడ్ కిక్కిరిసి ఉంటుంది. ముఖ్యంగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేవారిలో చాలా మంది ఈ రోడ్డులో దొరికే చిరుతిళ్ల రుచి చూడందే ఇంటికి తిరిగి వెళ్లరు. ముఖ్యంగా కింగ్ ఫిష్ ఫ్రై, కొత్తు పరాట, చికెన్ ఫ్రై చాలా ఫేమస్.

మింట్ స్ట్రీట్, షావుకార్ పేట్

మింట్ స్ట్రీట్, షావుకార్ పేట్

P.C: You Tube

ఈ ప్రాంతంలో ఎక్కువగా హింది మాట్లాడేవారు ఉంటారు. అందువల్ల ఈ ప్రాంతంలో మనకు ఎక్కువగా నార్త్ ఇండియన్ డిషెస్ దొరుకుతుంటాయి. ముఖ్యంగా జిలేబీ, సమోసా, పానీ పూరి ఇక్కడ చాలా ఫేమస్. అందువల్ల ఈ వీధిలోకి వెలితే మనకు ఎక్కువగా భయ్యా...కుచ్ ఖిలాదో వంటి పదాలే వినిపిస్తుంటాయి.

బర్మాస్ స్టాల్స్, బీచ్ రోడ్

బర్మాస్ స్టాల్స్, బీచ్ రోడ్

P.C: You Tube

బీచ్ రోడ్ లో మనకు బర్మా బజార్ కనిపిస్తుంది. ఇక్కడ చైనీస్ రకపు ఫుడ్ కల్చర్ మనం చూడవచ్చు. రూ.50 లకే నూడుల్స్, ఫిష్ సూప్ తదితరాలను రుచి చూడవచ్చు. ఫ్యాటీ ఫుడ్ కాని ఈ చిరుతిండిని తినడానికి నగరవాసులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X