Search
  • Follow NativePlanet
Share
» »చిక్క మగళూర్ అందాలు !

చిక్క మగళూర్ అందాలు !

కర్నాటక రాష్ట్రంలో చిక్క మగళూర్ ఒక అందమైన, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. అనేక కొండలతో అలరారుతూ, ఆకాశం నుండి పడే పొగ మంచుతో ఒక స్వర్గంలా వుంటుంది. అందుకనే దీనిని క్వీన్ అఫ్ హిల్స్ లేదా కొండలలో రాణి అంటారు. అద్భుత కాఫీ గింజల సువాసనలతో, కాఫీ ని ఇండియాలో ప్రవేశ పెట్టిన ఘనతతో కర్నాటక రాష్ట్రానికి కాఫీ కాపిటల్ గా పేరు పడింది. బెంగుళూరు కు సుమారు 250 కి. మీ. ల దూరంలో వాయువ్యంగా కల చిక్క మగళూర్ ను రోడ్డు మార్గంలో తేలికగా చేరవచ్చు. చిక్క మగళూర్ వెళ్ళాలంటే, నేలమంగల, కూనిగల్, మరియు హస్సన్ పట్టణాల ద్వారా వెళ్ళాలి. ఒక్కసారి చేరితే చాలు, మీ సెలవులకు అర్ధం దొరికినట్లే.

చిక్క మగళూర్ ను ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గం అంటారు. ములాయనగిరి, బాబా బూదాన్ గిరి, కెమ్మనగుండి వంటి ప్రదేశాలు ట్రెక్కింగ్ చేసే వారికి స్వర్గ తుల్యాలు. ఉదయంవేళ కొండలు పొగమంచు తో కప్పబడి వుంటాయి. హస్సన్ పట్టణం లోని హసనాంబ టెంపుల్ వలెనె, దేవిరంమన్ కొండపై కల దేవిరంమన్ టెంపుల్ కూడా సంవత్సరానికి ఒక్క రోజు దీపావళి నాడు మాత్రం తెరుస్తారు. ఆ ఒక్క రోజు వేలాది మంది ఈ దొండను ఎక్కుతారు. చిక్క మగళూర్ లో చూసేందుకు కొండలు, జలపాతాలే కాదు సంవత్సరం పొడవునా చూసేటందుకు అనేక ప్రసిద్ధ ఆకర్షణలు కలవు.

చిక్క మగళూర్ అందాలు !
చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

ఈ కొండ మొత్తానికి మల్లెనహళ్లి లో కల దేవి రమ్మన్ టెంపుల్ ప్రధాన ఆకర్షణ. ఈ టెంపుల్ ను దీపావళి పండుగ నాడు మాత్రమే తెరుస్తారు. టెంపుల్ కు కాలి నడకలో చేరవచ్చు. భక్తులు సుమారు 7 కి. మీ. ల దూరం కల ఈ ప్రదేశాన్ని కాలి నడకన చేరటానికి ఇష్టపడతారు.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

ముల్లయనగిరి కర్నాటక లో ఎత్తైన శిఖరం. 6,330 అడుగులు ఎత్తు కల ఈ కొండ చంద్ర ద్రోణ హిల్ శ్రేణులలోనిది. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది ఒక ప్రసిద్ధ ఆకర్షణీయ ప్రదేశం.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

దత్త పీట హిందువులకు, బాబా బూదన్ గిరి ముస్లిం లకు పవిత్రమైన ప్రదేశాలు. ఈ కొండ ఒక ప్రసిద్ధ యాత్రా క్షేత్రం. ముల్లాయన గిరి తో పాటు ఈ కొండ కూడా చంద్ర ద్రోణ హిల్ శ్రేణులలో భాగమే. ఈ కొండలు నెలవంక ఆకారంలో వుండటంచే వీటిని చంద్ర ద్రోణ పర్వత శ్రేణులు అంటారు. బాబా బూదాన్ గిరి నుండి కెమ్మనగుండి వెళ్ళే దోవలో కల మాణిక్యధార ఫాల్స్ కూడా తప్పక చూడదగిన ప్రదేశం.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

కోదండరామ టెంపుల్ చిక్క మగళూర్ కు 4 కి. మీ. ల దూరంలో కలదు. ఇది హీరే మగళూర్ పట్టణంలో కలదు. ఈ టెంపుల్ శిల్ప శైలి ద్రావిడ, హోయసల శిల్ప శైలి లో వుంటుంది. ఈ ప్రదేశంలో శ్రీరాముడు పరశురాముడిని కలిశాడని చెపుతారు.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ కు 4 కి. మీ. ల దూరంలో ఉత్తరంగా కల రత్నగిరి బోర్ ఒక అందమైన పిక్నిక్ స్పాట్. చిల్డ్రన్ పార్క్ అయిన ఈ ప్రదేశం ఒక చిన్న కొండపై కలదు. వారాంతపు శెలవుల విహారం గా కల ఈ రత్నగిరి బోర్ ప్రదేశం నుండి అందమైన ముల్లయనగిరి దృశ్యాలు చూడవచ్చు.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

కెమ్మనగుండి ప్రదేశం ప్రకృతి గీసిన ఒక పెయింట్ వాలే వుంటుంది. చిక్క మగళూర్ కు 55 కి. మీ. ల దూరంలో ఉత్తర దిశగా వుంటుంది. కర్నాటక లోని ట్రెక్కింగ్ ప్రియులు కెమ్మనగుండి ని బాగా ఇష్టపడతారు. ఈ ప్రదేశం ఒకప్పుడు మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయార్ కు వేసవి విడిది గా వుండటంచే దీనిని కే. ఆర్. హిల్స్ అని కూడా పిలుస్తారు.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ కు నైరుతి గా సుందరమైన పర్వత శ్రేణులతో పచ్చని కుద్రేముఖ్ కొండలు కలవు. ఈ కొండకు ఈ పేరు ఆ కొండ గుర్రపు ముఖం ఆకారం తో వుండటంచే వచ్చింది. కుద్రేముఖ్ కొండలు హుందాగా అరేబియా మహా సముద్రాన్ని చూస్తూ వుంటాయి.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

బేలవాడి ప్రదేశం గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలది. బేలవాడి చిక్క మగళూర్ కు ఆగ్నేయంగా వుంది. ఈ విలేజ్ లో ప్రధాన ఆకర్షణ వీర నారాయణ టెంపుల్. దీనిని హోయసల పాలనలో నిర్మించారు. ఈ ప్రదేశం గురించిన వర్ణన మహాభారాతం లో కలదు. ఇక్కడ భీముడు బకాసురుడిని వధించాడని చెపుతారు.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

అమృతాపుర చిక్క మగళూర్ కు ఉత్తర దిక్కు గా 67 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఇక్కడ ప్రసిద్ధ అమృతేశ్వర టెంపుల్ కలదు. అద్భుతమైన శిల్పకళ కల ఈ టెంపుల్ ను హోయసల కాలంలో నిర్మించారు. చరిత్ర, కళలు, శిల్పం వంటి వాటిలో ఆసక్తి కలవారు ఈ టెంపుల్ తప్పక చూడాలి.

చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

శారద దేవి టెంపుల్ ను జగద గురువు ఆది శంకరుల వారు స్థాపించారు. ప్రతి రోజూ వందల కొలది భక్తులు ఈ టెంపుల్ కు వస్తారు. ఈ టెంపుల్ లో కల 12 స్తంభాలు పన్నెండు రాశులను సూచిస్తాయి. ప్రతి నెల సూర్య కిరణాలు ఆ రాశి స్తంభంపై పడతాయి.

 చిక్క మగళూర్ అందాలు

చిక్క మగళూర్ అందాలు

హొరనాడు టెంపుల్ లో హిందూ సాంప్రదాయంలో ఆహారం కు అధిక ప్రాధాన్యత. ఈ దేవత అన్నపూర్ణేశ్వరి. అంటే అన్నాన్ని ఇచ్చే దేవత అని అర్ధం. అందమైన కొండలు, ఎస్టేట్ ల మధ్య కల ఈ టెంపుల్ చాలా అందమైనది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X