Search
  • Follow NativePlanet
Share
» »ఈ గుహలు ప్రకృతి అందాలకు నెలవు

ఈ గుహలు ప్రకృతి అందాలకు నెలవు

By Karthik Pavan

వానా కాలం వచ్చేసింది.. హాట్‌హాట్‌ సమ్మర్‌ నుంచి స్వాంతన పొందుతూ హ్యాపీగా ఒక ట్రిప్‌ వేయాలనుకునేవాళ్లకు ఇది సరైన సమయం. వర్షాకాలంలో హిల్‌స్టేషన్స్‌కంటే అద్భుతమైన ప్రాంతాలు ఇంకేముంటాయి.? అలాంటి హిల్‌స్టేషన్స్‌ ల్లో విశాఖ జిల్లాలోని అరకు ఒకటి. అరకు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించడమంటే ప్రకృతితో మమేకమవడమే. ఎటుచూసినా పచ్చని కొండలు, పచ్చిక బయళ్లతో వానాకాలంలో మరింత అందంగా అరకు వ్యాలీ కనిపిస్తుంది. అటువంటి అరుకు వ్యాలీలో మరింత అందమైన, ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం బొర్రాగుహలు. ఇంతకీ ఏమిటీ బొర్రా గుహల స్పెషాలిటీ.? అక్కడకు ఎలా వెళ్లాలి? వెళ్లేముందు ఏయే సమాచారం తెలుసుకోవాలి? అన్న విషయాలు నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం

1. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి

1. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి

Image Source:

బొర్రా గుహలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటిప్రవాహం వల్ల కరిగిన రాళ్లు ఇక్కడ శిలలుగా ఏర్పడి ఎంతో అందంగా కనిపిస్తాయి. సహజంగా ఏర్పడిన ఈ గుహలు పదిలక్షల ఏళ్లనాటివని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు .

2. ఈ శిలలు ఎలా ఏర్పడ్డాయి?

2. ఈ శిలలు ఎలా ఏర్పడ్డాయి?

Image Source:

బొర్రా గుహల పక్కనే గోస్తనీ నది ప్రవహిస్తుంటుంది. సహజంగా నీటిలో ఉండే హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో కలిసినప్పుడు అది ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమంగా కరిగిపోతుంది. ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల కొంత కాలం తర్వాత గుహలు ఏర్పడతాయి.

3. ప్రచారంలో ఉన్న కథలు

3. ప్రచారంలో ఉన్న కథలు

Image Source:

ఈ గుహలను ఎవరు గుర్తించారనే అంశంపై రకరకాల కథలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం గుహలపై గడ్డితింటున్న ఒక ఆవు ప్రమాదవశాత్తూ గుహలోపల పడిపోయిందని, దానిని వెతుక్కుంటూ వెళ్లిన కాపరి.. మొట్టమొదటిసారిగా ఈ బొర్రాగుహలను చూశాడని చెబుతారు. అదే విధంగా అక్కడ అతనికి కనిపించిన లింగాకారానికి ప్రస్తుతం గిరిజనులు గుడి కట్టి పూజలు చేస్తున్నారు.

4. బొర్ర గుహల గురించి మరికొంత

4. బొర్ర గుహల గురించి మరికొంత

Image Source:

-- బొర్రా గుహల నుంచి నేరుగా గోస్తనీ నదికి దారి ఉంది. అయితే, అది ప్రమాదకరం కావడంతో ఆ దారిని పురావస్తు శాఖ మూసివేసింది
-- భారతదేశంలో అత్యంత పొడవైన, లోతైన గుహలు ఇవే
-- ఈ గుహలోపల ఏడాది పొడవునా చల్లటి వాతావరణం ఉంటుంది.
-- 1990లో రాష్ట్ర పర్యాటక శాఖ బొర్రా గుహలను తమ అధీనంలోకి తీసుకుంది.

5. అక్కడకు ఎలా చేరుకోవాలి?

5. అక్కడకు ఎలా చేరుకోవాలి?

Image Source:

విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి కనుమల్లో ఉన్నాయి బొర్రా గుహలు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి అయితే, 448 కిలోమీటర్లు, హైదరాబాద్‌ నుంచి 656 కిలోమీటర్ల దూరం. ఇక్కడకు చేరుకోవడానికి అన్నిరకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అతిదగ్గర ఎయిర్‌పోర్ట్‌ విశాఖపట్నం. అక్కడ్నుంచి 90 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే బొర్రా గుహలు చేరుకోవచ్చు.

6. ప్యాసింర్ రైలు కూడా

6. ప్యాసింర్ రైలు కూడా

Image Source:

ఇక ప్రతీరోజూ విశాఖపట్నం నుంచి బయల్దేరే కొత్తవలస కిరండూల్‌ ప్యాసింజర్‌లో కూడా బొర్రా గుహలకు వెళ్లచ్చు. ఐదుగంటల ప్రయాణం ఖచ్చితంగా మధురానుభూతులను మిగులుస్తుంది. కొండలమీదకు ఎగబాకే రైలు.. దాదాపు ౩౦సొరంగమార్గాల గుండా ప్రయాణం ధ్రిల్లింగ్‌గా ఉంటుంది. బొర్రా గుహలు స్టేషన్‌లో రైలు దిగితే.. అక్కడ్నుంచి గుహల వరకూ స్ధానిక ఆటోలు సిద్ధంగా ఉంటాయి. అయితే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ట్రైన్‌కు ఏడాదిపొడవునా గిరాకీ ఉంటుంది. సో.. ఒకవేళ బొర్రా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే మాత్రం ఖచ్చితంగా ముందుగా టిక్కెట్స్‌ రిజర్వ్‌ చేసుకోండి..

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X