Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలో సింధూలోయ నాగరికత బయటపడ్డ ప్రదేశాలు !

ఇండియాలో సింధూలోయ నాగరికత బయటపడ్డ ప్రదేశాలు !

By Mohammad

ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన నాగరికతల్లో సింధూలోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత సింధూనది పరివాహ ప్రాంతాల్లో క్రీ.పూ. 2700 - క్రీ.పూ. 1750 వరకు విలసిల్లింది. ఈ నాగరికతకు చెందిన హరప్పా నగరాన్ని మొదటగా వెలికితీయటం చేత దీనిని సింధూలోయ హరప్పా నాగరికత గా పిలవబడుతున్నది. సింధూలోయ నాగరికత నదీ పరివాహ ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో లభించిన చారిత్రక ఆధారాలను బట్టి వీరు అప్పట్లోనే పట్టణ ప్రణాళికలను వేసి, పట్టణాలను అభివృద్ధి చేయటంలో సిద్దహస్తులని, పరిశుభ్రతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : రూపనగర్ - ఇండస్ వాలీ నాగరికత కు నిలువెత్తు సాక్ష్యం !

సింధూలోయ నాగరికత భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్ముకాశ్మీర్ తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలిసింది. ఈ కాలంలో జీవించిన ప్రజలు పొడవు, ద్రవ్యరాశి మరియు కాలాలను ఖచ్చితంగా కొలవగలిగేవారని ఆధారాలు లభించినాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, చరిత్రకారులు ఇక్కడ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఇండియాలో సింధూలోయ నాగరికత బయటపడ్డ ప్రదేశాలు (వీటిని ఇండియాలో కెల్లా అతి ప్రాచీన ప్రదేశాలుగా పేర్కొనవచ్చు) గమనిస్తే ....

అలంగిర్పూర్, ఉత్తరప్రదేశ్

అలంగిర్పూర్, ఉత్తరప్రదేశ్

అలంగిర్పూర్ ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో ఉన్నది. దీనిని పరుశురాం- కా- ఖేరా అని పిలుస్తారు. అలంగిర్పూర్ సింధూలోయ నాగరికత కాలంలో ఒక పట్టణంగా ఉండేది. ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉన్నది.

చిత్ర కృప : Raveesh Vyas

బాబర్ కోట్, గుజరాత్

బాబర్ కోట్, గుజరాత్

బాబర్ కోట్ గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందినది. సింధూలోయ నాగరికతకు సంబంధిన ఆధారాలు ఇక్కడ బయటపడ్డాయి కనుక ఈ గ్రామం హరప్పా నాగరికత కు చెందినదిగా నిర్ధారించారు. ఈ గ్రామానికి అహ్మదాబాద్ 325 కి. మీ. దూరంలో, భావనగర్ 150 కి. మీ. దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Mohitnarayanan

బలు, హర్యానా

బలు, హర్యానా

బలు, హర్యానా రాష్ట్రంలోని ఫతెహబాద్ జిల్లాలో కలదు. ఈ గ్రామానికి సమీపంలో అనగా 22 కిలోమీటర్ల దూరంలో కైతల్ అనే నగరం ఉన్నది. ఇక్కడ కూడా సింధూలోయ నాగరికత జాడలు కనిపించినాయి.

చిత్ర కృప : Mohitnarayanan

బనవాళి, హర్యానా

బనవాళి, హర్యానా

బనవాళి సింధూలోయ నాగరికత కు చెందిన ప్రదేశం. ఇది హర్యానా రాష్ట్రంలోని హైసర్ జిల్లాలో ఉన్నది. బనవాళి సమీప పురాతత్వ ప్రదేశం కాలీ బంగాన్ కు 120 కిలోమీటర్ల దూరంలో, ఫతేహబాద్ కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రస్తుతం "వనవాలి" గా పిలువబడే ఈ బనవాళి సరస్వతి అంది ఒడ్డున ఉన్నది.

చిత్ర కృప : haryana tourism

బర్గాఓన్, ఉత్తరప్రదేశ్

బర్గాఓన్, ఉత్తరప్రదేశ్

బర్గాఓన్ అనే పురాతత్వ ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్పూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ లభించిన ఆధారాల వల్ల ఈ ప్రదేశం కూడా సింధూలోయ నాగరికత కాలంలో ప్రజలు నివసించినట్టుగా తెలుస్తుంది.

చిత్ర కృప : Radhi.pandit

బరోర్, రాజస్థాన్

బరోర్, రాజస్థాన్

బరోర్ ప్రదేశం రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగనాగర్ జిల్లాలో ఉన్నది. ఇది సింధూలోయ నాగరికత కు చెందిన ప్రదేశం.

చిత్ర కృప : Radhi.pandit

బెట్ ద్వారకా, గుజరాత్

బెట్ ద్వారకా, గుజరాత్

బెట్ ద్వారకా కి శంఖోధర్ అని పేరు. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ ముఖద్వారం వద్ద కలదు. దీనికి సమీప పట్టణం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓఖా. ఇసుక, రాళ్లతో కప్పబడి ఉన్న బెట్ ద్వారకా, ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన ద్వారకా కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ కూడా హరప్పా నాగరికత కు సంబంధించిన ఆనవాళ్ళు లభించినాయి.

చిత్ర కృప : Kuldip Pipaliya

భగత్రావ్ (భగత్ రావ్), గుజరాత్

భగత్రావ్ (భగత్ రావ్), గుజరాత్

భగత్రావ్ సింధూలోయ నాగరికతకు చెందిన చిన్న ప్రదేశం. గుజరాత్ రాష్ట్రంలోని ఉన్న భరూచ్ జిల్లాలో ఉన్న భగత్రావ్ ప్రదేశం సూరత్ కి 51 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నర్మదా, తపతి నది ప్రవాహాలతో పాటు లోయల్లోని అడవికొండలను ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : Radhi.pandit

భిర్రంగా, హర్యానా

భిర్రంగా, హర్యానా

భిర్రంగా ప్రదేశం సింధూలోయ నాగరికత కు చెందిన అతి ప్రాచీన ప్రదేశం. ఈ గ్రామం క్రీ.పూ. 7570 నుండి క్రీ.పూ. 6200 మధ్యలో ఉండేదని చరిత్రకారులు చెబుతారు. ప్రస్తుతం ఈ గ్రామం ఫతేహబాద్ జిల్లాలో, న్యూఢిల్లీ కి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Abhilashdvbk

దైమబాద్, మహారాష్ట్ర

దైమబాద్, మహారాష్ట్ర

దైమబాద్ ఆర్కియోలాజికల్ సైట్ గా ఉన్నది. దైమబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాకి చెందినది. ఈ సైట్ ను చూస్తే, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కూడా సింధూలోయ నాగరికత వర్ధిల్లిందా ?? అని ఆశ్చర్యం కలగక మానదు.

చిత్ర కృప : Gpratik

దేశల్పార్ గుంత్లీ, గుజరాత్

దేశల్పార్ గుంత్లీ, గుజరాత్

దేశల్పార్ గుంత్లీ గ్రామం సింధూలోయ నాగరికత కు చెందిన ప్రదేశం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్న నఖ్త్రానా తాలూకాలో ఉన్నది. దేశల్పూర్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం భుజ్.

చిత్ర కృప : Vidishaprakash

ధోల్ వీర, గుజరాత్

ధోల్ వీర, గుజరాత్

ధోల్ వీర గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గల ఖాదిర్ బెట్ వద్ద ఉన్నది. ఈ గ్రామం సింధూలోయ నాగరికత కాలంలో వర్ధిల్లిన మొదటి 5 ప్రదేశాల్లో ఒకటిగా ఉన్నది. ఇక్కడికి వెళితే సమీపంలో ఉన్న కచ్ ఎడారి వన్యప్రాణుల అభయారణ్యం తప్పక సందర్శించాలి.

చిత్ర కృప : Rama's Arrow

ఫర్మానాఖాస్, హర్యానా

ఫర్మానాఖాస్, హర్యానా

ఫర్మానాఖాస్ లేదా దక్ష్ ఖేర పురాతత్వ ప్రదేశం హర్యానా రాష్ట్రంలోని రోహ్టక్ జిల్లాలో ఉన్నది. ఈ గ్రామం దేశ రాజధాని ఢిల్లీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ హరప్పా నాగరికత కు సంబంధించిన ఆధారాలు లభించినాయి.

చిత్ర కృప : Emmanuel DYAN

గోలధోరో, గుజరాత్

గోలధోరో, గుజరాత్

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో గల బగసర తాలూకాలో గోలధోరో గ్రామం ఉన్నది. ఇది సింధూలోయ నాగరికత కు సంబంధించిన ప్రదేశం. ఈ ప్రదేశంలో నివసించే ఇల్లులు మరియు తయారుచేసిన నిర్మాణాలు తాలూకూ ఆనవాళ్ళు కనిపిస్తాయి.

చిత్ర కృప : Emmanuel DYAN

హులస్, ఉత్తరప్రదేశ్

హులస్, ఉత్తరప్రదేశ్

హులస్ ఒకప్పుడు సింధూలోయ నాగరికతకు సంబంధించిన ప్రదేశంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్పూర్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ హరప్పా నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు, నిర్మాణాలు బయటపడ్డాయి.

చిత్ర కృప : Radhi.pandit

జోగ్ణఖెర, హర్యానా

జోగ్ణఖెర, హర్యానా

జోగ్ణఖెర సింధూలోయ నాగరికతకు సంబంధిన ప్రదేశం. ఇక్కడ కూడా హరప్పా నాగరికత ఆనవాళ్ళు గుర్తించారు. ఇది హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలో ఉన్నది.

చిత్ర కృప : Bernard Gagnon

కాలిబంగన్, రాజస్థాన్

కాలిబంగన్, రాజస్థాన్

కాలి బంగన్ , రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమన్ గర్హ్ జిల్లాలో ఉన్నది. సింధూలోయ నాగరికత కు చెందిన ఈ ప్రదేశం బికనీర్ నుండి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Kk himalaya

కన్వారి, హర్యానా

కన్వారి, హర్యానా

కన్వారి నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి పురాతన గ్రామం. కన్వారి గ్రామం హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలో ఉన్నది. చరిత్ర విషయానికి వస్తే కన్వారి సింధూలోయ నాగరికత కు చెందినది. ప్రస్తుతం ఈ గ్రామం న్యూఢిల్లీ నుండి 166 కిలోమీటర్ల దూరంలో, జిల్లా ముఖ్య పట్టణం హిసర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Kk himalaya

కరన్పుర, రాజస్థాన్

కరన్పుర, రాజస్థాన్

కరన్పుర గ్రామం రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్ గర్హ్ జిల్లాలో ఉన్నది. దీనికి సమీపంలో గల పట్టణం భధ్ర మరియు హనుమాన్ గర్హ్ కి 125 కిలోమీటర్ల దూరంలో, కాలీబంగన్ కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామం లో కూడా సింధూలోయ నాగరికత వర్ధిల్లింది అని పురాతత్వ శాస్తవేత్తలు చెబుతున్నారు.

చిత్ర కృప : Kk himalaya

ఖీరసార, గుజరాత్

ఖీరసార, గుజరాత్

ఖీరసార సింధూలోయ నాగరికతకు చెందిన పురాతత్వ ప్రదేశం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన కచ్ జిల్లాలో నఖత్రన తాలూకాలో ఉన్నది. నఖత్రాన అహ్మదాబాద్ నగరం నుండి 386 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చిత్ర కృప : Vidishaprakash

కేరళ-నో-ధోరో, గుజరాత్

కేరళ-నో-ధోరో, గుజరాత్

కేరళ - నో- ధోరో ను పద్రి అని కూడా పిలుస్తారు. సింధూలోయ నాగరికతకు చెందిన ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో దక్షిణం వైపున అరేబియా సముద్రానికి చేరువలో ఉంటుంది.

చిత్ర కృప : Vidishaprakash

కునాల్, హర్యానా

కునాల్, హర్యానా

కునాల్, హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ ప్రాంతంలో ఎండిన సరస్వతి నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రిక మట్టి దిబ్బ. కునాల్ లో జరిపిన తవ్వకాలలో హరప్పా, పూర్వ-హరప్ప సంస్కృతిని తెలిపే సమాచార సంపద బయల్పడింది. ప్రారంభంలో ప్రజలు గోతులలో నివసించి, తర్వాత మట్టి ఇటుకలతో ఇళ్ళు నిర్మించారని, చివరికి బట్టీలలో కాల్చిన ఇటుకలతో చదరపు, దీర్ఘచతురస్రకారపు ఇళ్ళను నిర్మించారని ఇది తెలియచేస్తుంది.

చిత్ర కృప : Vikram Gakhar

కుంటసి, గుజరాత్

కుంటసి, గుజరాత్

కుంటసి , గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాలో ఫూల్కీ నది ఒడ్డున ఉన్నది. చరిత్రకారులు సింధూలోయ కాలానికి చెందిన కుండ పరికరాలు, త్రికోణాకారపు టెర్రకోట నమూనాలు, చేతివ్రాతలు, వెండి నాణేలు, ఒక కిరీటం, బంగారు, వెండి ఆభరణాలతో సహా అనేక రాచరిక వస్తువులు, విలువైన రాళ్ళతో చేసిన ఆభరణాలు, ఇంకా అనేక ఆసక్తికరమైన వస్తువులను కుంటసిలో కనుగొన్నారు.

చిత్ర కృప : Daniel Mennerich

లోటేశ్వర్, గుజరాత్

లోటేశ్వర్, గుజరాత్

లోటేశ్వర్ గ్రామం, గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లాకు చెందినది. ఇక్కడ పురావస్తు శాస్తవేత్తలు సింధూలోయ నాగరికతకు సంబంధిన కొన్ని ఆనవాళ్లను బయటపెట్టాడు. ఈ సైట్ ను స్థానికులు ఖరి - నో - టింబో అని అని పిలుస్తుంటారు.

చిత్ర కృప : Bernard Gagnon

లోథల్, గుజరాత్

లోథల్, గుజరాత్

లోథల్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ రాష్ట్రానికి చెందిన పురావస్తు ప్రదేశం. ఇక్కడ సింధూలోయ నాగరికతలో అప్పటి ప్రజలు వాడిన పనిముట్లు, వస్తువులు, శిలలు బయటపడ్డాయి.

చిత్ర కృప : Rashmi.parab

మంద, జమ్ముకాశ్మీర్

మంద, జమ్ముకాశ్మీర్

మంద హరప్పా నాగరికతకు సంబంధిన పురావస్తు ప్రదేశం. ఈ గ్రామం జమ్మూ నగరానికి చేరువలో ఉన్నది. జె.పి.జోషి అనే పురాతత్వ శాస్తవేత్త క్రీ.శ. 1976-77 మధ్య జరిపిన తవ్వకాల్లో ఈ గ్రామం బయటపడింది.

చిత్ర కృప : Abhilashdvbk

మల్వాన్, గుజరాత్

మల్వాన్, గుజరాత్

మల్వాన్ అనే ప్రదేశం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో ఉన్నది. దీన్ని భారత దేశానికి దక్షిణం వైపున సింధూలోయ నాగరికత విస్తరించిన ఆఖరి ప్రదేశంగా చెప్పుకోవచ్చు.

చిత్ర కృప : 100HOST.COM

మండి, ఉత్తరప్రదేశ్

మండి, ఉత్తరప్రదేశ్

మండి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజాఫర్ నగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామం. ఇక్కడ కూడా హరప్పా నాగరికతకు సంబంధిన కుండలు, మట్టి పాత్రలు, గిన్నెలు బయటపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీ కి ఉత్తరం వైపున 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Sara jilani

మితథల్, హర్యానా

మితథల్, హర్యానా

మితథల్, హరప్పా నాగరికతకు సంబంధిన ప్రదేశం. హర్యానా రాష్ట్రంలోని భివని జిల్లాలో ఉన్న ఈ గ్రామం, రాష్ట్ర రాజధాని చండీఘర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో, భివని నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చిత్ర కృప : Edward Francis Chapman

పబుమత్, గుజరాత్

పబుమత్, గుజరాత్

పబుమత్, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉన్నది. ఇక్కడ సింధూలోయ నాగరికత లో అప్పటి ప్రజలు వాడిన రాగి గాజులు, భారీ నిర్మాణం, దీర్ఘ చతురాస్త్రాకారకు వస్తువులు, నిర్మాణాలు వెలుగులోకి వచ్చినాయి.

చిత్ర కృప : Biswarup Ganguly

రాఖీగర్హి, హర్యానా

రాఖీగర్హి, హర్యానా

రాఖీగర్హి, హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలో ఉన్నది. ఈ గ్రామం ఢిల్లీ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సింధూ లోయ నాగరికత కు సంబంధించి ఇది ఒక పెద్ద నగరం. ప్రపంచ వారసత్వ ప్రదేశం గా యునెస్కో సంస్థ దీనిని గుర్తుంచారు.

చిత్ర కృప : Nomu420

రాంగ్పూర్, గుజరాత్

రాంగ్పూర్, గుజరాత్

రాంగ్పూర్ సింధూలోయ నాగరికత కు సంభందించిన ప్రదేశం. ఇది లోథల్ కి సమీపాన ఉన్నది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాకి చెందిన ఈ గ్రామం, గల్ఫ్ ఆఫ్ ఖంభట్ మరియు గల్ఫ్ ఆఫ్ కచ్ మధ్యలో ఉన్నది.

చిత్ర కృప : Ismoon

రొజ్‌డి, గుజరాత్

రొజ్‌డి, గుజరాత్

రొజ్‌డి, గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లాకు చెందిన గ్రామం. ఇక్కడ సింధూలోయ నాగరికత కు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి.

చిత్ర కృప : Shefali11011

రూపనగర్, పంజాబ్

రూపనగర్, పంజాబ్

రూపనగర్, పంజాబ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జిల్లాగా ఉన్నది. ఇది సింధూలోయ నాగరికతకు చెందిన నిలువెత్తు సాక్ష్యం గా నిలిచింది. పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో ఇక్కడ ఆరు వివిధ కాలాలకు చెందిన నాగరికతలను గుర్తించారు.

చిత్ర కృప : Saqib Qayyum

సనౌలి, ఉత్తరప్రదేశ్

సనౌలి, ఉత్తరప్రదేశ్

సనౌలి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పత్ జిల్లాకు చెందిన గ్రామం. సింధూలోయ నాగరికతకు సంబంధిచిన 150 సమాధులు ఈ ప్రదేశంలో బయటపడ్డాయి. ఈ సమాధులు క్రీ.పూ. 2200 - 1800 కు చెందినవిగా పురాతత్వవేత్తలు భావిస్తున్నారు.

చిత్ర కృప : Emmanuel DYAN

షికర్పూర్, గుజరాత్

షికర్పూర్, గుజరాత్

షికర్పూర్, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాకు చెందిన గ్రామం. హరప్పా నాగరికతకు చెందిన ఆనవాళ్ళు, ఆధారాలు ఇక్కడ లభించడం మూలాన ఇది ఒక పురావస్తు ప్రదేశం గా భాసిల్లుతుంది.

చిత్ర కృప : Emmanuel DYAN

సిస్వాల్, హర్యానా

సిస్వాల్, హర్యానా

సిస్వాల్, హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాకు సంబంధించిన గ్రామం. ఇక్కడ దొరికిన అనేక ఆధారాల వల్ల ఇది సింధూలోయ నాగరికత లో ఒక భాగంగా ఉండేదని చెబుతారు.

చిత్ర కృప : wikicommons

సోథీ, ఉత్తర ప్రదేశ్

సోథీ, ఉత్తర ప్రదేశ్

సోథీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బగ్పట్ జిల్లాకు చెందిన గ్రామం. దీనికి సమీపంలో గల పట్టణం బరౌట్. ఇక్కడ కూడా ప్రాచీన నాగరికత కు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి.

చిత్ర కృప : wikicommons

సూర్కోటడ, గుజరాత్

సూర్కోటడ, గుజరాత్

సూర్కోటడ, గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాకి చెందిన గ్రామం. ఇది భుజ్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ లభించిన కొన్ని ఆధారాల వల్ల ఈ గ్రామం సింధూలోయ నాగరికత కు చెందినదిగా పురావస్తు శాస్త్ర వేత్త ల అభిప్రాయం.

చిత్ర కృప : wikicommons

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X