Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు

దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు

దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు

కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నిలిపివేసిన సికింద్రాబాద్ - పూణే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆగస్టు 10 నుంచి రెండు వైపులా పునరుద్ధరించారు. దాంతో పాటు రైలులో కొత్తగా చేర్చిన విస్టాడోమ్‌కోచ్‌కు ప్రయాణీకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది.

దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్‌కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు సికింద్రాబాద్ - పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌. విస్టాడోమ్‌కోచ్‌ ప్రవేశపెట్టిన మొదటి కొద్దీ రోజుల్లో రైలులో ప్రయాణీకుల సగటు 63శాతం ఉంది.

vistadome-coaches-20-1505914995-1626085497-1660307867.jpg

లింక్ హఫ్మాన్ బుష్ (ఎల్ హెచ్ బి) కోచ్ లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుకు విస్టాడోమ్‌కోచ్‌ను చేర్చడం అదనపు ఆకర్షణగా మారింది. పెద్ద పెద్ద గాజు కిటికీలుండె ఈ కోచ్ పై కప్పు కూడా గాజుతో చేసిందే. అందువల్ల ఈ కోచ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణీకులు సికింద్రాబాద్ - పూణే -- సికింద్రాబాద్ మార్గంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను కొండలను, లోయలను చూస్తూ వెళ్లడం ఆశ్చర్యజనకంగా ఉంటుంది.

పెద్ద పెద్ద గాజు కిటికీలు ప్రయాణీకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. సికింద్రాబాద్ - పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులు అడవుల మీదుగా వెళ్తున్నప్పుడు ప్రకృతి అందాలను చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వికారాబాద్ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్, ఉజ్ని వృష్టజలాలను, బిగ్వాన్ దగ్గరి డ్యామును చూడవచ్చు. ఆ ప్రాంతం దేశీయ, వలస పక్షులకు నెలవు.

ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు..

గాజు పైకప్పు మాత్రమే కాక విస్టాడోమ్‌కోచ్‌లకు మరెన్నో పెద్ద పెద్ద గాజు కిటికీలు, ఎల్ ఈ డి లైట్లు, వెనక్కి జారిగీల పడే, చుట్టూ తిరిగే పుష్ బ్యాక్ రొటేటల్ సీట్లు, విద్యుత్ తో తెరుచుకునే కంపార్ట్మెంట్ తలుపులు పక్కకు జరిగే తలుపుల వంటి అదనపు అంశాలు ఈ కోచ్ ప్రత్యేకతలు.

ప్రయాణీకులు తాము కూర్చున్న చోటునుంచి కదలకుండా చుట్టూ ఉన్న పరిసరాలను చూడవచ్చు. గుండ్రంగా తిరిగే సీట్లకు తోడుగా పరిశీలన జరిపేందుకు ఒక లాంజ్ కూడా ఈ కోచ్ లో ఉంది.

vistadome2-1626085487-1660307877.jpg -2

శతాబ్ది రైలు బయలుదేరే వేళలు..

రైలు నెంబర్ 12026 సికింద్రాబాద్ = పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ లో మధ్యాన్నం 14.45 గంటలకు బయలు దేరి (మంగళవారం మినహా) పూణేకు అదేరోజు రాత్రి రాత్రి 23.10 గంటలకు (మంగళవారం మినహా) చేరుతుంది.

అదేవిధంగా 12025 పూణే- సికింద్రాబాద్ శతాబ్ది ఎక్సప్రెస్ పూణేలో ఉదయం 6.00 గంటలకు బయలుదేరి (మంగళవారం మినహా) సికింద్రాబాదుకు అదేరోజు మధ్యాన్నం 14.20 గంటలకు చేరుతుంది. ప్రయాణ మార్గంలో ఈ రైళ్లు రెండువైపులా బేగంపేట్, వికారాబాద్, తాండూర్, వాడి, కలబుర్గి మరియు సోలాపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

vestadome-3-1660307886.jpg

ఛార్జీల వివ‌రాలు..

ఈ రైలులో ఒక విస్టా డోమ్ కోచ్ , రెండు ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్ లు, తొమ్మిది ఏ సి చైర్ కార్ కోచ్ లు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి పూణే కు విస్టా డోమ్ కోచ్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ. 2110/- చార్జి చేస్తారు. ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.1935/- చార్జి తీసుకుంటారు. క్యాటరింగ్ సౌకర్యం కావాలంటే బుకింగ్ సమయంలోనే ప్రతి ఒక్కరు అదనంగా రూ. 385/- చెల్లించవలసి ఉంటుంది. ఏ సి చెయిర్ కార్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.905/- తో మొదలై ప్రయాణ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పెరిగే డైనమిక్ ఫేర్ పద్ధతిలో చార్జి తీసుకుంటారు.

క్యాటరింగ్ సౌకర్యం కావాలంటే బుకింగ్ సమయంలోనే ప్రతి ఒక్కరు అదనంగా రూ. 275/- చెల్లించవలసి ఉంటుంది.

Read more about: secunderabad pune
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X