Search
  • Follow NativePlanet
Share
» »హిమాలయాల్లో పవిత్ర ఓం పర్వత దర్శన యాత్ర !

హిమాలయాల్లో పవిత్ర ఓం పర్వత దర్శన యాత్ర !

హిమాలయాల్లో పవిత్ర 'ఓం' పర్వత దర్శన యాత్ర ఎలా ఉంటుంది ? అక్కడికి ఎలా చేరుకోవచ్చు ? అసలు చేరుకోవచ్చా ? లేదా అనే సందేహాలను పక్కన పెట్టి 'ఓం' ప్రదంగా ముందుకు వెళ్ళటమే.

By Mohammad

'ఓం' లేదా 'ఓంకారము' త్రిమూర్తి స్వరూపముగా హిందువుల పురాణాల్లో చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారం హిందూమతానికి కేంద్ర బిందువు. 'ఓం' అని ఒక్కసారి స్మరిస్తే చాలు భవంతున్నే స్మరించినట్లు అవుతుంది. మరి అలాంటి 'ఓం' ఏకంగా పర్వత రూపంలో కళ్లముందర కనిపిస్తే .... మాటల్లో వర్ణించలేం. చాలు ఈ జీవితానికి ఇంతకంటే మహా దర్శన భాగ్యం ఉంటుందా అనుకొనే వారూ ... లేకపోలేరు.

పవితమైన ఓం పర్వతం హిమాలయాల్లో ఇండో - నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ పర్వతానికి సమీపాన ఉన్న పట్టణం ధార్చుల. ఇది ఓం పర్వతానికి 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే 104. కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన పితోర్ ఘర్ కూడా కలదు. అన్నట్టు ఇది ఏ రాష్ట్రంలో ఉండేది చెప్పలేదు కదూ ..! ఉత్తరాఖండ్.

'ఓం' పర్వతానికి గల ఇతర పేర్లు : చిన్న కైలాష్, ఆది కైలాష్, బాబా కైలాష్, జోంగ్లీంగ్‌కొంగ్. ఈ పర్వతానికి ఉన్న గొప్పదనం అక్కడ పర్వతంలో కనిపించే 'ఓం' అనే అక్షరం. రెండు దేశాల మధ్య ఉన్న ఆది కైలాష్ (ఓం పర్వతం) ప్రదేశానికి వెళ్ళాలంటే రెండు దేశాల అనుమతులు తప్పక తీసుకోవలసిందే.

ఇది కూడా చదవండి : అమర్ నాథ్ సాహసోపేత ట్రెక్కింగ్ మార్గాలు !

హిమాలయాల్లో పవిత్ర ఓం పర్వత దర్శన యాత్ర ఎలా ఉంటుంది ? అక్కడికి ఎలా చేరుకోవచ్చు ? అసలు చేరుకోవచ్చా ? లేదా అనే సందేహాలను పక్కన పెట్టి 'ఓం' ప్రదంగా ముందుకు వెళ్ళటమే. ధార్చుల లో దిగి సరాసరి ఓం పర్వతాన్ని చేరుకొనే దానికంటే మార్గ మధ్యలో కొన్ని ప్రదేశాలను తనివితీరా చూసుకుంటూ ఓం పర్వతాన్ని చేరుకుంటే అదో ... సాహస యాత్ర లాగా అనిపిస్తుంది. సరే .. ఇక అక్కడికి ఎలా చేరుకోవాలో ముందుగా తెలుసుకుంటే ...

ధార్చుల ఎలా చేరుకోవాలి ??

ధార్చుల ఎలా చేరుకోవాలి ??

ఓం పర్వతం చేరుకోవాలంటే ముందుగా ధార్చుల చేరుకోవాలి.ధార్చుల చేరుకోవటానికి వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు చక్కగా ఉన్నాయి.

వాయు మార్గం

పంత్నగర్(పంత్ నగర్) ధార్చుల కు సమీపాన ఉన్న దేశీయ విమానాశ్రయం. ఇది ధార్చుల కు 130 కి. మీ. దూరంలో ఉన్నది. పంత్నగర్ కు ఢిల్లీ కి మధ్య రోజూ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పంత్ నగర్ ఏర్ పోర్ట్ నుండి ధార్చుల చేరుకోవటానికి ప్రవేట్ ట్యాక్సీ లు మరియు క్యాబ్ లు అందుబాటులో ఉంటాయి.

రైలు మార్గం

ధార్చుల కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ 'తనక్పుర్'. ఇది జిల్లా ముఖ్య పట్టణం పితోర్ గర్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ ఉత్తర భారత దేశంలో అన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, డెహ్రాడూన్, జమ్మూ, రాణిఖేత్, కాన్పూర్ వంటి నగరాల నుండి చక్కగా అనుసంధానించడం జరిగింది. స్టేషన్ నుండి ధార్చుల కు ట్యాక్సీ లు మరియు బస్సులు ప్రతి రోజూ అందుబాటులో ఉంటాయి.

బస్సు మార్గం / రోడ్డు మార్గం

ధార్చుల నుండి జిల్లా కేంద్రమైన పితోర్ గర్ పట్టణానికి రాష్ట్ర బస్సు సర్వీస్ పుష్కలంగా అనుసంధించబడింది. బస్సులు అంతరాష్ట్ర బస్సు టెర్మినల్, ఆనంద్ విహార్, ఢిల్లీ నుండి చంపావత్, అల్మోర మరియు తనక్పూర్ నుండి కూడా ఉన్నాయి. పర్యాటకులు, ఈ పట్టణాలనుండి ధార్చుల చేరుకోవటానికి టాక్సీలను అద్దెకు తీసుకుని చేరుకోవొచ్చు.

చిత్ర కృప : Trekkers Pardise

ధార్చుల పట్టణం

ధార్చుల పట్టణం

ధార్చుల ఉత్తరాఖండ్ లోని పితోర్ గర్ జిల్లాలో ఇండో-నేపాల్ బార్డర్ మీద ఉన్న ఒక అందమైన పర్వత పట్టణం. ఈ ప్రదేశం యొక్క పేరు రెండు మాటలు 'ధార్ (శిఖరం) ' మరియు 'చుల (స్టవ్ ) ' నుండి ఏర్పడింది. ఈ హిల్ పట్టణం స్టవ్ ఆకారంలో ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చిందని భావిస్తారు.

చిత్ర కృప : Marmik Lapsiwala

ధార్చుల పట్టణం

ధార్చుల పట్టణం

ధార్చుల నుండి జిల్లా కేంద్రమైన పితోర్ గర్ కు 90 కి. మీ. దూరం ఉంటుంది. ఈ పట్టణం చుట్టూరా పర్వతాలు ఉన్నాయి. ఈ పట్టణంలో మానస సరోవర్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

చిత్ర కృప : Jamie McGuinness

నారాయణ్ ఆశ్రమం

నారాయణ్ ఆశ్రమం

పితోర్ గర్ నుండి 44 కిలోమీటర్ల దూరంలో, ధార్చుల కు వెళ్లే మార్గంలో నారాయణ్ ఆశ్రమం ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 2734 మీటర్ల ఎత్తులో కలదు. ఆ ఆశ్రమంలో 40 మందికి పైగా ఆశ్రయం పొందవచ్చు. ఈ ఆశ్రమం ప్రతి రోజు అనేక ఆధ్యాత్మిక, సాంఘీక కార్యక్రమాలతో పాటుగా యోగా శిక్షణలను కూడా అందిస్తున్నది. వింటర్ లో అధిక మంచు కారణంగా ఈ ఆశ్రమాన్ని మూసెస్తారు.

చిత్ర కృప : Ramesh Vyas

మానస సరోవర్

మానస సరోవర్

చైనా యొక్క టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఉన్న ఒక మంచినీటి సరస్సు ఈ మానససరోవర్. ఈ సరస్సు హిందూమతం మరియు బౌద్ధమతం యొక్క గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఈ సరస్సులోని నీరు పాపాలను కడిగివేస్తాయని మరియు మోక్షానికి దారి తీస్తాయని నమ్ముతారు.

చిత్ర కృప : veerendhersharma

మానస సరోవర్

మానస సరోవర్

మానససరోవర్ సరస్సు ప్రముఖ నదులు బ్రహ్మపుత్ర, సింధు మరియు సట్లెజ్ యొక్క మూలం అయి ఉంటుందని భావిస్తున్నారు. మానస సరోవరానికి పడమర వైపున ఉన్న రక్షాతల్ సరస్సును కూడా పర్యాటకులు చూడవొచ్చు.

చిత్ర కృప : prasad.srinivasan

కాళీ నది

కాళీ నది

కాళి నది 'కాలాపానీ' వద్ద హిమాలయాల నుండి ఉద్భవించినది. ధార్చుల ప్రదేశంలో ఉన్న ఈ నది సముద్ర మట్టానికి 3600 మీ. ఎగువన ఉన్నది. ఇక్కడ కాళి దేవాలయం కూడా ఉన్నది. ఈ నది ఇండియా మరియు నేపాల్ మధ్య సహజంగా ఏర్పడిన విభజన రేఖలా ఉండి ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్(శారద నదిగా) గుండా ప్రవహిస్తున్నది.

చిత్ర కృప : Soumitra Dhali

కాళీ నది

కాళీ నది

కాళి నదిలో వివిధ ట్రాక్స్ లో 'రాఫ్టింగ్' చేస్తూ, పర్యాటకులు చాలా ఆనందిస్తుంటారు. దీనికి తోడు నది మీద నిర్మించిన ఆనకట్ట, చిర్కిల డాం, ఓ అందమైన సరస్సు కూడా ఉన్నాయి. ఇది ఒక ప్రముఖ విహార స్థలం గా కూడా చెప్పబడుతుంది.

చిత్ర కృప : Sunil Joshi

అస్కోట్ ముస్క్ డీర్ స్యాంక్చురీ

అస్కోట్ ముస్క్ డీర్ స్యాంక్చురీ

అస్కోట్ మస్క్ డీర్ స్యాంక్చురీ, జిల్లా కెన్ంద్రమైన పితోర్ గర్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 5412 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ పార్క్ ముస్క్ డీర్ లకు ప్రసిద్ధి చెందినది. వీటితో పాటుగా చిరుతలు, అడవి పిల్లులు, హిమాలయన్ నల్లని ఎలుగుబంటీలు ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన జంతువులు, పక్షులు, మొక్కలు కూడా ఉన్నాయి.

చిత్ర కృప : Sanctuary India

ఓం పర్వతం

ఓం పర్వతం

ఇక చివరగా చేరుకొనే ప్రాంతం ఓం పర్వతం. ఇది భారత మరియు నేపాల్ సరిహద్దు భూభాగంలో కలదు. ఈ పర్వతం సముద్ర మట్టానికి 6191 మీటర్ల ఎత్తున ఉన్నది. రెండు దేశాల మధ్యన ఉన్నది కాబట్టి, రెండు చోట్ల అనుమతులు తప్పక తీసుకోవలసిందే ..!

చిత్ర కృప : Soumitra Dhali

ఓం పర్వతం

ఓం పర్వతం

ఓం పర్వతాన్ని చిన్న కైలాసం అని, ఆది కైలాసం అని పిలుస్తుంటారు. ఈ పర్వత గొప్పతనం అక్కడున్న 'ఓం' అనే స్వరూపమే. ఈ పర్వతాన్ని స్వయాన ఈశ్వరుని ప్రతి రూపంగా భావిస్తుంటారు భక్తులు. కైలాస మానససరోవర్ యాత్ర జరిపే వారు తప్పక ఈ పర్వతాన్ని దాటి వెళ్ళవలసి ఉంటుందట .. !

చిత్ర కృప : Saumil Shah

ఓం పర్వతం

ఓం పర్వతం

ఓం పర్వతం యొక్క ముఖ భాగం అంటే 'ఓం' భారత్ వైపున మరియు వెనక భాగం నేపాల్ వైపున ఉంటాయి. పర్వతానికి ముందు భాగంలో పార్వతి సరస్సు మరియు జోంగ్లీంగ్‌కొంగ్ సరస్సు ఉంటాయి. జోంగ్లీంగ్‌కొంగ్ సరస్సు ను సాక్షాత్తూ ఆ మానససరోవరం సరస్సుకు ప్రతి రూపంగా భావిస్తారు.

చిత్ర కృప : Soumitra Dhali

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X