Search
  • Follow NativePlanet
Share
» »వ‌స్త్ర ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానం.. గుజరాత్‌లోని భుజ్‌..

వ‌స్త్ర ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానం.. గుజరాత్‌లోని భుజ్‌..

వ‌స్త్ర ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానం.. గుజరాత్‌లోని భుజ్‌..

గుజ‌రాత్‌లోని జైస‌ల్మేర్‌గా పిలువ‌బ‌డే భుజ్.. క‌చ్ ప్రాంతంలోని అత్యంత ముఖ్య‌మైన న‌గ‌రం. ఇది ఎడారి నగరంగా ప్రసిద్ధి చెందింది. 2001 లో సంభ‌వించిన భూకంపంలో ఈ న‌గ‌రం ధ్వంస‌మైంది. ఆ విప‌త్తు భారీ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది.

దీంతో ఈ ప్రాంత‌మంతా శిథిలావ‌స్త‌కు చేరుకుంది. భుజ్ పూర్వ‌పు రాచ‌రిక రాష్ట్ర‌మైన క‌చ్ రాజ‌ధాని. సిటి సెంట‌ర్ నుండి మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న భుజియా దుంగార్ కొండ వ‌ల‌న ఈ న‌గ‌రం ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, వ‌స్త్ర ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఈ ప్రాంతం ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది.

ఈ ప్రాంత‌ చరిత్ర మొత్తం రాజ్యాలు, సామ్రాజ్యాల రాజభవనాలు, నాగా అధిపతులు, జడేజా రాజపుత్రులు, గుజరాత్ సుల్తానులు మరియు బ్రిటిష్ రాజ్ పాలనతో ముడిపడి ఉంది. భుజ్ న‌గ‌రం హ‌స్త‌క‌ళ‌లు ముఖ్యంగా ఎంబ్రాయిడ‌రీ వస్త్రాల‌ను కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి ఉన్న ప‌ర్యాట‌కుల‌కు స్వ‌ర్గ‌ధామం. భుజ్‌లోని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు ప్రాగ్ మ‌హాల్‌లోని క్ష‌త్ర‌పా శాస‌నాలు, ఈ ప్రాంతంలోని పురాత‌న మ్యూజియాలు. అంతేకాక, భుజ్ ఒక వస్త్ర పర్యాటక గమ్యస్థానం. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప‌ర్యాట‌క ప్రేమికుల‌ను ఆక‌ట్టుకుంది. అన్ని ర‌కాలు సంప్ర‌దాయ‌న దుస్తుల‌తోపాటు మంచి మంచి మోడ్ర‌న్ డిజైన్‌లు ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి.

వ‌స్త్ర కొనుగోలు కోసం ప్ర‌త్యేకంగా ఇక్క‌డ‌కు సంద‌ర్శ‌కులు వ‌స్తూ ఉంటారు. భుజ్ ఏర్పడినప్పటి నుండి చాలా మంది పాలకులకు ఒక కోటగా ఉంది. ఈ నగరాన్ని 1510లో రావు హమీర్జీ నిర్మించాడు. తరువాత 1549లో రావు ఖేంగర్జీ రాజధానిగా ప‌రిపాలించాడు. ఈ నగరం సంపన్న రాచరిక రాష్ట్రమైన కచ్ కు రాజధానిగా ఉండేది. అందుకే నేటికీ ప్రజలు ఇక్కడ ప‌ర్య‌టించేందుకు ఆస‌క్తి క‌న‌ప‌రుస్తున్నారు.

భుజియా కొండపై హైక్

భుజియా కొండపై హైక్

భుజియా కొండపై హైకింగ్ చేయడం ఖచ్చితంగా మ‌న‌కు ఒక మంచి అనుభవమ‌నే చెప్పుకోవాలి. ఇది మతపరమైన‌ చారిత్రాత్మక‌మైన‌ ఒక ప్రధాన సహజ నిర్మాణం. ఇది భుజంగ యొక్క అద్భుతమైన విజయానికి సంబంధించింది. కొండపై నిర్మించిన భుజియా కోట నుండి ఈ నగరం కనిపిస్తుంది. భుజియా కోటను నగరాన్ని రక్షించడానికి జడేజా అధిపతులు నిర్మించారు. మొదటి రావు గాడ్జీ 1715లో నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఈ నిర్మాణం 1741లో మొదటి దేశల్జీ పాలనలో ముగిసింది. ఈ కోట ఆరు ప్రధాన యుద్ధాలకు ప్ర‌త్య‌క్ష సాక్షిగా నిలిచింది.

శ్రీ స్వామినారాయణ్ ఆలయం..

శ్రీ స్వామినారాయణ్ ఆలయం..

వాస్తవానికి 1822 లో నిర్మించబడిన శ్రీ స్వామినారాయణ్ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. కానీ 2001 నాటి భుజ్ భూకంపం వల్ల ఈ ఆలయంలో చాలా భాగం ధ్వంసమైంది. హ‌ర్‌మీర్స‌ర్ స‌ర‌స్సు

సమీపంలో పాలరాతితో శ్రీ స్వామినారాయణ్ ఆలయాన్ని పున‌ర్ నిర్మించారు. ఈ ఆల‌య నిర్మాణం ప‌ర్యాట‌క ప్రేమికుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. దీంతోపాటు హ‌ర్‌మీర్స‌ర్ సరస్సు భుజ్ నగరానికి నడిబొడ్డున, గుజరాత్ లోని కచ్ పశ్చిమ చివరన ఉంది. భుజ్ ప్రజల గృహావసరాలను తీర్చడానికి రాజులు పురాతన కాలంలో ఈ సరస్సును నిర్మించారు. నగరంలోని జలాశయాలను నింపడానికి మూడు నదుల నుండి నీటిని తీసుకువెళ్ళే కాలువ, సొరంగాలతో హ‌ర్‌మీర్స‌ర్ సరస్సు బాగా అభివృద్ధి చెందింది. కానీ 2001లో భుజ్ లో సంభవించిన భూకంపం తరువాత ఈ నీటి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీని తరువాత, భుజ్ ప్రజలు వారి అవసరాల నిమిత్తం నీటి వ్యవస్థను దాని అసలు రూపంలో పునరుద్ధరించడానికి మరోసారి చొరవ తీసుకున్నారు. మానవ నిర్మితమైన ఈ సరస్సుకు సుమారు 450 సంవత్సరాల క్రితం పాలించిన జడేగా పాలకుడు రావు హమీర్ పేరు పెట్టారు. రావు హమీర్ ను కచ్ లోని జడేజా వంశ స్థాపకుడు రావు ఖేంగార్జీ తండ్రిగా భావిస్తారు.

వందేమాతరం స్మారక చిహ్నం..

వందేమాతరం స్మారక చిహ్నం..

గుజరాత్ లోని భుజ్ కు ప‌ది కిలోమీటర్ల దూరంలో ఉన్న వందేమాతరం మెమోరియల్ మ్యూజియం నగరంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. 1857 తిరుగుబాటు నుండి 1947 స్వాతంత్రోద్య‌మం వరకు భారత సైనికులు ఎదుర్కొన్న అత్యంత ముఖ్యమైన పోరాటాలకు గుర్తుగా ఆశాపుర ఫౌండేషన్ ప‌న్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. భారత పార్లమెంటరీ భవనాన్ని అనుకరిస్తూ రూపొందించిన ప్రధాన మ్యూజియం ఈ సముదాయంలోనే హైలైట్ గా నిలుస్తుంది. దీనిని నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇక్క‌డ ఒక ఉద్యానవనం, అద్భుతమైన భరతమాత విగ్రహంతో పాటు అనేక ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి. భుజ్‌లో ప‌ర్యాట‌కుల బ‌డ్జెట్ కు అనుకూలంగా చాలా హోట‌ల్‌లు అందుబాటులో ఉన్నాయి.

Read more about: jaisalmer gujarat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X