Search
  • Follow NativePlanet
Share
» »చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

కీర్తి ప్రతిష్టలు, ధైర్య సాహసాలు కల చోళ రాజులు సూర్యుడి నుండి నేరుగా వారసత్వం పొంది భూమికి దిగి వచ్చినట్లు అనిపిస్తుంది. వారికి గల ధైర్యం, కీర్తి ప్రతిష్టలు దేశంలోని నలుమూలలకు సూర్య కిరణాలవలె వ్యాపించాయి. కావేరి నది ఎక్కడ ప్రవహిస్తే, వారి రాజ్యం అక్కడ వ్యాపించింది. ఇండియా లోని దక్షిణ భాగంలో వారి సామ్రాజ్యం అతి బలమైనదిగా చెప్పబడుతుంది. తుంగభద్ర నదికి దక్షిణ భాగంలోని అన్ని ప్రదేశాలను ఒకే తాటిపై వారు పాలించి నిజమైన రాజులు అనిపించుకున్నారు. క్రి. శ.9 వ శతాబ్దం నుండి క్రి. శ. 13 వ శతాబ్దం వరకు చోళ రాజులు గొప్ప అధికారంలో కలరు.

చోళ సామ్రాజ్యం సాంస్కృతిక పరంగా, ఆర్ధిక పరంగా, మిలిటరీ పరంగా దక్షిణ ఆసియా మరియు దక్షిణ ఆగ్నేయ ఆసియా లలో పేరు ప్రతిష్టలు సంపాదించినది. చోళ రాజులందరి లోకి మొదటి రాజ రాజ చోళుడు అతని కుమారుడైన మొదటి రాజేంద్ర చోళుడు గొప్పవారు. వారి సామ్రాజ్యాలు సూర్యోదయం వలే పెరిగి వ్యాప్తి చెందాయి.

తమిళ్ సాహిత్యంలో, ప్రత్యేకించి, సంగమ కవులు చోళుల గురించి ఎంతో వర్ణించారు. చోళుల ప్రాభవం అంతా సంగం సాహిత్యం నుండి చరిత్ర గ్రహించినది. వారు ఎన్నో రకాల కళలను ఆదరించినప్పటికీ, ఒకటవ రాజ రాజ చోళు డి కాలంలో నిర్మాణ కౌశాలాలతో గొప్ప టెంపుల్స్ కట్టించే వరకూ వారి ప్రాభవం బయటకు రాలేదు. చోళ రాజులు చాలా వరకూ పల్లవుల నిర్మాణ కౌశాల్యాలను అనుసరించారు. బ్రిహదీస్వరార్ టెంపుల్, అయిరవతెస్వరార్ టెంపుల్, గంగైకొండ చోళపురం టెంపుల్ వంటి గొప్ప దేవాలయాలను యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించి, వాటికి 'గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ ' అని పేరు పెట్టింది. తమిళ్ నాడులో చోళ టెంపుల్ వైభవాలను పరిశీలిస్తే,

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

కుంబకోణం సమీపంలోని దరసురం లో ఐరవతెస్వర టెంపుల్ కలదు. ఇది పూర్తిగా ద్రావిడ శిల్ప నిర్మాణ శైలి కలిగి వుంటుంది. ఈ టెంపుల్ ను రెండవ రాజ రాజో చోళుడు నిర్మించాడు. ఈ టెంపుల్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తించినది. దేవేంద్రుడి వాహనమైన తెల్లటి ఏనుగు శివ భగవానుడిని ఇక్కడ పూజించినదని కనుక ఈ టెంపుల్ ను శివుడికి అంకితం చేయబడినది అని చెపుతారు.


Eurekaitskk

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

భూతల కైలాసం లేదా భూమిపై శివుడి నివాసం వలే చిదంబరంలోని తిల్లాయి నటరాజ టెంపుల్ వుంటుందని తమిళ్ సాహిత్యం చెపుతుంది. రాజు కోసెంగాన్నాన్ చోళ తిలాయి నటరాజ ఆశీస్సులతో జన్మిస్తాడు. ఆ కారణంగా ఈ టెంపుల్ లోని ప్రధాన భాగం శివుడికి కృతజ్ఞతగా రాజు నిర్మించాడు.

ఇక్కడి శివుడి శిల్పాలు, కంచు విగ్రహాలు శివుడి నాట్య భంగిమలలో 'ఆనంద తాండవ ' దృశ్యాలు కలిగి వుంటాయి.

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

ఈ టెంపుల్ ను క్రి. శ. 9 వ శతాబ్దంలో మధ్యయుగ చొళులు ప్రధానంగా నిర్మించారు. తర్వాతి కాలంలో వచ్చిన సంగమ, సాలువ మరియు తుళువ రాజ వంశాలు అనేక మార్లు దీనిని పునరుద్ధరించారు. టెంపుల్ కాంప్లెక్స్ తంజావూర్ లోని బ్రిహదీస్వరార్ టెంపుల్ కు ఒక సాంస్కృతిక నమూనాగా కూడా నిలిచింది.


Srini G

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

ఒకటవ రాజ రాజ చోలుడి చే నిర్మించబడిన ఈ బ్రిహదీస్వరార్ ఆలయం ఒక గొప్ప కళాఖండం. ఈ ఆలయం, యొక్క టవర్ లేదా గోపురం, ఏకరాతి తో మలచబడి ప్రపంచ ప్రసిద్ధి గాంచినది. ఇక్కడే మరొక ఏక రాతి నంది విగ్రహంకూడా కలదు. ఇది సుమారు వేయి సంవత్సరాల కిందటిది.


Pugaipadangal

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

గంగైకొండ చోళపురం టెంపుల్ ను ఒకటవ రాజేంద్ర చోళుడు నిర్మించాడు. గంగైకొండ చోళపురం టెంపుల్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒక భాగం. చెక్కడాలు అతి సుందరంగా వుండి గోడలపై శాసనాలు, వారి విజయాలు చెక్కబడి వుంటాయి. ప్రధాన గోపురం యొక్క నీడ ఎప్పటికి నేలపై పడక పోవటం ఒక విశేషంగా వుంటుంది.


Thamizhpparithi Maari

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

రాజగోపాలస్వామి టెంపుల్, ఒక విష్ణు టెంపుల్. దీనిలోని ప్రధాన విగ్రహం కృష్ణుడి అవతారమైన రాజగోపాలుడు. కనుక ఈ టెంపుల్ ను దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ ను మొదటి కులోత్తుంగ చోళుడు మొదటగా నిర్మించాడు. తర్వాత చోళ సామ్రాజ్య వారసులు ఈ టెంపుల్ ను అభివృద్ధి పరచారు.

Chitrinee

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

ఈ దేవాలయంలో శివుడిని శ్వేతా అరణఎస్వర గాను, పార్వతి దేవిని బ్రహ్మవిద్యానయకి గాను పూజిస్తారు. తిరువెంకడులోని ఈ శివుడు అఘోర మూర్తి గా ఉంటాడు. అంటే కోపం కలిగి ఉగ్ర అవతారంగా ఉంటాడు. శ్వేతా అరణ్యేస్వర్ టెంపుల్ గోడలపై చోళ చక్రవర్తుల కీర్తి ప్రతిష్టల గురించిన అనేక చెక్కడాలు, కధలు వ్రాయబడి వున్నాయి.

Rsmn

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

కుంబకోణం లోని ఈ టెంపుల్ సుమారు 1300 ఏళ్ల నాటిది. ఏడవ శతాబ్దం లోని చోళుల కాలం నాటిది. ఇక్కడ శివ భగవానుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

Arian Zwegers

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

మైల దుతురాయి - కుంబకోణం రోడ్ లోని తిరుబవనం లో కల కంప హేస్వరార్ టెంపుల్ శివుడికి అంకితం చేయబడినది. ఇక్కడి టెంపుల్ పై వ్రాయబడిన శాసన లిఖితాల మేరకు ఈ టెంపుల్ ను మూడవ కులోతుంగా చోళుడు తాను ఉత్తర భారత దేశ భాగాలు జయించిన గుర్తుగా నిర్మించబడి నట్లు తెలుస్తోంది.


Krishna Kumar

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

చోళ రాజుల దేవాలయ ఔన్నత్యాలు !

జమ్బుకేస్వరార్ టెంపుల్ లో నిరంతరం, గర్భ గుడి అడుగు భాగం నుండి నీరు ప్రవహిస్తుంది. ఎన్ని సార్లు దీనిని తొలగించటానికి ప్రయత్నించినా ఆ నీరు ఊరుతునే వుంటుంది. ఈ టెంపుల్ శ్రీరంగం ద్వీపంలో కలదు. దీనిని చోళ రాజ పాలనా మొదటి భాగంలో నిర్మించారు.

Hari Prasad Nadig

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X