Search
  • Follow NativePlanet
Share
» »కోణార్క్ సూర్యదేవాలయం - అద్భుతాలకు నిలయం !!

కోణార్క్ సూర్యదేవాలయం - అద్భుతాలకు నిలయం !!

కోణార్క్ సూర్యదేవాలయంఅద్భుతాలకు నిలయం... భారతీయ నిర్మాణకౌశలతకు నిదర్శనం.

By Mohammad

ఎక్కడ ఉంది ? ఒడిశా రాష్ట్రంలోని పూరీ సమీపాన 33 కిలోమీటర్ల దూరంలో

ప్రత్యేక ఆకర్షణ : సూర్యదేవాలయం

కోణార్క్ సూర్యదేవాలయం అద్భుతాలకు నిలయం... భారతీయ నిర్మాణకౌశలతకు నిదర్శనం. కనువిందు చేసే కోణార్క్‌ దేవాలయం ఒరిస్సాలోని కోణార్క్‌లో సూర్యుడి కోసం ప్రత్యేకంగా నిర్మించిన దేవాలయం కోణార్క్‌ దేవాలయం. 13వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం నాటి రాజుల కళాకౌశల్యానికి అద్దం పడుతుంటుంది.

ఇది కూడా చదవండి : ఒడిశా లోని అందమైన 10 కోస్తా తీరాలు !!

దీనిని తూర్పు గంగ రాజవంశా నికి నరసింహదేవ-1 (1238-1250) నిర్మింప జేశారు. భారతదేశంలోని దేవాలయాలన్నింటిలోనూ ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాతి చెందినదే కాకుండా, ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపు పొందింది. భారతదేశంలోని ఏడు వింతల్లో ఈ దేవాలయం ఒకటిఈ క్షేత్రం చంద్రభాగా నది తీరాన ఉంది.

మేగ్నటైట్ రాళ్ళు

మేగ్నటైట్ రాళ్ళు

కోణార్క్ సూర్యదేవాలయాన్ని మేగ్నటైట్(సూదంటురాయి) లాంటి రాళ్ళతో నిర్మించారు. అవన్నీ ఒక క్రమ పద్దతిలో ఒక దాని మీదుగా అమర్చటం వలన సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలి ఉండి, వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది.

చిత్రకృప : G41rn8

స్మారకం

స్మారకం

ఈ ఆలయం మాత్రమే కాక ఈ ఆలయ ముఖ ద్వారం కూడా ఎంతో విలువైనది. ఈ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఎంతో శక్తివంతమైనవి. దాని గొప్పతనాన్ని చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ ను పరీక్షలనిమిత్తం ఇంగ్లాండుకు తీసుకుని పోయారని ఒక కథనం.

చిత్రకృప : Kbhargava

ఆకట్టుకునేవి

ఆకట్టుకునేవి

ఈ క్షేత్రంలోసూర్యభగవానుడు ఇరవైనాలుగు చక్రాల తో, ఏడు అశ్వాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగాఉంటుంది. ఈ ఆలయానికి కింది భాగంలో చెక్కిన రథ చక్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

చిత్రకృప : Dinudey Baidya

ఆలయ ప్రవేశం వద్ద

ఆలయ ప్రవేశం వద్ద

ఆలయ ప్రాకారం 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు పెద్ద సింహాల విగ్రహాలుంటాయి. ఈ సింహాలు తమ ఏనుగులను పడవేసి అణద్రొక్కుతున్నట్లు మలిచారు.

చిత్రకృప : Bernard Gagnon

గుర్తుంచుకోవలసినవి

గుర్తుంచుకోవలసినవి

ఇరవైనాలుగు చక్రలు ఒకరోజులోని గంటలకు సూచన. ఏడు గుర్రాలు ఏడు రోజులకు సూచన. ఈ అశ్వాలు చాలా రౌద్రంగా భయానకంగా కనపడిచూపరులను భయ పడే విధంగా ఉంటాయట (ప్రస్తుతం శిధిలమైనాయి).ఏనుగులు నిజంగా ఉన్నాయేమొనని అనిపించేంత ఉంటాయట...

చిత్రకృప : Ramnath Bhat

నాట్య భంగిమలు

నాట్య భంగిమలు

ఈ ఆలయ కుడ్యాల మీద రసరమ్య శిల్పాలు,నాట్యభంగిమలు అద్భుతం , ఆలయ ప్రాంగణం ప్రారంభంలో నాట్యమందిరం ఉంటుంది. ఇక్కడ నర్తకీమణులు దేవ్ఞడికి తమ నృత్యంతో అర్చనలు చేస్తారు

చిత్రకృప : Chaitali Chowdhury

శిల్పాలు

శిల్పాలు

దేవాలయం చుట్టూ అనేకానేక శిల్పాలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రస్తుతం ఈ దేవాలయం పాక్షికంగా దెబ్బ తిన్నది. ఇక్కడ దెబ్బ తిని పడిపోయిన కొన్ని శిల్పాలను సూర్యదేవాలయ మ్యూజియంలో భద్రపరిచారు.

చిత్రకృప : Santosh.pati

ఠాగూర్ మాటల్లో

ఠాగూర్ మాటల్లో

రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఈ దేవాలయాన్ని సందర్శించినపుడు చెప్పిన మాటలు ఎప్పటికీ వాస్తవాలే. ఆయన అంటారు - ఇక్కడ శిల్పాల భాష మనిషి భాషను అధిగమించింది - అని.

చిత్రకృప : Abhishek K Saxena

1200 మంది శిల్పకళాకారులు

1200 మంది శిల్పకళాకారులు

ఈ ఆలయం కట్టడానికిపదహారు సంవత్సరాలు పట్టిందట. దీనికై దాదాపు పన్నెండు వందల మందిశిల్పకారులు పనిచేసారట.

చిత్రకృప : Ritu20

సందర్శన సమయం

సందర్శన సమయం

ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోణార్క్ సూర్యదేవాలయాన్ని యాత్రికులు దర్శించుకోవచ్చు. జీవిత కాలంలో ఒక్కసారిఅయిన చూడతగిన క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం.

చిత్రకృప : Mayank Choudhary

ఆర్కియోలాజికల్ మ్యూజియం

ఆర్కియోలాజికల్ మ్యూజియం

సన్ టెంపుల్ దగ్గర చూడవలసిన మరో ఆకర్షణ ఆర్కియోలాజికల్ మ్యూజియం. ఈ మ్యూజియంను టెంపుల్ యొక్క గత వైభవాన్ని తెలుసుకొనేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. మ్యూజియం మొత్తం నాలుగు గ్యాలరీలుగా విభజించారు.

చిత్రకృప : konarkmuseum

ఆర్కియోలాజికల్ మ్యూజియం

ఆర్కియోలాజికల్ మ్యూజియం

ఒక్కో గ్యాలరీలో ఒక్కో వస్తుసేకరణ ఉంచారు. టెంపుల్ కు చెందిన పురాతన వస్తువులు, తవ్వకాలలో బయటపడిన శిల్పాలు, పత్రాలు మ్యూజియంలో చూడవచ్చు. అలాగే ఒడిశా పురాతన చిత్రాలను, వివిధ రకాల స్మారక చిహ్నాలను ఇందులో భద్రపరిచారు.

చిత్రకృప : konarkmuseum

ఆర్కియోలాజికల్ మ్యూజియం

ఆర్కియోలాజికల్ మ్యూజియం

ఆర్కియోలాజికల్ మ్యూజియంను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. శుక్రవారం సెలవు. ప్రవేశ రుసుము 5 రూపాయలు. బెస్ట్ టైం : నవంబర్ - ఫిబ్రవరి.

చిత్రకృప : konarkmuseum

ఇలా చేరుకోండి

ఇలా చేరుకోండి

సమీప విమానాశ్రయం : 64 కి. మీ ల దూరంలో ఉన్న భువనేశ్వర్

సమీప రైల్వే స్టేషన్లు : 33 కి. మీ ల దూరంలో ఉన్న పూరీ, భువనేశ్వర్

రోడ్డు/ బస్సు మార్గం : పూరీ, భువనేశ్వర్ నుండి కోణార్క్ సన్ టెంపుల్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : Ankit gooner

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X