Search
  • Follow NativePlanet
Share
» »‘రెడ్ గోల్డ్ నగరం’ లేదా ‘భారత దేశపు పుట్టగొడుగుల రాజధాని’ఎక్కడ ఉందో తెలుసా?

‘రెడ్ గోల్డ్ నగరం’ లేదా ‘భారత దేశపు పుట్టగొడుగుల రాజధాని’ఎక్కడ ఉందో తెలుసా?

‘రెడ్ గోల్డ్ నగరం’ లేదా ‘భారత దేశపు పుట్టగొడుగుల రాజధాని’ఎక్కడ ఉందో తెలుసా?

భారత దేశం ఆధ్యాత్మిక సంపదకు ఆలవాలం. దీనిని ప్రతిబింబిస్తూ అనేక ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇండియాలో తప్పనిసరిగా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. హిమాచల్ ప్రదేశంలో అనేక హిల్ స్టేషన్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో సోలన్ ఒకటి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక అందమైన జిల్లా, సోలన్. ఈ ప్రాంతంలోని విస్తృత పుట్టగొడుగుల వ్యవసాయం ఉన్న కారణంగా "భారతదేశపు పుట్టగొడుగుల నగరం" అని కూడా పిలవబడుతుంది.

సముద్ర మట్టానికి 1467 మీటర్ల ఎత్తులో ఒదిగిన సోలన్, అత్యద్భుతమైన అందానికై ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఇక్కడి ప్రధాన దైవం అయిన హిందూ దేవత సోలోని దేవి నుండి ఆ పేరు పొందింది. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులు మరియు ఎత్తైన పర్వతాలతో చుట్టబడింది. సోలన్ అత్యంత మనోహరమైన లోయలతో కనిపిస్తుంది. రోడ్డు ప్రయాణమైనా, రైలు ప్రయాణమైనా ఈ లోయల సోయగాలను చూస్తూ వెళ్లవచ్చు. మరి ఆ లోయ సౌందర్యం ఎంటో తెలుసుకుందాం..

Garconlevis

మనాలి రోహతాంగ్ మనుమకు వెళ్లే దారిలో మనాలీకి సుమారు

మనాలి రోహతాంగ్ మనుమకు వెళ్లే దారిలో మనాలీకి సుమారు

మనాలి రోహతాంగ్ మనుమకు వెళ్లే దారిలో మనాలీకి సుమారు 14కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన పర్యాటకుల తాకిడి లేని లోయ ఇది. ఈ మధ్య కాలంలో ఈ లోయలో ఉన్న కొండవాలులని ఉపయోగించుకుంటూ శీతాలకంలో స్కీయింగ్, వేసవిలో పేరాగ్లైడింగ్, పేరాచూటింగ్, జోర్బింంగు ఆటలు నిర్వహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.

Bhanu Sharma Solan

జోర్బింగ్ అంటే

జోర్బింగ్ అంటే

జోర్బింగ్ అంటే పెద్ద ట్రాన్సపెరంట్ బాల్ లో ఇద్దరు మనుషులు పట్టణంత పెద్దది, మనిషిని కూర్చోబెట్టి జిప్ వేసి కొండవాలులపైన వదిలి పెడతారు, వాలు దొర్లుకుంటా కింద మైదానం చేరుతుంది. బాలుతో పాటు అందులో ఉన్నవారు కూడా.ఈ ఆటలు వయస్సులో ఉన్నవారికి పిల్లలకి థ్రిల్ గా ఉంటాయి.

Photo Courtesy: Raman Virdi

ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కరోల్ శిఖరం

ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కరోల్ శిఖరం

నగరం యొక్క తూర్పు వైపు, 1986 మీటర్ల ఎత్తులో ఉన్న మాటియుల్ శిఖరాన్ని ఇక్కడ నుండి సులభంగా చూడవచ్చు. నగరం యొక్క ఉత్తర వైపు ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన కరోల్ శిఖరం ఉంది. కందాఘాట్, కాసోవ్లి, చైల్ మరియు దగషై వంటి ఇతర ప్రసిద్ధ పర్వత పర్యటనలకు సోలన్ ఆధార ప్రదేశంగా (బేస్) ఉంటుంది.

Photo Courtesy: Sabyasachi Baidya

 ‘రెడ్ గోల్డ్ నగరం' అని లేదా భాతర పుట్టగొడుగుల రాజధాని

‘రెడ్ గోల్డ్ నగరం' అని లేదా భాతర పుట్టగొడుగుల రాజధాని

హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ పురాతన మరియు ఆకర్షణీయమైన హిల్ స్టేషన్..మాతిల్ -కరోల్ శిఖరాల మధ్య ఉంది. టొలోటోస్ మరియు పుట్టగొడుగులు ఎక్కువగా పెరుగుట వల్ల సోలన్ ను ‘రెడ్ గోల్డ్ నగరం' అని లేదా భాతర పుట్టగొడుగుల రాజధాని అని కూడా పిలుస్తారు.

Garconlevis

.నిశ్శబ్దమైన పరిపూర్ణ వాతావరణాన్ని అందించేందుకు

.నిశ్శబ్దమైన పరిపూర్ణ వాతావరణాన్ని అందించేందుకు

ఈ అందమౌన హిల్ స్టేషన్ లో ఎత్తైన పర్వతాల పైకి ట్రెక్కింగ్ వద్దని భావిస్తే...మీకు ప్రశాంతమైన..నిశ్శబ్దమైన పరిపూర్ణ వాతావరణాన్ని అందించేందుకు పలు ప్రవాహాలు మరియు నదులు ఉన్నాయి. మీరు మొహన్ మీకిన్ యొక్క బ్రూవరీని చూడడం ద్వారా ..1885లో స్థాంపించబడిన ఆసియాలోని మొట్టమొదటి బీరు తయారీ కేంద్రంగా గురించి తెలుసుకోవచ్చు.

Photo Courtesy: Rohan Babu

 కరోల్ పర్వత పైభాగానికి సమీపంలో ఒక గుహ ఉంది.

కరోల్ పర్వత పైభాగానికి సమీపంలో ఒక గుహ ఉంది.

ఈ ప్రాంతం, అనేక కొండలు మరియు పర్వతాలతో కూడిన కలప భూమి కావటం వల్ల, ఇక్కడ నిర్మాణం సాధ్యం కాదు. కరోల్ పర్వత పైభాగానికి సమీపంలో ఒక గుహ ఉంది. స్థానికుల నమ్మకం ప్రకారం, భారతీయ ఇతిహాసం మహాభారతంలో అజ్ఞాత వాసం సమయంలో పాండవులు ఇక్కడ నివసించటం జరిగింది.

Garconlevis

ఈ ప్రదేశానికి, గొప్ప చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చింది.

ఈ ప్రదేశానికి, గొప్ప చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చింది.

బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా 1920 లో జరిగిన ఐరిష్ తిరుగుబాటు కూడా ఇక్కడే మొదలయి, ఈ ప్రదేశానికి, గొప్ప చారిత్రక ప్రాధాన్యతను చేకూర్చింది. తరువాత, ఇద్దరు ఐరిష్ సైనికులను చంపివేయటంతో తిరుగుబాటు భగ్నం అయింది. దాని తర్వాత, అనేక మంది తిరగబడిన సైనికులను కారాగారం లో బంధించారు.

Photo Courtesy: Sabyasachi Baidya

యుంగ్ ద్రుంగ్ టిబెటన్ ఆరామం

యుంగ్ ద్రుంగ్ టిబెటన్ ఆరామం

యుంగ్ ద్రుంగ్ టిబెటన్ ఆరామం, సోలోని దేవి ఆలయం, గూర్ఖా కోట మరియు జతోలి శివాలయం, సోలన్ లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు కొన్ని. సోలన్ ప్రధానంగా ఒక పారిశ్రామిక పట్టణం. ఈ ప్రాంత ఆర్ధిక వ్యవస్థకు దోహదం చేసే కొన్ని ముఖ్య పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. హిమాలయ పైప్ ఇండస్ట్రీస్, హెచ్.ఎఫ్.సి.ఎల్. మరియు బైమెటల్ కంట్రోల్స్ లిమిటెడ్ ఇక్కడి ప్రఖ్యాత పరిశ్రమలలో కొన్ని.

సోలన్ జిల్లాలో ఇతర పర్యాటక ప్రదేశాలు:

సోలన్ జిల్లాలో ఇతర పర్యాటక ప్రదేశాలు:

సోలన్ జిల్లాలో అందార్ బజార్ వద్ద మాతా షూలిని దేవి ఆలయం, రాజ్ఘర్ రోడ్డ్ వద్ద జతోలీ మందిర్, మాల్ రోడ్ వద్ద చిల్డ్రెన్ పార్క్, శిఖరం మీద జవహర్ పార్క్, భారదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మోహన్ మీకిన్ బ్రివెరీస్ ఉన్నాయి. కల్క సిమ్లా మార్గంలో నడుపబడుతున్న టాయ్ ట్రైన్ సోలన్ జిల్లా గుండా ప్రయాణిస్తుంది.

సోలన్ ను ఎప్పుడు సందర్శించాలి ?

సోలన్ ను ఎప్పుడు సందర్శించాలి ?

సోలన్ యొక్క వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. యాత్రికులు ఎప్పుడైనా ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం చల్లగా ఉంటుంది మరియు మాన్సూన్ ముందు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

కల్క - సిమ్లా టాయ్ ట్రైన్

కల్క - సిమ్లా టాయ్ ట్రైన్

పర్వత ప్రాంతాల్లో టాయ్ ట్రైన్ సందర్శన ఒక గొప్ప అనుభూతి గా ఉంటుంది. ఇక్కడ కూడా టాయ్ ట్రైన్ సౌకర్యం కలదు. కల్క నుండి సిమ్లా వరకు వయా సోలన్ మీదుగా ఈ ట్రైన్ వెళుతుంది. ఈ మౌంటెన్ రైల్వే ను హెరిటేజ్ సైట్ గా గుర్తించారు.

Photo Courtesy: TheWanderer7562

సోలన్ ఎలా చేరుకోవాలి ?

సోలన్ ఎలా చేరుకోవాలి ?

విమానమార్గం సోలన్ కు సమీపాన చండీఘర్ విమానాశ్రయం (67 కి. మీ) కలదు. ఢిల్లీ, ముంబై, జైపూర్, కోల్కతా వంటి నగరాల నుండి నిత్యం విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి సోలన్ చేరుకోవచ్చు.

రైలు మార్గం సోలన్ కు సమీపాన 44 కి. మీ ల దూరంలో కల్క రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ నుండి ప్రతి రోజు ఒక టాయ్ ట్రైన్ సిమ్లా కు బయలుదేరుతుంది. అది ఎక్కి సోలన్ చేరుకోవచ్చు. ఈ స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కలుపబడింది.

రోడ్డు / బస్సు మార్గం ఢిల్లీ, సిమ్లా, కల్క , చండీఘర్ తదితర సమీప పట్టణాల నుండి సోలన్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X